ట్రాక్టర్ పై సోఫా: విలేకరి చెంపు చెళ్లుమనేలా రాహుల్ సమాధానం

0

ఇటీవలే యూపీలోని రైతుల సమస్యలపై పోరాడారు రాహుల్ గాంధీ. ఆ రాష్ట్రంలో ఓ ట్రాక్టర్ పై కూర్చొని రైతులతో కలిసి ప్రయాణించారు. అయితే ఆయన కూర్చున్న ట్రాక్టర్ పై అభిమానులు సోఫా ఏర్పాటు చేశారు. దాన్ని మీడియా క్లిక్ మనిపించడంతో వైరల్ అయ్యింది. బీజేపీ శ్రేణులు.. నేతలు.. రాహుల్ ‘ట్రాక్టర్ సోఫా’లో కూర్చొని ఉద్దరిస్తాడా అంటూ ఆడిపోసుకున్నాయి.

అయితే తాజాగా రాహుల్ గాంధీ పాల్గొన్న విలేకరుల సమావేశంలోనూ ఓ అత్యుత్సాహ వంతుడైన విలేకరి ఇదే విషయంపై రాహుల్ గాంధీని కాస్త వెటకారంగానే అడిగేశారు. రైతుల నిరసనలో సోఫాలో కూర్చోవడం ఏంటి సార్ అంటూ దెప్పిపొడిచారు.

అయితే రాహుల్ సమాధానం విని ఆ విలేకరి నోటా మాట రాలేదు. ముఖంపై నెత్తురు చుక్కలేకుండా రాహుల్ గట్టి పంచ్ ఇచ్చేశాడు.

ప్రధాని మోడీ తన విదేశీ పర్యటనల కోసం ప్రజాధనం 8400 కోట్లు వెచ్చించి అమెరికా నుంచి లగ్జరీ విమానాలు రెండు కొన్నాడని.. దాని గురించి మీరెప్పుడైనా ఆయన్ని అడుగుతున్నారా అని విలేకరిని సూటిగా ప్రకటించారు. ట్రాక్టర్ లో మెత్తటి సీటు ఉంటే ప్రశ్నిస్తారు? మోడీ విలాసాలపై ఎందుకు ప్రశ్నించరు.. అంటూ ఘాటుగా ఎదురు ప్రశ్న వేశాడు.

ఈ సమాధానం ఆ విలేకరిని చాచికొట్టినట్టైంది. రాహుల్ గాంధీలో పరిణతి వచ్చిందని.. ఆయన మునుపటి కంటే వాడి వేడిగా తయారయ్యాడని ఈ విలేకరుల సమావేశం చూస్తే అందరికీ అర్థమైంది.