Templates by BIGtheme NET
Home >> Cinema News >> (అ)తను.. విజయ్ దేవరకొండ కాదు..!

(అ)తను.. విజయ్ దేవరకొండ కాదు..!


మనం వెళ్తూ వెళ్తూ ఎవరినో చూస్తాం.. ఒక్కసారిగా స్టన్ అయిపోతాం. ‘వీరు వారేనా..?’ అని అనుకుంటాం. అదేవిధంగా.. ఒక యాక్టర్ లేదా యాక్ట్రెస్ ను చూస్తాం.. వీళ్లు ఫలానా అనుకుంటాం. కానీ.. తేరిపారా చూశాకగానీ అర్థం కాదు. వారు వేరు.. వీరు వేరు అని! ఇలా తరుచూ చాలా మంది విషయంలో జరుగుతూ ఉంటుంది.

మనకు తెలిసిన ముఖాన్ని మరొకరితో పోల్చుకొని గందరగోళానికి గురికావడం మామూలుగా జరుగుతూనే ఉంటుంది. ఇది సినిమా యాక్టర్ల విషయంలో మరింత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు పైనున్న చిత్రం కూడా అలాగే అనిపిస్తోంది.

ఈ చిత్రంలోని మనిషి జుట్టు.. కళ్లకు పెట్టుకున్న గ్లాసెస్.. ఇంకా డ్రెస్.. ఇవన్నీ రౌడీ హీరో విజయ్ దేవరకొండను పోలినట్టుగా లేవూ..?! చాలా మంది ఏమంటారోగానీ.. ఇటీవల రిలీజైన ‘లైగర్’ ఫస్ట్ లుక్ ను చూసిన వారు మాత్రం ‘అవును.. పోలికలు అలాగే ఉన్నాయి’ అంటారు.

కానీ.. ఇక్కడ ఉన్నది వెరీ బ్యూటీఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. పొడవాటి జుట్టుకు సగం బ్రౌన్ కలర్ డై వేసుకున్న ఈమె.. ఆ హెయిర్ స్టైల్ కూడా ‘లైగర్’ను పోలి ఉంది. సన్ గ్లాసెస్ కూడా విజయ్ దేవరకొండ రెగ్యులర్ గా యూజ్ చేసే స్పెట్స్ ను గుర్తు చేస్తున్నాయి. దీంతో.. ఈ ఫొటోను సడెన్ గా చూసినవారంతా విజయ్ అని పొరబడుతున్నారట.