అలయ ఎఫ్ బాలీవుడ్ లోకి సైలెంట్ గా దూసుకొచ్చిన అందగత్తె. అంతకుమించి నటవారసురాలిగా సుపరిచితం. ప్రముఖ సీనియర్ కథానాయిక పూజా భేడీకి అలయ కుమార్తె. ఇక నేటితరం నటవారసులకు ధీటుగా ఆలయా కూడా ఫిట్నెస్ ఫ్రీక్. నిరంతరం జిమ్ యోగా అంటూ ఫిట్నెస్ గోల్స్ ని సెట్ చేస్తుంది. అందరికీ ఫిట్ నెస్ పరంగా ప్రేరణనిస్తుంది. అలయ తరచుగా తన గదిలో యోగాసనాలతో ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటుంది.
అలయ ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ తన ఫిట్ నెస్ డైరీలు.. ఫ్యాషన్ డైరీలతో నిండి ఉంటుంది. తన వ్యక్తిగత జీవితంలోని గ్లింప్స్ ని కూడా ఈ వేదికపై షేర్ చేస్తుంటుంది. ఇటీవల అలయ తన గదిలో యోగా రొటీన్ చేస్తున్న చిన్న స్నిప్పెట్ తో దుమారం రేపింది. ఆలయ తాను సంతోషంగా ఉండేందుకు ఫిట్నెస్ సహకరిస్తుందని ప్రతిసారీ చెబుతోంది. ఇక యోగా వల్ల ప్రయోజనాలను కూడా వివరిస్తుంది.
అలాగే అమ్మడు ఫ్యాషన్ ఎంపికల్లోనూ తనదైన మార్క్ వేస్తుంది. ఎప్పటికప్పుడు న్యూ డిజైన్స్ లో చూపరులను ఆకట్టుకుంటుంది. తాజాగా మరో హాట్ పిక్ తో అంతర్జాలంలోకి ఎక్కేసింది. ఇదిగో ఇక్కడి లా డిజైనర్ ప్యాంట్..బ్లౌజు ధరించింది. అమ్మడి బ్లౌజ్ లో ఎద అందాలో ఆరబోతే. ప్యాంట్ మ్యాచింగ్ బ్లౌజ్ లో అగ్గిరాజేస్తుంది. అలయ కిల్లర్ లుక్ కుర్రాళ్లంతా ఫిదా అవ్వాల్సిందే. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అభిమానులు తమదైన శైలిలో హాట్ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
జవానీ జానెమాన్ చిత్రంతో బాలీవుడ్ లో అరంగేట్రం చేసిన ఆలయ తొలి ప్రయత్నమే ఎఫ్ విమర్శకుల ప్రశంసలను పొందమేగాక ప్రేక్షకాభిమానుల మనుసుల్ని గెలుచుకుంది. కొంత గ్యాప్ తర్వాత ఆలయ తన మొట్టమొదటి మ్యూజిక్ వీడియోతో అభిమానుల ముందుకు వచ్చింది. కొత్త పాట ఆజ్ సజేయలో కనిపించింది. మ్యూజిక్ వీడియో లో ప్రతి ఫ్రేమ్ లో ఎంపిక చేసిన దుస్తుల్లో ఎంతో ఆకర్షణీయంగా స్టైలిష్ గా కనిపించింది. ఇటీవల రెండు..మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చినా అవి ఆశించిన ఫలితాలు సాధించలేదు.
టైటిల్స్ పై వివాదాలు కొత్తేంకాదు. స్టార్ హీరోలంతా అప్పుడప్పుడు టైటిల్ వివాదాలు ఎదుర్కుంటూనే ఉంటారు. ఈ వివాదం సరిగ్గా రిలీజ్ సమయంలో జరుగుతుంది. అంతవరకూ సైలెంట్ గా ఉన్న సంఘా లన్నీ రిలీజ్ సమయం దగ్గరపడేసరికి ముందుకొస్తాయి. ఆ తర్వాత నెట్టింట నానా రచ్చ జరుగు తుంటుంది. తాజాగా మరో తెలుగు సినిమా టైటిల్ కి వివాదం తప్పలా లేదని వినిపిస్తోంది.
ఇటీవలే ఓ యంగ్ హీరో తన కొత్త సినిమా టైటిల్ ప్రకటించారు. నిజానికి ఆ టైటిల్ కూడా వివాదాస్ప దంగా నే కనిపిస్తుంది. క్యాచీగా ఉంటుందని చిత్ర దర్శకుడు నిర్ణయించినా ఆ టైటిల్ యువతలో చెడుగా వెళ్లే అవకాశం ఉందని ఫిలిం సర్కిల్స్ లో సైతం చర్చ నడుస్తోంది. గతంలో పలు సినిమాల టైటిళ్ల పై వివాదాలు తలెత్తిన పరిస్థితిని గుర్తు చేస్తూ ఈ సినిమాకి ఆ తిప్పలు తప్పవంటున్నారు.
ఇప్పటికే చాలా మంది యువత మద్యం..సిగరెట్టు వంటి వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారని ప్రభుత్వాలు అవేర్ నెస్ కార్యక్రమాలు కూడా పెంచాయి. ఈ నేపథ్యంలో యువతపై సినిమాల ప్రభావం కూడా తీవ్రంగా ఉందని కొంత మంది విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా ఓ సినిమా టైటిల్ మత్తు అనే పదార్దంతో ముడి పడి ఉంటుంతో యువతని ఎక్కువగా కర్షించే అవకాశం ఉందని వినిపిస్తుంది.
సరిగ్గా రిలీజ్ సమయంలో ఆసినిమా టైటిల్ వివాదం ఎదుర్కుంటుందని… ఈ విషయంలో కొన్ని పేరున్న సంస్థలు కూడా టైటిల్ ని ఖండిచే అవకాశం ఉంటుందని అంటున్నారు. ముందున్న రెండు అక్షరాల్ని తొలగించి రిలీజ్ చేసేలా ఒత్తిడి తెస్తారని వినిపిస్తుంది. సినిమా కి ముందు మద్యం..సిగరెట్లు మానేయాలని కొటేషన్లు ఇచ్చే హీరోలు… సినిమాలకి అలాంటి టైటిల్స్ పైట్టడం వెనుక ఆతర్యం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ లా హీరోలు ఆలోంచించాలని…యువత చెడు దోవ పట్టకుండా వీలైనంత వరకూ ఏదో ఒక సందేశం సినిమాలో ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. మరి ఇదంతా జరిగే పనేనా ? అన్నది ఆ పెరుమాళ్లకే తెలియాలి.
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో సినిమాలు చేయాలని క్రేజీ స్టార్ డైరెక్టర్లు పోటీపడుతున్నారు. ఇటీవలే రజనీతో ‘జైలర్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ని అందించిన మళ్లీ ట్రాక్‌లోకి తీసుకొచ్చిన ఈ సినిమా ఆయనలో సరికొత్త జోష్‌ని నింపిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో రూ.600 కోట్లమేర వసూళ్లని రాబట్టింది. ఈ సినిమా అందించిన సక్సెస్ ఆనందంలో ఉన్న రజనీ అదే ఊపులో మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లని లైన్‌లో పెట్టారు. ఇప్పటికే 170ని ‘జై భీమ్’ డైరెక్టర్ టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో లాంఛనంగా ప్రారంభించేశారు.
త్వరలో క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అత్యంత భారీ స్థాయిలో తలైవర్ 171 ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టబోతున్నారు. రజనీ పరిస్థితి ఇలా ఉంటే మన మెగాస్టార్ పరిస్థితి మరోలా ఉంది. ఆయనతో సినిమాలు చేయాలని క్రేజీ స్టార్ డైరెక్టర్‌లు పోటీపడుతుంటే మన మెగాస్టార్ మాత్రం ఫ్లాప్ డైరెక్టర్లని, యంగ్ డైరెక్టర్లని లైన్‌లోకి తీసుకొస్తున్నారు. ఇటీవల మెహర్ రమేష్‌కు ఛాన్స్ ఇచ్చి ‘భోళా శంకర్’తో చేతులు కాల్చుకున్న చిరు ఆ షాక్ కారణంగా కాస్త విరామం తీసుకున్నారు. త్వరలో యంగ్ డైరెక్టర్ ‘బింబిసార’ ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ఓ సోషియో ఫాంటసీ మూవీని చేయబోతున్నారు.
ఇప్పటికే అధికారికంగా ప్రకటన కూడా విడుదలైంది. దీనితో పాటు కల్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలోనూ మరో సినిమా చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ముందుగా మల్లిడి వశిష్ట సినిమానే ముందు సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వీరితో పాటు చిరంజీవి ఇద్దరు స్టార్ డైరెక్టర్లతో కలిసి పని చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్‌లతో సినిమాలు చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇది ప్రచారం మాత్రమేనని ఇందులో ఎలాంటి నిజం లేదని చిరు తాజాగా క్లారిటీ ఇచ్చారు.
ఈ ఇద్దరితో పాటు బోయపాటి శ్రీను కూడా చిరుతో కలిసి సినిమా చేయాలని ఉందని కొన్నేళ్ల క్రితమే ప్రకటించారు. కానీ ఇంత వరకు అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా త్రివిక్రమ్, సుకుమార్ ప్రాజెక్ట్‌లపై స్పందించారు. వారితో అసలు చర్చలే జరగలేదని, ఇప్పట్లో వారితో కలిసి పని చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు. త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్‌తో ‘గుంటూరు కారం’ చేస్తుండగా, సుకుమార్ బన్నీతో ‘పుష్ప 2’ చేస్తున్నారు. బన్నీ తరువాత రామ్ చరణ్‌తో సినిమా చేయబోతున్నారు. ఇక త్రివిక్రమ్ ‘గుంటూరు కారం’ తరువాత బన్నతో భారీ పాన్ ఇండియా మూవీని చేయబోతున్నాడు. అంటూ మరో ఏడాదికి పైనే వీరిద్దరు బిజీగా ఉంటారు. చిరు కావాలన్నా దొరకరు.
ఇదిలా ఉంటే తమిళంలో స్టార్ డైరెక్టర్లు సూపర్ స్టార్ రజనీ, యూనివర్సల్ స్టార్ కమల్ వెంటపడుతుంటే మన స్టార్ డైరెక్టర్లు మాత్రం మన మెగాస్టార్‌ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఫ్యాన్స్, సామాన్య ప్రేక్షకులు సెటైర్లు వేస్తున్నారు. చిరుకు ఓ విక్రమ్, ఓ ‘జైలర్’ లాంటి సినిమాలు పడితే ఆయన క్రేజ్‌కి తగ్గట్టుగా ఉంటుందని, మన స్టార్ డైరెక్టర్లు ఈ వైపుగా ఎందుకు ఆలోచించడం లేదని తెలుగు ప్రేక్షకులు వాపోతున్నారు. ఇప్పటికైనా మెగాస్టార్ క్రేజ్‌ని గ్రహించి ఆయన ఏజ్‌కు, చరిష్మాకు తగ్గ కథలతో సంప్రదిస్తారని ఆశిద్దాం.
సూపర్ స్టార్ మహేశ్ బాబును గ్రీకు వీరుడిగా పోల్చే అభిమానులు చాలా మందే ఉన్నారు. ఆయన అందం చూసి అసూయ, ఈర్ష్య వంటివి వ్యక్తం చేసే ప్రేక్షకులు కూడా ఉన్నారు. అంతెందుకు హీరో హీరోయిన్లలో కూడా చాలా మంది.. మహేశ్ అందం కొంచెం తమకు ఇస్తే బాగుంటుందని సరదాగా చెప్పిన వాళ్ళు ఉన్నారు.
అయితే మహేశ్ ఇలా ఉండటానికి కారణం.. జీన్స్‌తో పాటు ఆయన కష్టం కూడా దాగి ఉంది. రెగ్యులర్‌గా డైట్ ఫాలో అవుతారు. జిమ్ అండ్ వర్కౌట్స్ క్రమం తప్పకుండా చేయడం ఆయన అలవాటు. అందుకే, ఎప్పుడూ సేమ్ ఫిజిక్ మైంటైన్ చేస్తూ ఫిట్ అండ్ గ్లామర్‌గా కనిపిస్తుంటారు. సోషల్ మీడియాలో వాటికి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ అభిమానుల్లో స్ఫూర్తిని నింపుతుంటారు.
తాజాగా మరోసారి తాను వర్కౌట్ చేస్తున్న ఫోటోను మహేశ్ పోస్ట్ చేశారు. బ్లాక్ అండ్ వైట్ కలర్ ఫొటోలో ఆర్మ్స్ ఎక్స్‌ర్‌సైజ్స్ చేస్తూ కనిపించారు. ఆ పిక్‌లో బైసెప్స్ బాగా కనపడుతున్నాయి. హార్డ్ వర్క్ విషయానికి వస్తే నలుపు తెలుపు అంటూ ఏమీ ఉందడు. దానిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దడమే!! అంటూ వ్యాఖ్య రాసుకొచ్చారు.
ప్రస్తుతం ఆయన నటిస్తున్న గుంటూరు కారం సినిమాతో పాటు తర్వాత చేయబోయే రాజమౌళి సినిమాలోని ఫిజిక్ కోసం ఇప్పటి నుంచే తెగ కష్టపడుతున్నారని చాలా రోజుల నుంచి అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కానీ మహేశ్.. తాను ఏ సినిమా కోసమో కాదని, రెగ్యులర్‌గానే తాను ఈ వర్కౌట్స్ చేస్తున్నట్లు ఆ మధ్య చెప్పుకొచ్చారు.
ఇక మహేశ్ నటిస్తున్న గుంటూరు కారం సినిమా విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది 2024 సంక్రాంతికి కానుకగా సినిమా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. పక్కా మాస్ ఎంటర్టైనర్గా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సినిమాను నిర్మిస్తోంది. ఇక దీని తర్వాత మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం మరింత బలంగా సిద్ధంగా కానున్నాడు. ఆ ప్రాజెక్టు వచ్చే ఏడాది సమ్మర్లో మొదలయ్యే అవకాశం ఉంది.
అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా దర్శకత్వం వహించిన వైల్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా యానిమల్. రణ్‌బీర్ కపూర్ – రష్మిక ఈ చిత్రంలో జంటగా నటించారు. రీసెంట్‌గా ఈ చిత్రం నుంచి అమ్మాయి అనే సాంగ్ విడుదలై సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది. పాటలో ఇంటెన్స్ రొమాన్స్ కెమిస్ట్రీ ఉండటంతో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
రష్మిక ఫ్యామిలీ ముందు ఓ డీప్ లిప్ కిస్ చేసుకుంటూ తమ ప్రేమను వ్యక్తపరచడంతో సాంగ్ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య లవ్ డ్రామాటిక్ జర్నీ ప్రారంభమై పెళ్లి వరకు చూపిస్తారు. పాట మొత్తం లిప్ కిస్ల వంటి బోల్డ్ సీన్స్‌తో సాగుతుంది.
అయితే ఈ సన్నివేశాలలో.. ఫ్యామిలీ ముందే రణ్‌బీర్ – రష్మిక లిప్ లాక్ కిస్ పెట్టుకుని ప్రేమను వ్యక్తపరచడం వంటి బోల్డ్ సీన్ బాగా హైలైట్ అయింది. అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంకా ప్రైవేట్ జెట్‌లో రణ్‌బీర్ ఐకానిక్ టవల్ సీన్ – చీరలో ఉన్న రష్మికతో బోల్డ్ అండ్ రొమాన్స్ ఇంటెన్స్ వంటి సన్నివేశాలను కూడా చూపించారు. ఇవన్నీ యూత్‌కు బాగానే ఆకట్టుకున్నప్పటికీ.. రణ్‌బీర్‌పై భిన్నమైన కాంమెట్స్ చేస్తున్నారు.
ఆలియా భట్ లాంటి అందమైన అమ్మాయితో పెళ్లి అయ్యాక కూడా ఇలాంటి బోల్డ్ సీన్స్ అవసరమా అంటూ రణ్‌బీర్‌ను ప్రశ్నిస్తన్నారు. అదే సమయంలో మరికొంతమంది మద్దతుగా నిలుస్తున్నారు. రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీలో ఆలియా బెడ్ సీన్స్‌లో నటించినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని అడుగుతున్నారు. అలాగే ఇంకొంతమంది హీరో విజయ్ దేవరకొండను ఇందులోకి లాగుతున్నారు.
విజయ్ గర్ల్‌ప్రెండ్ రష్మికతో రణ్‌బీర్ చిల్ కొడుతున్నారంటూ మీమ్స్ క్రియేట్ చేసి తెగ షేర్ చేస్తున్నారు. మొత్తంగా ఈ సాంగ్ అందరీ దృష్టిని తమవైపు తిప్పుకుంది. సినిమాపై బజ్ క్రియేట్ చేసింది. ఈ క్రైమ్ థ్రిల్లింగ్ సినిమా డిసెంబర్ 1న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. సినిమాలో క్రైమ్, ఫ్యామిలీ ఎమోషన్స్, ప్యాషనేట్ రొమాన్స్ వంటి ఎలిమెంట్స్ ఉండనున్నాయి.
సోషల్ మీడియా ద్వారా జూనియర్ సమంత అంటూ గుర్తింపు దక్కించుకున్న అషు రెడ్డి ఆ తర్వాత బుల్లి తెరపై పలు కార్యక్రమాల్లో కనిపించింది. ముఖ్యంగా బిగ్ బాస్ ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకోవడం తో అషు రెడ్డికి ఇన్ స్టా లో దాదాపుగా రెండు మిలియన్ ల ఫాలోవర్స్ అయ్యారు. హీరోయిన్స్ రేంజ్ అందాల ఆరబోత తో తన ఫాలోవర్స్ కి అషు వినోదాన్ని పంచుతోంది.
అందాల అషు రెడ్డి తాజాగా ఇన్ స్టా లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సైడ్ యాంగిల్ లో నడుము అందాన్ని చూపిస్తూ నాభి అందాలతో కవ్విస్తోంది. పొట్టి నిక్కర్ వేయడం తో థైస్ ఎక్స్ పోజ్ చేస్తోంది. మొత్తానికి చూపించాల్సినంత చూపిస్తూ కవ్విస్తున్న ముద్దుగుమ్మ అషు రెడ్డి అందాల ఆరబోతకు అంతా కూడా ఫిదా అవుతున్నారు.
బుల్లి తెరపై కార్యక్రమాలతో పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ అషు రెడ్డి ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా హీరోయిన్ లకు ఏమాత్రం తగ్గకుండా అందాలు ఆరబోస్తూ కవ్విస్తోంది. ఓ రేంజ్ లో అందాలను చూపిస్తున్న ముద్దుగుమ్మ అషు రెడ్డి కి హీరోయిన్ గా ఛాన్స్ లు రాకపోవడం బాధాకరం అంటూ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హాట్ బ్యూటీ అషు రెడ్డి ఈ రేంజ్ లో అందాల ఆరబోత చూస్తే ఇతర భాషల ఫిల్మ్ మేకర్స్ అయినా ఆఫర్స్ ఇస్తారేమో అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అషు కాస్త సీరియస్ గా తమిళ్ లేదా ఇతర భాషల్లో హీరోయిన్స్ గా నటిస్తే తప్పకుండా మంచి ఆఫర్లు దక్కించుకునే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంటున్నారు. మరి అషు ఆ దిశగా ఎందుకు ప్రయత్నాలు చేయడం లేదో మరి..!
సినిమా ఇండస్ట్రీలో ప్రతిభ ఉంటే అవకాశాలకు కొదవ లేదు. జీరో నుండి హీరోల స్థాయికి వచ్చిన వారు ఎంతో మంది ఉన్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని వారు కూడా హీరోలుగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యి.. ఇప్పుడు సూపర్ స్టార్ లుగా వెలుగు వెలుగుతున్నారు. చిన్నతనంలో తినేందుకు కనీసం తిండి లేక ఇబ్బంది పడ్డ వారు చాలా మంది ఇప్పుడు ఇండస్ట్రీ లో వందలాది మంది కి డైరెక్ట్ గా లేదా ఇండైరెక్ట్ గా అన్నం పెడుతున్నారు.
హిందీతో పాటు సౌత్ లో పలు భాషల సినీ ప్రేమికులకు సుపరిచితుడు అయిన బోమన్ ఇరానీ బ్యాక్ గ్రౌండ్ ఏమీ లేకుండానే ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో బోమన్ ఇరానీ తన కెరీర్ గురించి మాట్లాడుతూ… చదువుపై ఆసక్తి ఉండేది కాదు. పదో తరగతి పూర్తి చేసిన తర్వాత వెయిటర్ గా కోర్స్ చేశాను. కోర్స్ పూర్తి చేసిన తర్వాత తాజ్ హోటల్ లో రూమ్ సర్వీస్ బాయ్ గా, వెయిటర్ గా చేశాను.
వెయిటర్ గా చేస్తున్న సమయంలో తన తల్లి ప్రమాదానికి గురి కావడంతో ఆమె నిర్వహించే దుకాణం ను నేను నడిపించాను. 14 సంవత్సరాల పాటు అమ్మ దుకాణం ను నేనే నడిపించాను. ఆ సమయం లోనే నేను పెళ్లి చేసుకున్నాను. జీవితంలో ఏదో లోపిస్తుంది అనిపించేది. అందుకే ఫోటోగ్రాఫర్ గా కెరీర్ ను మొదలు పెట్టాను. ఫోటోగ్రాఫర్ గా చేస్తున్న సమయంలోనే యాడ్ ఫిల్మ్ లో నటించే అవకాశం వచ్చింది.
180 కి పైగా యాడ్స్ లో బోమన్ ఇరానీ కనిపించాడు. యాడ్స్ లో నటన చూసి మున్నా భాయ్ ఎంబీబీఎస్ లో నటించే అవకాశం వచ్చిందట. ఆ సినిమా కి గాను ఇరానీ రూ.2 లక్షల పారితోషికం అందుకున్నాడు. ఆ సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్న బోమన్ ఇరానీ ఏ స్థాయి లో ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా రేంజ్ లో దూసుకు పోతున్నాడో మనం చూస్తూనే ఉన్నాం.
తెలుగు లో పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం లో వచ్చిన సూపర్ హిట్ మూవీ అత్తారింటికి దారేది సినిమాలో కీలక పాత్రలో బోమన్ ఇరానీ నటించి ఆకట్టుకున్నాడు. బెంగాల్ టైగర్, నా పేరు సూర్య మరియు అజ్ఞాతవాసి సినిమాల్లో కూడా ఈయన నటించి మెప్పించాడు. ముందు ముందు మరిన్ని సినిమాల్లో ఈయన నటించి ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటున్నాడట.
సూపర్ స్టార్ మహేశ్ బాబు – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న భారీ మాస్ ఎంటర్టైనర్ సినిమా గుంటూరు కారం. ఈ సినిమా రిలీజ్ కోసం, అలాగే ప్రమోషన్స్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతాయా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అదిరిపోయే ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ప్రమోషన్స్‌ను మొదలుపెట్టాలని మూవీటీమ్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. దసరా నుంచి ప్రమోషన్స్‌ను ప్రారంభించి.. రాబోయే రెండున్నార నెలల పాటు గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అండ్ సర్‌ప్రైజెస్‌తో సంక్రాంతి వరకు అభిమానుల్లో జోష్ నింపాలని రెడీ అవుతోందట. సంక్రాంతి రాబోయే సినిమాల లైనప్ పెద్దగా ఉండటం వల్ల.. వాటిలో గుంటూరు కారం సినిమాకే ఎక్కువ బజ్ క్రియేట్ అయ్యేలా స్ట్రాటజీని ఫాలో అవ్వాలని ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది.
ఫస్ట్ సింగిల్‌ను దసరా కన్నా ముందే రిలీజ్ చేయాలని మేకర్స్ కౌంట్‌డౌన్ పెట్టుకున్నారట. ఆడియో సింగిల్‌ను రిలీజ్ చేసి.. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ గ్యాప్ లేకుండా అప్డేట్స్ ఇస్తానే ఉంటామన్న సంకేతాలను ఇవ్వడంతో పాటు సినిమా ఎలా ఉండబోతుందో రుచి చూపించనున్నారట. మూవీ కచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నారంట.
ఇకపోతే ఇప్పటివరకు పోస్ట్‌పోన్ చేసుకుంటూ ఎన్నో కష్టాలను ఎదుర్కోని ఈ మధ్యే షూటింగ్‌ను జరుపుకుంటున్న ఈ గుంటురు కారం చిత్రాన్ని.. ఎలాగైనా వచ్చే ఏడాది 2024 సంక్రాంతికి రిలీజ్ చేసే దిశగా ముందుకు వెళ్తోంది మూవీటీమ్. అందుకు తగ్గట్టు షెడ్యూల్స్‌ను ప్లాన్ చేసి షూటింగ్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది. చిత్రంలో శ్రీలీల – మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేశ్ – త్రివిక్రమ్ కాంబోలో మాస్ అంశాలతో రూపొందుతున్న చిత్రమిది.
టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతున్న వ్యక్తి అనిల్ రావిపూడి. ప్రస్తుతం ఇతని నుంచి భగవంత్ కేసరి చిత్రం వస్తోంది. ఈ సినిమా హిట్ అయితే డబుల్ హ్యాట్రిక్ ని అతని ఖాతాలో వేసుకుంటాడు. రాజమౌళి తర్వాత టాలీవుడ్ లో ఫ్లాప్ అంటూ లేకుండా సినిమాలు చేస్తోన్న దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకుంటాడు.
అనిల్ రావిపూడి బెస్ట్ మూవీస్ లో ఎఫ్ 2 కచ్చితంగా ఉంటుందని చెప్పాలి. రెండు తరాలకి చెందిన ఇద్దరు హీరోలని తీసుకొని అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సినిమాని ఆవిష్కరించి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రంలో వరుఙ్ తేజ్ మొదటిసారి పూర్తిస్థాయిలో కామెడీ చేశారు. 30 కోట్లతో నిర్మించిన ఈ మూవీ ఏకంగా 100 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది.
ఇప్పటికి ఎఫ్2 మూవీ టీవీలలో కూడా ఆడియన్స్ ని అలరిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని దిల్ రాజు బాలీవుడ్ లో రీమేక్ చేయాలని అనుకుంటున్నారు. కచ్చితంగా సినిమాలో ఉన్న ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ డ్రామా బాలీవుడ్ ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే మూవీని హిందీలో ఇద్దరు స్టార్స్ తో చేయాలని అనుకుంటున్నారు.
దానికి సంబందించిన కసరత్తులు స్టార్ట్ అయ్యాయి. భగవంత్ కేసరి రిలీజ్ తర్వాత అనిల్ రావిపూడి ఎఫ్ 2 హిందీ రీమేక్ పైన వర్క్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. త్వరలో ఈ సినిమాకి సంబందించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. దిల్ రాజు బాలీవుడ్ లో కూడా స్టార్ ప్రొడ్యూసర్ అనిపించుకోవాలని అనుకుంటున్నారు. జెర్సీ, హిట్ సినిమాలని హిందీలో రీమేక్ చేశారు. ఈ రెండు పెద్దగా నార్త్ ఇండియన్ ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు.
మూడో ప్రయత్నంగా తన బ్యానర్ లోనే వచ్చి ఎఫ్2ని రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ మూవీ అయితే గ్యారెంటీ సక్సెస్ అని భావించి ముందడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఏ మేరకు దిల్ రాజుకి బాలీవుడ్ లో గేట్ పాస్ గా ఉపయోగపడుతుందో చూడాలి.
ఆహా ఓటీటీలో బాలకృష్ణ హోస్ట్ గా చేస్తోన్న టాక్ షో అన్ స్టాపబుల్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ షో ఇప్పటికే రెండు సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. రెండో సీజన్ లో ఆసక్తికరంగా సినీ ప్రముఖులు మాత్రమే కాకుండా రాజకీయ ప్రముఖులు అయిన చంద్రబాబు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి లాంటి మాజీ సిఎంలు వచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి స్టార్స్ పార్టిసిపేట్ చేశారు.
దీంతో సీజన్ 2 బిగ్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు సీజన్ 3 కి రంగం సిద్ధం అవుతోంది. తాజాగా మూడో సీజన్ లో భాగంగా మొదటి ఎపిసోడ్ ని షూట్ చేశారు. భగవంత్ కేసరి టీమ్ తో అన్ స్టాపబుల్ సీజన్ 3 ఫస్ట్ ఎపిసోడ్ ఉండబోతోంది. మరి తన మూవీ టీమ్ సభ్యులని హోస్ట్ సీట్ లో కూర్చొని బాలయ్య ఎలాంటి ప్రశ్నలు వేయబోతున్నాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
సీజన్ 3 ఎపిసోడ్ 1 షూటింగ్ కంప్లీట్ అయిన విషయాన్ని ఆహా టీమ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇందులో కాజల్ అగర్వాల్, అనిల్ రావిపూడి, శ్రీలీలతో పాటు విలన్ రోల్ చేసిన అర్జున్ రాంపాల్ కూడా ఉన్నారు. వీరందరితో బాలయ్య ముచ్చట్లు, సినిమా విశేషాలు చర్చించారు. ఇక సీజన్ 3ని తక్కువ ఎపిసోడ్స్ తోనే ఫినిష్ చేయనున్నారంట.
ఇందులో మెగాస్టార్ చిరంజీవితో ఒక ఎపిసోడ్ ఉంటుందంట. ఇది సీజన్ కి ఫైనల్ ఎపిసోడ్ అనే మాట వినిపిస్తోంది. చాలా కాలంగా బాలయ్య, చిరంజీవి మధ్య కొంత గ్యాప్ నడుస్తోంది. ఈ గ్యాప్ ఈ సారి టాక్ షోతో పూర్తిగా దూరం అయిపోతుందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. అలాగే రామ్ చరణ్ కూడా ఒక ఎపిసోడ్ కి గెస్ట్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్.
యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైనట్లేనా? ఇంతకాలం హీరోగా అలరించిన రాజశేఖర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొత్త టర్నింగ్ తీసుకున్నట్లేనా? అంటే అవుననే తెలుస్తోంది. యూత్ స్టార్ నితిన్ కథానాయకుడిగా వక్కంతం వంశీ తెరకెక్కిస్తోన్న ‘ఎక్స్ ట్రా’ సినిమాలో రాజశేఖర్ ఓ కీలక పాత్రకి ఎంపికయ్యారు. రెండు రోజుల కిందటే ఆయన ఎక్స్ ట్రా సెట్స్ కి హాజరయ్యారు. తనదైన శైలిలో సాగే పాత్ర అని తెలుస్తోంది.
ఆయన ఇమేజ్ ని పక్కాగా మ్యాచ్ చేసే రోల్ ఇది. తెరపై కనిపించినంత సేపు తన మార్క్ తప్పనిసరిగా ఉంటుందని అంటున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే ఇలాంటి అవకాశాలు రావడం రాజశేఖర్ కి కొత్తేం కాదు. గతంలో చాలా మంది స్టార్ హీరోల చిత్రాల్లో రాజశేఖర్ కి అవకాశాలు వచ్చాయి. కానీ వాటిని ఆయన సున్నితంగా తిరస్కరించారు. చివరికి మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా చాలా కీలకమైన పాత్ర ఇచ్చినట్లు ప్రచారం సాగింది.
వచ్చిన అవకాశాలన్నీ కూడా ఆయన ఇమేజ్ కి తగ్గట్టు డిజైన్ చేసినవే. కానీ అలాంటి అవకాశాలు కూడా కాదనుకున్నారు. అప్పుడలా కాదనుకున్న రాజేశేఖర్ ఇప్పుడు నితిన్ సినిమాలో నటించడం అన్నది ఆసక్తికర అంశమే. ఈ సినిమా తర్వాత ఇదే తరహా పాత్రలు వస్తే కొనసాగుతారా? లేక నితిన్ సినిమాతోనే సరిపెడతరా? అన్నది ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే రాజశేఖర్ హీరోగా ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. తెలుగు ప్రేక్షకుల్లో గొప్ప ఫాలోయింగ్ ఉన్న నటుడు. వెండి తెరపై కొన్ని సాహసోపేతమైన పాత్రలు సైతం చేసారు.
అయితే కాలక్రమంలో సినిమాలు తగ్గించారు. దీంతో మార్కెట్ పైనా ప్రభావం పడింది. ఆ సమయంలో ఇతర హీరోల చిత్రాల్లో అవకాశాలు వచ్చినా ముందుకెళ్లలేదు. అయితే ఇండస్ట్రీలో ఎదగకుండా తనని కొన్ని శక్తులు అడ్డుకున్నాయని రాజేశఖర్ పలు సందర్భాల్లో ఆరోపించారు. ఓ సమయంలో ఏకంగా కొంత మంది సినిమా నటుల కాళ్లకి సైతం నమస్కరించడం జరిగింది. తొటి నటుడు అలా నమస్కరించడంతో అంతా షాక్ అయ్యారు. ఆయన ఎందుకిలా చేస్తున్నారో అర్దం కాక తల పట్టుకున్నారు. రాజశేఖర్ చివరిగా ‘శేఖర్’ అనే చిత్రంలో నటించారు. ఆ తర్వాత ఆయన నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
ఇండస్ట్రీలో ఒక ఫేజ్ లోనే అవకాశాలు క్యూ కడతాయి. ఆ తర్వాత ఛాన్సులు ఇవ్వమన్నా ఇవ్వరు. సక్సెస్ అవ్వాలన్నా….ఫెయిలవ్వాలన్నా! అప్పుడే తానేంటో నిరూపించుకోవాలి. లేదంటే పరిస్థితి మళ్లీ మొదటి కే వస్తుంది. తాజాగా హాట్ సంచలనం సుర్వీన్ చావ్లా అదే పరిస్థితుల్లో కనిపిస్తుంది. ఆరంభంలో అమ్మడు వరుసగా అన్ని భాషల్లోనూ సినిమాలు చేసింది. తెలుగు..కన్నడ..హిందీ అంటూ చుట్టేసింది.
ఎక్కువగా బాలీవుడ్ లోనే సినిమాలు చేసింది. అక్కడ అవకాశాలు తగ్గడంతో వెబ్ సిరీస్ లపైనా పడింది. చివరికి ‘రానా నాయుడు’ సిరీస్ లో కూడా అమ్మడు ఛాన్స్ దక్కించుకుని మరోసారి తెలుగు ఆడియన్స్ ని మురిపించే ప్రయత్నం చేసింది. కానీ పనవ్వలేదు. ఇప్పుడీ బ్యూటీ కి అవకాశాలు రాలేదు. ఇన్ స్టా గ్రామ్ లో అమ్మడు ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలతో దుమారం రేపుతుంది.
అందాల ఆరబోతలా తనకంటూ ఓ ప్రత్యేకత ఉందని చాటి చెబుతుంది. తాజాగా మరో పిక్ తో ముందు కొచ్చేసింది. ఇదిగో ఇక్కడిలా మిలి మిల మెరిసే బ్యాక్ గ్రౌండ్ లో సెటప్ లో.. డిజైనర్ ప్రాక్ ధరించి వివిధ భంగిమల్లో కెమెరాకి ఫోజులిచ్చింది. అమ్మడి థై హైలైట్. థై అందాల్ని పర్పెక్ట్ గా ఎక్స్ పోజ్ చేసింది. అమ్మడి స్కిన్ టోన్..చురకత్తిలాంటి చూపులతో యువతని ఆకర్షించే లుక్ ఇది.
ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు గుప్పిస్తు న్నారు. బాలీవుడ్ లో అవకాశాలు తగ్గినప్పటి నుంచి సుర్వీన్ ఇలా ఇన్ స్టా రచ్చకెక్కింది. తన హాట్ షోకి ఛాన్సులు ఇవ్వకపోతారా? అని ఎదురు చూస్తుంది. ఛాన్స్ ఇస్తే సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపో తానంటోంది. కానీ ఆ ఛాన్స్ ఇచ్చేది ఎవరు?
డార్లింగ్ ప్రభాస్ బర్త్ డే అంటే అభిమానులకు పండగే. ఏదో స్పెషల్ ఉంటుందని ఆశిస్తారు. అందులోనూ ఈసారి ఏకంగా మూడు సినిమాలు సెట్స్ లో ఉండటంతో ట్రీట్ ఇంకా స్పెషల్ గా ఉంటుందని భావిస్తు న్నారు. మరి డార్లింగ్ ఆ రకంగా షురూ చేస్తాడా? అంటే అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఈనెల 23 డార్లింగ్ బర్త్ డే. ప్రస్తుతం డార్లింగ్ వయసు 43… అక్టోబర్ 23 తో 44వ వసంతంలో కి అడుగు పెడతాడు.
అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసారి కూడా డార్లింగ్ విదేశాల్లోనే పుట్టిన రోజు వేడుకలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి తన స్నేహితులంతా 23 కల్లా ఫారిన్ లో ఉండే లా ప్లాన్ చేసుకుంటున్నారుట. కొన్ని రోజులుగా ప్రభాస్ విదేశాల్లోనే ఉంటోన్న సంగతి తెలిసిందే. సర్జరీ నిమిత్తం విదేశాలు వెళ్లిన ప్రభాస్ విశ్రాంతి లో భాగంగా అక్కడే ఉన్నారు. ప్రస్తుతం ఆరోగ్యం…సర్జరీ అంతా సక్సెస్ పుల్ గా ఉన్నా! హైదరాబాద్ కి మాత్రం తిరిగిరాలేదు.
ఇక మరో పది రోజుల్లో ఎలాగూ పుట్టిన రోజు కూడా వస్తుందనేమో ఏకంగా మరోసారి విదేశాల్లోనే ఆవేడుకలు నిర్వహిస్తున్నట్లు సన్నిహితుల నుంచి తెలిసింది. ఈనేపథ్యంలో ఆయన నటిస్తోన్న సినిమా అప్ డేట్లు కూడా ఆరోజు బయటకు వచ్చే అవకాశం ఉంది. బర్త్ డే కాబట్టి మూడు సినిమాల నుంచి అభిమానుల్ని అలరించేలా ప్రచార చిత్రాలు రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని తెలు
మారుతి సినిమాకి సంబంధించి కచ్చితంగా ఏదో సర్ ప్రైజ్ ఉంటుందని అంటున్నారు. అలాగే ‘సలార్’ రిలీజ కి రెడీ అయినా ఇంతవరకూ ట్రైలర్ రిలీజ్ చేయలేదు. అటుపై వాయిదాల పర్వం తెలిసిందే. బర్త్ డేకి అభిమానులకు ట్రీట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ట్రైలర్ ఆరోజు రిలీజ్ చేసే అవకాశం ఉందంటు న్నారు. అలాగే ‘కల్కి’ నుంచి సర్ ప్రైజ్ ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. మరి ఫ్యాన్స్ ఆశలు తీరుస్తారా? లేదా? అన్నది ఆ ముందు రోజు తెలిసిపోతుంది. ఇంతవరకూ ఈ మూడు సినిమాలకు సంబంధించి ఎలాంటి ప్రచారం చిత్రం రిలీజ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటనైతే లేదు.
బాలీవుడ్ లెజెండ్ అమితాబచ్చన్ కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో అంచలం చెలుగా ఎదిగిన నటుడాయన. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా పరిశ్రమకొచ్చి సక్సెస్ అయిన నటుడు. నాలుగు దశాబ్ధాలుగా ప్రేక్షకుల్ని తనదైన మార్క్ చిత్రాలతో అలరిస్తున్నారు. హిందీ సినిమాలతో పాటు దక్షిణాది చిత్రాల్లోనూ కీలక పాత్రల్లో మెప్పిస్తున్నారు. నేటితో ఆ లెజెండరీ 81వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్బంగా అమితాబ్ కుటుంబ సభ్యుల సమక్షంలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులు భారీ ఎత్తున శుభాకాంక్షల వెల్లువ కురిపిస్తున్నారు. అమితాబ్ ఐకానిక్ చిత్రాల గురించి స్మరించుకుంటున్నారు. ఆ రోజుల్లో అమితాబ్ ఎలాంటి సినిమాలు చేసేవారు…కాలంతో పాటు ఆయన మారిన విధానం…నవతరం నటులతో ఆయన పనిచేస్తున్న విధానంపై తమదైన శైలి పోస్టులతో అభిమానం చాటుకుంటున్నారు. 500 తో మొదలైన అమితాబ్ నేడు వేల కోట్ల కు అధిపతి.
