బిగ్ బాస్ 4 వచ్చేసింది.. ‘మాస్క్ ముఖానికి.. ఎంటర్ టైన్మెంట్‌కి కాదు’..

0

బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 వచ్చేసింది. గత మూడు సీజన్ల కంటే భిన్నంగా.. లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు మన్మథుడు నాగార్జున. వరుసగా రెండోసారి బిగ్ బాస్‌కి హోస్ట్ చేస్తూ ‘మాస్క్ ముఖానికి ఎంటర్‌టైన్మెంట్‌కి కాదు’ అంటూ కరోనా పరిస్థితులకు అనుగుణంగా పర్ఫెక్ట్ డైలాగ్ డెలివరీతో ఫుల్ ఎంటర్‌టైన్మెంట్‌ అందించేందుకు బిగ్ బాస్‌ను షురూ చేశారు.

ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ స్టార్ మా, హాట్ స్టార్‌లలో బిగ్ బాస్ సీజన్ 4 తొలి ఎపిసోడ్ ప్రారంభం కానుంది. శని ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం కానుండగా.. మిగిలిన సోమవారం-శుక్రవారం వరకూ రాత్రి 9.30 గంటలకు బిగ్ బాస్ ఆట ప్రసారం కాబోతుంది. ఎప్పటిలాగే శని-ఆది వారాల్లో మాత్రమే నాగార్జున కనిపించబోతున్నారు.

తాజాగా ఈ సీజన్‌ని సంబంధించిన ప్రీమియర్ టీజర్‌ను స్టార్ మా విడుదల చేయగా.. ఓపెనింగ్ సెర్మనీ హంగామా మామూలుగా లేదు. ‘ది బ్లాక్ బస్టర్ షో బిగ్ బాస్ బిగెన్.. మాస్క్ ముఖానికి అవసరం, ఎంటర్ టైన్మెంట్‌కి కాదు’ అంటూ ఎంట్రీ ఇచ్చాడు హోస్ట్ నాగార్జున. అందమైన భామలతో ఆడిపాడిన మన్మథుడు.. బంగర్రాజు ఓల్డ్ గెటప్‌లో పంచెకట్టి సందడి చేస్తున్న ఆ గెటప్‌ను రివీల్ చేయకుండా జస్ట్ హైప్ ఇచ్చారు.