మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగబాబు.. నటుడిగా నిర్మాతగా అనేక సినిమాలు చేశారు. ఈ క్రమంలో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి అక్కడ సక్సెస్ అయ్యారు. ఓవైపు సినిమాలు చేస్తూ మరోవైపు ‘మన ఛానల్ మన ఇష్టం’ అనే యూట్యూబ్ ఛానల్ లో తన అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడిస్తూ వస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా నాగబాబు కొత్త లుక్స్ తో కనిపిస్తూ మెగా అభిమానులను పలకరిస్తున్నాడు. ఇటీవల తెల్ల గడ్డంతో ఉన్న ఫోటోని మెగా బ్రదర్ సోషల్ మీడియా మధ్యమాలలో పోస్ట్ చేయగా ఓ రేంజ్ లో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో తాజాగా మరో కొత్త లుక్ తో వచ్చాడు. మొన్నటి వరకు ఉన్న తెల్లటి గడ్డాన్ని తీసేసి.. నోట్లో సిగరెట్ పెట్టుకొని – ముఖంపై కత్తి గాటు – కొరమీసంతో మాస్ లుక్ లో కేక పుట్టిస్తున్నాడు నాగబాబు. దీనికి ”మనిషి రూత్ అనేది తన వేషధారణలో కనిపించదు. యాంగర్ అంటే నేను ఎలా ఉన్నానో అని కాదు.. నేను ఎలా స్పందిస్తాను అని” అంటూ కామెంట్ జత చేశాడు. విలన్ ని గెటప్ ని తలపిస్తోన్న ఈ లుక్ ని చూసి మరో ‘నారప్ప’ దిగాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నేను విలన్ రోల్స్ చేయడానికి కూడా రెడీ అయ్యానని నాగబాబు మేకర్స్ కి హింట్ ఇస్తున్నట్లు ఉందని మరికొందరు అంటున్నారు. మొత్తంగా ఈ మధ్య నాగబాబు షేర్ చేస్తున్న కొత్త కొత్త లుక్స్ మాత్రం మెగా ఫ్యాన్స్ ని అలరిస్తున్నాయి.
ఇటీవల సింగర్ సునీత – మ్యాంగో రామ్ వీరపనేని వివాహం జరిగిన సంగతి తెలిసిందే. శంషాబాద్ లోని ఓ ఆలయంలో శనివారం రాత్రి.. సన్నిహితులు కొద్దిమంది సినీ రాజకీయ ప్రముఖుల మధ్య జరిగింది. రామ్ – సునీత వివాహాన్ని వారి పిల్లలే దగ్గరుండి జరిపించారు. అయితే ఇప్పుడు సునీత పెళ్లి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సునీత-రామ్ దంపతులను అందరూ అభినందిస్తుంటే.. మరొకొందరు సునీత రెండో పెళ్లిని విమర్శిస్తున్నారు. సునీత పెళ్లి ఫోటోలపై పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి విమర్శలు చేసేవారికి మెగా బ్రదర్ నాగబాబు కౌంటర్ ఇచ్చాడు.
”సంతోషం అనేది పుట్టుకతో ఉండదు. రాదు. దాన్ని మనం వెతుక్కోవాలి. రామ్ – సునీతలు ఇద్దరూ కూడా తమ సంతోషాలను కనుగొన్నందుకు కంగ్రాట్స్. కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకడుగు వేసే వారికి.. కొన్నింటిని ఎంచుకునేందుకు సిగ్గుపడేవారికి ఉదాహరణగా మీ జంట నిలిచింది.. ప్రేమ సంతోషం అనేది ఎప్పటికీ మీ పర్మనెంట్ అడ్రెస్ గా మారాలని కోరుకుంటున్నాను. హ్యాపీ మ్యారీడ్ లైఫ్” అని నాగబాబు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు. ఇంతకముందు సినీ విమర్శకుడు కత్తి మహేష్ సైతం సునీత పెళ్లిని ట్రోల్ చేస్తున్న వారిపై తనదైన శైలిలో కామెంట్స్ చేశాడు.
మెగా బ్రదర్ నాగబాబు తన కూతురు నిహారికను ఎంతగా ప్రేమిస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి తండ్రి కూడా తన కూతురును ప్రిన్సెస్ మాదిరిగా చూసుకుంటాడు. కాని నాగబాబు అంతకు మించి చూసుకున్నట్లుగా అనిపిస్తుంది. ఆమె ఏం కోరితే అది చేశారు.. చేయనిచ్చారు. ఇతరులు ఏం అనుకుంటారో అనే విషయంను ఆయన ఎప్పుడు పట్టించుకోలేదు. కూతురు కోసం ఎంతో చేసిన నాగబాబు ఇటీవలే ఆమె పెళ్లిని అంగరంగ వైభవంగా నిర్వహించాడు. ఇక నేడు ఆమె పుట్టిన రోజు అవ్వడంతో చాలా ఎమోషనల్ గా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
నిహారిక చిన్నప్పటి ఫొటోను షేర్ చేసి దేవుడిపై నమ్మకం లేని నాకు నీ రాకతో ఏంజిల్స్ ను నమ్మాలనిపించింది. నీ కళ్లలో ఆనందం చూసేందుకు నీ ముందు గర్వంగా ఉండేందుకు నేను చాలా చేశాను. ఈ పెళ్లి అనేది మనం ఇంకా క్లోజ్ అవ్వడానికి మరియు నాకు నీపై ఉన్న ప్రేమను చూపించింది అని భావిస్తున్నాను. హ్యాపీ బర్త్ డే నాన్న అంటూ పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలో నిహారిక మరియు ఆమె తల్లిని కనీసం గుర్తు పట్టడానికి కూడా కష్టంగా ఉన్నారు కదా. చిన్నప్పుడే నిహరిక ఎంత క్యూట్ గా ఉంది.. ఆ బుగ్గలు ఎంత ముద్దు వస్తున్నాయో అంటూ మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
మెగా డాటర్ నిహారిక ప్రేమ వివాహం చేసుకున్నారా? పెద్దలు కుదుర్చిన సంబంధం మాత్రమేనా? ఈ ప్రశ్నకు సమాధానం ఇంతవరకూ పూర్తి స్పష్ఠతతో లేదు. కానీ ఇప్పుడు అన్ని సందేహాలకు చెక్ పెట్టేశారు మెగా బ్రదర్ నాగబాబు. తన గారాల పట్టి నిహారిక – చైతన్య ల ప్రేమకథని మెగా బ్రదర్ నాగబాబు స్వయంగా బయటపెట్టారు. ఉదయ్ పూర్ లోని ఉదయ్ విలాస్ ప్యాలెస్ లో మెగా ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు అత్యంత సన్నిహితుల మధ్య నిహారిక- చైతన్యల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే వీరిద్దరు ప్రేమించుకున్నారని ఆ తరువాత ఆ ప్రేమకథ తనకు తెలిసిందని నాగబాబు తెలిపారు. ప్రేమాయణం తరువాతే వీరి పెళ్లి కుదిరిందన్న విషయం చాలా మందికి తెలియదు.
చాలా కాలంగా ప్రేమలో వున్న నిహారిక- చైతన్య తమ ప్రేమని పెద్దల అంగీకరింతో పెళ్లి పీటల దాకా తీసుకెళ్లాలని ప్లాన్ చేసుకున్నారట. ఇందులో భాగంగానే మెగా బ్రదర్ నాగాబాబుకు దగ్గరయ్యేందుకు జొన్నలగడ్డ చైతన్య జూబ్లీహాల్స్ లోని అపోలో జిమ్ లో చేరారట. అదే జిమ్ లో నాగబాబు వర్కవుట్ లు చేస్తుండటంతో చైతన్య అపోలో జిమ్ లో చేరారట. చిన్నగా నాగబాబుతో పరిచయం పెంచుకుని రోజూ విష్ చేయడం పనిగా పెట్టుకుని ఇంప్రెస్ చేయడం మొదలుపెట్టారట. 2015 నుంచి చైతన్య- నిహారిక ప్లాన్ మొదలైందట.
చివరకు గత ఏడాది నిహారిక తన తల్లిదండ్రులకు ప్రేమ వ్యవహారం గురించి వెల్లడించిందట. ఆమె తండ్రి నాగబాబుకు చైతన్య గురించి సమాచారం ఇచ్చింది. ఆ తరువాతే నాగబాబు కుటుంబం చైతన్య కుటుంబం గురించి ఆరా తీశారట. చైతన్య తండ్రి గుంటూరు ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు గురించి తెలుసుకున్న తరువాత నాగబాబు నిహారిక ప్రేమ పెళ్లికి గ్రీన్సిగ్నల్ ఇచ్చేశారట. ఐజి జె ప్రభాకర్ రావు కు చిరంజీవితో మంచి అనుబంధం వుండటంతో నిహారిక ప్రేమ పెళ్లికి ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగింది` అని నాగబాబు నిహారిక ప్రేమ పెళ్లి సీక్రెట్ ని బయటపెట్టారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ – మెగా బ్రదర్ నాగబాబు మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ కి మద్దతు ప్రకటించడం తనకు నచ్చలేదని.. అభిప్రాయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ‘2014లో మీరే బీజేపీ వాళ్లు ఇంద్రుడు చంద్రుడు అన్నారు. మళ్లీ గత ఎన్నికల్లో లేదు వాళ్లు ద్రోహులు అన్నారు. మళ్లీ ఇప్పుడు వీళ్లే నాయకులుగా కనిపిస్తున్నారు. అంటే ఇలా మూడు నాలుగు సార్లు మారుతున్నారంటే.. మీరు ఊసరవెల్లి అయి ఉండాలి కదా’ అని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు. అయితే పవన్ ని ఏదైనా అంటే ఒంటి కాలిపై లేచొచ్చే సోదరుడు నాగబాబు ఆయన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.
‘పవన్ కళ్యాణ్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలపడం వెనుక విస్తృత ప్రయోజనాలు ఉన్నాయని నా నమ్మకం. పవన్ కళ్యాణ్ ఎవరికి ద్రోహం చేశాడని ప్రతి పనికిమాలినవాడు విమర్శిస్తున్నాడు. మిస్టర్ ప్రకాష్ రాజ్.. నీ డొల్లతనం ఏంటో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి డిబేట్ లోనే అర్థం అయ్యింది. సుబ్రహ్మణ్య స్వామి నిన్ను తొక్కి నారతీస్తుంటే మాట్లాడలేక తడబడటం నాకు ఇంకా గుర్తుంది. నిర్మాతలని డబ్బు కోసం ఎన్ని రకాలుగా హింస పెట్టావో.. డేట్స్ ఇచ్చి రద్దు చేసి ఎంత హింసకు గురిచేశావో అన్నీ గుర్తున్నాయి. ముందు నువ్వు మంచి మనిషిగా మారు. ఆ తర్వాత మాట్లాడు. డైరెక్టర్స్ ని కాకా పట్టి నిర్మాతలను కాల్చుకు తినే నీకు ఇంత కంటే మంచిగా మాట్లాడడం ఏమి తెలుసు. మీడియా అడిగింది కదాని ఒళ్లు పొంగి నీ పనికి మాలిన రాజకీయ డొల్లతనాన్ని బయట వేసుకోకు” అని నాగబాబు ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. నాగబాబు ట్వీట్ పై ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
అయితే ప్రకాష్ రాజ్.. నాగబాబు లా కాకుండా తనదైన కౌంటర్ ఇచ్చారు. నాకు తెలుగు వచ్చు.. కానీ మీ భాష రాదంటూ నాగబాబు అభ్యంతరకర వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ”గౌరవనీయులైన నాగబాబు గారికి.. మీ తమ్ముడి మీద మీకున్న ప్రేమ నాకు అర్థమైంది. నాకు దేశం మీద ఉన్న ప్రేమను మీరు అర్థం చేసుకోండి. నాకు తెలుగు భాష వచ్చు. కానీ మీ భాష రాదు” అంటూ ప్రకాష్ రాజ్ తెలుగులో ట్వీట్ చేశారు. దీనికి #Justasking అనే హ్యాష్ ట్యాగ్ తో నాగబాబు ని ట్యాగ్ చేసిన ప్రకాష్.. దండాలు పెడుతున్న ఎమోజీలు ఉంచాడు. మరి దీనిపై మెగా బ్రదర్ స్పదిస్తారా లేదా సైలెంటుగా ఉంటారా అనేది చూడాలి.
తెలుగు బిగ్ బాస్ లో రెండవ వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్ ఎక్కువగా సింపతీతో నెగ్గుకు రావాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మొదట ఇల్లు ఈఎంఐ కట్టలేక ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాను అంటూ చెప్పి సింపతీ వర్కౌట్ చేశాడు. ఆ తర్వాత తనకు ఇక్కడ నుండి బయటకు వెళ్తే జీవతం లేదు. జబర్దస్త్ నుండి నన్ను బయటకు పంపించారు. మళ్లీ వారు తీసుకోమని చెప్పారు. ఇప్పుడు నా జీవితం ఏంటీ అన్న రీతిలో డ్రామాను చేస్తున్నాడు. ఎలిమినేషన్ కు నామినేట్ అయన ప్రతి సారి కూడా అతడు చేస్తున్న సీన్ కాస్త ఓవర్ అనిపిస్తుంది.
ఇదే విషయాన్ని స్వయంగా నాగబాబు కూడా పేర్కొన్నాడు. అవినాష్ బాగానే ఆడుతున్నాడు. వాడు ఏడ్చే రకం కాదు. కాని వాడు అక్కడ ఏడుస్తుంటే కాస్త తేడాగా అనిపిస్తుంది. ఇలా ఏడ్చుకుంటూ బిగ్ బాస్ లో నెగ్గుకు రావడం అనేది సాధ్యం అయ్యే విషయం కాదు. ఆ విషయాన్ని వాడు తెలుసుకోవడం లేదు. బిగ్ బాస్ లో అవినాష్ చేస్తున్న అతి పెద్ద తప్పు అదే అన్నట్లుగా నాగబాబు తన యూట్యూబ్ వీడియోలో పేర్కొన్నాడు. అవినాష్ కు ఎవిక్షన్ పాస్ రావడంతో ఈ వారం సేవ్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. వచ్చే వారం ఒక్క వారం సేవ్ అయితే ఖచ్చితంగా ఫైనల్ 5 లో అవినాష్ ఉంటాడు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇక నాగబాబు దృష్టిలో అభిజిత్ లేదా అవినాష్ విన్నర్ అవుతారు అంటున్నారు. ఇద్దరిలో ఎవరు విన్నర్ అయినా కూడా తనకు హ్యాపీ అంటూనే అవినాష్ తప్పులు చేస్తున్నాడు అంటూ అభిజిత్ ను హైప్ చేశాడు. మీరు ఈ ఇద్దరిని కూడా ఫైనల్ 5కి తీసుకు వెళ్లండి ఫైనల్ విజేత ఎవరు అయినా పర్వాలేదు అంటూ నాగబాబు ఇండైరెక్ట్ గా వీరిద్దరికి తనవంతు సాయంగా ప్రమోట్ చేశాడు.
మెగా బ్రదర్ నాగబాబు యూట్యూబ్ లో ఈమద్య అన్ని విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని సార్లు ఎంటర్ టైన్ చేస్తున్నారు.. కొన్ని సార్లు తెలియని విషయాలను తెలియజేస్తున్నారు. మొత్తంగా నాగబాబు ప్రతి వీడియో కూడా అందరిని ఆకట్టుకునేలా ఉంటుంది. ఇటీవల కమ్యూనికేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది నాగబాబు చెప్పే ప్రయత్నం చేశాడు. స్నేహితుల మద్య అయినా.. కుటుంబ సభ్యుల మద్య అయినా ఏ ఇద్దరి మద్య అయినా కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం. ఆ కమ్యూనికేషన్ సరిగా లేక పోవడం వల్లే ఇబ్బందులు తలెత్తుతాయి అన్నాడు.
సరిగ్గా కమ్యూనికేట్ చేస్తే ఖచ్చితంగా అవతలి వారు కన్విన్స్ అవుతారు. ఆ విషయంలో ఎలాంటి అనుమానం లేదు అంటూ నాగబాబు ఒక ఉదాహరణతో తెలియజేశాడు. తన గారాల పట్టి నిహారిక 10వ తరగతి ఉన్న సమయంలో జరిగిన సంఘటనను ఈ సందర్బంగా షేర్ చేసుకున్నాడు. ఒకప్పుడు పిల్లలకు పూర్తి స్వచ్చ ఇచ్చేవారు. కాని ఇప్పుడు పిల్లలను ఎక్కువగా ప్రేమించడంతో పాటు గారాబం చేస్తున్నాం. దాంతో వారికి స్వేచ్చ మిస్ అవుతుంది. అతి ప్రేమతో వారికి స్వేచ్చ ఇవ్వడం లేదు. ఆ కారణంగా వారు కొన్ని మిస్ అవుతున్నారు.
