అదా శర్మ.. ఏమిటీ సెగలు?

0

అదా కి అదా ట్విట్టర్ .. ఇన్ స్టా ట్రీట్ గురించి చెప్పాల్సిన పనే లేదు. కొంటె అదా కి అతి తక్కువ కాలంలో వీరలెవల్ ఫాలోయింగ్ పెరిగిందంటే అందుకు ఎంతగా కృషి చేస్తోందో తెలుసా?

ఇదిగో లేటెస్ట్ ఫోటోషూట్ అందుకు ఎగ్జాంపుల్. ఇది మాల్దీవుల్లో కాదు మహారాణిపురంలో అని క్లారిటీ ఇచ్చేసింది ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా! అక్కడినుంచి ఫోటోషూట్ ని షేర్ చేసింది. మెడలో పూలతో అలంకరించిన ప్రత్యేక ఫోటోషూట్ నుంచి రకరకాల ఫోటోల్ని కూడా రివీల్ చేసింది ఈ భామ. అవన్నీ వైరల్ గా మారాయి.

లాక్ డౌన్ తర్వాత విశ్రాంతి కోసం చాలా మంది టాలీవుడ్ బాలీవుడ్ ప్రముఖులు ఇటీవల మాల్దీవులకు వెళుతున్నారు. మహమ్మారి చింతల నుండి తప్పించుకోవడానికి సమంతా అక్కినేని- నాగ చైతన్య- ప్రణీత సుభాష్- మెహ్రీన్ పిర్జాద- కాజల్ అగర్వాల్- తాప్సీ- మలైకా- ఎల్లీ అవ్ రామ్ వంటి తారలు ఈ ద్వీపానికి వెళ్లారు.

అదా శర్మ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించింది. తనను తాను గుంపు నుండి వేరుచేసి ఇంటికి దగ్గరగా ఉన్న మహారాజాపురానికి వెళ్లిందట. ప్రకృతిలో కొంత నిశ్శబ్ద సమయాన్ని ఆస్వాధిస్తున్న వీడియోను పంచుకున్న ఆమె “మహారాజాపురం ఇది మాల్దీవులు కాదు. మేము ఇక్కడకు ఎలా చేరుకున్నామని అడగవద్దు! ఇంతకు ముందు ఎవరూ ఇక్కడ కాలు పెట్టలేదు. నేను డ్రోన్ షాట్ కోసం ఇక్కడకు వెళ్ళడం నా అదృష్టం … పర్వతం పైకి“ అంటూ వీడియోని చూపించింది. అక్కడ ఒక సరస్సు పచ్చని కొండల దృశ్యాన్ని ఆస్వాదిస్తోంది అదా. అక్కడ అందమైన వాతావరణం పచ్చదనాన్ని ఆస్వాదించడాన్ని కూడా చూడవచ్చు.

ప్రశాంత్ వర్మ కల్కిలో నటించిన తరువాత అదా మరో రెండు చిత్రాలకు సంతకాలు చేసింది. విప్రా అని పిలిచే దర్శకద్వయం తెరకెక్కిస్తున్న `క్వశ్చన్ మార్క్` అనే థ్రిల్లర్ లో నటిస్తోంది. ఈ చిత్రం నుండి నటి ఫస్ట్ లుక్ విడుదలైంది. తన పాత్రను రక్తపాతం గాయాలతో చూపించారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Adah Sharma (@adah_ki_adah)