Templates by BIGtheme NET
Home >> Telugu News >> విజయవాడలో 40 % మందికి కరోనా !

విజయవాడలో 40 % మందికి కరోనా !


కరోనా వైరస్ .. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఈ మహమ్మారి దెబ్బకి వణికిపోతోంది. చైనాలో మొదలైన ఈ మహమ్మారి విజృంభణ ప్రస్తుతం ప్రపంచం మొత్తం వ్యాపించింది. మనదేశంలో కూడా కరోనా మహమ్మారి విజృంభణ భారీగా పెరుగుతుంది. అలాగే ముఖ్యంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి భారీగా ఉంది. ప్రతిరోజూ కూడా పది వేల వరకు పాజిటివ్ కేసులు నమోదు అవుతూవస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటి అంటే .. కొందరికి కరోనా సోకింది తగ్గిపోయింది కూడా తెలియడంలేదు.

తాజాగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన సిరో సర్వైలెన్స్ వివిధ రకాల వైరస్ పరీక్షల విశ్లేషణలో దాదాపుగా 40% మందికి అసలు వారికీ తెలియకుండానే కరోనా సోకి తగ్గిపోయినట్లు వైద్యులు గుర్తించారు . అలాగే వీరిలో ఎక్కువ శాతం మందికి అనుమానిత లక్షణాలు లేవని తేలింది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఇన్ ఫెక్షన్ రేట్ ఏ స్థాయిలో ఉన్నదో తెలుసుకునేందుకు వైద్య అధికారులు ఇటీవల ‘సిరో సర్వై లెన్స్’ నిర్వహించారు. దీని ప్రకారం కృష్ణా జిల్లా వ్యాప్తంగా 20 శాతం మందికి కరోనా సోకిన విషయం కానీ తగ్గిపోయిన విషయం కానీ తెలియదు.

విజయవాడ అర్బన్ లో 378 మందికి కరోనా యాంటీ బాడీలు ఉన్నట్లు గుర్తించారు. వీరికి కరోనా వచ్చింది తగ్గిపోయింది కూడా. అలాగే రాణిగారితోటలో 29 లంబాడిపేటలో 18 రామలింగేశ్వరనగర్లో 18 దుర్గాపురంలో 17 మధురానగర్లో 20 గిరిపురంలో 18 ఎన్టీఆర్ కాలనీ 16 ఆర్ఆర్ పేట 16 లబ్బీపేట 4 పటమటలోని 5 మందిలో కరోనా యాంటీ బాడీలు వృద్ది చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అలాగే గ్రామీణ ప్రాంతాలైన కానూరులో 8 మందికి గొల్లమూడిలో 14 మందికి చిన్న ఓగిరాలలో 15 గొల్లపల్లిలో 9 మందికి యాంటీ బాడీలు ఉన్నట్లు వైద్యులు చేసిన నిర్దారణ పరీక్షల్లో గుర్తించారు. విజయవాడలోని వివిధ ప్రాంతాల్లో మే నెలాఖరు వరకు నమోదైన కరోనా కేసులను పరిగణనలోకి తీసుకుని ఈ పరీక్షలు చేసినట్లు తెలిపారు. కాగా ఇదే విధంగా తమకి కరోనా సోకిన విషయం తెలియకుండానే. కరోనా సోకి తగ్గిపోయిన వారు ఢిల్లీలో 23 శాతం ఉండగా మహారాష్ట్రలోని ఓ మురికివాడలో 43 శాతం ఉందని సిరోస్ సర్వైలెన్స్ విశ్లేషణలో వెల్లడైంది.