సలార్ ఒక్క రాత్రిలోనే బాక్సాఫీస్ షేక్

పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు సినిమాల్లో సలార్‌ ఒకటి. కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌, స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో తెరకెక్కిన ఈ మూవీ మరో మూడు రోజుల్లో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. క్రిస్మస్ కానుకగా విడుదలవుతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

కాగా ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతుంది. ఇప్పటికే ట్రైలర్, ఫస్ట్ సింగిల్ తో సూపర్ క్రేజ్ సంపాదించుకోగా.. నిన్న మూవీ టీమ్ మరో సాలిడ్ ట్రైలర్ ను రిలీజ్ చేసి ప్రభాస్ అభిమానులను మరింత ఖుషీ చేసింది. రెండు రోజులుగా ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ లో జోష్ నింపింది. భారీ యాక్షన్ సన్నివేశాలతో నిండిపోయిన ఈ ట్రైలర్ సినిమాపై ఒక్కసారిగా బజ్ పెంచేసింది.

నిజానికి.. మిగతా సినిమాలతో పోలిస్తే సలార్ ప్రమోషన్ కార్యక్రమాలు బాగా తక్కువే. ఇదే సమయంలో ట్రైలర్ రిలీజ్ చేయడం బాగా వర్కౌట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను ఎంతో ఆకట్టుకున్న ఈ ట్రైలర్.. ప్రీ బుకింగ్స్ పై భారీగా ప్రభావం చూపించింది. ఉత్తర అమెరికాలో ఒక్క రాత్రిలోనే 2.5లక్షల డాలర్లను వసూలు చేసింది.

సాధారణంగా ఒకేసారి ఇంత మొత్తంలో వసూళ్లు పెరగడం.. ప్రీమియర్ షోలు పడిన తర్వాత జరుగుతుంది. కానీ సలార్ సినిమా విషయంలో ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఇలా జరిగింది. దీంతో ప్రశాంత్ నీల్ స్కెచ్ అదిరిపోయిందని సినీ పండితులు చెబుతున్నారు. యూఎస్ లో సలార్ వసూళ్లు భారీ స్థాయిలో రాబడుతుందని అంటున్నారు. ట్రైలర్ విషయానికి వస్తే.. మొదటి ట్రైలర్ లాగానే రెండో ట్రైలర్ మొత్తం కూడా భారీ యాక్షన్ సన్నివేశాలతో నిండిపోయింది. తండ్రి కుమారుడికి సుల్తాన్ కథ చెప్పడంతో ప్రారంభమైంది. ప్రభాస్ ఎంట్రీ అదిరిపోయింది.

ప్రశాంత్ నీల్ మార్క్ బాగా కనిపించింది. చివరకు ఈ కథ ప్రాణ స్నేహితులను శత్రువులుగా మార్చడమే అంటూ.. మొదటి పార్ట్ వీరిద్దరూ శత్రువులుగా మారే దగ్గర ఆగుతుందన్నట్టుగా హింట్ ఇచ్చారు దర్శకుడు.

Related Images:

సలార్ కేజీఎఫ్ 2 రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా?

డార్లింగ్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సిద్ధమై ప్రేక్షకుల ముందుకి వస్తోన్న సినిమా సలార్. ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషలలో డిసెంబర్ 22న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. రెండు భాగాలుగా హోంబలే ఫిలిమ్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సలార్ ఖాన్సార్ రాజ్యంలో జరిగే కథగా ఉండబోతోందని ట్రైలర్ బట్టి క్లారిటీ వచ్చింది.

ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది హైప్ పెరుగుతూ వెళ్తోంది. ఇన్ని రోజులు కాస్తా సైలెంట్ గానే బజ్ నడిచింది. అయితే తాజాగా వచ్చిన యాక్షన్ ట్రైలర్ తో ఒక్కసారిగా రీసౌండ్ పెరిగింది. ఈ ప్రపంచంలోకి ఆడియన్స్ కూడా వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే ఇంట్రెస్ట్ ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతోంది.

ఇదే స్పీడ్ కొనసాగితే కచ్చితంగా అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా సలార్ రికార్డులు క్రియేట్ చేయడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. అలాగే సలార్ ముందు పెద్ద టార్గెట్ ఉంది. ప్రశాంత్ నీల్ ముందు సినిమా కేజీఎఫ్ చాప్టర్ 2 ప్రపంచ వ్యాప్తంగా 170 కోట్లు ఫస్ట్ డే కలెక్ట్ చేసింది.

ఈ రికార్డుని సలార్ బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సినిమాపై ఉన్న హైప్ చూస్తుంటే కచ్చితంగా బ్రేక్ చేయడానికి కావాల్సిన స్కోప్ ఉంది. ప్రభాస్ ఆదిపురుష్ మూవీ కూడా వంద కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. అయితే సలార్ మాస్ , యాక్షన్ మూవీ కావడంతో 150 కోట్లు చాలా ఈజీగా దాటేస్తుంది అని అంచనా వేస్తున్నారు.

170 కోట్ల మార్క్ ని సలార్ అందుకుంటే మాత్రం ఈ ఏడాది హైయెస్ట్ గ్రాస్ అందుకున్న మూవీగా నిలిచిపోతుంది. అలాగే వెయ్యి కోట్ల కలెక్షన్స్ టార్గెట్ కూడా సలార్ ముందు ఉంది. అది అందుకుంటే మాత్రం షారుఖ్ తో సమాన రికార్డ్ కలిగి ఉంటాడు. మరి ప్రశాంత్ నీ సృష్టించిన ఈ ఖాన్సార్ ప్రపంచం ప్రభాస్ కి ఏ రేంజ్ సక్సెస్ ఇస్తుందనేది వేచి చూడాలి.

Related Images:

సలార్.. ఇది సౌత్ ఇండియా టార్గెట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ సలార్. ఈ సినిమా డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. పవర్ ఫుల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో ఈ సినిమాని ప్రశాంత్ నీల్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకి భారీ హైప్ ఉన్న సంగతి తెలిసిందే. థియేటర్స్ లో సినిమా రిలీజ్ కి ఇంకా ఐదు వారాల సమయం ఉంది.

ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ అన్ని రాష్ట్రాలలో జరిగిపోయింది. సలార్ సౌత్ ఇండియా డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్ ఇప్పుడు బయటకొచ్చింది. సలార్ ను ఆంధ్రప్రదేశ్ ఏరియా బట్టి డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. అయితే తెలంగాణలో కంప్లీట్ గా మైత్రీ మూవీ మేకర్స్ డిస్టిబ్యూట్ చేస్తోంది. ఇక తమిళనాడులో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రెడ్ జెయింట్ సలార్ డిస్టిబ్యూటర్ గా ఉంది. కేరళలో పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ సలార్ ను రిలీజ్ చేస్తోంది. కర్ణాటకలో మాత్రం సలార్ నిర్మాణ సంస్థ అయిన హోంబలే ఫిలిమ్స్ సొంతంగా విడుదల చేయనుంది.

ఇక సలార్ నైజాం రైట్స్ విలువ 65 కోట్లు కాగా, ఆంధ్రా రైట్స్ విలువ 70 కోట్లు. సీడెడ్ రైట్స్ విలువ 27 కోట్లతో. తెలుగు రాష్ట్రాల హక్కులు దాదాపు 165 కోట్లు బిజినెస్ జరిగింది. అయితే మిగతా ఏరియాల్లో ఆయా డిస్ట్రిబ్యూటర్ల ద్వారా నిర్మాతలు సొంతంగానే రిలీజ్ చేస్తున్నారు. సౌత్ లో మిగిలిన మూడు రాష్ట్రాలలో సలార్ 75 కోట్ల బిజినెస్ వేల్యూతో థియేటర్స్ లోకి రావడానికి సిద్ధం అవుతోంది.

మొత్తం దక్షిణాదిలోనే సుమారు 240 కోట్లు. బిజినెస్ సలార్ సినిమాపై జరిగిందని సినీ ఇండస్ట్రీలో వినిపిస్తోన్న మాట. నార్త్ 100 కోట్ల వరకు బిజినెస్ జరిగే ఛాన్స్ ఉందని టాక్. అదే జరిగితే కేవలం థీయాట్రికల్ రైట్స్ ద్వారానే 350 కోట్ల వరకు సలార్ పై బిజినెస్ జరుగుతుంది. అతి పెద్ద బ్రేక్ ఈవెన్ టార్గెట్ తోనే ఈ మూవీ థియేటర్స్ లోకి రానుంది.

ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ పవర్ ఫుల్ విలన్ లు గా కనిపిస్తున్నారు. మరి ప్రభాస్ కి ఈ సినిమా ఏపాటి సక్సెస్ ని అందిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Related Images:

సలార్ తప్పుకునే మాట ఉత్తుత్తిదే..!

స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన కొన్ని ప్రచారాలు అభిమానులను విపరీతమైన ఆందోళనకు గురి చేస్తాయి. సలార్ డిసెంబర్ 22 నుంచి మళ్ళీ వాయిదా పడొచ్చనే ప్రచారం నిన్న కొన్ని మీడియా వర్గాల్లో జరగడం చూసి ఫ్యాన్స్ హడావిడి పడిపోయి సోషల్ మీడియాలో తమ నిరసనని వ్యక్తం చేశారు. డుంకి ప్రోమో వచ్చాక కూడా సలార్ కనీసం ప్రభాస్ కనిపించే టీజర్ వదలకపోవడం పట్ల ఇప్పటికే బోలెడు అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో మళ్ళీ పోస్ట్ పోన్ అంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. అయితే నిర్మాణ వర్గాలు మాత్రం వీటిని పూర్తిగా కొట్టి పారేస్తున్నాయి. వాయిదా సమస్యే లేదంటున్నాయి.

విడుదల తేదీకు అనుగుణంగా బిజినెస్ వ్యవహారాలు, థియేటర్ అగ్రిమెంట్లు జరుగుతున్నాయి. ఏరియాల వారిగా డిస్ట్రిబ్యూటర్లు లాక్ అవుతున్నారు. సంక్రాంతి సినిమాలకే కేటాయింపులు జరుగుతున్న తరుణంలో వాటికి ఇరవై రోజుల ముందు వస్తున్న సలార్ ని ఊరికే వదిలేస్తారా. షారుఖ్ ఖాన్ ఓవర్సీస్ లో ప్రభావం చూపించే మాట వాస్తవమే అయినా హోంబాలే ఫిలింస్ ఎంత మాత్రం తగ్గే ఆలోచనలో లేరు. పైగా ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ వేసవి దాకా స్లాట్ దొరకదు. ఒకసారి జరిగిన వాయిదాకే ఇతర టాలీవుడ్ నిర్మాతలు తమ ప్లానింగ్ మార్చుకుని నానా రకాల ఇబ్బందులు పడ్డారు.

సో సలార్ తప్పుకోవడమనే మాట ఉత్తుత్తిదే. దీపావళికి కొత్త టీజర్ ఆశిస్తున్న అభిమానుల కోరిక నెరవేరుతుందో లేదో ఇంకా క్లారిటీ లేదు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఒత్తిడి మధ్య జరుగుతున్నాయి. ప్రశాంత్ నీల్, రవి బస్రూర్ తో పాటు ఎడిటింగ్ టీమ్ మొత్తం ఫైనల్ కాపీని సిద్ధం చేసే దిశగా ఉరుకులు పరుగులు పెడుతున్నారు. వరల్డ్ కప్ ఫైనల్ అయ్యాకే సలార్ పబ్లిసిటీ మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఎలాగూ ఇండియా ఫైనల్ కు వెళ్తుంది కాబట్టి ఆ హడావిడిలో సినిమాలను పట్టించుకోరు. అందుకే నవంబర్ 20 నుంచి ఏ నిమిషంలో అయినా సలార్ దూకుడు మొదలవ్వొచ్చు.

Related Images:

నెట్టింట హల్చల్ చేస్తున్న సలార్ ప్రభాస్ బైక్ ఫోటో..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ సలార్. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కేజీఎఫ్ ప్రొడ్యూసర్ విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నాడు. ఈ ఏడాది సంక్రాంతి టైంలో ప్రారంభించిన సలార్ ఫస్ట్ షెడ్యూల్ రామగుండం ఏరియాలోని బొగ్గుగనులలో జరిగింది. పదిరోజుల పాటు జరిగిన ఆ షెడ్యూల్లో సలార్ షూటింగ్ ముగిసింది. ప్రభాస్ ఈ సినిమాలో మాస్ లుక్కులో ఓ యోధుడిగా కనిపిస్తాడని టాక్ నడుస్తుంది. అయితే రామగుండంలో ప్రభాస్ సలార్ పాత్రలో ఉన్నటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ బొగ్గుగనుల ప్రదేశంలో బుల్లెట్ బైక్ పై కూర్చున్న పిక్ లీక్ అయింది. ఆ ఫోటోలో ప్రభాస్ తో పాటు చిత్రబృందం కూడా ఆ ఫోటోలో కనిపిస్తుంది.

అయితే ఫస్ట్ టైం హీరోయిన్ శృతిహాసన్ ప్రభాస్ సరసన నటిస్తోంది. అయితే హీరోయిన్ కిడ్నాప్ సీన్ టైంలో దొంగలను బైక్ పై చేస్ చేసి హీరోయిన్ను కాపాడే సీన్ లోదే ఈ పిక్ అంటూ కొన్ని ఊహగానాలు వ్యక్తం అవుతున్నాయి. యాక్షన్ సీన్స్ షూట్ చేసినట్లు తెలుస్తుంది అంటే అందులోనే ఈ బైక్ సీన్ ఉండి ఉంటుందని అంటున్నారు. ఇక త్వరలోనే మరో భారీ షెడ్యూల్ ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. ఈ పాన్ ఇండియా మూవీ తెలుగుతో పాటు తమిళ కన్నడ హిందీ మలయాళం భాషలలో విడుదల కాబోతుంది. ఇదిలా ఉండగా.. ప్రభాస్ ఇటీవలే రాధేశ్యామ్ మూవీ కంప్లీట్ చేసేసాడు. పీరియడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వాలంటైన్స్ డే రోజున రాధేశ్యామ్ ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయనున్నారు మేకర్స్. సలార్ తో పాటు ప్రభాస్ ఆదిపురుష్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.

Related Images:

‘సలార్’ దర్శకుడి వివరణతో కన్నడిగులు సైలెంట్ అవుతారా..?

‘ఉగ్రమ్’ అనే కన్నడ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్ నీల్.. రెండో సినిమా ‘కేజీఎఫ్’ తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. పదుల సంఖ్యలో సినిమాలు చేసిన అనుభవం లేకపోయినా మాస్ ప్రేక్షకుల పల్స్ తెలుసుకున్న దర్శకుడు అనిపించుకున్నాడు. అందుకే ప్రతి స్టార్ హీరో కూడా ఈ సంచలన దర్శకుడితో సినిమా చేయాలని ఆసక్తి కనబరిచారు. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరోలు – నిర్మాతలు ప్రశాంత్ తో సినిమా చేయడానికి ముందుగానే ఖర్చీఫ్ వేశారు. ప్రస్తుతం ‘కేజీఎఫ్ 2’ సినిమా పనులతో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ – ప్రభాస్ లతో సినిమాలు చేయడానికి కమిట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ముందుగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ‘సలార్’ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు.

అయితే ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సినిమా చేయడం పట్ల టాలీవుడ్ సినీ అభిమానులు హ్యాపీగా ఉన్నప్పటికీ.. శాండిల్ వుడ్ ఫ్యాన్స్ మాత్రం నిరాశ చెందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కన్నడిగులు సోషల్ మీడియా వేదికగా ఆయన పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. తనకు లైఫ్ ఇచ్చిన కన్నడ చిత్రసీమను నిర్లక్ష్యం చేసి ఇతర ఇండస్ట్రీల హీరోల కోసం పరుగులు పెడుతున్నాడంటూ ప్రశాంత్ మీద కన్నడిగులు తీవ్ర విమర్శలు చేశారు. ట్విట్టర్ నెగిటివ్ ట్రెండ్స్ చేస్తున్నారు. ఇంతకముందు పొగిడిన వాళ్ల నుంచే వ్యతిరేకత రావడం చూసిన చూశాక ప్రశాంత్.. తాను ప్రభాస్ తోనే ఎందుకు సినిమా చేస్తున్నాడో వివరణ ఇచ్చుకున్నాడు.

ప్రశాంత్ నీల్ ఓ ఆంగ్ల డైలీతో మాట్లాడుతూ..”నేను దర్శకుడిగా పేరు తెచ్చుకున్నది కన్నడ సినిమాలతోనే. ‘ఉగ్రమ్’ ‘కేజీఎఫ్’ సినిమాలతో నాకు పేరొచ్చింది. ఇక్కడ ఉన్న హీరోలను కాకుండా తెలుగు ఇండస్ట్రీకి చెందిన ప్రభాస్ ని హీరోగా తీసుకోవడం గురించి చాలామంది అడుగుతున్నారు. నేను రాసుకున్న ‘సలార్’ కథకు ప్రభాస్ సరిగ్గా సరిపోతాడని నాకు అనిపించింది. అందుకే ఆయనతో ఈ సినిమా చేస్తున్నా. మిగతా విషయాలు సినిమా విడుదలయ్యాక మాట్లాడతాను” అని చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో కన్నడ హీరోలతో సినిమా చేయలేదని కామెంట్స్ చేసిన శాండిల్ వుడ్ ఫ్యాన్స్ ప్రశాంత్ వివరణతో సైలెంటుగా ఉంటారేమో చూడాలి.

Related Images:

‘సలార్’ అంటే ఏంటో చెప్పిన ప్రశాంత్ నీల్..!

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ – ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ‘సలార్’ అనే పాన్ ఇండియా సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘కేజీఎఫ్ 2’ సినిమాని కంప్లీట్ చేసే పనిలో ఉన్న ప్రశాంత్ నీల్.. సడన్ గా ప్రభాస్ తో సినిమా ప్రకటించి అందర్నీ ఆశ్యర్యానికి గురి చేశారు. ‘సలార్’ అనౌన్స్మెంట్ పోస్టర్ లో ప్రభాస్ వైలెంట్ లుక్ ని చూసిన సినీ అభిమానులు షాక్ తిన్నారు. అలానే అందరూ ‘సలార్’ అంటే అర్థం ఏమిటని గూగుల్ చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ‘సలార్’ టైటిల్ మీనింగ్ మరియు ప్రభాస్ తో సినిమా చేయడానికి గల కారణాలను వెల్లడించాడు.

ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. “కన్నడ హీరోలతో కాకుండా తెలుగు ఇండస్ట్రీకి చెందిన ప్రభాస్ తో సినిమా చేయడం గురించి అందరూ అడుగుతున్నారు. నేను రాసుకున్న ‘సలార్’ కథకు ప్రభాస్ సరిగ్గా సరిపోతాడని నాకు అనిపించింది. అందుకే ఆయనతో ఈ సినిమా చేస్తున్నా. ఇందులో ప్రభాస్ క్యారక్టర్ వైలంటుగా ఉంటుంది” అని చెప్పుకొచ్చాడు. ”సలార్ టైటిల్ కు ఎన్నో రకాల అర్థాలు చెబుతున్నారు. అది ఉర్దూ భాషలోని ఒక సామాన్యమైన పదం. ‘సలార్’ అంటే సమర్థవంతమైన నాయకుడు.. రాజుకి కుడి భుజంగా ఉంటూ ప్రజలను రక్షించే వ్యక్తి అని చెప్పొచ్చు. ఓ వైలెంట్ పాత్రను మీ ముందుకు తీసుకురానున్నాను. దీనికి తగ్గట్టే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసాం. ప్రభాస్ లుక్ చూసి ఆర్మీలో ఉండే వ్యక్తి అని అందరూ అనుకుంటారనే ఫస్ట్ లుక్ పోస్టర్ ను టైటిల్ తో పాటు విడుదల చేశాం” అని ప్రశాంత్ నీల్ ఈ సందర్భంగా వెల్లడించారు.

Related Images:

ప్రభాస్ – ప్రశాంత్ ‘సలార్’ పై కన్నడిగుల నెగిటివ్ కామెంట్స్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ”సలార్” అనే పాన్ ఇండియా మూవీని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘కేజీఎఫ్’ చిత్రాన్ని నిర్మించిన హోంబలే ఫిలింస్ నిర్మాణ సంస్థ ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ని నిర్మించనుంది. ‘సలార్’ చిత్రానికి సంబంధించిన అనౌన్స్ మెంట్ పోస్టర్ ప్రభాస్ మెషిన్ గన్ మీద చేయి పెట్టి మోస్ట్ వైలెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇది ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఇంతకముందు వచ్చిన ‘ఉగ్రమ్’ చిత్రానికి రీమేక్ అని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని 2021 జనవరిలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ‘కేజీఎఫ్’ దర్శకుడితో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ సినిమా అనౌన్స్ చేయడం పట్ల డార్లింగ్ ఫ్యాన్స్ మరియు టాలీవుడ్ సినీ అభిమానులు ఫుల్ ఖుషీ గా ఉన్నారు. కానీ కన్నడ సినీ అభిమానులు ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న ‘సలార్’ పై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.

‘కేజీఎఫ్’ దర్శకుడు కన్నడ పరిశ్రమకు చెందిన హీరోలతో కాకుండా బయట ఇండస్ట్రీ హీరోతో మూవీ చేయడం అక్కడి వారికి నచ్చడం లేదని తెలుస్తోంది. ‘కేజీఎఫ్’ దర్శక నిర్మాతలు శాండిల్ వుడ్ అభివృద్ధికి కాకుండా పక్క ఇండస్ట్రీల కోసం వర్క్ చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. దీని కారణంగా ఒకప్పుడు ప్రశాంత్ నీల్ ని పొగిడిన నోళ్లే ఇప్పుడు విమర్శిస్తున్నాయి. దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న రాజమౌళి – శంకర్ లాంటి పాన్ ఇండియా దర్శకులు తమ హీరోలతో సినిమాలు తీస్తూ వారి ఇండస్ట్రీలకి పేరు తెస్తున్నారని.. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం పక్క ఇండస్ట్రీలో పేరు కోసం ప్రాకులాడుతున్నాడని సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. మరికొందరు మాత్రం కన్నడ దర్శకుడి కోసం పక్క ఇండస్ట్రీ హీరోలు ఆరాటపడటం శాండిల్ వుడ్ కే గర్వకారణం అని.. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా లెవల్లో సినిమాలు తీస్తూ ఇండస్ట్రీ పేరుని దేశవ్యాప్తంగా తీసుకెళ్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.

Related Images:

ప్రభాస్.. ప్రశాంత్ ల ‘సలార్’ అర్థం ఇదే

బాహుబలి స్టార్ ప్రభాస్.. కేజీఎఫ్ మేకర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ అధికారిక ప్రకటన వచ్చింది. కొన్ని రోజులుగా ప్రభాస్.. ప్రశాంత్ నీల్ ల కాంబోలో సినిమా రాబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. కాని చాలా ప్రభాస్ ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు ఉన్నాయి కనుక పుకార్లే అయ్యి ఉంటాయి అనుకున్నారు. పవర్ ఫుల్ లుక్ తో అధికారికంగా ఫస్ట్ లుక్ వచ్చేసింది. ‘సలార్’ అనే టైటిల్ తో మోస్ట్ వయోలెంట్ మాన్ గా ప్రభాస్ ను ప్రశాంత్ నీల్ చూపించబోతున్నాడు.

పాన్ ఇండియా మూవీగా దీనిని విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో అన్ని భాషల్లో కూడా ఒకే టైటిల్ ఉండాలని ‘సలార్’ ను ఫిక్స్ చేశారు. టైటిల్ అర్థం ఏంటీ అంటూ చాలా మంది నెట్ లో సెర్చ్ చేస్తున్నారు. సలార్ కు చాలా అర్థాలు వస్తున్నాయి. సలార్ అంటే ఉర్దులో ధైర్యవంతుడు అయిన నాయకుడు అని అర్థం.

ఒక బలహీన తెగకు చెందన వ్యక్తి సలార్ గా ఎలా మారాడు అనేది ఈ సినిమా కథగా చెబుతున్నారు. టైటిల్ కు తగ్గట్లుగానే ప్రభాస్ ఈ సినిమా కోసం అత్యంత పవర్ ఫుల్ గా కనిపించబోతున్నాడు. ఫస్ట్ లుక్ లోనే ఆ విషయాన్ని క్లారిటీ ఇచ్చారు. వచ్చే జనవరి నుండి ‘సలార్’ ను ప్రారంభించబోతున్నారు. రాధేశ్యామ్ ముగిసిన వెంటనే ఈ సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉంది.

Related Images:

ప్రభాస్ – ప్రశాంత్ కాంబోలో ‘సలార్’

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కనుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘కేజీఎఫ్’ చిత్రాన్ని నిర్మించిన హోంబలే ఫిలింస్ నిర్మాణ సంస్థ మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను డిసెంబర్ 2న ప్రకటించబోతున్నారని చెప్పడంతో ఇది ప్రభాస్ తో చేయబోయే సినిమానే అని ప్రాంతీయ మీడియాతో పాటు జాతీయ మీడియా కూడా కోడై కూసింది. ఇప్పుడు ఈ వార్తలను నిజం చేస్తూ ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబోలో ‘సలార్’ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను అధికారకంగా ప్రకటించారు.

‘కేజీఎఫ్’ మేకర్స్ నిర్మిస్తున్న ‘సలార్’ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ని కూడా విడుదల చేసారు. ది మోస్ట్ వైలెంటెడ్ మ్యాన్ అంటూ రిలీజ్ చేసిన ‘సలార్’ పోస్టర్ లో ప్రభాస్ తుపాకీ మీద చేయి పెట్టి వైలెంట్ గా చూస్తున్నాడు. ఇది ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘ఉగ్రమ్’ చిత్రానికి రీమేక్ అని వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ ‘సలార్’ వరల్డ్ లో 2021జనవరిలో అడుగుపెట్టబోతున్నాడంటూ చిత్ర యూనిట్ ప్రకటించింది.

Related Images: