హంసవో నువు సరోవరంలో రాణివో

హంసానందిని పరిచయం అవసరం లేని పేరు ఇది. మోడల్ టర్న్ డ్ నటి కి పలువురు టాలీవుడ్ హీరోలు అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేశారు. జగపతిబాబు.. నాగార్జున లాంటి హీరోలు కెరీర్ ఆరంభమే అవకాశాలిచ్చారు. ఆ క్రమంలోనే టాలీవుడ్ లో ఈ భామ కెరీర్ అలా అలా సాగింది.

ఓవైపు ఐటెమ్ నంబర్లు.. మరోవైపు ఆసక్తికర క్యారెక్టర్లతో రాణించింది. నాయికగా అడపాదడపా మెరిపించింది. అత్తారింటికి దారేది చిత్రంలో ముంతాజ్ తో కలిసి నర్తించింది. అలాగే జై లవకుశ- సోగ్గాడే చిన్ని నాయనా తదితర చిత్రాల్లో నటించింది. కొన్ని సినిమాల్లో యాక్షన్ రాణిగానూ మురిపించింది. అన్నిటికీ మించి ఐటెమ్ భామగా క్లిక్కయ్యింది.

అయితే కరోనా కష్టకాలంలో ఈ అమ్మడికి సరైన ఆఫర్లు ఏవీ వచ్చినట్టే కనిపించడం లేదు. టాలీవుడ్ లో కెరీర్ అంతంత మాత్రమే. ఆ క్రమంలోనే సోషల్ మీడియా ఫోటోషూట్లతో అవకాశాల కోసం గాలం వేస్తోంది. ఇలా అందాల స్టింట్ తో ఓ పెద్ద అవకాశం పట్టేయాలన్నది ప్లాన్. కానీ హంసను చూసి ఎవరైనా అవకాశం ఇస్తారా? ప్రస్తుతానికి ఈ ఫోటో చూడగానే.. హంసవో.. మానస సరోవరంలో రాణివో! అంటూ యూత్ ఒకటే ఇదైపోతున్నారు మరి.

Related Images:

హంస బ్యూటీకి ఫిదా అవ్వాల్సిందే

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన ముద్దుగుమ్మ హంసా నందిని ఐటెం సాంగ్స్ తో అప్పుడప్పుడు గెస్ట్ రోల్స్ చేస్తూ రెగ్యులర్ గా ఈ అమ్మడు ప్రేక్షకులకు టచ్ లో ఉంటుంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ పోస్టులు చేస్తున్న ఈ అమ్మడు తాజాగా షేర్ చేసిన ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. థైస్ బ్యూటీని చూపిస్తూ ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫొటో అందరి దృష్టిని ఆకర్షించింది. 2017లో జై లవకుశ చిత్రం తర్వాత ఈ అమ్మడు మళ్లీ పెద్ద సినిమాల్లో నటించలేదు. గత రెండు సంవత్సరాలుగా ఈ అమ్మడు పెద్దగా ఆఫర్లు దక్కించుకోలేక పోయింది.

హంసా నందిని ఆఫర్ల కోసం ఇలా థైస్ బ్యూటీని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. హంసా నందిని సోషల్ మీడియా పోస్ట్ లతో అయినా మళ్లీ ఆఫర్లు దక్కించుకుంటుందా అనేది చూడాలి. మంచి ఫిజిక్ మరియు అందం ఉన్నా కూడా ఈ అమ్మడికి ఆఫర్లు దక్కక పోవడం ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటి వరకు ఈమె చేసిన పాత్రలు ఎక్కువగా వ్యాంప్ తరహాలో ఉన్నాయి. అందుకే ఆమెకు హీరోయిన్ గా ఆఫర్లు తక్కువగా వస్తున్నాయనే కామెంట్స్ వస్తున్నాయి.

Related Images: