మహేష్ ఫ్యాన్స్ మరో మూడేళ్లు వెయిట్ చేయాల్సిందే

0

బాహుబలి చిత్రం తర్వాత మహేష్ బాబుతో రాజమౌళి సినిమా చేయాల్సి ఉంది. కాని కొన్ని కారణాల వల్ల ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లతో మల్టీస్టారర్ చిత్రాన్ని మొదలు పెట్టిన విషయం తెల్సిందే. ఇటీవల పలు సందర్బాల్లో ఈసారి ఖచ్చితంగా మహేష్ బాబుతో సినిమా ఉంటుందని రాజమౌళి ప్రకటించాడు. దాంతో మహేష్ బాబు కూడా అందుకోసం వెయిట్ చేస్తున్నట్లుగా సన్నిహితుల వద్ద పేర్కొన్నాడు. అయితే వీరిద్దరి కాంబోకు కరోనా అడ్డుగా నిలిచింది. అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్ దాదాపుగా ముగింపు దశకు వచ్చేది. వచ్చే ఏడాది సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేవారు.

మహేష్ బాబుతో వచ్చే ఏడాదిలో సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉందని అంతా భావించారు. కాని అనూహ్య పరిణామాల కారణంగా వీరిద్దరి కాంబో మరికొంత కాలం ఆలస్యం అవుతుంది. ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రాన్ని చేసేందుకు మహేష్ బాబు రెడీ అవుతున్నాడు. ఆ తర్వాత వెంటనే రాజమౌళితో సినిమా ఉండే ఛాన్స్ లేదు కనుక ఒకటి రెండు సినిమాలు చేసేందుకు ముందస్తుగానే ప్లాన్ చేసుకుంటున్నాడట. సర్కారు వారి పాట చిత్రం తర్వాత మహేష్ బాబు వెంటనే చేసేందుకు ఇటీవల ఒక కథకు ఓకే చెప్పాడు.

రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదల తర్వాత ఖచ్చితంగా కనీసం ఆరు నెలల సమయం తీసుకుంటాడు. కనుక వచ్చే ఏడాది ద్వితీయార్థంలో సినిమా విడుదలైతే మహేష్ బాబు కోసం 2021 నుండి టైం కేటాయించే అవకాశం ఉంది. అంటే 2024 లో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అంటే వీరిద్దరి కాంబో కోసం ఇంకా ఎంత లేదన్నా కనీసం మూడు సంవత్సరాల పాటు వెయిట్ చేయాల్సి రావచ్చు అంటున్నారు.