హీరోయిన్స్ కు దక్కని బెయిల్

కన్నడ హీరోయిన్స్ రాగిణి ద్వివేది మరియు సంజన గర్లానీలు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెల్సిందే. పోలీసుల వద్ద కీలక ఆధారాలు ఉండటం వల్ల వీరిద్దరిని అరెస్ట్ చేసినట్లుగా మీడియాలో కథనాలు ఉన్నాయి. వారి విచారణ మరియు అరెస్ట్ కు సంబంధించిన వీడియోలు లీక్ అవ్వడంపై ఇప్పటికే సినీ వర్గాల వారు మరియు మహిళ సంఘాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి కేసు ఇంకా నిర్థారణ అవ్వకుండానే ఎలా వారే దోషులు అంటూ వీడియోలు విడుదల చేస్తారంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. గత వారం అరెస్ట్ అయిన వీరిని బెయిల్ పై బయటకు తీసుకు వచ్చేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇద్దరు హీరోయిన్స్ కుటుంబ సభ్యులు కూడా బెయిల్ కోసం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అయితే విచారణ అధికారులు వారిని ఇంకా ప్రశ్నించేది చాలా ఉంది. మరియు వారు బయటకు వెళ్తే సాక్ష్యులను ప్రభావింతం చేయడంతో పాటు కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది అంటూ వాదించడంతో వారికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. వారిద్దరు ఇప్పుడు జ్యుడీషయల్ కస్టడీలో ఉన్నారు. వారి నుండి మరింత సమాచారం రాబట్టేందుకు ఎంక్వౌరీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

కన్నడ సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ఈ కేసుతో సంబంధం కలిగి ఉంటారు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బెయిల్ కోసం వారు ఈనెల 24న జరుగబోతున్న తదుపరి విచారణ వరకు వెయిట్ చేయాల్సిందే. ఆ రోజు అయినా హీరోయిన్స్ కు బెయిల్ వస్తుందా అనేది కన్ఫర్మ్ గా చెప్పలేని పరిస్థితి.

Related Images:

హీరోయిన్స్ విచారణ వీడియోల లీక్ పై హాట్ బ్యూటీ ఫైర్

కన్నడ హీరోయిన్స్ రాగిణి ద్వివేది మరియు సంజనలు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెల్సిందే. వారిని అరెస్ట్ చేసిన వీడియోలు మరియు విచారిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని లేడీ కానిస్టేబుల్స్ షూట్ చేసినట్లుగా క్లీయర్ గా తెలుస్తుంది అంటూ హీరోయిన్ పరూల్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో ఒక వైపు లక్షల్లో పెరుగుతున్న కరోనా కేసులు.. మరో వైపు చైనా ఆగడాలు.. ఆర్థిక వ్యవస్థ అస్థవ్యస్థం అవ్వడం వంటి అతి పెద్ద సమస్యలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో డ్రగ్స్ కేసును దేశ విపత్తు అన్నట్లుగా మీడియా మరియు కొందరు ఫోకస్ చేస్తున్నారు అంటూ పరూల్ యాదవ్ అసహనం వ్యక్తం చేసింది. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి ఇంకా వారి కేసు నిర్థారణ కాకుండానే వారి వీడియోలను లీక్ చేయడం ద్వారా వారి జీవితాలను నాశనం చేసినట్లే అంటూ ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది.

దేశంలో ఉన్న సమస్యల గురించి ప్రస్తుతం ఎక్కడ చర్చ జరుగుతున్నట్లుగా అనిపించడం లేదు. ప్రజలకు ఉన్న కష్టాల గురించి రాజకీయ నాయకులు మరియు మేధావులు పట్టించుకోవడం లేదు. కాని ఎక్కడ చూసినా కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ముగ్గురు హీరోయిన్స్ గురించి మాత్రమే చర్చ జరుగుతోంది. పోలీసు డిపార్ట్ మెంట్ మొత్తం కూడా ఇతర చోట్ల ఎక్కడ కేసులు లేవు అన్నట్లుగా మొత్తం దృష్టి ఈ కేసుపైనే పెట్టడం విడ్డూరంగా ఉంది. దేశంలో రాజకీయ నాయకులు మరియు వ్యాపారస్తులు ఎంతో మంది తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. అయినా వారిని పట్టించుకునేందుకు జనాలకు సమయం లేదు. కాని డ్రగ్స్ విషయంలో మాత్రం చర్చించుకునేందుకు వారి వద్ద కావాల్సినంత సమయం ఉంది. పోలీసులు ప్రజల కోసం పని చేయాలి. కాని వారు చేస్తున్న పని ఒక్కొసారి చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కావాలని ప్రజల ఆలోచన తప్పుదారి పట్టించి అసలు సమస్యలు వారికి కనిపించకుండా కొందరు చేస్తున్నారేమో అనిపిస్తుంది. దేశంలో ఉన్న సమస్యలు మరియు వాటికి సంబంధించిన పరిష్కారాల గురించి ఆలోచించే వారే నిజమైన దేశ భక్తులు. ఇప్పుడు దేశంలో దేశభక్తులు ఎక్కడ కనిపించడం లేదంటూ పరూల్ ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

Related Images:

డ్రగ్స్ కేసులో హీరోయిన్ కస్టడీ పొడిగింపు…!

కన్నడ చిత్ర సీమలో డ్రగ్స్ వాడకంపై బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హీరోయిన్ రాగిణి ద్వివేదితో పాటు పలువురిని అరెస్టు చేసిన సీసీబీ మొత్తం 13 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరో హీరోయిన్ సంజన ని కూడా అరెస్ట్ చేసారు. నిందితులు ప్రశాంత్ రంకా – రాహుల్ – లూమ్ పెప్పర్ – రవిశంకర్ లను విచారించిన సీసీబీ పోలీసులు ముఖ్య సమాచారాన్ని రాబట్టింది. అయితే రాగిణి మాత్రం విచారణకు సహకరించడం లేదని తెలుస్తోంది. ఇక ఆధారాలు దొరకకుండా చేయాలనే ఉద్దేశంతో రాగిణి తన మొబైల్ ఫోన్ లోని మెసేజ్ లను తొలగించింది. అయితే సీసీబీ ఆమె మొబైల్ కు సంబంధించిన డాటాను తిరిగి పొందింది. మరోవైపు రాగిణి కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని ఆమె ఎక్కడెక్కడకు ప్రయాణించిందో విచారిస్తున్నారు.

ఇదిలా ఉండగా రాగిణి – రవిశంకర్ – వీరేన్ ఖన్నాల కస్టడీ ముగియంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బెంగళూరు ఎసీఎంఎం 1వ కోర్టు జడ్జి ముందు హాజరు పరిచారు. అయితే అనారోగ్యం పేరుతో రాగిణి విచారణకు సహకరించడం లేదని.. మరికొన్ని రోజులు కస్టడీని పొడిగించాలని పోలీసులు జడ్జికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వీరిని మరో ఐదు రోజుల పాటు కస్టడీకి అనుతిస్తున్నట్లు కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. కాగా శాండల్ వుడ్ డ్రగ్స్ దందా కేసును నిష్పాక్షపాతంగా విచారించాలని.. అధికారులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని.. ఈ కేసుతో డ్రగ్స్ మాఫియా తుడిచిపెట్టుకు పోవాలని హోం మినిస్టర్ బసవరాజ్ బొమ్మై అధికారులను ఆదేశించారు.

Related Images:

దర్యాప్తు అధికారులకు చుక్కలు చూపించిన సినీ నటి

కొద్ది రోజులుగా ఆ వుడ్డు.. ఈ వుడ్డు అన్న తేడా లేకుండా పలు సినీ రంగాలకు సంబంధించి చోటు చేసుకుంటున్న పరిణామాల సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య దేశ వ్యాప్తంగా ఎంత సంచలనంగా మారిందో తెలిసిందే. ఇదిలా ఉంటే.. శాండల్ వుడ్ కు సంబంధించి భారీ డ్రగ్స్ రాకెట్ బయటకు రావటం.. అందులో కన్నడ సినీ రంగానికి చెందిన పలువురికి లింకులు ఉన్నాయన్న అంశం సంచలనంగా మారింది.

జాతీయ మీడియాతో పాటు.. ప్రాంతీయ మీడియా పెద్దగా ఫోకస్ చేయని ఈ అంశం కర్ణాటక రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. సినీ నటి రాగిణి ద్వివేదికి సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో పాటు.. అందుకు సంబంధించిన ఆధారాలు పెద్ద ఎత్తున సేకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. డ్రగ్స్ రవాణాలో ఆమె అరెస్టు కావటంతో ఈ వ్యవహారం మరింత వేడెక్కించేలా చేసింది. ఓవైపు బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఆమె.. మరోవైపు దర్యాప్తు అధికారులకు చుక్కలు చూపించిన వైనం బయటకు వచ్చింది.

రెండు రోజులుగా అమెను విచారించిన అధికారులకు.. ఎలాంటి సమాచారం రాని పరిస్థితి. ప్రశ్న ఏదైనా మౌనమే తన సమాధానంగా వ్యవహరించటం.. పొడి పొడి మాటలతో అధికారుల సహనానికి పరీక్ష పెట్టినట్లు చెబుతున్నారు. ఏం అడిగినా ఆమె తిన్నగా సమాధానం చెప్పటం లేదంటూ బెంగళూరు కేంద్ర నేర నియంత్రణ దళం తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.

ఆమె వ్యవహరిస్తున్న తీరుతో ఆమెను కనీసం పది రోజులైనా ప్రశ్నించాల్సి ఉంటుందని కోరారు. అయితే.. పది రోజుల విన్నపాన్ని కొట్టేస్తూ.. ఐదు రోజుల పాటు అధికారులు విచారించేందుకు కోర్టు అనుమతిని ఇచ్చింది. ఇదిలా ఉంటే.. కోర్టు విచారణలో హైడ్రామా చోటు చేసుకుంది. తన తరఫున తొలుత ఎంపిక చేసుకున్న లాయర్ స్థానంలో మరొకరికి కేసు అప్పజెప్పారు. అనారోగ్య కారణంగా తన లాయర్ కు బదులుగా మరో లాయర్ ను ఎంపిక చేయాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారణకు హాజరైన ఆమె తానే పాపం చేయలేదన్నారు.

ఆమె తరపు వాదనలు వినిపించిన లాయర్ మరింత ఆసక్తికర వాదనల్ని వినిపించారు. రాగిణి నివాసంలో ఎలాంటి డ్రగ్స్ లభించలేదని.. అలాంటప్పుడు ఆమె నేరం చేసిందని ఎలా ఒప్పుకోవాలని ప్రశ్నించిన లాయర్.. చేయని నేరాన్ని అంగీకరించాలా? దర్యాప్తు అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇస్తున్నారు. కానీ.. అధికారులు కోరుకున్న కోణంలో సమాధానాలు ఇవ్వాలంటే ఎలా? అంటూ వినిపించిన వాదన అధికారులకు సరికొత్త అనుభవాన్ని ఇచ్చిందని చెబుతున్నారు.

రాగిణి తరఫు న్యాయవాది వినిపించిన వాదనకు కౌంటర్ ఇస్తూ.. అధికారుల తరఫు న్యాయవాది.. డ్రగ్స్ డీల్స్ లో రాగిణి స్వయంగా మాట్లాడేవారని.. ఆమె సరుకును తెప్పించుకున్నట్లుగా ఆధారాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. వాట్సాప్ చాట్ లను తొలగించటం.. సాక్ష్యాల్ని నాశనం చేసిన ఆధారాలు ఉన్నాయంటూ సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించారు. ఇదిలా ఉంటే తాజాగా రాగిణి కారు డ్రైవర్ ను అరెస్టు చేయటం.. మరో నలుగురు సినీ నటుల్ని అదుపులోకి తీసుకునే అవకాశం ఉండటంతో.. రానున్న రోజుల్లో ఈ వ్యవహారంలో మరిన్ని సంచలనాలు చోటు చేసుకోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.

Related Images:

గంజాయిని చట్టబద్ధం చేయాలని కోరుతున్న హీరోయిన్…!

సినీ ఇండస్ట్రీని ఇప్పుడు డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తోంది. బాలీవుడ్ లో మొదలైన డ్రగ్స్ మాఫియా వ్యవహారం శాండల్ వుడ్ కు పాకింది. మాదకద్రవ్యాల మాఫియాతో కన్నడ సీమలో పలువురు నటీనటులకు లింకులున్నాయని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేశారు. నాని ‘జెండాపై కపిరాజు’ చిత్రంలో హీరోయిన్ గా నటించిన రాగిణి ద్వివేది ని అరెస్ట్ చేయడంతో పాటు ‘బుజ్జిగాడు’ ఫేమ్ సంజన కు నోటీసులు జారీ చేశారు. రాగిణి ద్వివేది ని విచారించిన పోలీసులు ఆమెకు డ్రగ్స్ మాఫియాతో లింకులున్నట్లు కీలక సమాచారం సేకరించారని తెలుస్తోంది. దీంతో సినీ ఇండస్ట్రీలో చాలామంది పేర్లు తెరపైకి వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉండగా డ్రగ్స్ కేసులో హీరోయిన్ రాగిణి ద్వివేది అరెస్ట్ పై స్పదించిన ప్రముఖ కన్నడ నటి నివేదిత సంచలన వ్యాఖ్యలు చేసింది. గంజాయి కూడా తులసి మొక్కలాంటిదే అని.. మన దేశంలో దాని వినియోగాన్ని చట్టబద్ధం చేయాలని కోరింది. గంజాయిని బ్యాన్ చేయడానికి ముందు అది ఆయుర్వేదానికి వెన్నెముకలా ఉండేదని పేర్కొంది. మనదేశంలో నిషేధించిన మత్తు పదార్ధాల్లో ఒకటైన గంజాయిని పవిత్రంగా పూజించే తులసి తో పోల్చడమే కాకుండా దాని వినియోగాన్ని చట్టబద్ధం చేయాలని నివేదిత కోరడంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. పాము విషయంతో మందులు తయారు చేస్తామని.. పాముతో కాటు వేయించుకోము కదా అని కామెంట్స్ చేస్తున్నారు. కొంపదీసి గంజాయి తులసి లాంటిదని నువ్వు కూడా తీసుకుంటున్నావా అని ట్రోల్ చేస్తున్నారు. ‘తులసి వనంలో గంజాయి మొక్క’ అనేదాన్ని మార్చేసి ఆ గంజాయి మొక్కను కూడా మంచిదే అని చెప్తూ మత్తు పదార్థాలకు సపోర్ట్ చేస్తోందని విమర్శిస్తున్నారు.

Related Images:

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నాని హీరోయిన్?

బాలీవుడ్.. టాలీవుడ్.. శాండిల్ వుడ్ ఇలా ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతం డ్రగ్స్ టాపిక్ నడుస్తోంది. బాలీవుడ్ నటి రియా కు డ్రగ్స్ రాకెట్ తో సంబంధం ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సంబంధిత అధికారులు ఆమెను ఇప్పటికే ప్రశ్నించడంతో పాటు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇక తెలుగు సినిమా పరిశ్రమలో కూడా డ్రగ్స్ కల్చర్ ఉంది అంటూ మాధవి లత ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. తాజాగా కన్నడ సినిమా పరిశ్రమకు చెందిన హీరోయిన్ రాగిణి ద్వివేది డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యింది.

కన్నడంతో పాటు తెలుగు తమిళం మలయాళం హిందీ భాషల్లో కూడా ఈమె హీరోయిన్ గా నటించింది. తెలుగులో ఈమె నానికి జోడీగా జెండాపై కపిరాజు అనే సినిమాలో నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా నిరాశ పర్చడంతో మళ్లీ టాలీవుడ్ లో ఆమె కనిపించలేదు. ఈమద్య కాలంలో వరుసగా కన్నడ సినిమాల్లోనే నటిస్తున్న ఆమె అనూహ్యంగా డ్రగ్స్ కేసులో నింధితురాలిగా అరెస్ట్ అవ్వడం కన్నడ సినీ పరిశ్రమలో చర్చనీయాంశం అయ్యింది.

ఇటీవల డ్రగ్స్ రాకెట్ లో పట్టుబడ్డ ఇద్దరు రాగిణి ద్వివేది మరియు సంజన పేర్లను చెప్పారట. దాంతో ఇద్దరిని విచారించేందుకు పోలీసులు సిద్దం అయ్యారు. విచారణకు ప్రస్తుతం హాజరు అయ్యేందుకు సిద్దంగా లేనని సోమవారం నాడు తాను విచారణకు హాజరు అవుతాను అంటూ రాగిణి చెప్పుకొచ్చింది. కాని పోలీసులు మాత్రం వెంటనే విచారణకు హాజరు కావాలంటూ మళ్లీ నోటీసులు ఇవ్వగా స్పందించక పోవడంతో నేడు తెల్లవారు జామున ఆమె ఇంటి వద్ద అదుపులోకి తీసుకుని ఎంక్వౌరీ మొదలు పెట్టారు. ఈ కేసులో సంజన కూడా విచారణ ఎదుర్కొంటుంది.

Related Images: