మనిషి లైంగిక చర్య ద్వారా పొందే సుఖం దైవికమైనది: పోప్

0

పోప్ ఫ్రాన్సిస్.. ఈయన క్రైస్తవ మత పెద్ద. ప్రపంచంలోనే వారికి ఆరాధ్య గురువు. ఇటలీలో ఉండే ఈయన చెప్పిందే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు పాటిస్తున్నారు. అలాంటి ఆధ్యాత్మిక గురువు నుంచి తాజాగా ఓ హాట్ కామెంట్ వచ్చింది. దైవత్వంలోనూ లైంగిక సుఖం ఉందన్న ఆయన మాటలు ప్రపంచవ్యాప్తంగా సంచలనమయ్యాయి.

తాజాగా క్రైస్తవ మత గురువు పోప్ ప్రాన్సిస్ ఇంటర్వ్యూల్లో మాట్లాడారు. ఇటలీకి చెందిన రచయిత కొర్లో పెట్రెనీ ఓ బుక్ రూపంలో ఆయన బోధనల సారాన్ని తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా మనిషి లైంగిక చర్య ద్వారా పొందే సుఖం దైవికమైనదని పోప్ ప్రాన్సిస్ అన్నారు. ఇష్టమైన ఆహారాన్ని కడుపునిండా తినడం ద్వారా ప్రియమైన వ్యక్తితో శారీరక కలయిక ద్వారా సుఖ సంతోషాలు అనుభవించడం పాపం కాదని.. దైవికమైనది పోప్ అన్నట్లు ఆ పుస్తకాల్లో కార్లో రాశాడు.

అంటే లైంగిక సుఖం కూడా దైవకార్యమేనని పోప్ అన్నట్టు ఆ పుస్తకాన్ని బట్టి తెలుస్తోంది. ఇన్నాళ్లు దీన్ని చెప్పడానికే భయపడే వారంతా ఇప్పుడు పోప్ నోటివెంట కూడా రావడంతో ఈ చర్చ ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.