జీఎఫ్ సినిమాకు ముందు వరకు కన్నడ సినిమా పరిశ్రమలో 50 కోట్లు వసూళ్లు చేసిన సినిమా అంటే చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా భావించేవారు. ఇక కన్నడ సినిమా వంద కోట్లు అనేది కల అనుకునే వారు. అలాంటిది కేజీఎఫ్ సినిమా వందల కోట్ల వసూళ్లను రాబట్టింది. కన్నడ సినిమా పరిశ్రమ స్థాయిని ఆల్ ఇండియా స్థాయిలో చాటి చెప్పిన కేజీఎఫ్ కు యశ్ మొదట పారితోషికం తీసుకోకుండా విడుదలైన తర్వాత లాభాల్లో నుండి వాటా తీసుకున్నారు. కేజీఎఫ్ వంటి భారీ సినిమా బడ్జెట్ కష్టంగా మారడంతో పాటు ఈ సినిమా వర్కౌట్ అవుతుందా అనే అనుమానాలు ఉండటంతో నిర్మాతలు వెనుక ముందు ఆడారు. ఆ సమయంలో యశ్ తనకు పారితోషికం ఇవ్వనక్కర్లేదు. విడుదలైన తర్వాత లాభాల్లో వాటా తీసుకుంటాను అన్నాడట. అలా మొదటి పార్ట్ యశ్ పారితోషికం తీసుకోకుండానే చేసినా లాభాల వాటాతో అతడికి కన్నడ హీరోల్లోనే అత్యధిక పారితోషికం దక్కింది.
ప్రస్తుతం కేజీఎఫ్ 2 సినిమా తెరకెక్కుతుంది. ఈ సారి నిర్మాతలు యశ్ కు దాదాపుగా పాతిక కోట్ల వరకు పారితోషికంగా ముందే ఇచ్చారట. అది మాత్రమే కాకుండా లాభాల్లో వాటాను కూడా ఖరారు చేశారట. కేజీఎఫ్ 2 కు ఉన్న క్రేజ్ కారణంగా ఈసారి కూడా ఈజీగా మూడు వందల కోట్ల వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. కనుక యశ్ కు పాతిక కోట్లను మించి లాభాల్లో షేర్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. కన్నడ మీడియా సర్కిల్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం కేజీఎఫ్ 2కు యశ్ కు కనీసం రూ. 50 కోట్లు అయినా వస్తాయి. సినిమా భారీ విజయాన్ని సాధిస్తే ఆ లాభాల షేర్ మరింత పెరిగి యశ్ పారితోషికం ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కన్నడ స్టార్ హీరోలు సూపర్ స్టార్ హీరోలు ఎవరు కూడా ఈ స్థాయి పారితోషికంను దక్కించుకోలేదు. సౌత్ లోనే టాప్ పెయిడ్ హీరోల జాబితాలో కేజీఎఫ్ 2 తో యశ్ నిలిచే అవకాశం ఉందని కన్నడ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా ఆల్ ఇండియా స్టార్ అయిన యశ్ ప్రస్తుతం కేజీఎఫ్ 2 సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ లో యశ్ పాల్గొంటున్నాడు. ఇదే సమయంలో తన ఇద్దరు పిల్లలతో కూడా ఎక్కువ సమయం గడిపేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. సోషల్ మీడియాలో యశ్ మరియు ఆయన భార్య రాధికలు రెగ్యులర్ గా పిల్లల ఫొటోలను షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా వీరు షేర్ చేసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు నవ్వు తెప్పిస్తోంది.
యశ్ తన కూతురు ఐరాకు ఇటీవల జుట్టు తీయించాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం పుట్టు వెంట్రుకలు తీయిస్తూ ఉంటారు. ఐరాకు కూడా అందులో భాగంగా జుట్టు తీయించినట్లుగా ఉన్నారు. ఐరాను ఎత్తుకుని యశ్ ఉన్న ఈ ఫొటోకు ఫన్నీ కామెంట్స్ చాలా వస్తున్నాయి. నీకేమో అంత జట్టు ఉంది.. నాకున్న కొద్ది జట్టును కూడా తీయించేశావ్ ఎందుకు అన్నట్లుగా యశ్ పై ఐరా కోపంతో చూస్తున్నట్లుగా ఆమె రియాక్షన్ ఉందని కొందరు నెటిజన్స్ అంటుంటే మరికొందరు మాత్రం ఇంకా ఎన్నాళ్లు అలా ఉంటావ్ నాలా గుండు చేయించుకో హాయిగా ఉంటుంది నాన్న అంటూ ఐరా రియాక్షన్ ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
కన్నడ రాకింగ్ స్టార్ యష్ ‘కేజీఎఫ్’ చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. కన్నడ సినిమా చరిత్రలోనే అత్యధికంగా వసూళ్లు అందుకున్న హీరోగా బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ లలో కూడా బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేసాడు యశ్. ప్రస్తుతం ‘కేజీఎఫ్ 2’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్న మన రాఖీ భాయ్.. రీసెంటుగా తన కుమారుడికి నామకరణ మహోత్సవం జరిపారు. యష్ తన కొడుకుకి ‘యథర్వ యష్’ అనే పేరు పెట్టారు.
కాగా యష్ 2016లో హీరోయిన్ రాధిక పండిట్ ని వివాహం చేసుకున్నాడు. వీరికి ముందు ఐరా అనే పాప జన్మించింది. ఇక యశ్ – రాధిక దంపతులకి ఇటీవల కుమారుడు జన్మించాడు. అయితే తనయుడి నామకరణమహోత్సవం జరిపించాలనుకుంటున్న సమయంలో కరోనా మహమ్మారి వచ్చింది. దీంతో ఇన్నిరోజులు వెయిట్ చేసి సోమవారం రోజున నామకరణ వేడుక జరిపించారు. తమ ఫాం హౌజ్ లో కొద్దిమంది కుటుంబ సభ్యుల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
తన కుమారుడికి ‘యధర్వ్ యష్’ అనే పేరుని పెట్టినట్టు యష్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. తన భార్య కొడుకుతో ఉన్న ఫోటోలను షేర్ చేసాడు. యశ్ కుమారుడిని చూసిన అభిమానులు జూనియర్ రాకీ భాయ్ వచ్చేశాడంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జూనియర్ యష్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక సినిమా విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ నటిస్తున్న ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి విడుదల తేదీని ప్రకటించడానికి మేకర్స్ సన్నాహకాలు చేసుకుంటున్నారు.
View this post on Instagram
సౌత్ ఇండియన్ సినిమాల స్థాయిని బాలీవుడ్ వారికి తెలియజేసిన హీరోలు ప్రభాస్.. యశ్ అనడంలో సందేహం లేదు. బాహుబలి.. సాహో సినిమాలతో ప్రభాస్ బాలీవుడ్ హీరోలను మించిన వసూళ్లను దక్కించుకున్నాడు. అక్కడ ఉన్న సూపర్ స్టార్స్ కూడా ప్రభాస్ తర్వాత స్థానంకు పడిపోయారు అనడంలో సందేహం లేదు. ఇక సౌత్ కే చెందిన యశ్ కూడా ప్రస్తుతం బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ను కలిగి ఉన్నాడు. కేజీఎఫ్ సినిమాతో యశ్ గురించి బాలీవుడ్ లో మాట్లాడుకోవడం ఎక్కువ అయ్యింది.
ఇక ప్రస్తుతం కేజీఎఫ్ 2 సినిమా రూపొందుతోంది. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయితే యశ్ ఇక బాలీవుడ్ లో సెటిల్ అవ్వడం ఖాయం అనిపిస్తుంది. ప్రభాస్ వరుసగా భారీ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే హిందీ డెబ్యూ ‘ఆది పురుష్’ కు ఓకే చెప్పాడు. ప్రస్తుతం ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ అనడంలో సందేహం లేదు. అందుకే ఇప్పుడు యశ్ కూడా ప్రభాస్ ను ఫాలో అవ్వబోతున్నాడు. ప్రభాస్ కు బాహుబలితో వచ్చిన క్రేజ్ మాదిరిగానే యశ్ కు కూడా కేజీఎఫ్ తో భారీ క్రేజ్ దక్కింది.
యశ్ ఆ క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా తన భవిష్యత్తును ప్లాన్ చేసుకుంటున్నాడు. భారీ బడ్జెట్ సినిమాతో పాటు కేజీఎఫ్ తరహా యాక్షన్ సినిమానే యశ్ చేయాలనుకుంటున్నాడు. ఇదే సమయంలో బాలీవుడ్ లో కూడా నటించాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా హింట్స్ ఇస్తున్నారు. ఒక వైపు కన్నడ స్ర్కిప్ట్ లు వినడంతో పాటు మరో వైపు ఈయన బాలీవుడ్ లో నటించేందుకు కూడా హిందీ ఫిల్మ్ మేకర్స్ కథలు వింటున్నాడు. కేజీఎఫ్ 2 తర్వాత యశ్ హిందీ సినిమానే చేస్తాడని కన్నడ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ ఏడాది చివరి వరకు కేజీఎఫ్ 2 పూర్తి అవ్వబోతుంది. కనుక కొత్త సినిమా పై వచ్చే ఏడాదిలో యశ్ ప్రకటన చేస్తాడని అంటున్నారు.
సౌత్ ఇండియా సినిమాల స్థాయిని చాటి చెప్పిన సినిమాల్లో కేజీఎఫ్ కూడా ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. బాహుబలి సినిమాతో బాలీవుడ్ రికార్డులను సైతం బద్దలు కొట్టిన రాజమౌళిపై నమ్మకంతో కేజీఎఫ్ ను హిందీలో మరియు తెలుగులో విడుదల చేసేందుకు బయ్యర్లు ముందుకు వచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా కేజీఎఫ్ హీరో యశ్ చెప్పుకొచ్చాడు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ సినిమాను భారీ యాక్షన్ సీన్స్ తో అయితే తీశాం కాని విడుదల విషయంలో కాస్త ఆందోళన ఉండేది. ఆ సమయంలో బెంగళూరులోని ఒక హోటల్ లో రాజమౌళి గారిని అనుకోకుండా కలుసుకోవడం జరిగింది. ఆ సమయంలో కొన్ని నిమిషాల పాటు తమ కోసం సమయం కేటాయించాలంటూ విజ్ఞప్తి చేసి మేము అప్పటికే తీసిన కొన్ని సీన్స్ ను ఆయనకు చూపించడం జరిగింది. మా షాట్స్ నచ్చిన ఆయన తెలుగు మరియు హిందీలో బిజినెస్ అయ్యేలా మాట్లాడారు. ఆయన చెప్పడం వల్లే సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు బయ్యర్లు ముందుకు వచ్చారు.
సినిమా ఎంత బాగా తీసినా కూడా విడుదల సమయంలో తీసుకునే జాగ్రత్తలు మరియు విడుదల చేసిన తీరును బట్టి ఫలితం ఆధారపడి ఉంటుంది. మా సినిమాకు రాజమౌళి గారు బ్రాండ్ అంబాసిడర్ మాదిరిగా మారి సాయం చేశారంటూ యశ్ నిగర్వంగా జక్కన్న రాజమౌళి గురించి చెప్పడం జరిగింది. గతంలో దర్శకుడు ప్రశాంత్ కూడా ఇదే మాదిరిగా వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు రాజమౌళి ని ఆకాశానికి ఎత్తుతూ యశ్ కూడా కామెంట్స్ చేయడంతో జక్కన్న కేజీఎఫ్ అంతటి సెన్సేషన్ క్రియేట్ చేయడంలో కీలక పాత్ర పోషించారంటూ ఆయన అభిమానులు గొప్పగా చెబుతున్నారు.