Home / REVIEWS / కల్కి 2898 AD సమీక్ష

కల్కి 2898 AD సమీక్ష

చిత్రం : కల్కి 2898 AD

నటీనటులు: ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్, పశుపతి అన్నా బెన్ తదితరులు.

దర్శకుడు: నాగ్ అశ్విన్

నిర్మాత : అశ్వనీ దత్

సంగీత దర్శకుడు: సంతోష్ నారాయణన్

సినిమాటోగ్రఫీ: జోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్

ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు

విడుదల తేదీ : జూన్ 27, 2024

ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కల్కి 2898 ఏడీ’. భారతీయ సినీ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం ఈ రోజు భారీ అంచనాల మధ్య భారీ స్థాయిలో రిలీజ్ అయింది.

కథ :

భవిష్యత్‌ లో ప్రపంచమంతా వనరులను కోల్పోయిన నిర్జీవమైన దశలో కాశీ పట్టణం ఒక్కటి మాత్రమే ఉంటుంది. అక్కడ సుప్రీం యాస్కిన్‌ (కమల్‌హాసన్‌) కాంప్లెక్స్‌ అనే వండర్ ఫుల్ లోకాన్ని క్రియేట్ చేసుకుని ఆ ప్రాంతాన్ని లీడ్ చేస్తాడు. కాంప్లెక్స్‌ కింద భూమి మీద ప్రజలు కష్ట పడుతూ బాధలతో బతుకుతూ ఉంటారు. దీంతో అక్కడే ఉండే భైరవ (ప్రభాస్)కి కాంప్లెక్స్‌ లోకి వెళ్లి బతకాలని బలమైన కోరిక ఉంటుంది. దానికోసం భైరవ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో మళ్లీ 6000 వేల సంవత్సరాల తర్వాత కల్కి (దేవుడు) రాబోతున్నాడని సుప్రీం యాస్కిన్‌ మనుషులకు అర్ధం అవుతుంది. దీంతో సుమతి (దీపికా పదుకొనే) కడుపులోని దేవుడ్ని కాపాడటానికి అశ్వత్థామ (అమితాబ్‌ బచ్చన్‌) వస్తాడు. దానికి భైరవ అడ్డు పడుతూ ఉంటాడు. మరి ఈ క్రమంలో జరిగిన సంఘటనలు ఏమిటి ?, అసలు భైరవ ఎవరు ?, ఇంతకీ, సుప్రీం యాస్కిన్‌ మోటివ్ ఏమిటి ?, చివరకి సుమతిని అశ్వత్థామ సేవ్ చేశాడా? లేదా ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్రం పురాణాలను భవిష్యత్‌ను కలుపుతూ అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించబడటం, అలాగే ప్రభాస్, అమితాబ్ తో పాటు మిగిలిన అగ్ర నటీనటుల నటన, అద్భుతమైన విజువల్స్, అత్యాధునిక వీఎఫ్‌ఎక్స్‌ మరియు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ వంటి అంశాలు ఈ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. అశ్వత్థామగా అమితాబ్‌ బచ్చన్‌, సుప్రీం యాస్కిన్‌గా కమల్‌హాసన్‌ తమ పాత్రల్లో జీవించారు. దాదాపు 40ఏళ్ల విరామం తర్వాత వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో కనిపించడం ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్. ముఖ్యంగా కమల్‌ హాసన్‌ సుప్రీం యాస్కిన్‌ పాత్ర లుక్‌ చాలా బాగుంది. అదేవిధంగా 81 సంవత్సరాల వయసులో కూడా అశ్వత్థామ పాత్రలో అమితాబ్‌ తన యాక్షన్ తో అదరగొట్టారు.

ఇక భైరవ పాత్రలోని షేడ్స్ ను ప్రభాస్ చాలా బాగా పలికించాడు. ప్రభాస్ – అమితాబ్ మధ్య సాగే యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. తన పాత్రకు ప్రభాస్ ప్రాణం పోశారు. మొత్తానికి ప్రభాస్ తన లుక్స్ అండ్ యాక్షన్ తో ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాడు. దీపికా పదుకొనేకి చాలా మంచి పాత్ర దొరికింది. ఆమె భగవంతుడ్ని కనే అమ్మగా అలరించింది. నటి శోభన తన పాత్రలో మెరిశారు. మరో కీలక పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కూడా చాలా బాగా నటించాడు. అలాగే, దిశా పటానీ, పశుపతి, అన్నా బెన్ లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

ఈ ‘కల్కి’ కథ మూడు ప్రపంచాల మధ్య సాగుతుంది. పైగా భవిష్యత్‌ లో ప్రపంచమంతా వనరులను కోల్పోయిన నిర్జీవమైన దశలో కాశీ పట్టణాన్ని చూపించిన విధానం కూడా చాలా ఆలోచనాత్మకంగా ఉంది. అదే విధంగా సర్వమత శరణార్థులు ఉండే ప్రాంతంగా శంబాలను చూపించిన విధానం కూడా చాలా బాగుంది. ఇక అన్ని వనరులు కలిగి ఆకాశంలో కిలోమీటర మేర ఉండేలా కాంప్లెక్స్‌ను వండర్ ఫుల్ గా డిజైన్‌ చేశారు. మొత్తానికి గుడ్ క్లైమాక్స్ తో పాటు ప్రతి నేపథ్యాన్ని, ప్రతి పాత్రను దర్శకుడు నాగ్ అశ్విన్ చాలా బాగా తీర్చిదిద్దారు.

మైనస్ పాయింట్స్ :

‘కల్కి 2898 ఏడీ’ కథా నేపథ్యంలో డెప్త్ ఉన్నా.. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు స్లాగా సాగుతాయి. అలాగే మెయిన్ ప్లాట్ లోని మెయిన్ క్యారెక్టర్స్ మధ్య ప్రధాన కాన్ ఫ్లిక్ట్ ను ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేయాల్సింది. అలాగే కొన్ని ఇన్సిడెంట్స్ మరీ సినిమాటిక్ గా అనిపిస్తాయి. శంబాల రెబల్స్ రేపటి కోసం చేస్తున్న యుద్ధంలోని ఎమోషన్స్ ను ఇంకా బలంగా చూపించి ఉంటే బాగుండేది. అదేవిధంగా భైరవ పాత్రను క్లైమాక్స్ లో చూపించిన విధంగా ఫస్ట్ హాఫ్ లో కూడా కొన్ని ఎలివేషన్స్ పెట్టి ఉంటే బాగుండేది.

సాంకేతిక విభాగం :

టెక్నికల్ గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. సంతోష్ నారాయణన్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. అదే విధంగా జోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్ సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం చాలా బాగుంది. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాత అశ్వనీ దత్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు నాగ్ అశ్విన్ తన రచనతోనూ దర్శకత్వంతోనూ ఆకట్టుకున్నారు.

%

చిత్రం : కల్కి 2898 AD నటీనటులు: ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్, పశుపతి అన్నా బెన్ తదితరులు. దర్శకుడు: నాగ్ అశ్విన్ నిర్మాత : అశ్వనీ దత్ సంగీత దర్శకుడు: సంతోష్ నారాయణన్ సినిమాటోగ్రఫీ: జోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్ ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు విడుదల తేదీ : జూన్ 27, 2024 ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కల్కి 2898 ఏడీ’. భారతీయ సినీ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం ఈ రోజు భారీ అంచనాల మధ్య భారీ స్థాయిలో రిలీజ్ అయింది. కథ : భవిష్యత్‌ లో ప్రపంచమంతా వనరులను కోల్పోయిన నిర్జీవమైన దశలో కాశీ పట్టణం ఒక్కటి మాత్రమే ఉంటుంది. అక్కడ సుప్రీం యాస్కిన్‌ (కమల్‌హాసన్‌) కాంప్లెక్స్‌ అనే వండర్ ఫుల్ లోకాన్ని క్రియేట్ చేసుకుని ఆ ప్రాంతాన్ని లీడ్ చేస్తాడు. కాంప్లెక్స్‌ కింద భూమి మీద ప్రజలు కష్ట పడుతూ బాధలతో బతుకుతూ ఉంటారు. దీంతో అక్కడే ఉండే భైరవ (ప్రభాస్)కి కాంప్లెక్స్‌ లోకి వెళ్లి బతకాలని బలమైన కోరిక ఉంటుంది. దానికోసం భైరవ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో మళ్లీ 6000 వేల సంవత్సరాల తర్వాత కల్కి (దేవుడు) రాబోతున్నాడని సుప్రీం యాస్కిన్‌ మనుషులకు అర్ధం అవుతుంది. దీంతో సుమతి (దీపికా పదుకొనే) కడుపులోని దేవుడ్ని కాపాడటానికి అశ్వత్థామ (అమితాబ్‌ బచ్చన్‌) వస్తాడు. దానికి భైరవ అడ్డు పడుతూ ఉంటాడు. మరి ఈ క్రమంలో జరిగిన సంఘటనలు ఏమిటి ?, అసలు భైరవ ఎవరు ?, ఇంతకీ, సుప్రీం యాస్కిన్‌ మోటివ్ ఏమిటి ?, చివరకి సుమతిని అశ్వత్థామ సేవ్ చేశాడా? లేదా ? అనేది మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్ : ఈ చిత్రం పురాణాలను భవిష్యత్‌ను కలుపుతూ అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించబడటం, అలాగే ప్రభాస్, అమితాబ్ తో పాటు మిగిలిన అగ్ర నటీనటుల నటన, అద్భుతమైన విజువల్స్, అత్యాధునిక వీఎఫ్‌ఎక్స్‌ మరియు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ వంటి అంశాలు ఈ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. అశ్వత్థామగా అమితాబ్‌ బచ్చన్‌, సుప్రీం యాస్కిన్‌గా కమల్‌హాసన్‌ తమ పాత్రల్లో జీవించారు. దాదాపు 40ఏళ్ల విరామం తర్వాత వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో కనిపించడం ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్. ముఖ్యంగా కమల్‌ హాసన్‌ సుప్రీం యాస్కిన్‌ పాత్ర లుక్‌ చాలా బాగుంది. అదేవిధంగా 81 సంవత్సరాల వయసులో కూడా అశ్వత్థామ పాత్రలో అమితాబ్‌ తన యాక్షన్ తో అదరగొట్టారు. ఇక భైరవ పాత్రలోని షేడ్స్ ను ప్రభాస్ చాలా బాగా పలికించాడు. ప్రభాస్ – అమితాబ్ మధ్య సాగే యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. తన పాత్రకు ప్రభాస్ ప్రాణం పోశారు. మొత్తానికి ప్రభాస్ తన లుక్స్ అండ్ యాక్షన్ తో ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాడు. దీపికా పదుకొనేకి చాలా మంచి పాత్ర దొరికింది. ఆమె భగవంతుడ్ని కనే అమ్మగా అలరించింది. నటి శోభన తన పాత్రలో మెరిశారు. మరో కీలక పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కూడా చాలా బాగా నటించాడు. అలాగే, దిశా పటానీ, పశుపతి, అన్నా బెన్ లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఈ ‘కల్కి’ కథ మూడు ప్రపంచాల మధ్య సాగుతుంది. పైగా భవిష్యత్‌ లో ప్రపంచమంతా వనరులను కోల్పోయిన నిర్జీవమైన దశలో కాశీ పట్టణాన్ని చూపించిన విధానం కూడా చాలా ఆలోచనాత్మకంగా ఉంది. అదే విధంగా సర్వమత శరణార్థులు ఉండే ప్రాంతంగా శంబాలను చూపించిన విధానం కూడా చాలా బాగుంది. ఇక అన్ని వనరులు కలిగి ఆకాశంలో కిలోమీటర మేర ఉండేలా కాంప్లెక్స్‌ను వండర్ ఫుల్ గా డిజైన్‌ చేశారు. మొత్తానికి గుడ్ క్లైమాక్స్ తో పాటు ప్రతి నేపథ్యాన్ని, ప్రతి పాత్రను దర్శకుడు నాగ్ అశ్విన్ చాలా బాగా తీర్చిదిద్దారు. మైనస్ పాయింట్స్ : ‘కల్కి 2898 ఏడీ’ కథా నేపథ్యంలో డెప్త్ ఉన్నా.. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు స్లాగా సాగుతాయి. అలాగే మెయిన్ ప్లాట్ లోని మెయిన్ క్యారెక్టర్స్ మధ్య ప్రధాన కాన్ ఫ్లిక్ట్ ను ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేయాల్సింది. అలాగే కొన్ని ఇన్సిడెంట్స్ మరీ సినిమాటిక్ గా అనిపిస్తాయి. శంబాల రెబల్స్ రేపటి కోసం చేస్తున్న యుద్ధంలోని ఎమోషన్స్ ను ఇంకా బలంగా చూపించి ఉంటే బాగుండేది. అదేవిధంగా భైరవ పాత్రను క్లైమాక్స్ లో చూపించిన విధంగా ఫస్ట్ హాఫ్ లో కూడా కొన్ని ఎలివేషన్స్ పెట్టి ఉంటే బాగుండేది. సాంకేతిక విభాగం : టెక్నికల్ గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. సంతోష్ నారాయణన్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. అదే…

కల్కి 2898 AD సమీక్ష

కథ స్క్రీన్ ప్లే - 4.05
నటీ-నటుల ప్రతిభ - 4.1
సాంకేతిక వర్గం పనితీరు - 4.1
దర్శకత్వ ప్రతిభ - 4.05

4.1

కల్కి 2898 AD సమీక్ష

కల్కి 2898 AD సమీక్ష

User Rating: 2.77 ( 5 votes)
4

Related Images:

చిత్రం : కల్కి 2898 AD నటీనటులు: ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్, పశుపతి అన్నా బెన్ తదితరులు. దర్శకుడు: నాగ్ అశ్విన్ నిర్మాత : అశ్వనీ దత్ సంగీత దర్శకుడు: సంతోష్ నారాయణన్ సినిమాటోగ్రఫీ: జోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్ ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు విడుదల తేదీ : జూన్ 27, 2024 ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కల్కి 2898 ఏడీ’. భారతీయ …

Review Overview

కల్కి 2898 AD సమీక్ష

Summary : కల్కి 2898 AD సమీక్ష

0

SEO Keywords: కల్కి, సమీక్ష, చిత్రం, ad నటీనటులు:, ప్రభాస్,

About TeluguNow .

Reviews, Live Updates, Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets Telugu Movie Review, Telugu Movie Ratings, Telugu News, News in Telugu, AP Politics, Telangana News, Gossips, Telugu Cinema News, Wallpapers, Actress Photos, Actor Photos, Hot Photos,
Scroll To Top