నిహారిక 10వ తరగతిలో ఉత్తరాంచల్ ట్రిప్ కు వెళ్తాను అంది. స్కూల్ వాళ్లు అందరితో కలిసి వెళ్తున్నందున పంపించాలని కోరింది. కాని నేను పది రోజులు అవ్వడం వల్ల పంపించేందుకు ఒప్పుకోలేదు. నాలుగు అయిదు రోజులు రిక్వెస్ట్ చేయడంతో ఇద్దరు బాడీగార్డ్స్ ను పంపిస్తా వారు నీకు దూరంగా ఉంటారు. అందుకు ఓకే అయితే వెళ్లు అన్నాను. కాని తను అందుకు ఓకే చెప్పలేదు. తన స్నేహితులు నవ్వుతారు అంది. ఒక రోజు నా కు లెటర్ రాసింది. అందులో నన్ను కన్విన్స్ చేసిన తీరు నచ్చింది.
నేను నా టీచర్ల నెంబర్స్ ఇస్తాను.. స్నేహితుల నెంబర్స్ ఇస్తాను… ప్రతి రోజు నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు కాల్ చేయి. సిగ్నల్ ఉన్నా లేకున్నా నేను నీకు ప్రతి రోజు కాల్ చేసి ఎక్కడ ఉన్నది చెప్తాను. ప్లీజ్ నాన్న వెళ్లనివ్వు అంటూ కోరింది. తను నన్ను కమ్యూనికేట్ చేసిన విధానం నాకు నచ్చిందని నాగబాబు పేర్కొన్నాడు. ఆ రోజు తను అలా కమ్యూనికేట్ చేయకుంటే నేను ఒప్పుకునే వాడిని కాదు.. తను ఆ మంచి మూమెంట్స్ మిస్ అయ్యేది అంటూ నాగబాబు కమ్యూనికేషన్ యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్పుకొచ్చాడు.
తెలుగు బిగ్ బాస్ పై మెగా బ్రదర్ నాగబాబు స్పందించాడు. జబర్దస్త్ ఫ్యామిలీకి చెందిన అవినాష్ అంటే నాకు చాలా అభిమానం ఉంది. అతడికి తప్పకుండా సపోర్ట్ చేయండి అంటూనే తనకు అభిజిత్ ఆట బాగా నచ్చింది. వ్యక్తిగతంగా రెండు మూడు సార్లు కలిశాం. అతడి ప్రవర్తన చాలా బ్యాలెన్స్ గా ఉంటుంది. అతడు చాలా కూల్ గా ఆడుతున్న తీరు నాకు నచ్చింది. అభిజిత్ ను సపోర్ట్ చేయాలనుకుంటున్నా. నన్ను ఎవరు కూడా అభిజిత్ కు సపోర్ట్ చేయమని అడగలేదు. కాని అతడి ఆట తీరుతో నాకు ఎందుకో అతడికి సపోర్ట్ చేయాలని నేనే ముందుకు వచ్చాను.
నాకు అవినాష్ మరియు అభిజిత్ ఇద్దరిని ఫైనల్ లో చూడాలని ఉంది. ఇద్దరిలో ఎవరిని గెలిపించినా పర్వాలేదు కాని ఇద్దరు కూడా ఫైనల్ వరకు ఉండాలని కోరుకుంటున్నట్లుగా పేర్కొన్నాడు. నాగబాబు చాలా క్లీయర్ గా జబర్దస్త్ ఫ్యామిలీకి చెందడం వల్ల అవినాష్ అంటే ఇష్టం.. ఆట తీరు బాగుండటం వల్ల అభిజిత్ అంటే ఇష్టం అంటూ క్లారిటీగా చెప్పాడు. ఇద్దరిలో ఎవరు గెలిచినా కూడా హ్యాపీ అంటూనే అభిజిత్ కు విన్నింగ్ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా చెప్పకనే చెప్పాడు. అవినాష్ ఫైనల్ 5 లో ఉంటాడా లేదా అనేది ఈ వారం ఎలిమినేషన్ తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
నవదీప్ హీరోగా సక్సెస్ అవ్వలేక పోయినా కూడా ఆయన కెరీర్ ఆరంభం నుండి ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే వచ్చాడు. హీరోగా నవదీప్ చేసిన పలు సినిమాలు వివాదాస్పదం అయ్యాయి. హీరోగా నవదీప్ చేసిన ఒక సినిమాలో అంకిత హీరోయిన్ గా నటించింది. ఆ సమయంలో నవదీప్ వల్ల అంకిత నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ సమయంలో నవదీప్ చాలా మానసిక సంఘర్షణకు గురి అయ్యాడట. తాజాగా ఆ విషయాన్ని అలీతో సరదాగా టాక్ షో లో వెళ్లడించాడు.
ఆనాటి సంగతులను నవదీప్ వెళ్లడిస్తూ… నేను వరుసగా ప్లాప్ ల్లో ఉన్న సమయంలో అంకిత వరుస సక్సెస్ల్లో ఉన్న సమయంలో మా ఇద్దరి కాంబోలో సినిమాను అనుకున్నారు. మొదటి నుండే ఆమె నా సినిమాలో నటించేందుకు ఇష్టం చూపించలేదు. మద్యలో ఆమె కొన్నాళ్ల పాటు షూటింగ్ రాకుండా నిర్మాతలను ఇబ్బంది పెట్టింది. నిర్మాతలు ఆమెను అగ్రిమెంట్ ముందు పెట్టి షూటింగ్ పూర్తి చేయించారు. ఆ తర్వాత ఆమె నాపై నిర్మాతలకు ఫిర్యాదు చేయడం మొదలు పెట్టింది.
ఆ సమయంలో ఏదోలా సినిమాను పూర్తి చేశాం. కొన్ని రోజుల తర్వాత ఒక వ్యక్తి ఫోన్ చేసి హీరోయిన్ అంకిత మీ వల్ల ఆత్మహత్య ప్రయత్నం చేసిందట. దీనిపై మీరు ఏమంటారు అంటూ ప్రశ్నించడంతో షాక్ అయ్యాను. ఆ విషయమై నేను నా కుటుంబ సభ్యులు చాలా ఆందోళన వ్యక్తం చేశాము. ఆ సమయంలో నాకు నాగబాబు గారు సాయంగా నిలిచారు. ఆయన మద్దతుతో ఆ సమస్య నుండి బయట పడ్డాను. ప్రెస్ మీట్ పెట్టి ఆ వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదు అంటూ చెప్పాను. దాంతో నాకు ఆ వివాదంతో ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు.
1990వ దశకంలో రాంగోపాల్ వర్మ అనే దర్శకుడి అవసరమే తెలుగు సినిమా ఇండస్ట్రీకి లేదని.. నాడు రాఘవేంద్రరావు కోదండరామిరెడ్డి బీ గోపాల్ లాంటి గొప్ప గొప్ప దర్శకులున్నారని.. అలాంటి టైంలో రాంగోపాల్ వర్మ అనే కుర్రాడికి బోలెడంతా టాలెంట్ సినిమాలపై అవగాహన ఉండి తపించాడని.. సరైన అవకాశం దక్కించుకొని ‘శివ’తో ఇండస్ట్రీని షేక్ చేశాడని మెగా బ్రదర్ నాగబాబు కొనియాడారు. ‘మా చానెల్ మా ఇష్టం’ అంటూ యూట్యూబ్ లో తాజాగా ఆయన ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన సినీ ప్రముఖుల గురించి ఎంతో గొప్పగా చెప్పుకొచ్చారు. టాలెంట్ ఉన్నవాడిని ఎవరూ ఆపలేరంటూ ఉదాహరణలతో నాగబాబు వివరించారు. ఈ క్రమంలోనే రాంగోపాల్ వర్మ ఎదిగిన తీరును నాగబాబు వివరించారు.
రాంగోపాల్ వర్మ నాన్న గారు అన్నపూర్ణలో పనిచేస్తున్నారని.. అలా అప్పటి స్టార్ హీరో నాగార్జునను అప్రోచ్ అయ్యి ఆయన సూచన మేరకు ఒక సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా వర్మ చేశాడని నాగబాబు వివరించారు. అప్పటికే వర్మకు ఫిల్మ్ మేకింగ్ లో విపరీతమైన అవగాహన ఉందని.. శివ సినిమాతో ఒక సంచలనం సృష్టించాడని నాగబాబు చెప్పుకొచ్చాడు. ఆరోజు వర్మ తీసిన సినిమా ఇప్పటికీ ఒక కల్ట్ సినిమాగా నిలిచిందని.. ఇలా కూడా సినిమాలు తీయవచ్చా.. ఇంత రియలిస్టిక్ గా అని వర్మ అందరినీ ఆశ్చర్యపరిచాడని అన్నారు.
సో శివ సినిమా తర్వాత రాంగోపాల్ వర్మ వెనక్కి తిరిగి చూసుకోలేదని..తనదంటూ గొప్ప మార్క్ ను సినిమా ఇండస్ట్రీపై క్రియేట్ చేశాడని నాగబాబు అన్నారు.
సినిమా ఇండస్ట్రీలో రైటర్లకు చాలా డిమాండ్ ఉందని.. వారి సృజనాత్మకతే సినిమాలను నడిపిస్తోందని మెగా బ్రదర్ నాగబాబు చెప్పుకొచ్చారు. రైటర్లు ఇండస్ట్రీలో కొరత ఉందని.. రైటర్లు అంతా దర్శకులు అయిపోయి రైటింగ్ తగ్గించారన్నారు.
ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకున్నా కేవలం టాలెంట్ తపనతో పైకి ఎదిగిన వారు ఎందరో ఉన్నారని.. సాయి మాధవ్ బుర్రా లాంటి రచయితలు ఇందుకు ఉదాహరణ అని.. పలువురు హాలీవుడ్ దర్శకులు కూడా తపనతో పైకి ఎదిగారని నాగబాబు చెప్పుకొచ్చారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి మన అవసరం లేకపోయినా సరే మనమే ఒక అవసరాన్ని సృష్టించగలగడం చేయాలని.. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త వారికి నాగబాబు సలహా ఇచ్చారు.
మెగా బ్రదర్ నటుడు నిర్మాత నాగబాబు ఇటీవల కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే.. ఆయన పలు టీవీ షోలను చేస్తున్నారు. ఆ క్రమంలోనే కరోనా బారినపడ్డారని తెలిసింది. కాగా గత 14 రోజులుగా చికిత్స తీసుకుంటున్న నాగబాబు తాను కరోనాను జయించానని తాజాగా తెలిపారు. హోం ఐసోలేషన్ తర్వాత తాను ఎదుర్కొన్న అనుభవాలు తీసుకున్న జాగ్రత్తలు కోలుకున్న విధానాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఒక వీడియోను విడుదల చేశారు.
ఇటీవల తాను ఐదు సార్లు కరోనా టెస్ట్ చేయించుకున్నానని.. నిహారిక నిశ్చితార్థానికి ముందు కూడా ఫ్యామిలీ అంతా చేయించుకుంటే నెగెటివ్ వచ్చిందని నాగబాబు తెలిపారు. కానీ తాజాగా కాస్త చలి జ్వరం మత్తుగా అనిపించడంతో టెస్ట్ చేయిస్తే పాజిటివ్ వచ్చిందని నాగబాబు తెలిపారు.
కరోనా అనగానే మొదట ఆందోళనకు గురయ్యానని.. ఆస్పత్రికి వెళ్లి అవసరమైన పరీక్షలు చేయించుకున్నానని.. నాకు గతంలో న్యూమోనియా ఉండడంతో ఆస్పత్రిలో చేరగా.. ఐదురోజులు రెమిడెసివిర్ ఔషధాన్ని ఇచ్చారని నాగబాబు తెలిపారు. జ్వరం ఒళ్లు నొప్పులు తప్ప ఎటువంటి ఇబ్బంది నాకు కలుగలేదని నాగబాబు తెలిపారు.
కరోనాకు ఎవరూ అతీతులు కారని.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అది వస్తుందని నాగబాబు తెలిపారు. జ్వరం దగ్గు జలుబు ఉంటే వెంటనే కరోనా టెస్ట్ చేయించుకోండని నాగబాబు తెలిపారు. కరోనాకు మందు లేదని.. వైరస్ లోడును బట్టి చికిత్స అందిస్తారని.. కరోనా వైరస్ 14 రోజుల తర్వాత దానంతట అదే చచ్చిపోతుందని నాగబాబు తెలిపారు. 14 రోజుల తర్వాత వైరస్ ఉన్నా మనకు హాని కలిగించదని అన్నారు. తాను ఫ్లాస్మా దానం చేస్తానని నాగబాబు తెలిపారు. అందరూ కంగారు పడవద్దనే ఈ వీడియో పంచుకున్నానని నాగబాబు తెలిపారు.
మెగా బ్రదర్ నాగబాబు ఏకైక కుమార్తె నిహారిక కొణిదెల నిశ్చితార్థం వివాహం త్వరలో జరగనుందనే విషయం తెలిసిందే. గుంటూరు జిల్లాకు చెందిన ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు తనయుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక పెళ్లి జరగనుంది. ఈ క్రమంలో ఇటీవల నిహారిక – చైతన్యల ఎంగేజ్మెంట్ ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్ గా జరిగింది. అయితే త్వరలో వియ్యంకుడు కాబోతున్న ఐజీ ప్రభాకర్ రావు త్వరలో పదవీవిరమణ చేస్తుండటంతో ఆయన గురించి నాగబాబు మాట్లాడారు. తన యూట్యూబ్ ఛానల్ ‘మన ఛానల్ మన ఇష్టం’లో దీనికి సంబంధించిన వీడియో విడుదల చేశారు నాగబాబు.
నాగబాబు మాట్లాడుతూ.. ”ఈ నెల ఆగస్టు 31న రిటైర్డ్ కాబోతున్న ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు గారికి.. అభినందనలు తెలియజేస్తున్నా. వారితో త్వరలో వియ్యం అందుకోబోతున్నాను. మా ఫ్యామిలీకి పోలీస్ డిపార్ట్మెంట్ తో తెలియని అనుబంధం ఉంది. మా నాన్న ఎక్సయిజ్ డిపార్ట్మెంట్ తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా పనిచేశారు. నాన్నకి మా ముగ్గురు అన్నదమ్ముల్లో ఎవరినో ఒకరిని ఐపీఎస్ చేయాలని కోరిక ఉండేది. కాని మేము ఎవరం ఆ ఫీట్ సాధించలేకపోయాం. ఇన్నాళ్లకు కాకతాళీయంగా ప్రభాకర్ గారితో వియ్యం అందుకునే అవకాశం వచ్చింది. ఆ విధంగా ఓ పోలీస్ ఆఫీసర్ మా కుటుంబంలో భాగం కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది” అని చెప్పారు.
ఐజీ ప్రభాకర్ వివరాలు తెలియజేసిన నాగబాబు.. ఆయన డీఎస్పీగా పదవీ బాధ్యతలు చేపట్టిన కొత్తలో గుంటూరులో ఓ రౌడీ షీటర్ ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటే రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకుని వెళ్లి రౌడీయిజాన్ని కట్టడి చేశారని చెప్పుకొచ్చారు. అలాగే రాజమండ్రిలో టెర్రరిస్టులు చొరబడినప్పుడు వాళ్లని చాకచక్యంగా పట్టుకుని జాతీయ స్థాయిలో సెన్సేషన్ అయ్యారని వెల్లడించారు. అంతేకాకుండా రాయలసీమలో పనిచేస్తున్నప్పుడు ఫ్యాక్షన్ వల్ల వచ్చే నష్టాన్ని తెలియజేస్తూ వాళ్లలో మార్పు తీసుకొచ్చి మంచి వైపుకు మళ్లే విధంగా చేశాడు.. ఇలా ఆయన గురించి చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయని నాగబాబు కాబోయే వియ్యంకుడి గురించి చెప్పుకొచ్చారు.
”నాకు సంతోషం కలిగించే విషయం ఏంటంటే.. ప్రభాకర్ గారి అబ్బాయి చైతన్యకి మా అమ్మాయి నిహారికను ఇవ్వడం. ఇంత మంచి ఫ్యామిలీకి మా అమ్మాయి కోడలుగా వెళ్లడం ఆనందంగా ఉంది. మంచి వ్యక్తులతో వియ్యం అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. బావగారూ.. మీ రిటైర్డ్మెంట్ అయిన తరువాత కూడా చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ వీడియో ద్వారా తనకు కాబోయే బావగారిపై మెగా బ్రదర్ నాగబాబు ప్రశంసలు కురిపించారు.
