ప్రభాస్ ‘రాముడు’ అయితే.. మరి ‘రావణుడు’…

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసపెట్టి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నాడు. ‘బాహుబలి’తో వచ్చిన ఇమేజ్ ని నిలబెట్టుకునే క్రమంలో లేటెస్టుగా స్ట్రెయిట్ బాలీవుడ్ మూవీలో నటించడానికి రెడీ అయ్యాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్న ఈ చిత్రానికి ”ఆది పురుష్” అనే టైటిల్ ఖరారు చేశారు. ‘చెడుపై మంచి సాధించిన విజయం’ అనే థీమ్ తో ఈ మూవీ టైటిల్ కి సంబంధించిన మోషన్ పోస్టర్ విడుదల చేశాడు ప్రభాస్. ఈ పోస్టర్ లో రాముడు విల్లు ఎక్కుపెట్టినట్లుగా.. పది తలల రావణుడు.. గదతో దూసుకొస్తున్న హనుమంతుడు.. మునులు చిత్రాలు.. ఇలా ఇతిహాసగాథ రామాయణాన్ని తలపించేలా డిజైన్ చేయబడి ఉంది. దీంతో బాహుబలి ఇప్పుడు ‘రాముడి’ అవతారం ఎత్తబోతున్నాడని అందరూ ఫిక్స్ అయిపోయారు. దీనికి తోడు నాగ్ అశ్విన్ ట్వీట్ చేస్తూ.. ‘ప్రభాస్ ని తెరపై రాముడిలా చూడబోతుండడం ఎగ్జైటింగ్ గా ఉంది. గతంలో కొంతమంది నటులు మాత్రమే ఆ పాత్రను చేయగలిగారు’ అని పేర్కొన్నాడు. ఈ ట్వీట్ తో ప్రభాస్ రాముడు అని సినీ అభిమానులు కంఫర్మ్ చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ సినిమాలో ప్రతినాయకుడు రావణుడుగా ఎవరు నటించబోతున్నారనే డిస్కషన్ స్టార్ట్ అయింది.

కాగా ‘ఆది పురుష్’ లో ప్రధాన ప్రతినాయకుడి పాత్ర కోసం మేకర్స్ స్టార్ హీరోలను సంప్రదిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ కి విలన్ గా పలువురు స్టార్ హీరోల పేర్లను సూచిస్తున్నారు. ఓమ్ రౌత్ గత చిత్రం ‘తన్హాజీ’లో హీరోగా నటించిన అజయ్ దేవగన్ అయితే రావణాసుడుగా బాగుంటాడని అంటున్నారు. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్న అజయ్ దేవగన్ అయితే మార్కెట్ పరంగా కూడా వర్కౌట్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు స్టార్ హీరో అక్షయ్ కుమార్ అయితే ప్రభాస్ కి ధీటుగా ఉంటాడని కామెంట్స్ చేస్తున్నారు. రజినీకాంత్ ‘2.0’లో ప్రతినాయకుడిగా నటించిన అక్షయ్ ని రావణాసురుడి పాత్ర కోసం తీసుకొని సూచిస్తున్నారు. ఇంకొందరైతే సూపర్ స్టార్ రజినీకాంత్ అయితే రావణుడుగా సూట్ అవుతాడంటా ఏకంగా పది తలల రజినీకాంత్ పోస్టర్ డిజైన్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ‘బాహుబలి’కి సమానమైన భల్లాలదేవుడుగా కనిపించిన రానా దగ్గుబాటి నే ‘ఆది పురుష్’లో రిపీట్ చేయమని సలహా ఇస్తున్నారు. ఇక రియల్ శ్రీమంతుడు సోనూసూద్ ని విలన్ గా తీసుకోమని పలువురు సూచిస్తున్నారు. కొంతమంది డై హార్డ్ ఫ్యాన్స్ మాత్రం ‘రావణుడు’గా కూడా ప్రభాస్ నటిస్తే మూవీ నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని అంటున్నారు. మొత్తం మీద ఈ సినిమాలో కీలకమైన విలన్ రోల్ కోసం మేకర్స్ ఎవరిని తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉండగా 3-డీ ఫార్మాట్ లో విజువల్ వండర్ గా రూపొందించనున్న ‘ఆదిపురుష్’ చిత్రాన్ని 2021 లో సెట్స్ పైకి తీసువెళ్లి.. 2022లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని టీ – సిరీస్ భూషణ్ కుమార్ – కృష్ణ కుమార్ – ప్రసాద్ సుతార్ – రాజేష్ నాయర్ – ఓం రౌత్ లు కలిసి భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఆది పురుష్’ని తెలుగు హిందీ భాషల్లో నిర్మించి తమిళం – మలయాళం – కన్నడ భాషలలో పాటు అనేక విదేశీ భాషల్లోకి కూడా అనువదించనున్నారని తెలుస్తోంది.

Related Images:

హాలీవుడ్ స్టార్లతో ‘ప్రభాస్’కి ఓ బిల్డింగ్ ఉండాలి: సీనియర్ రెబల్ స్టార్

స్టార్ హీరో ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా ప్రకటించి అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో ప్రభాస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో పర్మినెంట్ గా నిలిచిపోయే అడుగు పెట్టబోతున్నాడని అందరూ అభిప్రాయ పడుతున్నారు. అయితే ప్రభాస్ పెదనాన్న సీనియర్ హీరో కృష్ణంరాజు ఆదిపురుష్ సినిమా గురించి కొన్ని విషయాలు చెప్పి థ్రిల్ ఇచ్చారు. కృష్ణంరాజు మాట్లాడుతూ.. ‘ఆదిపురుష్ అంటే విష్ణుమూర్తి.. ఆయన అవతారాల్లో ఆదిపురుష్ ఒకటి. సోసియో ఫాంటసీ కథతో భారీ బడ్జెట్తో విసువల్ వండర్ గా ఈ సినిమాను రూపొందించాలని చిత్రయూనిట్ సంకల్పించారు. ప్రభాస్ ఈ సబ్జెక్ట్ వినగానే చాలా ఇంప్రెస్ అయ్యాడు.. వెంటనే బాగుంది ఖచ్చితంగా చేద్దాం అనేసాడు. అలాగే ఈ సినిమా కథ నేను కూడా విన్నాను. నాకు కూడా బాగా నచ్చింది. ఖచ్చితంగా చాలా పెద్ద సినిమా అవుతుంది. ఇది కేవలం భారతీయ భాషల్లోనే కాదు.. హాలీవుడ్లో కూడా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. అయోధ్య రామాలయానికి ఇటీవలే శంకుస్థాపన చేశారు. ఆ శ్రీరాముడి కోసం ప్రపంచం అంతా ఎదురు చూస్తున్న సమయంలో ఆదిపురుష్ సబ్జెక్ట్ తెరపైకి రావడం గొప్ప విషయం. ఈ సినిమా ప్రభాస్ కెరీర్లోనే గొప్ప సినిమా అవుతుంది.

పురాణాలకు సంబంధించిన కంటెంట్ తో ఈ సినిమా ఉంటుంది. దాదాపు ఈ సినిమా వెయ్యి కోట్లు బడ్జెట్ ఉండబోతుంది. మన పురాణాలు ఇతిహాసాల గొప్పతనం ‘ఆదిపురుష్’ చిత్రంతో ప్రపంచానికి తెలియజెప్పబోతున్నాడు ప్రభాస్. ఇక “నా కోరిక ఏంటంటే.. బాహుబలి సినిమా చూసిన తరువాత ప్రభాస్.. ప్యాన్ ఇండియా సినిమాలు చేయాలని అనుకున్నాడు. అయితే బాహుబలి చిత్రంతోనే ఆ మార్క్ అందుకున్నాడు. ఇప్పుడు హాలీవుడ్ రేంజ్కి వెళ్తాడు. అలాగే ప్రభాస్తో నా కోరిక చెప్పాను. నీతో కలిసి బ్లవర్లీ హిల్స్లో భోజనం చేయాలని.. బ్లవర్లీ హిల్స్లో భోజనం అంటే అక్కడ ఓన్లీ హాలీవుడ్ స్టార్లకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. అందుకే అక్కడ ప్రభాస్తో కలిసి భోజనం చేయాలని ఉందని కోరాను. అందులో ప్రభాస్కి కూడా ఒక బిల్డింగ్ ఉండాలి.. నేను అక్కడ ప్రభాస్తో కలిసి భోజనం చేయాలి. త్వరలోనే ఆ కోరిక తీరబోతోందని అనుకుంటున్నా. ప్రభాస్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది” అంటూ తన కోరికను బయటపెట్టారు కృష్ణంరాజు. చూడాలి మరి పెదనాన్న కోరిక తీరుస్తాడో లేదో అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.

Related Images:

రజినీకాంత్‌ను బీట్ చేసిన ప్రభాస్!

ఆసియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోగా సూపర్ స్టార్ రజినీకాంత్ ఎప్పుడో రికార్డ్ సృష్టించారు. అందరి హీరోల మాదిరిగా కేవలం రెమ్యునరేషన్ మాత్రమే కాకుండా సినిమా లాభాల్లో రజినీ వాటా తీసుకుంటారని అంటుంటారు. అందుకే ఆయన రెమ్యునరేషన్ భారీ స్థాయిలో ఉంటుందని చెబుతుంటారు. చైనా యాక్షన్ హీరో జాకీచాన్ కన్నా అధిక మొత్తంలో రజినీ పారితోషికం తీసుకుంటారని ఎప్పటి నుంచో వినిపిస్తోన్న మాట. అయితే, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు రజినీకాంత్‌ను దాటేశారట.

వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో అశ్వినీదత్ నిర్మాతగా ఆయన అల్లుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇది ప్రభాస్ 21వ సినిమా. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె కథానాయిక. పాన్ ఇండియా మూవీగా రూపొందనున్న ఈ సినిమాకు ప్రభాస్ రూ. 100 కోట్లు అందుకోనున్నట్టు సమాచారం. రెమ్యునరేషన్ రూ.70 కోట్లు, డబ్బింగ్ రైట్స్ రూ.30 కోట్లు కలుపుకుని మొత్తంగా రూ.100 కోట్లు తీసుకుంటున్నారట ప్రభాస్.

ఇప్పటి వరకు ఏ ఇండియన్ హీరో ఇంత మొత్తంలో ఒక సినిమాకు అందుకోలేదు. ‘దర్బార్’ సినిమాకు రజినీకాంత్ అత్యధికంగా రూ.70 కోట్లు అందుకున్నట్టు తమిళ ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అంతేకాదు, ఇప్పటి వరకు రజినీకాంత్‌ అందుకునేదే అత్యధికం. ఇన్నేళ్ల తర్వాత ఆ రికార్డును ప్రభాస్ బ్రేక్ చేస్తున్నారని అంటున్నారు. ప్రభాస్‌కే రూ.100 కోట్లు ఇస్తుంటే.. ఇక సినిమా బడ్జెట్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ప్రభాస్ ప్రస్తుతం ‘రాధే శ్యామ్’తో బిజీగా ఉన్నారు. కేకే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ కరోనా వైరస్ కారణంగా తాత్కాలికంగా ఆగింది. ఈ సినిమాలో ప్రభాస్ హస్తసాముద్రిక నిపుణుడిగా కనిపించనున్నారు. కథ చాలా వరకు యూరప్‌లోనే నడుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటిస్తుండటం ఇదే తొలిసారి. ఇప్పటికే ఈ చిత్ర యూనిట్ రెండు షెడ్యూళ్లను పూర్తిచేసింది. ఈ చిత్రాన్ని యూవీ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మిస్తున్నారు.

Related Images: