ప్రియుడితో అవికా సెక్సీ డాన్స్

0

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన చిన్నారి పెళ్లి కూతురు ఫేం అవికా గౌర్ హీరోయిన్ గా ఉయ్యాల జంపాల సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఈ అమ్మడు మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. కాని ఆమద్య ఈ అమ్మడు ఏడాది పాటు కనిపించకుండా పోయింది. బరువు తగ్గి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మళ్లీ బిజీ అవ్వాలని ప్రయత్నించింది. కాని రాజు గారి గది 3 సినిమాతో నిరాశ పర్చింది.

హీరోయిన్గా మళ్లీ కెరీర్లో నిలబడుతాననే నమ్మకం లేకపోవడం వల్లో లేదా మరేంటో కాని ఈ అమ్మడు మిలింద్ చంద్వానీతో ప్రేమలో ఉన్నట్లుగా చెప్పి పెళ్లికి సిద్దం అన్నట్లుగా ప్రకటించింది. సోషల్ మీడియాలో ఇటీవలే ప్రియుడి ఫొటోలను షేర్ చేసిన ఈ అమ్మడు తాజాగా ప్రియుడు మిలింద్ తో కలిసి డాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. వీడియోలో ఈ అమ్మడు రెచ్చి పోయి డాన్స్ చేసింది. మిలింద్ కూడా ఆమెకు సరి జోడి అన్నట్లుగా డాన్స్ లో పోటీ పడ్డాడు. కాని ఆమె సెక్సీ స్టెప్ ల ముందు ఆయన తేలిపోయాడు. ప్రియుడితో అవికా వేసిన సెక్సీ స్టెప్పులు వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Avika Gor (@avikagor)