లేడీసూపర్ స్టార్ ‘ప్రేమమ్’

లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాల జోరు కంటిన్యూ అవుతూనే ఉంది. ఏడాదికి అరడజను సినిమాల వరకు ఈమె ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తూనే ఉంది. ఒక వైపు రజినీకాంత్.. విజయ్ వంటి సూపర్ స్టార్ లతో నటిస్తూనే మరో వైపు మూకుత్తి అమ్మన్ వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఈమె రజినీకాంత్ మూవీ అన్నాత్తేలో నటించడంతో పాటు ప్రియుడి దర్శకత్వంలో రూపొందుతున్న ఒక ముక్కోణపై ప్రేమ కథలో కూడా నటిస్తోంది. ఈ రెండు సినిమాలతో పాటు మరో రెండు కూడా చర్చల దశలో ఉన్నాయి. ఈ సమయంలోనే ఒక క్రేజీ మూవీలో ఈమె హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. ‘ప్రేమమ్’ సినిమాతో అందరిని ఆకట్టుకున్న దర్శకుడు ఆల్ఫాన్స్ పుత్రెన్స్ దర్శకత్వంలో ‘పాత్తు’ అనే సినిమా రూపొందుతుంది. ఆ సినిమాలో నయన్ ను ఎంపిక చేశారట.

ఫహద్ ఫసిల్ హీరోగా రూపొందబోతున్న పాత్తు సినిమాలో నయనతార నటించబోతున్నట్లుగా యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది. ప్రేమమ్ సినిమాతో దేశ వ్యాప్తంగా దర్శకుడు ఆల్ఫాన్స్ మంచి పేరు దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఈయన చేస్తున్న ఈ సినిమాను పలు భాషల్లో విడుదల చేయాలని భావిస్తున్నాడు. అన్ని భాషల్లో విడుదల చేసేవిధంగా సినిమాను రూపొందించాలనే అభిప్రాయంతో ఉన్నాడు.

మలయాళంలో రూపొందబోతున్న ఈ సినిమాకు తెలుగు మరియు తమిళంలో నయన్ వల్ల మంచి క్రేజ్ ఏర్పడటం ఖాయం. ఇక కన్నడం మరియు హిందీల్లో ఎలాగూ దర్శకుడికి ఉన్న పేరుతో మార్కెట్ అయ్యే అవకాశం ఉంది. కనుక పాత్తు సినిమా ఒక భారీ పాన్ ఇండియా మూవీగా నిలిచే అవకాశం ఉందంటున్నారు.

Related Images:

సింగరాయ్ లో మూడవ ముద్దుగుమ్మ ప్రేమమ్ మడోనా

నాని హీరోగా రాహుల్ దర్శకత్వంలో రూపొందబోతున్న శ్యామ్ సింగరాయ్ మూవీ షూటింగ్ నేడు లాంచనంగా ప్రారంభం అయ్యింది. నాని తండ్రి ఈ సినిమాకు క్లాప్ కొట్టి ప్రారంభించాడు. ఈ సినిమాలో సాయి పల్లవి మరియు కృతి శెట్టిలు హీరోయిన్స్ గా నటించబోతున్నట్లుగా ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. నేడు జరిగిన పూజా కార్యక్రమాలకు వీరు హాజరు అవ్వడంతో ఆ విషయమై స్పష్టత వచ్చింది. ఇక ఈ సినిమా కథానుసారం మూడవ ముద్దుగుమ్మ కూడా నటించాల్సి ఉందట. అందుకే ఈ సినిమాలో మూడవ ముద్దుగుమ్మ కోసం మడోనా సెబాస్టియన్ ను ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ప్రేమమ్ సినిమాలో నటించిన మడోనా సెబాస్టియన్ మంచి పేరు దక్కించుకుంది. కాని ఆ తర్వాత పెద్దగా కనిపించలేదు. ఇతర భాషల్లో బిజీగా ఉన్న ఈ అమ్మడు మళ్లీ ఇన్నాళ్లకు తెలుగులో నానికి జోడీగా మూడవ ముద్దుగుమ్మగా నటించబోతుంది. తెలుగులో ఈమెకు ఇదీ రీ ఎంట్రీగా అనుకోవచ్చు. కాస్త బొద్దుగా ఉండే ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో తెలుగులో ఆఫర్లు రాకపోవడంకు కారణం బరువు అంటున్నారు. మరి ఇప్పుడు నాని సినిమాలో రీ ఎంట్రీ ఇస్తున్న ఈ అమ్మడికి తెలుగులో ఈసారి అయినా వరుసగా ఆఫర్లు దక్కుతాయో చూడాలి.

టక్ జగదీష్ ను పూర్తి చేసిన వెంటనే వచ్చే ఏడాది ఆరంభంలో శ్యామ్ సింగరాయ్ ను సినిమాను పట్టాలెక్కించేందుకు నాని వెయిట్ చేస్తున్నాడు. ట్యాక్సీ వాలా వంటి విభిన్నమైన సినిమాను తెరకెక్కించిన రాహుల్ మరోసారి పునర్జన్మల నేపథ్యంలో సినిమాను తీస్తున్నట్లుగా తెలుస్తోంది. మొదటి సినిమాతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు ఈ సినిమాతో కమర్షియల్ గా సక్సెస్ అయ్యేనా అనేది చూడాలి.

Related Images:

అనుకు అక్కడ కూడా నిరాశే

మలయాళంలో ‘ప్రేమమ్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్ తెలుగులో మరియు తమిళంలో ఆ తర్వాత నటించింది. తెలుగులో అఆ మరియు ప్రేమమ్ సినిమాలు సక్సెస్ అయినా కూడా ఈమెకు ఆశించిన స్థాయిలో క్రేజ్ మాత్రం దక్కలేదు. మరో వైపు తమిళంలో కూడా ఈమె ప్రత్నాలు చేసింది ఇంకా చేస్తూనే ఉంది. కాని ఈమెకు అక్కడ కూడా స్టార్ డం రాలేదు. మలయాళంలో చాలా కాలంగా సినిమాల్లో నటించని ఈమె మళ్లీ ఇన్నాళ్లకు దుల్కర్ సల్మాన్ సినిమా అయిన మణిరైలే అశోకన్ లో కీలక పాత్రలో నటించింది.

మణిరైలే అశోకన్ సినిమాలో హీరోయిన్ గా కాకుండా కీలకమైన గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వడంతో పాటు ఆ సినిమాకు సహాయ దర్శకురాలిగా కూడా వ్యవహరించింది. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో నేరుగా విడుదల అయ్యింది. తెలుగు తమిళంలో ఈమద్య వరుసగా ఫ్లాప్స్ చవిచూసిన అనుపమ పరమేశ్వరన్ తన సొంత భాష మలయాళంలో కూడా ఫ్లాప్ ను చవి చూసింది. నటిగా మంచి ప్రతిభ కనబర్చినా కూడా ఈమె సినిమాలు కమర్షియల్ గా మాత్రం ఆశించిన స్థాయిలో కమర్షియల్ విజయాలను సొంతం చేసుకోవడంలో విఫలం అవుతున్నాయి.

Related Images: