Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘బిగ్ బాస్’ హౌస్ లో టెన్షన్ .. టెన్షన్: మోనల్

‘బిగ్ బాస్’ హౌస్ లో టెన్షన్ .. టెన్షన్: మోనల్


బిగ్ బాస్ 4′ మొదటి నుంచి కూడా అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తూ వస్తోంది. ఎవరైతే ఎలిమినేట్ అవుతారని అనుకున్నామో వాళ్లు సేవ్ అవుతున్నారు. ఎవరికైతే ఇప్పట్లో ఢోకా లేదనుకున్నామో వాళ్లు మరుసటివారమే బయటికి వెళ్లిపోతున్నారు. దాంతో ‘బిగ్ బాస్ 4’లో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆసక్తి పెరుగుతోంది. ఈ సీజన్లోని పోటీదారులంతా ఎవరి ధోరణిలో వాళ్లు ఆడుతూ వచ్చారు. పోటీదారులలో ఇష్టాలు .. కష్టాలు .. త్యాగాలు .. నిందలు .. ఓదార్పులు .. నడుస్తూ వచ్చాయి. ఆటపాటల సంగతి అటుంచితే ఈ సీజన్ కి గ్లామర్ పరంగా మోనల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

100 రోజుల పాటు బిగ్ బాస్ హౌస్ లో పోరాడుతూ వచ్చిన మోనల్ మొత్తానికి పోయిన ఆదివారం బయటికి వచ్చేసింది. అసలు ఆమె కొన్ని వారాల క్రితమే బయటికి రావలసింది అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ అభిమానూలు ఆమెను సేవ్ చేస్తూ వచ్చారు. ‘టాప్ 5’ లిస్టులో మోనల్ ఉంటుందేమో అనే అనుమానం కూడా కొంతమందికి కలిగింది. ‘టాప్ 5’లో ఉంటాననీ .. ఉండాలనే మోనల్ కూడా కోరుకుంది. కానీ ఈ సారి బయటికి రాక తప్పలేదు. తాజా ఇంటర్వ్యూలో మోనల్ మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ లో తన జర్నీని గురించిన విషయాలను చెప్పుకొచ్చింది.

“బిగ్ బాస్ హౌస్ లో నేను అబద్ధాలు ఆడతాననే విషయాన్ని ఒకరిద్దరు హైలైట్ చేశారు. మాట మారుస్తానని మరికొందరు అన్నారు. నా పట్ల వాళ్లకి గల అభిప్రాయాన్ని మార్చడానికి నా వంతు ప్రయత్నం చేశాను .. కానీ ప్రయోజనం లేకపోయింది. నాకు తెలుగు అర్థమవుతుంది .. కొంచెం కొంచెం మాట్లాడతాను. బిగ్ బాస్ హౌస్ లో తెలుగు సరిగ్గా రాకపోవడం సమస్యగా మారింది. నా సమస్యను చెప్పుకుందామంటే హిందీ .. ఇంగ్లిష్ లో మాట్లాడకూడదనే నిబంధన ఉంది. అందువలన నన్ను అపార్థం చేసుకున్నవారికి నా మనసులోని మాటను చెప్పలేకపోయాను.

ఒక వారం అభిజిత్ .. ఆ తరువాత వారం అఖిల్ నన్ను నామినేట్ చేయడం నాకు చాలా బాధ కలిగించింది. అఖిల్ నామినేట్ చేసిన తరువాత మిగతా వాళ్లంతా నేను వీక్ అనే విషయాన్ని హైలైట్ చేస్తూ వచ్చారు. అప్పుడు మాత్రం నాకు చాలా కోపం వచ్చింది. నేను అఖిల్ కంటే వీక్ కావొచ్చు .. కానీ మిగతావాళ్లందరి కంటే వీక్ కాదు. అవినాశ్ బయటికి వెళుతూ “నువ్వు చాలా స్ట్రాంగ్” అని నాతో అన్నాడు. మనస్ఫూర్తిగా అంటున్నాడని నేను అనుకున్నాను. కానీ బయటికి వచ్చేసి ఇంటర్వ్యూల్లో అతను వేరే మాట చెబుతున్నాడు. మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఒకటి చెప్పడం నాకు నచ్చలేదు. బిగ్ బాస్ హౌస్ లో హాయిగా ఆటలాడుతూ .. మంచిగా తినేసి పడుకుంటారని అంతా అనుకుంటారు. కానీ అక్కడ అంతా టెన్షన్ .. టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ తోనే నాకు హైఫీవర్ కూడా వచ్చేసింది” అంటూ చెప్పుకొచ్చింది.