దీపిక ఈగో సంతృప్తిపడేలా సమ ప్రాధాన్యత!?

0

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలతో ఇండియన్ ఫిల్మ్ మార్కెట్ లోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో `రాధేశ్యామ్` మూవీతో పాటు నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ మూవీకి సన్నాహాలు చేస్తున్నాడు. అలాగే బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ తో `ఆది పురుష్ 3డి` చిత్రాల్ని లైన్ లో పెట్టారు. ఇటీవల వరుసగా`ఆది పురుష్` చిత్రం వార్తల్లో నిలుస్తోంది. తాజాగా `మహానటి` ఫేమ్ నాగ్ అశ్విన్ చిత్రం హాట్ టాపిక్ గా మారింది.

లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక విషయాన్ని మేకర్స్ ప్రకటించారు. ప్రత్యేకంగా ఓ పోస్టర్ ని రిలీజ్ చేసిన మేకర్స్ ఈ సందర్భంగా ప్రచారంలో వున్న మూడు ఆసక్తికరమైన విషయాల్ని బయటపెట్టారు. ప్రభాస్ 21 మూవీ ఓ సైన్స్ ఫిక్షన్ అని తొలి నుంచి మేకర్స్ చెబుతూనే వున్నారు. అయితే తాజాగా ఇది టైమ్ మెషీన్ నేపథ్యంలో రూపొందుతున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని వైజయంతీ మూవీస్ కన్ఫమ్ చేస్తూ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావుని ఈ ప్రాజెక్ట్ కి మెంటర్ గా నియమించినట్టు వెల్లడించింది. దీంతో ఈ మూవీ `ఆదిత్య 369`కు సీక్వెల్ అనే వాదనకు బలం చేకూరినట్టయింది.

ఇక ప్రారంభం నుంచి ప్రభాస్ 21 అంటూ ప్రచారం చేసిన మేకర్స్ కి దీపిక ఇచ్చిన కౌంటర్ తెలిసిందే. అలా ప్రచారం చేయడం వల్ల దీపికా పదుకొనే హర్ట్ కావడంతో ఆ తర్వాత `ప్రభాస్ – దీపిక పాన్ ఇండియా మూవీ` అంటూ సరికొత్తగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఒక రకంగా ప్రభాస్ కి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అంతే ప్రాధాన్యత దీపికకు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ప్రమోషన్స్ పోస్టర్స్ లోనూ ఇది ప్రభాస్ – దీపిక పదుకొనే ఫిల్మ్ అని మెన్షన్ చేస్తున్నారు. ఈ రెండు విషయాల్లో ప్రభాస్ ఫ్యాన్స్ కి క్లారిటీ రావడంతో ఈ మూవీపై రానున్న రోజుల్లో పెద్ద రచ్చ జరగడం ఖాయంగా కనిపిస్తోంది.