నివర్ ముప్పు తొలగకముందే ఏపీ కి పొంచి ఉన్న మరో పెను ముప్పు !

నివర్ తుఫాన్ దెబ్బకి ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రస్తుతం ఏపీని వణికిస్తున్న నివర్ ముప్పు తొలగిపోక మునుపే ఏపీకి మరో ముప్పు వెంటాడుతోంది. ఈనెల 29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. అది తీవ్ర వాయుగుండం కాస్తా తుఫాన్గా మారే అవకాశం ఉందని హెచ్చరించింది.

అలాగే వచ్చే నెలలో మరో రెండు తుఫాన్లు వచ్చే అవకాశం ఉందంటున్నార. డిసెంబర్2న డిసెంబర్ 7న ఈ ప్రమాదం పొంచి ఉందంటున్నారు. దక్షిణ తమిళనాడు ఆంధ్రప్రదేశ్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నివర్ నివర్ తీవ్రవాయుగుండంగా కొనసాగుతుంది.. ఈ ప్రభావంతో రాగల 6 గంటల్లో వాయుగుండంగా ఆ తదుపరి అల్పపీడనంగా బలహీన పడనుంది. ప్రస్తుతానికి తిరుపతికి పశ్చిమ నైరుతిగా 30 కీమీ దూరంలో.. చెన్నైకి పశ్చిమ వాయువ్య దిశగా 115 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని ప్రభావంతో చిత్తూరు కడప నెల్లూరు జిల్లాల వ్యాప్తంగా గంటకు 55-75 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.

శనివారం ఉదయానికి నివర్ ప్రభావం కొంతమేర తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శనివారం కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో విస్తృతంగా మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. విశాఖ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు.. వర్షాలు కురుస్తుండటంతో వాగులు వంకలు పొంగిపోర్లే అవకాశం ఉంది.

Related Images:

డేంజర్: కరోనాతో కొత్త ముప్పు

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా రక్కసి మనకు సోకి పోయినా కూడా దాని పర్యవసనాలు దారుణంగా ఉంటున్నాయని కొత్తగా వెలుగుచూసింది. కరోనా మనుషుల్లో కొత్త సమస్యలను సృష్టిస్తోందని తేలింది.

కరోనా సోకి తగ్గిన వారిలో మధుమేహం స్థాయిలు పెరుగుతున్నాయని.. లంగ్ ఇన్ ఫెక్షన్స్ లివర్ కిడ్నీలపై ప్రభావం చూపుతున్నట్లు వైద్యనిపుణులు గుర్తించారు.

తాజాగా కరోనాకు గురైన వారిలో కొందరిలో రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడడంతో గుండెపోటు బ్రెయిన్ స్ట్రోక్ లకు గురవుతున్నట్టు వెల్లడైంది. ఆస్పత్రుల్లో కరోనా నుంచి కోలుకొని ఇంటికి వెళ్లిన వారిలో 7 నుంచి 8శాతం మంది రోగులు నాలుగు నుంచి ఆరు వారాల్లో గుండెపోటు బ్రెయిన్ స్ట్రోక్ కు గురవుతున్నట్లు అధ్యయనంలో తేలింది. వెంటీలేటర్ పై చికిత్స పొందిన రోగుల్లో ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నట్టు తేలింది.

దీంతో కరోనా తగ్గినా మూడు నెలల పాటు రోగులంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పుడు కరోనా రోగులకు గుండెజబ్బులను తప్పనిసరి చేస్తున్నారు.

కరోనా మరణాల్లో ఎక్కువ మందిలో సైడ్ ఎఫెక్ట్స్ దారితీస్తున్నాయి. కొందరిలో గుండె రక్తనాళాల్లో మెదడుకు వెళ్లే రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడి పూడికలు రావడం కాళ్ల రక్తనాళాల్లో సైతం గడ్డలు ఏర్పడి రక్తప్రసరణ తగ్గుతున్న వారిని గుర్తిస్తున్నారు.

ఈ క్రమంలోనే రోగులంతా మూడు నెలల పాటు యాంటి కో ఆగ్యులేషన్ మందులు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. అలా వాడిని వారిలో రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడిన సందర్భాలు లేవని అంటున్నారు. ఇక ఇన్ ఫెక్షన్లపై స్టెరాయిడ్స్ ఫాలోఅప్ మందులు వాడాలని సూచిస్తున్నారు.

Related Images: