Templates by BIGtheme NET
Home >> Cinema News >> RRR అప్డేట్: ‘సీత’ ఫస్ట్ లుక్ వచ్చేస్తోంది..!

RRR అప్డేట్: ‘సీత’ ఫస్ట్ లుక్ వచ్చేస్తోంది..!


బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ”ఆర్.ఆర్.ఆర్” సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న చరణ్ కు జోడీగా అలియా కనిపించనుంది. ఈ మధ్య రెగ్యులర్ ఏదో ఒక అప్డేట్ ఇస్తూ వస్తున్న ఆర్.ఆర్.ఆర్ టీమ్.. ఇప్పుడు అలియా ఫస్ట్ లుక్ ని రెడీ చేస్తోంది.

మార్చి 15న అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు ఉదయం 11 గంటలకు ‘ఆర్.ఆర్.ఆర్’లో ‘సీత’ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన హీరోల ఇంట్రో వీడియోలు. మరియు కొమరం భీమ్ జోడీ ఒలీవియా మోరిస్ ఫస్ట్ లుక్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో వస్తున్న అలియా లుక్ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

కాగా ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా మూవీగా వివిధ భాషల్లో రూపొందుతున్న ‘ఆర్.ఆర్.ఆర్’ పై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ – నేషనల్ అవార్డ్ గ్రహీత సముద్రఖని – శ్రీయా శరణ్ – హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్ సన్ – అలిసన్ డూడీ తదితరులు ఇతర ప్రధాన ప్రాతల్లో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.