దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సినిమాలను మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ఆడియెన్ అంత ఇదిగా వోన్ చేసుకోవడానికి కారణమేమిటి? అంటే ఆయన చూపించే ఉద్వేగాలు యాక్షన్ కి ఉన్న రేంజు అలాంటిది అని ఎవరైనా చెబుతారు. ఒళ్లు గగుర్పొడిచే భీకరమైన యాక్షన్ ఎపిసోడ్ .. నరాలు తెగే ఉత్కంఠ.. పీక్ ఎమోషన్ .. సస్పెన్స్ ఇన్ని ఎలిమెంట్స్ ని యాక్షన్ సినిమాకి జోడిస్తారు కాబట్టే జనం స్క్రీన్ కి కళ్లప్పగించి చూస్తారు.
బాహుబలి సక్సెస్ వెనక ఇంత కథ ఉంది మరి. ఇండియన్ స్క్రీన్ పై నెవ్వర్ బిఫోర్ యాక్షన్ సీక్వెన్సులు చూపించిన ఘనత మన రాజమౌళిదే. అందుకే ఆయన సినిమా తీస్తున్నారు అంటే బాలీవుడ్ వాళ్లే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ కోసం ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
అల్లూరి సీతారామరాజు- కొమురం భీమ్ కథల్ని ఫిక్షనలైజ్ చేసి భారతదేశ స్వాతంత్య్రానికి ముందు ఏం జరిగింది? అనే ఆసక్తికర కథతో ఆర్.ఆర్.ఆర్ మూవీని తెరపై ఆవిష్కరిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం..ఈ మూవీకి సంబంధించిన అతి భారీ యాక్షన్ ఎపిసోడ్ ని పూర్తి చేశారని తెలుస్తోంది. 50 రోజుల పాటు సింగిల్ యాక్షన్ సీన్ తీశారని తెలిసింది.
ఒక మల్టీస్టారర్ కోసం ఒకే యాక్షన్ సీక్వెన్స్ కోసం యాభై రోజులు పని చేయడం అనేది గతంలో వినని విషయం. ఇలాంటిది రాజమౌళికి మాత్రమే సాధ్యమవుతుంది. ఆ షెడ్యూల్ ని ముగించి వెంటనే చిత్ర బృందం కొత్త షెడ్యూల్ ని ప్రారంభించిందిట. ఈ చిత్రం సంక్రాంతి 2021 కి విడుదల కావాల్సి ఉన్నా.. మహమ్మారి కారణంగా వాయిదా పడింది. వేసవికి కష్టమే కాబట్టి దసరా 2021 విడుదలకు ప్లాన్ చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
2021 వేసవిలో మాత్రమే ఈ బృందం తన విడుదల ప్రణాళికను ప్రకటించే అవకాశం ఉంది. మహమ్మారీ ప్రభావం పోయాకే ఈ మూవీని రిలీజ్ చేసే ఆలోచన ఉందిట. ఇప్పటికే తారక్ .. చరణ్ ల పాత్రలపై విడుదల చేసిన వీడియోలు సంచలనం సృష్టించాయి. మునుముందు టీజర్ ట్రైలర్ తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడోనన్న ఆసక్తి అభిమానుల్లో ఉంది.
తెలుగమ్మాయిల మైండ్ సెట్ లో అనూహ్య మార్పు ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మునుపటిలా మడిగట్టుకు కూచుంటే టాలీవుడ్ లో అవకాశాలు రావడం అంత సులువేమీ కాదని అర్థం చేసుకుంటున్నారు. ఇరుగు పొరుగు భాషల నుంచి.. మెట్రోల నుంచి తమకు ఎదురవుతున్న పోటీని ఎదుర్కొని నిలబడాలంటే తెగింపు చాలా ఇంపార్టెంట్ అని తాజా సీన్ చెబుతోంది.
ఇటీవల తెలుగు గాళ్స్ చెలరేగుతున్న తీరు చూస్తుంటే మైండ్ సెట్ ఛేంజ్ అనేది స్పష్ఠంగా అవగతమవుతోంది. ఇక కమిట్ మెంట్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్ని చిద్రం చేసేందుకు రెడీ అవుతున్న తెలుగమ్మాయి తేజస్వి మాదివాడ లేటెస్ట్ ఫోటోషూట్ హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా తేజస్వి లుక్ ఛేంజ్ బాడీ లాంగ్వేజ్ ఛేంజ్ .. బికినీ టూపీస్ అప్పియరెన్స్ ప్రతిదీ హాట్ టాపిక్ గా మారాయి.
తాజాగా తేజస్వి టూపీస్ లుక్ నెటిజనుల్లో అగ్గి రాజేస్తోంది. నెవ్వర్ బిఫోర్ హాటెస్ట్ బోల్డ్ లుక్ కి బోయ్స్ ఫిదా అయిపోతున్నారు మరి. బ్రిట్నీస్పియర్స్ కే బెండు తీసినట్టుగా.. ! అని ఓ తెలుగు లిరిసిస్ట్ వర్ణించిన తీరుగా తేజస్విని చెలరేగిన తీరు హాట్ టాపిక్ గా మారింది. తేజస్వి నటించిన కమిట్ మెంట్ త్వరలోనే రిలీజ్ కి రెడీ అవుతోంది.
సోషల్ మీడియాల్లో ఎంతగా ఫాలోయింగ్ ఉంటే ఆ స్టార్ కి అంత గొప్ప పాపులారిటీ ఉందని అర్థం. అందుకే నిరంతరం ఫోటోలు.. వీడియో కంటెంట్ విషయంలో మన అందాల నాయికలు ఏమాత్రం తగ్గడం లేదు. అందాల ఆరబోతకు ఇంతకుముందులా అడ్డు చెప్పడం లేదు. ఇక ఇన్ స్టా వంటి ఫోటో వీడియో షేరింగ్ సైట్ వచ్చాక అక్కడ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు అందగత్తెలు.
కథానాయికలా.. ఐటెమ్ భామలా.. అన్న తేడా ఏం లేదు. విదేశీ మోడల్స్ హాలీవుడ్ స్టార్లను మించి చెలరేగిపోతున్నారు. అయితే ఇంత ఠఫ్ కాంపిటీషన్ ని ఎదుర్కోవాలంటే ఆమాత్రం పట్టు విడుపు ఉండాలని భావించినట్టుంది రాశీఖన్నా. ఇన్నాళ్లు ఎంతో సంప్రదాయబద్ధంగా కనిపించిన రాశీ ఉన్నట్టుండి చెలరేగిపోయింది. టాప్ లెస్ ఫోజుతో దుమారం రేపింది.
పింక్ స్వెట్ షర్ట్ లో టాప్ బటన్ ఓపెన్ చేసి కుర్రకారు కంటికి కునుకు పట్టనివ్వని ట్రీటిచ్చింది. ఒక రకంగా రాశీ వ్యవహారం చూస్తే 60 ప్లస్ బాబులకు చెమటలు పట్టేయడం గ్యారెంటీ. రాశీ నెవ్వర్ బిఫోర్ ట్రీట్ ఇదే. ఇటీవల తెలుగులో అవకాశాలు తగ్గాయ్. యువహీరోలు అవకాశాలివ్వాలే కానీ అగ్ర హీరోలెవరూ ఈ భామకు ఆఫర్ ఇచ్చిందేమీ లేదు. అందుకే నెక్ట్స్ లెవల్ ఏంటో చూపించాలన్న పంతం రాశీఖన్నాలో కనిపిస్తోంది. పర్యవసానమే ఈ ఫోటోషూట్ ట్రీట్ అని అర్థమవుతోంది. అలాగే పలు కాస్ట్ లీ బ్రాండ్స్ కి రాశీ ఇప్పటికే సంతకం చేసి ఇన్ స్టాలో ప్రచారం చేస్తున్న సంగతి తెలిసినదే.