మెగా అల్లుడు అందుకోబోతున్న కట్న కానుకలు

0

కట్నం అనేది చట్ట విరుద్దం. కాని కట్నం ఇవ్వకుండా పెళ్లి చేయడం అనేది అమ్మాయి తల్లిదండ్రులకు అస్సలు ఇష్టం ఉండదు. ఎంత లేని వారు అయినా తమ పిల్లకు అంతో ఇంతో ఇవ్వాలనే చూస్తారు. ఆస్తిలో అమ్మాయికి ఎలాగూ వాట ఇవ్వరు. కనుక దానినే కట్నం కానుకల రూపంలో ఇవ్వాలని అమ్మాయిల తల్లిదండ్రులు భావస్తారు. ఎవరి స్థాయికి తగ్గట్లుగా వారు కట్నకానుకలు ఇస్తూ ఉంటారు. ప్రముఖుల పెళ్లిల్లో కట్నాల విషయం పెద్దగా చర్చకు రాదు. కాని కానుకలు మాత్రం భారీగా అందుతూ ఉంటాయి.

మెగా బ్రదర్ నాగబాబు తన ముద్దుల కూతురు నిహారిక వివాహం చైతన్యతో చేయబోతున్నాడు. మరి కొన్ని రోజుల్లో నిహారిక పెళ్లి జరుగబోతుంది. ఈ సమయంలో తన గారాల పట్టికి నాగబాబు ఇవ్వబోతున్న కానుకలు ఏంటీ అనేది అందరిలో ఆసక్తి రేకెత్తుతోంది. మీడియా వర్గాలు మరియు సినీ వర్గాల వారి ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం చైతన్యకు మెగా ఫ్యామిలీ నుండి దాదాపుగా పాతిక కోట్ల వరకు కానుకల రూపంలో అందబోతున్నాయి. నిహారిక పేరుపై ఇప్పటికే ఒక బంగ్లా ఉంది. దాంతో పాటు కొన్ని ప్లాట్ లు బంగారం కారు ఇలా ఆమె పేరు మీద ఉన్న వాటితో పాటు మరికొన్ని కొత్తగా ఆమెకు ఇవ్వబోతున్నారట.

మొత్తంగా నిహారికతో చైతన్య వద్దకు పాతిక కోట్ల వరకు కానుకల రూపంలో వెళ్తున్నట్లుగా మెగా కాంపౌండ్ నుండి కూడా సమాచారం అందుతోంది. నాగబాబు తరపు నుండే కాకుండా నిహారికకు పవన్ మరియు చిరంజీవి ఇతర కుటుంబ సభ్యుల తరపు నుండి కూడా భారీగా కానుకలు అందబోతున్నాయి. అవి కూడా మెగా అల్లుడి ఖాతాలోకి వెళ్తాయి. కనుక చైతన్య భారీ మొత్తంలో కానుకలు అందుకోబోతున్నాడు. చైతన్య ఫ్యామిలీ కూడా గుంటూరుతో పాటు హైదరాబాద్ లో పలు ఆస్తులు ఉన్నాయి. కనుక ఆ ఆస్తులు నిహారికు కానుకగా అందబోతున్నాయి అన్నమాట.