Templates by BIGtheme NET
Home >> Cinema News >> వర్మ హీరో కొత్త లుక్ కు అంతా షాక్

వర్మ హీరో కొత్త లుక్ కు అంతా షాక్


రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మరియు నిర్మాణంలో వచ్చిన పలు సినిమాల్లో నటించిన హీరో ఫర్దీన్ ఖాన్ గత పదేళ్లుగా కనిపించకుండా పోయాడు. పదేళ్ల పాటు బిజీ హీరోగా వరుసగా సినిమాలు చేసిన ఫర్దీన్ 2010 తర్వాత అవకాశాలు రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. ఆ సమయంలోనే వర్కౌట్ లు మానేశాడో లేక విపరీతంగా తిన్నాడో కాని గుర్తు పట్టలేనంతగా బరువు పెరిగాడు. ఒకానొక సమయంలో ఫర్దీన్ ఖాన్ అంటూ అభిమానించే వారు కూడా ఆయన్ను దగ్గర నుండి చూసి కూడా గుర్తు పట్టలేదు. అలాంటి ఫర్దీన్ ఖాన్ మళ్లీ మునుపటి రూపంకు వచ్చాడు.

లావుగా ఉంటంతో అయిదు పదుల వయసు ఉన్న వ్యక్తిగా కనిపించిన హీరో ఫర్దీన్ ఇప్పుడు పాతికేళ్ల కుర్రాడిగా కనిపిస్తున్నాడు. ఈయన కొత్త లుక్ తో మళ్లీ సినిమాల్లో నటిస్తారా అంటూ సంప్రదిస్తున్నారట. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది ఫర్దీన్ ఖాన్ బాలీవుడ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈయనకు విలన్ గా ఆఫర్లు ఇచ్చేందుకు ఒకరు ఇద్దరు ఫిల్మ్ మేకర్స్ ఇప్పటికే రెడీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. బరువు తగ్గిన ఫర్దీన్ మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యేనా చూడాలి. వర్మ కాంబోలో ఈయన చేసిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కనుక మళ్లీ ఈయనకు వర్మ ఆఫర్ ఇస్తాడేమో చూడాలి.