Templates by BIGtheme NET
Home >> Cinema News >> ప్రెగ్నెంట్ అయినా దాన్ని వదలని హీరోయిన్

ప్రెగ్నెంట్ అయినా దాన్ని వదలని హీరోయిన్


హీరోయిన్స్ తిండి విషయంలో తమకు తాము చాలా కండీషన్స్ పెట్టుకుంటారు. ఆహారం ఎక్కువ తీసుకుంటే బరువు పెరగడంతో పాటు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయనే ఉద్దేశ్యంతో చాలా మంది కూడా నోరు కట్టేసుకుని ఉంటారు. హీరోయిన్ గా ఫాల్ లో ఉన్న సమయంలోనే కాకుండా ఆ తర్వాత కూడా ఫిజిక్ ను మెయింటెన్ చేసేందుకు తక్కువ తింటున్న హీరోయిన్స్ చాలా మంది ఉంటారు. హీరోయిన్ అనిత నటనకు దూరంగా ఉంటున్నా కూడా ఆహారం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నానని రోడ్డు సైడ్ ఫుడ్ తినడం చేయడం మానేసినట్లుగా చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం అనిత ప్రెగ్నెంట్ అనే విషయం తెల్సిందే. ఆమె గర్బిణిగా ఉన్న విషయాన్ని ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఈ సమయంలో కూడా తాను పానీ పూరి తినకుండా మాత్రం ఉండలేక పోతున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో బయట ఫుడ్ తినకూడదు కనుక తప్పనిసరి పరిస్థితుల్లో పానీపూరిని ఇంట్లోనే తయారు చేసుకుని మరీ తింటున్నట్లుగా అనిత చెప్పుకొచ్చింది. పాని పూరి ఈ సమయంలో తినకూడదన్నా కూడా నాకు మాత్రం దాన్ని వదలాలని లేదు అంది. నువ్వు నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఉదయ్ కిరణ్ తో కలిసి నటించి పరిచయం అయిన ఈ అమ్మడు ఆ తర్వాత పలు సినిమాల్లో కనిపించి మెప్పించింది. అయితే ఆశించిన స్థాయిలో సక్సెస్ లు రాకపోవడంతో కెరీర్ లో త్వరగానే కనిపించకుండా పోయింది. ఇతర భాషల్లో ఏదో ఒక మార్గంలో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. కాని అక్కడ కూడా ఆశించిన స్థాయిలో బ్రేక్ మాత్రం రావడం లేదు.