Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘ఎఫ్ 3’ మూవీ.. మొదలు కాకుండానే అమ్మేశారు!

‘ఎఫ్ 3’ మూవీ.. మొదలు కాకుండానే అమ్మేశారు!


ఒక సినిమా షూటింగ్ పూర్తయి.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు అయ్యాక.. థియేటర్ రైట్స్ శాటిలైట్ హక్కుల వ్యవహారం డిస్కషన్లో ఉంటుంది. కానీ.. దిల్ రాజు నిర్మిస్తున్న ‘ఎఫ్ 3’ మూవీ మాత్రం.. షూటింగ్ షురూ కాకముందే అమ్మకాలు జరిగిపోయాాయట! సూపర్ హిట్ చిత్రం ‘ఎఫ్ 2’ తర్వాత.. అవే పాత్రలతో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎఫ్ 3’. ఈ చిత్ర ప్రారంభోత్సవం గురువారం జరిగింది.

సీక్వెల్ కాదంటున్న అనిల్..
‘ఎఫ్ 3’ మూవీ.. ‘ఎఫ్ 2’కు సీక్వెల్ కాదంటున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. గతేడాది జనవరిలో విడుదలైన ‘ఎఫ్ 2’ భార్యాభర్తల రిలేషన్ మీద ఫోకస్ అయిన కథ. అయితే.. ఇప్పుడు రూపొందిస్తున్న ‘ఎఫ్ 3’ మాత్రం.. డబ్బు చుట్టూ తిరుగుతుందని అందువల్ల రెండు సినిమాలు సంబంధం లేదని చెబుతున్నాడు దర్శకుడు.

మంచి ధరలకే అమ్మేశారట..
‘ఎఫ్ 3’ చిత్రం డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ మంచి ధర చెల్లించి సొంతం చేసుకుందట. అలాగే శాటిలైట్ హక్కులను కూడా ఒక లీడింగ్ టీవీ ఛానెల్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ‘ఎఫ్ 2’ భారీ విజయంతో రాబోయే ‘ఎఫ్ 3’పై మాంచి క్రేజ్ ఏర్పడింది. అందుకే ప్రేక్షకులతోపాటు బిజినెస్ వర్గాల్లోనూ ఈ సినిమాకు డిమాండ్ ఏర్పడింది. అందువల్లే.. సినిమా మొదలుకావడానికి ముందే సగం బిజినెస్ అయిపోయినట్టు సమాచారం. ఇందులో విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ తమన్నా మెహ్రీన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.