అక్కినేని కోడలితో లక్ష్మీ మంచు చెలిమి కథేమి?

0

నటి.. యాంకర్ కం నిర్మాత లక్ష్మి మంచు కి ఫేజ్ 3 క్రౌడ్ లో ఎవరెవరు క్లోజ్? అంటే.. తొలిగా వినిపించే పేర్లలో సమంత.. ఉపాసన.. శిల్పా రెడ్డి.. తాప్సీ.. ఝాన్సీ.. అమల.. నందిని రెడ్డి.. ఇలా పలువురు స్ట్రాంగ్ పర్సనాలిటీస్ గుర్తుకొస్తారు. వీళ్లతో పాటు ఇండస్ట్రీలో చాలామంది అగ్ర కథానాయికలతో లక్ష్మీ మంచు ఎంతో సన్నిహితంగా ఉంటారు. టీవీ హోస్ట్ గా ఇప్పటికే ఇండస్ట్రీ బెస్ట్ కమ్యూనికేటర్ గా లక్ష్మీకి ప్రత్యేకించి ఇమేజ్ ఉంది.

ఇక స్టార్ హీరోయిన్ సమంతకు లక్ష్మి మంచి స్నేహితులు. శుక్రవారం రాత్రి లక్ష్మి తన ఫ్రెండ్స్ తో పాటు దిగిన ఓ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేశారు లక్ష్మీ మంచు. ఇది త్రోబ్యాక్ ఫోటో. కొన్ని రోజుల క్రితం సమంత.. డిజైనర్ శిల్పా రెడ్డిలతో పాటు భోజనం చేసారట లక్ష్మీ.

“నేను ఇప్పటికే గతించిన కాలంలో చాలా విలువైన సమయాన్ని కోల్పోయాను. అయితే ఇకపై ఇలాంటి ముందస్తు భోజన పథకాలను మనం ఎక్కువగా ప్లాన్ చేయాలి“ అని లక్ష్మి పోస్ట్ చేశారు. భోజనానంతరం లక్ష్మీ ఇంట్లో రిఫ్రిజిరేటర్ ను చిన్న మొక్కలతో అలంకరించడంలో సామ్ సహాయం చేశారట.