Templates by BIGtheme NET
Home >> Cinema News >> మలైకమా మైకమా.. గుండెల్లో గుబులు గుబులుగా!

మలైకమా మైకమా.. గుండెల్లో గుబులు గుబులుగా!


కుర్రాళ్ల గుండెలు గుబులు గుబులుగా బరువెక్కే వైనం.. క్షణకాలంలోనే మైకం కమ్మే వైనం ఇంకేదైనా ఉందా? ఇంతగా మత్తెక్కించే ఫికరు ఇంకేది? అదేదైనా మలైకానే అడగాలి మరి. 36 ఏజ్ హీరో అర్జున్ కపూర్ .. ఈ 47 బ్యూటీకి అంతగా అడిక్ట్ అయిపోయాడంటే దానివెనక కారణమేంటో ప్రత్యేకించి చెప్పాలా?.  అరవిరిసిన తెల్లమందారాన్ని తలపిస్తున్న మలైకా లేటెస్ట్ లుక్ కుర్రకారు వాట్సాపుల్లో సోషల్ మీడియాల్లో వైరల్ గా మారింది. యాభై కి చేరువలో ఇంత బిగిసడలని అందమా? అంటూ పరేషన్ అయిపోతోంది యూత్. పర్ఫెక్ట్ జిమ్ యోగాతో ఈ రూపం తిరిగి తెచ్చిన మలైకా హార్డ్ వర్క్ ని ప్రశంసించకుండా ఉండలేరు మరి.

కెరీర్ పరంగా అవకాశాలు తగ్గినా.. టీవీ రియాలిటీ షోలు.. మోడలింగ్ అసైన్ మెంట్స్ లో తనని తాను బిజీగా ఉంచుకోవడం ఎలానో మలైకాకు తెలుసు. ఫేమస్ రియల్ మి బ్రాండ్ స్మార్ట్ వాచ్ ప్రచారానికి భారీ కాంట్రాక్ట్ కుదుర్చుకున్న మలైకా అందుకు సంబంధించిన ప్రచార చిత్రాన్ని ప్రమోట్ చేసే కొన్ని క్షణాల ముందు ఇలాంటి బ్లాస్ట్ ఫోటోని షేర్ చేయడం వెనక లాజిక్ ని అర్థం చేసుకోవాల్సిందే మరి.