నెటిజన్ల పనికి సంచలనాల కంగనా ‘వర్రీ ‘

0

ఎక్కడ వివాదం ఉంటుందో కంగనా రనౌత్ అక్కడ ఉంటుంది. ఆమెకు నోరు పెద్దదే అనే టాక్ ఉంది. ఆమె ఎవరినీ వదలి పెట్టదు. అందరినీ ఓ రౌండ్ వేస్తుంటుంది. ఇక తన జోలికి ఎవరైనా వస్తే మాత్రం ఇక అంతే సంగతులు. ఇలాంటి కంగనా కు ఫ్యాన్స్ నెటిజన్లు షాకులు ఇస్తూ ట్విట్టర్ లో అన్ ఫాలో అవుతుండటంతో ఈ బాలీవుడ్ క్వీన్ తెగ ఫీల్ అవుతోంది. అన్ ఫాలో అంటే మరీ సాదా సీదాగా కాదు రోజుకు 40 వేల నుంచి 50 వేల మంది వెళ్లి పోతుండటంతో కంగనా ఆందోళన చెందుతోంది. ఇటీవల కంగనా ప్రతి విషయాన్ని వివాదం చేస్తూ ట్వీట్లు చేస్తోంది. అది నచ్చకే చాలా మంది ఆమె ట్విట్టర్ నుంచి అన్ ఫాలో అవుతున్నారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోయినప్పటి నుంచి లెక్కలేనన్ని ట్వీట్లు చేస్తోంది కంగనా. సుశాంత్ మరణానికి బాలీవుడ్ లోని నెపోటిజమే కారణమంటూ అందరినీ ఏకిపారేసింది.

హృతిక్ రోషన్ అలియాభట్ మహేష్ భట్ కరణ్ జోహార్ వినోద్ పంచోలీ తాప్సి మహారాష్ట్ర సీఎం కొడుకు ఆదిత్య ఠాక్రే.. ఇలా పలువురిపై ఇటీవల ట్వీట్ల వార్ కొనసాగిస్తోంది. ముందు ట్విట్టర్ లోకి ప్రవేశించి యాక్టివ్ గా ఉన్న కంగనా ఆ తర్వాత ఖాతాను మూసేసింది. రీ ఎంట్రీ ఇచ్చాక రెగ్యులర్ గా ట్వీట్లు పెడుతూ తన ఫాలోవర్లను ఒక మిలియన్ కు పెంచుకుంది. ఇటీవలి కాలంలో కంగనా ప్రతి నటి నటున్ని టార్గెట్ చేసి ట్వీట్లు వేస్తోంది. తాప్సి వంటి వారు దీటుగా బదులిస్తున్నా కంగనా ఏ మాత్రం తగ్గడం లేదు. కంగనా అందరితో గొడవ పెట్టుకోవడమే పనిగా పెట్టు కోవడంతో జనాలకు కూడా రోజూ ఇదే పనా.. అంటూ విసుగు చెందుతున్నారు. ఆమెను అన్ ఫాలో అవుతున్నారు. మరో వైపు రోజుకు ఇంత మంది అన్ ఫాలో అవుతుండటంతో దీనికి కారణం ఏంటో చెప్పాలని ఏకంగా ట్విట్టర్ ఇండియా ఖాతాను ట్యాగ్ చేస్తూ కంగనా ట్వీట్ చేసింది. ట్విట్టర్లో అందరినీ ఆడుకునే కంగనా.. ఈ సారి ట్విట్టర్ ని కూడా వదల్లేదని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.