Templates by BIGtheme NET
Home >> Cinema News >> సోనూసూద్ ను చూసి జంకుతున్న నిర్మాతలు.. స్క్రిప్టు మొత్తం మార్చేశారట

సోనూసూద్ ను చూసి జంకుతున్న నిర్మాతలు.. స్క్రిప్టు మొత్తం మార్చేశారట


సోనూ సూద్ అనగానే.. అరుంధతిలోని పశుపతి కళ్లముందు కదలాడుతాడు. సాధారణ వ్యక్తిగా కన్నా.. సినిమాల్లో విలన్ గానే ఆయన్ను చూశారు చాలా మంది. కానీ.. ఇప్పుడు సోనూ సూద్ అంటే నేషనల్ ఐకాన్. ఇప్పుడున్న ఇండియన్ సెలెబ్రిటీల్లో ఎవ్వరికీ కూడా సోనూసూద్ అంతటి గౌరవాన్ని అందుకునే స్థాయి లేదంటే అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. అంతలా జనాలు సోనూ సూద్ను ఆదరిస్తుంటే.. మూవీ మేకర్స్ మాత్రం భయపడుతున్నాారట.

వారు ఒప్పుకుంటారా..?
దేశంలో కోటాను కోట్లు కూడబెట్టిన వాళ్లు లక్షల్లో ఉన్నారు. కానీ.. కరోనా కష్ట కాలంలో కాార్మికులను పేదలను ఆదుకునేందుకు వాళ్లు చెయ్యి మాత్రం చాచలేదు. కానీ.. నేనున్నా నంటూ ఆపన్నహస్తం అందించాడు సోనూ. తెరపైన సమాజాంలోనూ హీరోలుగా చెలామణి అవుతున్నవారు చూసి కూడా చూడనట్ట నటిస్తే.. హీరోలా మారి అందరినీ ఆదరించాడు ఈ ‘విలన్’. ఇప్పటికే ఎన్నో సహాయ కార్యక్రమాలు చేస్తూ.. ప్రజల్లో గుండెల్లో చెరగని ముద్ర వేశాడు. ఇందుకోసం తన ఇంటిని కూడా తాాకట్టు పెట్టాడు. అలా.. జనం మదిలో హీరో గా నిలిచాడు సోన సూద్. మరి ఇలాంటి వ్యక్తిని తెరపై విలన్ గా చూపిస్తే ఒప్పుకుంటారా..? అనేది ఫిల్మ్ మేకర్స్ ను ఇప్పుడు వేధిస్తున్న ప్రశ్న.

స్క్రిప్టు మార్చేస్తున్నారు..
హీరోల చేతిలో సోనూ సూద్ దెబ్బలు తింటే.. చెడ్డవాడిగా సినిమాల్లో చూపిస్తే ప్రేక్షకులు అంగీకరించరేమో అన్న భయం నిర్మాతదర్శకులను వెంటాడుతోందట. దీంతో.. ఎందుకొచ్చిన తిప్పలు అంటూ.. సోనూ సూద్ ఇప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్ట్ల్లో భారీ మార్పులు చేస్తున్నారట. ఇందులో భాగంగానే.. ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో చాలా వరకు స్క్రిప్ట్ను మార్చేశారట. సోనూ సూద్కు ఇప్పుడున్న క్రేజ్కు తగ్గట్టు.. పాటలుకూడా యాడ్ చేశారని సమాచారం. దీని కోసం బెల్లంకొండ శ్రీనివాస్ స్టోరీని కూడా తగ్గించారని తెలుస్తోంది.

విలన్ పాత్రలు చేయను..
ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగానే సోనూ సూద్ కూడా స్పందించాడు. ఇకపై విలన్ వేషాలు వేసే ప్రసక్తి లేదని చెప్పాడు. ఇక మీదట పాజిటివ్ సపోర్టింగ్ రోల్స్ చేస్తానని ఇప్పటికే మంచి కథలు చాలా విన్నానని సోనూ చెప్పాడు. అదేవిధంగా ఏడాదికి వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని ఫిక్స్ అయినట్టు తెలిపాడు.

బైక్ దాదాగా సోనూ..
బెంగాల్లో ‘బైక్ దాదా’గా పేరుగాంచిన కరిముల్ హక్ అనే వ్యక్తి ఉన్నాడు. మారుమూల గ్రామాల్లో ఆపదలో ఉన్న వారి కోసం తన బైక్ నే అంబులెన్స్గా వాడి ప్రాణాలను కాపాడేవాడు. ఆ వ్యక్తి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న చిత్రంలో సోనూ సూద్ ‘బైక్ దాదా’గా నటించనున్నట్టు తెలుస్తోంది.