వండర్ ఉమెన్ ను ఫాలో అవుతున్న కూలీ నెం- 1

0

ప్రఖ్యాత డీసీ కామిక్స్ నుంచి `సూపర్ ఉమన్` చిత్రం `వండర్ ఉమెన్ 1984` ఏకకాలంలో థియేట్రికల్ అలాగే డిజిటల్ విడుదలకు సిద్ధమవుతోంది. 2020 డిసెంబర్ 25 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అదే రోజున అమెరికా అంతటా HBO మాక్స్ లో ప్రత్యక్ష డిజిటల్ స్ట్రీమింగ్ జరగనుంది.

తాజా సమాచారం ప్రకారం… బాలీవుడ్ చిత్రం కూలీ నెం: 1 మేకర్స్ కూడా ఇదే తరహా విడుదలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ చాలా కాలం క్రితం సంపాదించగా.. త్వరలో ప్రీమియర్ కోసం సమాయత్తమవుతున్నారని తెలుస్తోంది.

డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం కూలీ నెం: 1. వరుణ్ ధావన్- సారా అలీ ఖాన్ ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే పోస్టర్లు అంతర్జాలంలోకి దూసుకెళ్లాయి.