‘తమ్ముడి’కి ప్లాప్ ఇచ్చిన దర్శకుడికి ‘అన్న’ ఛాన్స్ ఇస్తాడా…?

0

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య తండ్రి ‘కింగ్’ నాగార్జున బాటలో వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో ‘ఏమాయ చేసావే’ ‘100% లవ్’ ‘తడాఖా’ ‘మనం’ ‘ఒక లైలా కోసం’ ‘ప్రేమమ్’ ‘సాహసం శ్వాసగా సాగిపో’ ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ‘మజిలీ’ ‘వెంకీమామ’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు. ప్రస్తుతం సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ మూవీలో నటిస్తున్నాడు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో ”థాంక్యూ” అనే సినిమాలో నటించబోతున్నట్లు చైతూ ఇటీవల అనౌన్స్ చేశాడు. ఈ క్రమంలో ఓ యువ దర్శకుడు చెప్పిన స్టోరీ లైన్ కి అక్కినేని యువ హీరో ఇంప్రెస్ అయినట్లు తెలుస్తోంది.

కాగా అక్కినేని నాగచైతన్య లైనప్ లో డైరెక్టర్స్ ఇంద్రగంటి మోహనకృష్ణ – నందిని రెడ్డి లాంటి వారు ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే లేటెస్టుగా ‘తొలిప్రేమ’ ‘రంగ్ దే’ చిత్రాల డైరెక్టర్ వెంకీ అట్లూరి కూడా ఈ లైన్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ లో వెంకీ అట్లూరి చైతూ కోసం ఓ స్పోర్ట్స్ డ్రామా స్క్రిప్ట్ చేసి.. ఇటీవలే హీరోకి స్టోరీ లైన్ వినిపించాడట. దీనికి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చిన చైతన్య పూర్తి స్క్రిప్ట్ వినడానికి రెడీ అయ్యాడట. స్టోరీ విన్న తర్వాత అక్కినేని హీరో నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఈ ప్రాజెక్ట్ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే తమ్ముడు అఖిల్ కి ప్లాప్ ఇచ్చిన దర్శకుడికి చైతన్య ఛాన్స్ ఇస్తాడా అని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు. అఖిల్ తో వెంకీ అట్లూరి ‘మిస్టర్ మజ్ను’ సినిమా తీశాడు. ఈ సినిమా ఓపెనింగ్స్ రాబట్టినా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో చైతన్య వెంకీతో ప్రాజెక్ట్ ఓకే చేస్తాడా లేదా అనేది చూడాలి.