Templates by BIGtheme NET
Home >> Telugu News >> ఐపీఎల్ 2020 : ‘థీమ్’ సాంగ్ పై కాపీ రచ్చ !

ఐపీఎల్ 2020 : ‘థీమ్’ సాంగ్ పై కాపీ రచ్చ !


కరోనా మహమ్మారి కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్-13వ సీజన్ అసలు ఈ ఏడాది ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఇండియా లో కరోనా కారణంగా ఈ సీజన్ ను యూఏఈ లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసేసింది బీసీసీఐ. ఇప్పటికే షెడ్యూల్ను కూడా విడుదల చేశారు. సెప్టెంబర్ 19న డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరగబోతుంది. ఎన్నో ఒడిదొడుకులను దాటి కరోనా కష్టకాలంలో బీసీసీఐ ఈ టోర్నీ నిర్వహిస్తుండడంతో ఐపీఎల్ ఫాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా కరోనాపై పోరాటం చేస్తూ ఈ టోర్నీ మళ్లీ భారత్లోనే నిర్వహించబడుతుందనే ఆత్మవిశ్వాసంతో నిండిన ఓ థీమ్ సాంగ్ను ఇటీవల ఐపీఎల్ విడుదల చేసింది.

ఈ పాటకు క్రికెట్ అభిమానుల నుంచి విశేష స్పందన వస్తుండగా.. ముఖాలకు మాస్కులు ఒకరికొకరు దూరం శానిటైజర్లు రుద్దుకోవడం వంటి అంశాలు అన్ని ఆ పాటలో ఉన్నాయి.

“ఆయేంగే హమ్ వాపస్” అనే లిరిక్స్తో సాగిన ఈ పాట ఆద్యంతం క్రికెట్ అభిమానులను అలరిస్తోంది. ఇకపోతే తన పాటను కాపీ చేసి దీనిని రూపొందించారని ర్యాపర్ కృష్ణ కౌల్ ఆరోపించారు. ‘దేఖ్ కౌన్ ఆయా’ వాపస్కు ఇది నకలుగా ఉందని తెలిపారు. ఈ పాటను తాను 2017లో రూపొందించానని తెలిపాడు. కాగా అతడి ఆరోపణలను ఐపీఎల్ గీతం రూపకర్త ప్రణవ్ అజయ్ రావ్ మాల్ప్ ఖండించారు. ఈ పాటను స్వయంగా రూపొందించానని.. ఎవరికి పాటను కాపీ చేయలేదన్నారు. నేను నా జట్టు ఎంతో కష్టపడి దీనిని రూపొందించామన్నారు. ఎంసీఏఐ ధ్రువప్రతం సైతం మంజూరు చేసిందని తెలిపారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం #IPLAnthemCopied అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుండడం గమనార్హం. ఈ నెల 19న అంటే మరో 9 రోజుల్లో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ మధ్య అబుదాబిలో జరిగే తొలి మ్యాచ్ తో ధనాధన్ లీగ్ కు తెరలేవనుంది. మూడు వేదికల్లో కలిపి లీగ్ దశలో మొత్తం 56 మ్యాచ్లు జరగనున్నాయి. ఎక్కడ ఎన్ని మ్యాచ్లు నిర్వహించాలో బీసీసీఐ ఇప్పటికే ప్లాన్ చేసింది