సినీ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా బంధుప్రీతి(నెపోటిజం) పై చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో బంధుప్రీతి ఎక్కువ ఉంటుందని.. దీని కారణంగా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టిన వారికి అవకాశాలు రాకుండా చేస్తుంటారని.. నటవారసులకి మాత్రం టాలెంట్ తో సంబంధం లేకుండా ఛాన్సెస్ ఇస్తుంటారంటూ సినీ ప్రముఖులు బాహాటంగా కామెంట్స్ చేస్తున్నాయి. ఇది ఎప్పటి నుంచో ఉన్నదే అయినప్పటికీ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో ఒక్కసారిగా ఊపందుకుంది. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ సభ్యుడు నాగబాబు టాలీవుడ్ లో బంధుప్రీతి గురించి స్పందించారు. తన ‘మన ఛానల్ మన ఇష్టం’ యూట్యూబ్ ఛానెల్ లో దీనిపై మూడు ఎపిసోడ్స్ అప్లోడ్ చేశారు. నాగబాబు మాట్లాడుతూ ”ఇండస్ట్రీలో నెపోటిజం ఎక్కువైందని ఈ మధ్య ఎక్కువగా వింటూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో ఈ మధ్య ఆ నాలుగు ఫ్యామిలీలు ఆ నాలుగు ఫ్యామిలీలు అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. అది కేవలం జలస్ అక్కసు చేతగానితనం కుళ్ళు ఇలాంటివి లోపల ఉన్నవారు మాత్రమే అలాంటి మాటలు మాట్లాడతారు. ఇక్కడ టాలెంట్ ఉన్నవారే నిలబడతారు. దమ్ముంటేనే హీరో అవుతాడు. అంతేకాని టాలెంట్ లేకుండా జనాల మీద రుద్దితే హీరో అవలేరు” అని చెప్పుకొచ్చాడు.
”ముందుగా కుటుంబం గురించి చెప్పుకుంటే చిరంజీవి 20 ఏళ్ళ వయసులో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఏ గాడ్ ఫాథర్ లేడు. ఎంతో కష్టపడి మెగా హీరో అయ్యాడు.. ఓ పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాడు. నెక్స్ట్ జనరేషన్ లో వచ్చిన బన్నీ వంద శాతం కష్టపడి ప్రూవ్ చేసుకున్న హీరో అతను. చరణ్ కూడా బాంబే వెళ్లి యాక్టింగ్ నేర్చుకుని సినిమాల్లోకి రావడానికి హార్డ్ వర్క్ చేసారు. అంతేకాని చిరంజీవి కొడుకు అని మాత్రమే గుర్తింపు తెచ్చుకోలేదు. సినిమా కోసం చాలా కష్ట పడతాడు.. అతని టాలెంట్ తో ఈ స్థాయికి ఎదిగాడు” అని నాగబాబు చెప్పారు. అంతేకాకుండా సాయి ధరమ్ తేజ్ వరుణ్ నిహారిక అందరూ తమ కెరీర్ కోసం సినిమా కోసం విపరీతంగా కష్ట పడతారని.. తేజ్ కి ఈ మధ్య వరుసగా ఐదు సినిమా ప్లాప్ అయ్యాయి.. అప్పుడు ఎంత డిప్రెషన్ కి గురై ఉంటాడు. బంధు ప్రీతితో హిట్ అయ్యేలాగా చేయగలమా? ఎంత బ్యాగ్రౌండ్ ఉన్నా ఫెయిల్యూర్స్ వస్తాయని అన్నారు.
”నాగేశ్వరరావు కొడుకు కాబట్టి నాగార్జునను చూసెయ్యలేదు. ఆయన తన గ్లామర్ తో నటనతో ‘కింగ్’గా ఎదిగారు. అలాగే జూనియర్ ఎన్టీయార్ ఎంత కష్టపడతాడో నేను స్వయంగా చూశాను. ఎన్టీఆర్ కొడుకు అనే బ్యాగ్రౌండ్ ఉన్నా బాలకృష్ణ చాలా కష్టపడి పేరు సంపాదించించుకున్నారు. డ్యాన్సులు ఫైట్స్ తో ఆయనకంటూ సెపరేట్ స్టైల్ క్రియేట్ చేసుకుని పెద్ద హీరోగా నిలబడ్డాడు. నాగార్జున కొడుకులు విదేశాల్లో యాక్టింగ్ కోర్స్ నేర్చుకొని వచ్చారు. నానా కష్టాలు పడి హీరోలుగా మారారు. వెంకటేష్ – రానా కూడా చాలా కష్టపడ్డారు. అలాగే మహేష్ బాబు కాస్త లావుగా ఉండేవాడు. సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు కేబీఆర్ పార్కులో రోజూ రన్నింగ్ చేసేవాడు. చూస్తుండగానే స్లిమ్ గా మ్యాన్లీగా తయారై పోయాడు. జూనియర్ ఎన్టీఆర్ ఎంత కష్టపడతాడు అనేది నాకు తెలుసు. ‘అరవింద సమేత’ షూటింగ్ సమయంలో 44 డిగ్రీల ఎండలో షర్ట్ కూడా లేకుండా ఫైట్ చేశాడు. బంధుప్రీతితో వచ్చారు అని బుద్ధి లేని వారు అనే మాట. ఒక లాయర్ కొడుకు లాయర్ అయితే.. ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అయితే బంధుప్రీతి తో వచ్చారని ఎందుకు అనరు. ఎందుకంటే వారు కష్ట పడితేనే అలా అవుతారు. కష్ట పడకపోతే ఎవరికీ ఇక్కడ చోటు లేదు. దేవుడి కొడుకైనా.. అతడు నచ్చక పోతే ప్రజలు తిరస్కరిస్తారు. నెపోటిజం పై మాటలన్నీ కుళ్ళు బోతు మాటలు. హిందీ మీడియా లో కూడా ఇండస్ట్రీ లో నెపోటిజం ఎక్కువయిందని బుద్ధిలేని మాటలు అంటోంది. నెపోటిజం అనే పదం వాడటం మీ చేతకాని తనం.. మీ కుళ్ళు నేచర్. ఇక్కడ ఎవరూ నెపోటిజం తో పైకి రాలేదు.. కష్టం తో పైకి వచ్చారు. రవితేజ నాని విజయ్ దేవరకొండ లాంటి వారు బ్యాగ్రౌండ్ లేకుండా సక్సెస్ అయిన వారే. చాలా మంది స్టార్ హీరోల పిల్లలు సక్సెస్ కాలేదనే విషయం తెలుసుకోవాలి” అని నాగబాబు అన్నారు.
మెగా బ్రదర్ నాగబాబుకి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంత ప్రేమాభిమానాలో అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో నిన్న చిరంజీవి బర్త్ డే సందర్భంగా నాగబాబు చిన్ననాటి జ్ఞాపకాలను.. ఆయన జీవితంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నాడు. ‘మన ఛానల్ మన ఇష్టం’ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ‘మెగాస్టార్ సక్సెస్ సీక్రెట్స్’ అంటూ మూడు ఎపిసోడ్స్ పోస్ట్ చేసాడు. ‘అన్నయ్య చిన్నప్పటి నుంచి ఎంతో బాధ్యత.. ఎంతో డెడికేషన్ గా ఉండేవాడు. ఆరేళ్ళ వయసులోనే అమ్మ సరుకులు చీటి మీద రాసిస్తే ఎంతో జాగ్రత్తగా తెచ్చేవాడు. అమ్మ చెప్పిన ప్రతీమాటను పాటించేవాడు. ఇంట్లో నేను తప్ప ప్రతీ ఒక్కరూ బాధ్యతతో మెలిగేవారు. నేను చిన్నప్పటి నుంచి బాధ్యతారాహితంగా రెబల్ గా పెరిగాను’ అని నాగబాబు చెప్పుకొచ్చాడు. స్కూల్ కాలేజ్ ఎక్కడికి వెళ్లినా సరే అన్నయ్య అందర్నీ అట్రాక్ట్ చేసేవాడు. ఎంతో మంది అమ్మాయిలు కూడా అన్నయ్య వైపు అలా చూస్తూనే ఉండేవారు. ఎందుకిలా చూస్తున్నారో నాకు ఆ వయసులో అర్థమయ్యేది కాదు. అందుకు నాకు చిన్నప్పటి నుంచి మా అన్నయ్య ఓ హీరో అనే ఫీలింగ్ ఉండేదని’ నాగబాబు పేర్కొన్నాడు.
ఇక చిరంజీవికి కూడా మొదట్లో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని చెప్పడానికి చిరు ప్రెండ్ చెప్పిన ఓ విషయాన్ని ఈ వీడియో ద్వారా షేర్ చేసుకున్నాడు నాగబాబు. ”మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో రజినీకాంత్ ది ఫస్ట్ బ్యాచ్.. చిరంజీవిది చివరి బ్యాచ్. అదే సమయంలో అన్నయ్యతో పాటు సుధాకర్ హరి ప్రసాద్ కలిసి ఉండేవారు. అప్పుడు యాక్టర్ కమ్ డైరెక్టర్ పురాణం సూరి అనే అతను కూడా స్నేహితుడు. అతను ఫ్యామిలీ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. పురాణం సూరి ఒకసారి ఓ విషయం చెప్పారు. ఈ విషయం అన్నయ్యకు కూడా తెలీదు. ఓ సారి ఓ పెద్ద స్టార్ హీరో సినిమా ప్రివ్యూ జరుగుతుంటే పురాణం సూరి ఫ్యామిలీతో చిరంజీవి సుధాకర్ హరి ప్రసాద్ వెళ్లారు. అక్కడ థియేటర్ లో ముందు వరుసలో వెళ్లి కూర్చున్నారు. అయితే హీరోకు తెలిసిన వాళ్ళు వచ్చి ముందు వరుసలో కూర్చున్న అన్నయ్యను లేపి.. వెనకాల ఎక్కడో కూర్చోబెట్టారు. అక్కడ అన్నయ్య ఇంసల్ట్ గా ఫీల్ అయినప్పటికీ ఏం మాట్లాడలేదట” అని నాగబాబు చెప్పుకొచ్చారు.
”ఆ సినిమా టాక్ తెలుసుకోవాలని పురాణం సూరి ఫ్యామిలీ ఇంటికి పిలిస్తే సుధాకర్ హరి ప్రసాద్ వెళ్లారు. కానీ అన్నయ్య ఎంతకీ వెళ్లకపోయే సరికి పురాణం సూరి వెళ్లి పిలిచాడట. వెళ్లు వస్తాను.. అని సూరితో చిరాకుగా అన్నారట. సూరి ఇంటికి వెళ్ళాక థియేటర్లో జరిగింది చెప్పారట. అప్పుడు పురాణం సూరి ఫ్యామిలీ వారు అన్నయ్యకి ఓదార్పు మాటలు చెబుతూ.. వాళ్ళు అంతేలే వదిలేయ్ చిరంజీవి.. నువ్వు తప్పకుండా మంచి ఆర్టిస్ట్ వి అవుతావు మాకు తెలుసని అన్నారట. అప్పుడు అన్నయ్య వారితో మాట్లాడుతూ ఇండస్ట్రీకి నేను పెద్ద హీరోను అవ్వాలని వచ్చాను.. కానీ ఇప్పుడు అందరి కంటే నెంబర్ వన్ హీరో అవ్వాలని అనుకుంటున్నాను.. ఎవరైతే ఇలా ఫోజు కొట్టారో వాళ్ళందరిని మించి కొట్టకపోతే చూడండి.. ఎలా సాధించాలో నాకు తెలుసని చెప్పాడట. పురాణం సూరి ఆ రోజు జరిగిన సంఘటన అంతా నాకు చెప్పారు. ఆ రోజు అన్నయ్య ఈ మాటలు అన్నప్పుడు ఎటువంటి గాడ్ ఫాదర్ లేదు.. బ్యాగ్రౌండ్ లేదు. ఏ హీరో కొడుకు కాదు. ఏ హీరో తమ్ముడు కాదు. కనీసం పరిచయస్తులు కూడా లేరు. కేవలం ఆయన పట్టుదల.. ఎలా కష్టపడాలి.. ఎవరితో ఎలా నడుచుకోవాలి అనే వాటితో ఈ స్థాయికి ఎదిగారు. ఆయన అందరికి ఆదర్శం” అంటూ మెగా బ్రదర్ నాగబాబు తెలిపారు.