సూపర్ స్టార్ మహేష్ బాబు యొక్క సేవాగుణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్నేళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్న మహేష్.. అరుదైన వ్యాధి సోకిన చిన్నారులకు వైద్య సహాయం చేస్తున్నారు. విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో హెల్త్ చెకప్ లు నిర్వహించడమే కాకుండా చిన్నారులకు ఎంతో క్లిష్టమైన గుండె సంబంధిత సర్జరీలను చేయిస్తూ చిన్నారుల మొహాల్లో చిరునవ్వులు చిందిస్తున్నారు. ఇప్పటికే గుండె సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్న 1010 మంది చిన్నారులకు ప్రాణదానం చేశారు మహేష్. ఈ క్రమంలో మహేష్ బాబు మరోసారి రియల్ హీరో అనిపించుకున్నాడు.
తాజాగా ఆంధ్రప్రదేశ్ కి చెందిన డింపుల్ అనే చిన్నారి వైద్యం కోసం ఆర్థిక సహాయం చేశారు మహేష్ బాబు. అరుదైన కాల్సిఫైడ్ పల్మనరీ వాల్వ్ అనే వ్యాధితో బాధపడుతున్న ఆ చిన్నారికి మహేష్ చికిత్స ఇప్పించారు. ఈ విషయాన్ని మహేష్ సతీమణి నమ్రత సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ప్రస్తుతం ఆ చిన్నారి కోలుకుందని.. ఆ చిన్నారికి తన కుటుంబానికి తమ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని నమ్రత ఈ సందర్భంగా పేర్కొంది. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులను బ్రతికించడానికి ముందుకొచ్చి వారి పాలిట దేవుడిగా మారాడని.. మహేష్ నిజమైన హీరో అని అందరూ ప్రశంసిస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే మహేష్ ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ అనే చిత్రంలో నటించనున్నాడు. ఈ చిత్రం షూటింగ్ జనవరి నుండి మొదలు కానుంది.
తమిళ ట్యాలెంటెడ్ హీరో శివ కార్తీకేయన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఈయన నటించిన సినిమాలు తెలుగులో కూడా కొన్ని మెప్పించాయి. కౌశల్య కృష్ణమూర్తి సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పంచిన విషయం తెల్సిందే. శివ కార్తికేయన్ రీల్ లైఫ్ లో నే కాకుండా రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నాడు. ఒక పేద ప్రతిభావంతురాలైన అమ్మాయి చదువుకు ఆర్థిక సాయం అందజేసి ప్రస్తుతం ఆమె ఎంబీబీఎస్ చదవడంలో శివ కార్తికేయన్ కీలక పాత్ర పోషించారు.
తంజావూర్ జిల్లా పేరావురణి కి సమీపంలో ఉండే ఒక చిన్న పల్లెకు చెందిన గణేషన్.. చిత్రల సంతానం సహానా. ఈమె పేరావురణి లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్లస్ 2 వరకు చదువుకుంది. గజ తుఫాన్ సమయంలో ఇల్లు కూలిపోవడంతో వీధి దీపాల కింద కూర్చుని సహానా చదువుకుంది. ప్లస్ 2 లో 600 మార్కులకు గ ఆను 524 మార్కులు సాధించింది. తనకు డాక్టర్ అవ్వాలనే కోరిక ఉందని ఒక మీడియా సంస్థతో ఆమె తెలియజేసింది. సోషల్ మీడియాలో ఆ మీడియా సంస్థకు సంబంధించిన కథనం ను చూసిన శివ కార్తికేయన్ ఆమెను చదివించేందుకు ముందుకు వచ్చాడు.
సహానాను తంజావూర్ లోని నీట్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు కోసం శిక్షణ ఇప్పించాడు. అందుకు సంబంధించిన పూర్తి ఆర్థిక పరమైన సాయంను ఆయన అదించాడు. తాజాగా 273 మార్కులతో తిరుచ్చిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో సీటును దక్కంచుకుంది. డాక్టర్ కావాలనే తన కలను సాకారం చేసుకునేందుకు సాయంగా నిలిచిన శివ కార్తికేయన్ గారిక ఎప్పటికి రుణపడి ఉంటాను అని.. ఆయన వల్లే తాను డాక్టర్ అవ్వగలుగుతున్నాను అంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఒక నిరుపేద డాక్టర్ అవ్వడంలో సాయంగా నిలిచిన శివ కార్తికేయన్ నిజంగా రియల్ హీరో అంటూ అంతా అభినందనలు కురిపిస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ.. బోయపాటిల కాంబోలో రూపొందుతున్న చిత్రంలో విలన్ పాత్రకు గాను బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను దాదాపుగా ఖరారు చేశారంటూ వార్తలు వచ్చాయి. ఆయన షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నాడు అనుకుంటూ ఉండగా అనూహ్యంగా కరోనా మహమ్మారి ఎటాక్ మొదలయ్యింది. దాంతో షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి. సరే మళ్లీ షూటింగ్ షురూ అయినప్పుడు సంజయ్ దత్ వచ్చి నటిస్తాడు అనుకుంటున్న సమయంలో ఆయనకు క్యాన్సర్ అంటూ నిర్థారణ అయ్యింది. దాంతో ఇప్పటికే ఆయన చేస్తున్న సినిమాల విషయంలోనే అనుమానాలు మొదలు అయ్యాయి.
సంజయ్ దత్ ను బిబి3 లో నటింపజేయాలనుకున్న ప్లాన్ వర్కౌట్ అయ్యేలా లేదు. సంజయ్ దత్ ఇలాంటి పరిస్థతుల్లో కొత్త సినిమాలను చేయడం సాధ్యం కాకపోవచ్చు అంటున్నారు. అందుకే ఆయన విషయాన్ని ఆలోచించకుండా బోయపాటి మరో నటుడితో వెళ్లాలని భావిస్తున్నాడు. వచ్చే నెల నుండి షూటింగ్ ను పునః ప్రారంభించేందుకు గాను విలన్ పాత్రకు మరో నటుడితో సంప్రదింపులు చేస్తున్నాడట. ఆ మరో నటుడు మరెవ్వరో కాదు కరోనా టైం రియల్ హీరో సోనూసూద్. బాలకృష్ణ తో ఢీ కోసం సోనూసూద్ ను రంగంలోకి దించితే బాగుంటుందనే ఉద్దేశ్యంతో బోయపాటి ఉన్నాడట.
తెలుగు ప్రేక్షకులకు సోనూసూద్ సుపరిచితుడు అవ్వడంతో పాటు మంచి క్రేజ్ ఉన్న నటుడు. అందుకే ఆయన బిబి3 లో నటిస్తే అన్ని విధాలుగా బాగుంటుందనే అభిప్రాయంతో బోయపాటి ప్లాన్ చేస్తున్నాడట. త్వరలోనే సినిమాకు సంబంధించిన షూటింగ్ వివరాలను వెళ్లడించే అవకాశం ఉంది. ఆ సమయంలో విలన్ పాత్రపై క్లారిటీ ఇవ్వనున్నారు. మరో వైపు హీరోయిన్ విషయంలోనూ ఇంకా ఎలాంటి క్లారిటీని బోయపాటి ఇవ్వలేదు. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభించి అభిమానుల అనుమానాలు పుకార్లన్నింటిని బోయపాటి పటాపంచలు చేస్తాడేమో చూడాలి.