బావా .. నువ్వు తప్పకుండా అందరి కంటే త్వరగా కోలుకుంటావు : మంత్రి కేటీఆర్

0

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. శనివారం ట్విటర్ వేదికగా ఆయన స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. కొద్ది రోజులుగా తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని హోం క్వారంటైన్ లో ఉండాలని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు ట్విటర్ వేదికగా ఆకాంక్షించారు. ఈ క్రమంలో హరీశ్ రావు ట్వీట్పై పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ట్విట్టర్ ద్వారా స్పందించారు.

‘బావా తొందరగా కోలుకో.. నువ్వు ఇతరులకంటే త్వరగా కోలుకుంటావనే నమ్మకం నాకుంది’ అంటూ ట్వీట్ చేశారు. మంత్రి హరీశ్ కోలుకోవాలంటూ కేటీఆర్ వరస పెట్టి ఇలా ట్వీట్ చేయడం చూసి అందరూ మురిసిపోతున్నారు. అంతేకాక టీఆర్ఎస్ నాయకురాలు మాజీ ఎంపీ కవిత కూడా ట్విటర్ వేదికగా స్పందించారు. ‘బావా .. మా ప్రార్థనలన్నీ మీ కోసమే. మీ సంకల్ప బలంతో కరోనాను ఓడించాలి’ అని ట్వీట్ చేశారు. ఇకపోతే సోమవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతోన్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులందరికీ కరోనా పరీక్షలు చేస్తున్నారు. ఆ పరీక్షల్లోనే మంత్రి హరీశ్కు పాజిటివ్గా తేలింది