దేవిశ్రీ కోరిక ఇన్నాళ్లకు నెరవేరిందట

0

టాలీవుడ్.. కోలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ కంపోజర్ గా గత దశాబ్ద కాలంగా దూసుకు పోతున్న దేవి శ్రీ ప్రసాద్ కు చాలా కాలంగా ఒక కోరిక ఉందట. అది ఆయన గురువు అయిన మాండలిన్ శ్రీనివాస్ తో కలిసి సాంగ్ కంపోజ్ చేయాలి. ఆయనతో కలిసి వర్క్ చేయాలని చాలా సార్లు అనుకున్నా ఆయన్ను అడిగే ధైర్యం దేవిశ్రీ ప్రసాద్ చేయలేక పోయాడు. ఆరు ఏళ్ల క్రితం మాండలిన్ శ్రీనివాస్ చనిపోవడంతో దేవిశ్రీ ప్రసాద్ కల నెరవేరకుండానే అయ్యింది. ఇక కల నేరవేరదు అనుకుంటున్న సమయంలో మాండలిన్ ఒక ట్యూన్ కు దేవిశ్రీకి ఆర్కెస్ట్రా చేసే అవకాశం దక్కింది. అంటే గురువు గారి ట్యూన్ ను పాటగా మార్చే అవకాశం దేవికి దక్కింది.

ఆ విషయాన్ని వివరిస్తూ చాలా సంతోషంను దేవి వ్యక్తం చేశాడు. ఆయనతో కలిసి ఒక్క పాటను కంపోజ్ చేయాలనే నా కోరిక తిరింది. ఆయన బతికి ఉన్న సమయంలో ఆయనపై ఉన్న గౌరవంతో అడగలేక పోయాను. గురువు గారు అడిగి ఉంటే ఒప్పుకునేవారేమో. ఆయన మృతి చెందిన తర్వాత ఆయన ట్యూన్ చేసిన ఒక ట్యూన్ ను విన్నాను. ఆ ట్రాక్ కు ఆర్కెస్ట్రా చేసి నా గురువుకు అంకితం ఇవ్వాలనుకున్నాను. ఆయన తనయుడిని అడిగిన సమయంలో అందుకు ఒప్పుకున్నారు. దాంతో నా ఇనాళ్ల కల నెరవేరిందని దేవిశ్రీ చిన్న పిల్లాడిలా ఆనందం వ్యక్తం చేశాడు. గురువుకు పాటను అంకితం ఇవ్వబోతున్నందుకు ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు.