చిత్రం : భగవంత్ కేసరి రివ్యూ
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్, పి. రవిశంకర్, ఆర్. శరత్‌కుమార్
దర్శకుడు : అనిల్ రావిపూడి
నిర్మాతలు: హరీష్ పెద్ది, సాహు గారపాటి
సంగీతం: ఎస్ థమన్
సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్
ఎడిటర్: తమ్మిరాజు
విడుదల తేదీ : అక్టోబరు 19, 2023
ఈ దసరా కానుకగా టాలీవుడ్ నుంచి రిలీజ్ కి వచ్చిన మొట్ట మొదటి చిత్రం “భగవంత్ కేసరి”. నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ హీరోయిన్ గా యంగ్ హీరోయిన్ శ్రీలీల ఇంపార్టెంట్ రోల్ లో దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం సాలిడ్ బజ్ నడుమ అయితే ఇప్పుడు విడుదల అయ్యింది. మరి ఈ చిత్రం అంచనాలు అందుకుందో లేదో సమీక్షలో చూద్దాం రండి.
కథ :
ఇక కథలోకి వస్తే..నేలకొండ భగవంత్ కేసరి(నందమూరి బాలకృష్ణ) తన కూతురు కాని కూతురు విజ్జి విజయలక్ష్మి(శ్రీలీల) ని ఆర్మీలో చేర్చి ఈ ప్రపంచంలో ఒక దృఢమైన మహిళగా నిలపాలి అని తాపత్రయ పడుతూ ఉంటాడు. మరి వీరి లైఫ్ లోకి ప్రపంచంలో నెంబర్ 1 కావాలి అనుకుంటున్న ఓ డ్రగ్ మాఫియా లీడర్ రాహుల్ సాంగ్వి(అర్జున్ రాంపాల్)ఓ క్రైమ్ చేసి వస్తాడు దీనితో తాను విజ్జి ప్రాణాలకు హాని తలపెట్టగా మరి తన ప్రాణానికి ప్రాణం అయ్యిన విజ్జి జోలికి వస్తే భగవంత్ కేసరి ఏం చేశాడు? అసలు భగవంత్ కేసరికి విజ్జి కి సంబంధం ఏంటి? ఆ రాహుల్ సాంగ్వికి భగవంత్ కేసరికి ముందే ఏమన్నా ఫ్లాష్ బ్యాక్ ఉందా లాంటి ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఈ చిత్రంలో మొట్టమొదటిగా ఇంప్రెస్ చేసే అంశాలు ఏమైనా ఉన్నాయంటే అవి ఖచ్చితంగా బాలయ్య సరికొత్త మేకోవర్ మరియు యంగ్ నటి శ్రీలీల ల పాత్రలే అని చెప్పాలి. ఇది వరకు వారిని చాలా పాత్రల్లో మనం చూసి ఉండొచ్చు కానీ భగవంత్ కేసరి లో మాత్రం వీరి పాత్రలు ఆడియెన్స్ కి కొత్తగా వీరి ఇద్దరి నుంచి కూడా ఒక సరికొత్త కోణాన్ని మనకి చూపించినట్టు అనిపిస్తుంది. అలాగే వీరిని ఇలా ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు అనీల్ రావిపూడి సక్సెస్ అయ్యాడు అని చెప్పాలి.
ఇక బాలయ్య ఫ్యాన్స్ సహా మాస్ కి కావాల్సిన మాస్ ఫీస్ట్ అండ్ ట్రీట్మెంట్ అంతా కూడా కొత్తగానే ఉంటుంది. సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు బాగా ఇంప్రెస్ చేస్తాయి. అలాగే తెలంగాణ యాస భాషలో అయితే బాలయ్య తన సరికొత్త నడవడికతో చాలా ఈజ్ గా కేసరి రోల్ ని ఫుల్ చేసారని చెప్పాలి. అలాగే ఎమోషన్స్ ని కూడా బాలయ్య బాగా పండించారు. శ్రీలీల కి తనకి మధ్య పలు ఎమోషన్స్ కానీ తండ్రి కూతుర్లుగా వారి బాండింగ్ ఆన్ స్క్రీన్ పై చూసేందుకు చక్కగా ఉంటుంది.
ఇక వీరితో పాటుగా విలన్ పాత్రలో కనిపించిన హిందీ నటుడు అర్జున్ రాంపాల్ సాలిడ్ విలనిజంతో తన లుక్స్ అండ్ యాటిట్యూడ్ తో ఇంప్రెస్ చేస్తాడు. అలాగే హీరోయిన్ గా కాజల్ తన పాత్ర పరిధి మేరకు డీసెంట్ లుక్స్ అండ్ నటనతో ఆకట్టుకుంటుంది. ఇక ఫైనల్ గా శ్రీలీల అండ్ బాలయ్యపై వచ్చే ఓ క్రేజీ క్లైమాక్స్ సీక్వెన్స్ సాలీడ్ గా ఉంది. అందులో శ్రీలీల నుంచి ఇన్ని రోజులు కేవలం లుక్స్ డాన్స్ వరకే పనికొస్తుంది అనేవాళ్ళకి తనతో ఓ సాలీడ్ యాక్షన్ ఫ్లిక్ కూడా చేయొచ్చు అనే రేంజ్ లో నాచురల్ పెర్ఫార్మన్స్ రాబట్టింది. అలానే దర్శకుడు అనిల్ సమాజంలో ఆడవారి పట్ల డిజైన్ చేసిన ఓ చిన్నపాటి సందేశం కూడా బాగుంది.
మైనస్ పాయింట్స్ :
ఈ చిత్రంలో బాగా డిజప్పాయింట్ చేసే అంశం అసలు ఈ సినిమాలో నడిచే స్టోరీ కానీ పలు సీక్వెన్స్ లు ఎమోషన్స్ ఆల్రెడీ మనం చాలా చిత్రాల్లో చూసినట్టే అనిపిస్తుంది. హీరో ఫ్లాష్ బ్యాక్ శ్రీలీల పై కొన్ని ఎమోషన్స్ చాలా రొటీన్ గా ఉన్నాయి. అలాగే పలు యాక్షన్ సీక్వెన్స్ లలో అయితే కావాలనే పెడతారో ఏమో కానీ అవి కొంచెం ఓవర్ గా అనిపిస్తాయి.
అలాగే హీరోయిన్ కాజల్ రోల్ కి మరీ అంత స్కోప్ లేదు. ఇంకా సినిమా రన్ టైం కూడా పెద్దది దీనితో కొన్ని అనవసర సన్నివేశాలు తగ్గించాల్సింది. అలానే కొన్ని సీక్వెన్స్ లు ఇరికించినట్టు కూడా అనిపించవచ్చు. ఇంకా సినిమాలో లాజిక్స్ కూడా పెద్దగా లేవు. అలానే కొన్ని చోట్ల కామెడీ కూడా అంత వర్కౌట్ కాదు.
సాంకేతిక వర్గం :
ఈ చిత్రంలో షైన్ స్క్రీన్ వారి నిర్మాణ విలువలు అవుట్ స్టాండింగ్ అని చెప్పొచ్చు. చాలా గ్రాండియర్ గా అయితే ఈ చిత్రాన్ని మేకర్స్ తెరకెక్కించారు. ఇక టెక్నీకల్ టీం లో సినిమాకి బ్యాక్ బోన్ థమన్ కోసం చెప్పాల్సిందే. బాలయ్యతో తనకున్న ట్రాక్ రికార్డుని ఈ సినిమాతో మరో లెవెల్ కి తీసుకెళ్లాడు. అలాగే తన సాంగ్స్ కూడా బాగున్నాయి. సి రామ్ ప్రసాద్ విజువల్స్ బాగున్నాయి. కానీ గ్రాఫిక్స్ మాత్రం అసలు బాగలేవు. తమ్మిరాజు ఎడిటింగ్ ఇంకా బెటర్ గా చేయాల్సింది.
ఇక దర్శకుడు అనీల్ రావిపూడి విషయానికి వస్తే..తాను తన గత చిత్రాల కామెడీ ట్రాక్ నుంచి బయటకి వచ్చి చేసిన ఈ కంప్లీట్ మాస్ చిత్రం విషయంలో పర్వాలేదు అనిపించాడు. అక్కడక్కడా పర్వాలేదు కానీ చాలా రొటీన్ ప్లాట్ ని, స్క్రీన్ ప్లే ని నడిపించాడు. చాలా సీన్స్ అండ్ డైలాగ్స్ మనం ముందే చెప్పేసేలానే ఉంటాయి. అయితే రొటీన్ అయినప్పటికీ మాస్ ఆడియెన్స్ కి మెయిన్ గా బాలయ్య ఫ్యాన్స్ కి కావాల్సిన ఎలిమెంట్స్ ని హైలైట్ చేయడంలో తాను సక్సెస్ అయ్యాడు.
తీర్పు :
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “భగవంత్ కేసరి” లో బాలయ్య మరియు శ్రీలీల తమదైన మాస్ రోల్స్ లో కాస్త కొత్తగా కొన్ని ఊహించని ఎలిమెంట్స్ తో అదరగొడతారు. అలాగే సినిమాలో మాస్ యాక్షన్ కానీ బాలయ్య డైలాగులు అవన్నీ ఫ్యాన్స్ కి నచ్చుతాయి. అలానే క్లైమాక్స్ లో శ్రీలీల సర్ప్రైజ్ ప్యాక్ తన ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరచవచ్చు. అయితే రొటీన్ గానే ఉన్న కథాంశం అక్కడక్కడ కొన్ని సీన్స్ పక్కన పెడితే ఈ చిత్రం అన్ని వర్గాల ఆడియెన్స్ ని అలరిస్తుంది.
“భగవంత్ కేసరి”: లైవ్ అప్డేట్స్:
-
సినిమా సుఖాంతం గా ముగిసింది. పూర్తి వివరణాత్మక సమీక్ష కోసం మా వెబ్ సైట్ చూస్తూ ఉండండి.
Date & Time : 03:40 AM October 19, 2023 -
శ్రీలీల ఇప్పుడు తన పవర్ చూపిస్తోంది. ఆ సన్నివేశం చక్కగా వ్రాయబడింది మరియు విజిల్ కి యోగ్యమైనది అని చెప్పాలి
Date & Time : 03:30 AM October 19, 2023 -
బాలయ్య, అర్జున్ రాంపాల్ గ్యాంగ్ మధ్య ఇప్పుడు భారీ నాకౌట్ మ్యాచ్ జరుగుతోంది
Date & Time : 03:20 AM October 19, 2023 -
బాలయ్య నటించిన ఎలివేషన్ సీన్ బాగా ప్రెజెంట్ చేయబడింది
Date & Time : 03:10 AM October 19, 2023 -
శ్రీలీల ఇప్పుడు ఇండియన్ ఆర్మీలో చేరేందుకు కఠోర శిక్షణ తీసుకుంటోంది.
Date & Time : 03:02 AM October 19, 2023 -
బాలయ్య కొంతమంది పిల్లలకు కొన్ని విలువైన జీవిత పాఠాలు చెబుతున్నారు.
Date & Time : 02:52 AM October 19, 2023 -
హైదరాబాద్‌లో బాలకృష్ణకు అర్జున్ రాంపాల్ నుంచి ఘన స్వాగతం లభించింది. ఇప్పుడు కొన్ని కీలక అంశాలు వెల్లడవుతున్నాయి.
Date & Time : 02:44 AM October 19, 2023 -
ఒక మాస్ ఎలివేషన్ సన్నివేశం తర్వాత, అర్జున్ రాంపాల్ కీలకమైన విషయాన్ని వెల్లడించాడు.
Date & Time : 02:34 AM October 19, 2023 -
ఇప్పుడు ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ నడుస్తోంది. బాలకృష్ణ పవర్‌ఫుల్ గెటప్‌లో కనిపించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య చెప్పిన సర్ ప్రైజ్ ప్యాకేజీ ఇదే.
Date & Time : 02:24 AM October 19, 2023 -
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్: ఇప్పటి వరకు సినిమా డీసెంట్ గా ఉంది. బాలకృష్ణ మంచి నటనను కనబరిచారు మరియు శ్రీలీల కూడా తన పాత్రలో బాగుంది. ఫైట్ కంపోజిషన్స్ అంతగా ఆకట్టుకోలేదు. మరి సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 02:10 AM October 19, 2023 -
హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశంతో సినిమా ఇంటర్వెల్ దిశగా సాగుతోంది.
Date & Time : 01:56 AM October 19, 2023 -
బాలయ్య, శ్రీలీల మధ్య విభేదాలు తలెత్తాయి. సినిమా కాస్త సీరియస్‌గా మారింది.
Date & Time : 01:48 AM October 19, 2023 -
రవిశంకర్ మరియు బాలయ్య మధ్య అద్భుత ముఖాముఖి సన్నివేశం జరుగుతోంది.
Date & Time : 01:38 AM October 19, 2023 -
కాజల్ శ్రీలీలకు కౌన్సెలింగ్ ఇస్తుండగా, బాలయ్య, కాజల్ మధ్య కొన్ని ఫన్నీ సీన్స్ జరుగుతున్నాయి.
Date & Time : 01:28 AM October 19, 2023 -
ఇది గణేష్ ఆంథం పాట కి సమయం. బాలకృష్ణ, శ్రీలీల తమ డ్యాన్స్‌తో అదరగొడతున్నారు
Date & Time : 01:18 AM October 19, 2023 -
కాజల్ అగర్వాల్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది. పోలీస్ స్టేషన్‌లో కొన్ని సరదా సన్నివేశాలు జరుగుతున్నాయి.
Date & Time : 01:10 AM October 19, 2023
-
చిన్న ట్విస్ట్ తర్వాత శ్రీలీల, బాలకృష్ణ పోర్షన్స్ మొదలయ్యాయి. ఉయ్యాలో ఉయ్యాలో పాట ఇప్పుడు వస్తోంది.
Date & Time : 01:00 AM October 19, 2023 -
ఇది ఫస్ట్ ఫైట్ కి టైం, బాలయ్య తన పాటలను పాడుతూ గూండాలను ఫైట్ తో అదరగొడుతున్నారు
Date & Time : 12:55 AM October 19, 2023 -
బాలకృష్ణ ఇప్పుడే సింపుల్ గా ఎంట్రీ ఇచ్చారు. శరత్‌కుమార్‌ని జైలర్ గా కనిపిస్తున్నారు
Date & Time : 12:50 AM October 19, 2023
భగవంత్ కేసరి
కథ స్క్రీన్ ప్లే - 0.1625
నటీ-నటుల ప్రతిభ - 0.1875
సాంకేతిక వర్గం పనితీరు - 0.1625
దర్శకత్వ ప్రతిభ - 0.1625
0.2
భగవంత్ కేసరి రివ్యూ
భగవంత్ కేసరి రివ్యూ
Related Images:
Review Overview
కథ స్క్రీన్ ప్లే
నటీ-నటుల ప్రతిభ
సాంకేతిక వర్గం పనితీరు
దర్శకత్వ ప్రతిభ
భగవంత్ కేసరి రివ్యూ
Summary : భగవంత్ కేసరి రివ్యూ
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets

