సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దగ్గరలో పేలుడు

0

తెలంగాణ రాజధాని నగరం నడిబొడ్డున హైదరాబాద్ లో పేలుడు కలకలం రేపింది. హైదరాబాద్ లో శనివారం జగద్గిరిగుట్ట దగ్గర పేలుడు ఘటన కలవరం రేపితే.. ఇవాళ సికింద్రాబాద్ దగ్గర పేలుడు నగర వాసులను కంగారు పెట్టించింది.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 31 బస్ స్టాప్ దగ్గరలోని ముత్యాలమ్మ టెంపుల్ ముందు చెత్తా డబ్బాలో ఉన్న కెమికల్ డబ్బా భారీ శబ్ధంతో పేలింది.

ఈ పేలుడులో చెత్త ఏరుకునే రాజు అనే వృద్ధుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని హుటాహుటిన 108లో ఆస్పత్రికి తరలించారు.

సంఘటనా స్థలానికి పోలీసులు బాంబు స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ చర్య ఉగ్రకోణం కాదని.. కెమికల్స్ వల్ల జరిగిన ప్రమాదమని.. కంగారు పడాల్సిన అవసరం లేదని పోలీసులు భావిస్తున్నారు.