Templates by BIGtheme NET
Home >> Cinema News >> బిబి స్టేజీపై మళ్లీ కనిపించేందుకు ఎన్టీఆర్ ఒప్పుకున్నాడా?

బిబి స్టేజీపై మళ్లీ కనిపించేందుకు ఎన్టీఆర్ ఒప్పుకున్నాడా?


తెలుగు బిగ్ బాస్ మొదటి సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెల్సిందే. ఎన్టీఆర్ తర్వాత రెండవ సీజన్ కు నాని హోస్టింగ్ చేశాడు. మూడు మరియు నాల్గవ సీజన్ లకు నాగార్జున హోస్టింగ్ చేశాడు. మూడవ సీజన్ ఫినాలే ఎపిసోడ్ కు చిరంజీవిని నాగార్జున గెస్ట్ గా వచ్చాడు. ఈ సీజన్ ఫినాలే గెస్ట్ విషయంలో గత కొన్ని రోజులుగా చర్చనీయాంశం అవుతుంది. పలువురు స్టార్స్ ను ఫినాలే ఎపిసోడ్ కోసం సంప్రదించారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు ఎవరు అనే విషయంలో మాత్రం స్పష్టత రాలేదు.

డిసెంబర్ 20న ఫినాలే ఎపిసోడ్ ఉంటుంది. అప్పటి వరకు ఎవరు అందుబాటులో ఉంటారు అనేది చూడాల్సి ఉంది. అలాగే నాగార్జునకు సన్నిహితులు అయిన వారు కూడా ఆ ఎపిసోడ్ లో పాల్గొనే అవకాశం ఉంది. బిగ్ బాస్ మొదటి సీజన్ కు హోస్టింగ్ చేసిన ఎన్టీఆర్ ను తీసుకు వస్తేనే ఫైనల్ ఎపిసోడ్ కు మంచి రేటింగ్ వస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అందుకే నాగార్జున ద్వారా ఎన్టీఆర్ ను బిగ్ బాస్ టీం సంప్రదించారనే వార్తలు వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ను బట్టి ఎన్టీఆర్ ఆ రోజు షో కు హాజరు అయ్యేది లేనిది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇటీవలే ఆర్ఆర్ఆర్ మహాబలేశ్వరం షెడ్యూల్ ను పూర్తి చేసుకుని వచ్చిన టీం ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నారు. ఎన్టీఆర్ మళ్లీ అప్పటి వరకు బిజీ అయ్యేనా లేదంటే ఖాళీగానే ఉంటాడా అనే విషయంలో క్లారిటీ లేదు. ఒక వేళ ఎన్టీఆర్ ఖాళీగా ఉంటే ఖచ్చితంగా నాగార్జున కోసం వస్తాడనే నమ్మకం వ్యక్తం అవుతుంది.