ప్రశాంత్ భూషణ్ కు రూ.1 జరిమానా విధించిన సుప్రీం కోర్టు !

0

ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కు కోర్టు ధిక్కరణ కేసులో శిక్ష ఖరారు చేసారు. ఆయనకి న్యాయస్థానం 1 రూపాయి జరిమానా విధించింది. సెప్టెంబరు 15లోగా ఈ జరిమానాను కట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేశారు. ఒక్కవేల కోర్టు గడువులోపు జరిమానా చెల్లించకపోతే ఆయన ప్రాక్టీస్పై మూడేళ్ల నిషేధంతో పాటు మూడు నెలలపాటు జైలుశిక్ష విధించనున్న ధర్మాసనం. కాగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడం తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పడంపై ప్రశాంత్ భూషణ్ తిరస్కరించారు.

కాగా ఈ ఏడాది జూన్ 27 మరియు 29 తేదీల్లో సీజేఐ ఎస్ ఏ బాబ్డేతో పాటు నలుగురు గత సీజేఐలపై ఆయన వివాదాస్పద ట్వీట్లు చేశారు. ఈ మేరకు ప్రశాంత్ భూషణ్ చేసిన ‘ధిక్కార మరియు పరువు నష్టం’ వ్యాఖ్యలను సోషల్ మీడియా ట్వీట్లను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. క్షమాపణలు కోరాలని సైతం ప్రశాంత్ భూషణ్ కు అవకాశమిచ్చింది. ఈ కేసులో జస్టిస్ అరుణ్ మిశ్రా జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ కృష్ణ మురారీలతో కూడి త్రిసభ్య ధర్మాసనం వాదనలు వింది. తనకు రాజ్యాంగం ఇచ్చిన భావప్రకటనా స్వేచ్ఛను వినియోగించుకుని అభిప్రాయాలను వ్యక్తం చేశానని ప్రశాంత్ భూషణ్ చెప్పుకొచ్చారు. అయితే ఆయన ఇచ్చిన వివరణపై సుప్రీంకోర్టు సంతృప్తి చెందలేదు.