జిమ్ వర్సెస్ ప్రగతి: డ్యాన్సులతో షేక్ బేబి షేక్

0

వర్కవుట్లను ఆస్వాధిస్తూ చేయాలంటే మనసుండాలి. జిమ్ లో డంబెల్స్.. హెవీ వెయిట్స్ ఎత్తాలంటే చాలానే ఎనర్జీ ఉత్సాహం కావాలి. కానీ ఇదిగో ఇలా మ్యూజిక్ పెట్టుకుని ప్రత్యేకించి నృత్య భంగిమల్ని ప్రదర్శిస్తే అదేమీ అంతగా ఒత్తిడిని పెంచదు. అందుకే ఇదిగో జిమ్ ట్రైనర్లు ఇలా ప్రగతి మ్యాడమ్ లాంటి వారితో ఇలా చేయించేందుకు వెనకాడరు.

పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి తన డ్యాన్స్ వర్కౌట్ సెషన్లకు సంబంధించి ఇప్పటికే రెగ్యులర్ గా అనేక వీడియోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసారు. ఏజ్ 40 కి చేరువైనా అసలు ఏమాత్రం ఉత్సాహం తగ్గడం లేదనడానికి ఈ వీడియోలే సాక్ష్యం. ఆమె ఎనర్జీ ఉత్సాహం ఇన్ స్టా అనుచరులను ఆశ్చర్యపరుస్తోంది.

తాజా ఇన్ స్టా వీడియోలో ప్రగతి ఓ హిందీ సినిమా పాటకు డ్యాన్స్ చేస్తున్నారు. రణవీర్ సింగ్ – సారా అలీ ఖాన్ జంటగా నటించిన `సింబా` నుండి సూపర్ హిట్ సాంగ్ ‘ఆంఖే మారే’ కు ప్రగతి తన జిమ్ సెషన్ లో స్టెప్పులేస్తున్నారు. పూర్తి మాస్ స్టెప్పులతో ప్రగతి అదరగొట్టేసారంతే. ఈజ్ ఉండాలే కానీ ఊపుదేముంది అయినా? మనసుంటే మార్గం లేకపోలేదు మరి. టాలీవుడ్ లో బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా దశాబ్ధం పైగానే రాణించారు ప్రగతి. స్లిమ్ అవ్వాలన్న తన పట్టుదల ఎందరికో స్ఫూర్తి.