ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘డర్టీ హరి’. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రవణ్ రెడ్డి – రుహానీ శర్మ – సిమ్రత్ కౌర్ ప్రధాన పాత్రల్లో నటించారు. గూడూరు శివ రామకృష్ణ సమర్పణలో సతీష్ బాబు – సాయి పునీత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ మరియు వీడియో సాంగ్స్ విశేషమైన ఆదరణ పొందాయి. డిసెంబర్ 18న ‘ఫ్రైడే మూవీస్’ అనే డిజిటల్ వేదికపై ‘డర్టీ హరి’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రెండో ట్రైలర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
‘డర్టీ హరి’ మూవీ ట్రైలర్ ని చూస్తే ఈ సినిమాలో రొమాన్స్ తో పాటు సస్పెన్స్ కూడా ఉందని అర్థమవుతోంది. రొమాంటిక్ సన్నివేశాలతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని జత చేసి ఆద్యంతం యూత్ ని ఆకట్టుకునేలా ఈ ట్రైలర్ ని కట్ చేశారు. మొదటి ట్రైలర్ ని బోల్డ్ గా చూపించిన చిత్ర యూనిట్.. సెకండ్ ట్రైలర్ తో ఇదొక క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పే ప్రయత్నం చేశారు. దీనికి మార్క్.కె.రాబిన్ అందించిన నేపథ్య సంగీతం.. ఎం.ఎన్.బాల్ రెడ్డి విజువల్స్ బాగున్నాయి. జునైద్ సిద్ధిఖి ఎడిటింగ్ వర్క్ చేశారు. నేటి యువతను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ప్రేక్షకులకు ఏ మాత్రం ఆకట్టుకుంటుందో చూడాలంటే ఈ నెల 18 వరకు ఆగాల్సిందే.
కరోనా సంక్షోభ పరిస్థితుల్లో డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో – నెట్ ప్లిక్స్ – ఆహా – సన్ నెక్స్ట్ – డిస్నీ+ హాట్ స్టార్ – జీ5 – ఏటీఎల్ బాలాజీ వంటి ఓటీటీ ప్లాట్ ఫామ్ లు తమ పరిధిని పెంచుకునే పనిలో ఉన్నాయి. ఈ క్రమంలో అనేక కొత్త ఓటీటీలు – ఏటీటీలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా ‘ఫ్రైడే మూవీస్’ అనే మరో డిజిటల్ వేదికను క్రియేట్ చేశారు. దీంట్లో టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ ఎం.ఎస్.రాజు దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘డర్టీ హరి’ ని రిలీజ్ చేస్తున్నారు. డిసెంబర్ 18న ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ కి పెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
తాజాగా విడుదల చేసిన ‘డర్టీ హరి’ పోస్టర్ లో హీరో హీరోయిన్లు టాప్ లెస్ గా బ్యాక్ సైడ్ లుక్ ని చూపించారు. ఈ చిత్రాన్ని నేటి యువతను దృష్టిలో పెట్టుకొని రొమాంటిక్ థ్రిల్లర్ గా రూపొందించారు. ఈ సినిమాలో శ్రవణ్ రెడ్డి – రుహానీ శర్మ – సిమ్రత్ కౌర్ ప్రధాన పాత్రల్లో నటించారు. గూడూరు శివ రామకృష్ణ సమర్పణలో సతీష్ బాబు – సాయి పునీత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ మరియు వీడియో సాంగ్స్ విశేషమైన ఆదరణ పొందాయి. ఈ చిత్రంలో రొమాంటికి సన్నివేశాలు.. కుర్రకారుని ఆకట్టుకునే అంశాలు చాలానే ఉన్నట్లు తెలుస్తోంది. మార్క్ కె. రాబిన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అనిపించుకున్న ఎం.ఎస్.రాజు యూత్ ని టార్గెట్ చేస్తూ చేసిన ‘డర్టీ హరి’ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో తెలియాలంటే డిసెంబర్ 18 వరకు ఆగాల్సిందే.
తెలుగు ప్రేక్షకుల ముందుకు మరో డిజిటల్ ప్లాట్ ఫామ్ రాబోతుంది. ఇప్పటికే ఆహా ఓటీటీ రాగా త్వరలో కొత్తగా ప్రముఖ నిర్మాతలు ఏటీటీని ని తీసుకు రాబోతున్నారు. ఇప్పటికే శ్రియాస్ ఈటీ ఏటీటీ ఉన్న విషయం తెల్సిందే. కొత్త ఏటీటీని డిసెంబర్ 18వ తేదీన ప్రారంభించబోతున్నారట. ఏటీటీ ప్రారంభం కాకుండానే అప్పుడే సినిమాలను కొనుగోలు చేస్తున్నారట. ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపొందిన డర్టీ హరి సినిమాను ఫ్యాన్సీ రేటుకు కొత్త ఏటీటీ వారు కొనుగోలు చేశారంటూ వార్తలు వస్తున్నాయి.
పే ఫర్ వ్యూ పద్దతిలో నడిచే ఈ కొత్త ఏటీటీ యాప్ కు టాలీవుడ్ నుండి ప్రముఖులు వెనుకున్నట్లుగా తెలుస్తోంది. థియేటర్లకు జనాలు తక్కువగా వస్తున్న సమయంలో ఏటీటీ(ఎనీ టైమ్ థియేటర్) కి ప్రాముఖ్యత పెరుగుతోంది. అందుకే ఏటీటీ లు వరుసగా రాబోతున్నాయి అంటున్నారు. తెలుగు నిర్మాతల నుండి వస్తున్న ఏటీటీ కారణంగా దీనికి ప్రత్యేక స్థానం ఉంటుందని అంతా చాలా బలంగా నమ్ముతున్నారు. డర్టీ హరి చిత్రంతో పాటు ఇంకా పలు సినిమాలు డిసెంబర్ 18న కొత్త ఏటీటీ స్ట్రీమింగ్ అవ్వబోతున్నాయి.
సినిమా ను బట్టి రేటు ఉంటుందని.. పే ఫర్ వ్యూ పద్దతికి ముందు ముందు మంచి ఆధరణ ఉంటుందని అంటున్నారు. ఫోన్ కాల్ చేసి సినిమా చూసే విధానంను కొత్త ఏటీటీ వారు తీసుకు వస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు మీడియా సర్కిల్స్ లో ఈ ఏటీటీ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. డిసెంబర్ 18న అన్ని విషయాలు పూర్తి క్లారిటీగా వచ్చే అవకాశం ఉంది.