దుర్గమ్మ రథంపై మాయమైన సింహాల ప్రతిమలు !

విజయవాడలోని దుర్గా మల్లేశ్వరస్వామి వెండి రథానికి ముందూ వెనుక రెండేసి సింహాలు ఉంటాయి. వీటిలో మూడు సింహాలు అదృశ్యమయ్యాయన్న విషయం బయటికి రావడంతో ఆలయంలో తీవ్ర కలకలం రేగింది. అంతర్వేది ఘటన తర్వాత పోలీసుల సూచన మేరకు దేవాలయ అధికారులు వెండి రథాన్ని పరిశీలించినప్పుడు ఈ విషయం బయటపడినట్లు సమాచారం. అయితే దీన్ని అధికారికంగా ఎవరూ ధృవీకరించలేదు. గతేడాది ఉగాది సందర్భంగా ఉత్సవ మూర్తులను రథంపై ఊరేగించారు. ఈ సారి కరోనా కారణంగా రథాన్ని బయటకు తీయలేదు. […]