నివేదికల ప్రకారం ఆయన ఆస్తి విలువ నాలుగు వేలకు కోట్లకుపైగానే ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఆయన ఒక్కో సినిమాకి 5 నుంచి పది కోట్ల మధ్యలో ఛార్జ్ చేస్తున్నారు. కొన్నిసార్లు స్నేహ సోదర భావంతో ఎలాంటి పారితోషికం తీసుకోకుండా సినిమాలు చేసిన సందర్భాలున్నాయి. వ్యాపార ప్రకటనల ద్వారా ఏటా ఆదాయం భారీగానే ఉంటుందని తెలుస్తోంది. ఒక్కో ప్రకటని ఐదు కోట్లు ఛార్జ్ చేస్తారుట.
సినిమాలు..ప్రకటనల ద్వారా ఆయన ఆదాయం 100 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ఇంకా ఇతర వ్యాపారాలు…ముంబైలో ఖరీదైన ప్రాంతాల్లో విల్లాలు..అపార్టుమెంట్లు ఉన్నాయి. ఆయన జుహూ ప్రాంతాంలో జల్సా అనే బంగ్లా లో నివసిస్తున్నారు. దీని విలువ దాదాపు 100 కోట్లు ఉంటుందని అంచనా. ఎన్నో బ్రాండెడ్ కార్లు ఆయన సోంతం. ప్రముఖ కంపెనీ లగ్జరీ కార్లు అన్ని ఉన్నాయి. బిగ్ బీ ఆస్లులు…సంపాదన పక్కనబెడితే 81 లోనూ నటుడిగా అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ వయసులోనూ నేటి తరం హీరోలతో పోటీ పడి మరీ సినిమాలు చేస్తున్నారు. హిందీతో పాటు తెలుగు సినిమాలు ఎక్కువగా చేసున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్..మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు అమితాబ్ కంటే వయసులో చిన్నవారైనా! ఆయన వేగాన్ని మాత్రం అందుకోలేకపోతున్నారు. 81 లోనూ దూకుడు చూపిస్తూ దటీజ్ బిగ్ బీ అనిపిస్తున్నారు.
కొన్ని కాంబినేషన్‌లు అభిమానుల్లో ప్రత్యేకతను సంతరించుకుంటుంటాయి. అలాంటి కలయికలో మళ్లీ మరో సినిమా రావాలని ఆశగా ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు అలాంటి క్రేజీ కాంబినేషనే మళ్లీ సెట్ కాబోతోందా?.. అభిమానుల్ని సర్ ప్రైజ్ చేయబోతోందా? అంటే ఇండస్ట్రీ వర్గాల్లో అవుననే సమాధానం వినిపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. విక్టరీ వెంకటేష్, యంగ్ హీరో నాగచైతన్య మామా అల్లుళ్లు అన్న విషయం తెలిసిందే. వీరిద్దరు కలిసి తొలి సారి చేసిన సినిమా ‘వెంకీమామ’.
బాబి రూపొందించిన ఈ మూవీ దగ్గుబాటి, అక్కినేని అభిమానుల్ని సర్ ప్రైజ్ చేసింది. ఈ ఇద్దరు కలిసి ‘ప్రేమమ్’ లో మామా అల్లుళ్లుగా నటించారు. ఇద్దరి మధ్య కుదిరిన కెమిస్ట్రీ, వెంకీ డీన్‌తో మాట్లాడే సన్నివేశాల్లో చేసిన హడావిడీ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలిచాయి. దీని తరువాత పూర్తి స్థాయి పాత్రల్లో మామా అల్లుళ్లుగా వెంకీ, చైతూ కలిసి నటించిన తొలి సినిమా ‘వెంకీమామ’. ఇందులో ఇద్దరిని వెండితెరపై చూసి అక్కినేని అభిమానులు, దగ్గుబాటి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలయ్యారు. బాగా ఎంజాయ్ చేశారు. మళ్లీ నాలుగేళ్ల విరామం తరువాత ఈ క్రేజీ మామా అల్లుళ్లు కలిసి మరో సినిమాకు రెడీ అవుతున్నారని తెలిసింది.
ఈ మూవీని కోలీవుడ్ నిర్మాత, స్టూడియో గ్రీన్ అధినేత కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోలకు స్కోప్ ఉండగా సీనియర్‌గా వెంకటేష్‌ని ఫైనల్ చేసుకున్నారని తెలిసింది. ఇక మరో కీలక పాత్ర కోసం నాగచైతన్య అయితే బాగుంటుందని సురేందర్‌రెడ్డి ప్లాన్ చేస్తున్నారట. చైతూ దాదాపుగా ఖరారు అయినట్టేనని తెలుస్తోంది. చైతూ ప్రస్తుతం చందూ మొండేటితో సినిమా చేస్తున్నాడు. వెంకటేష్ ‘సైంధవ్’ని పూర్తి చేసి డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. వీటి తరువాతే వచ్చే ఏడాది ఈ క్రేజీ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని, భూపతిరాజా కథ అందిస్తున్నారని తెలిసింది.
మాస్ మహారాజ్ రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ సభ్యులు అందరూ కూడా చాలా బిజీగా పాల్గొంటున్నారు. అయితే ఈ సమయంలో నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కార్యాలయంలో ఐటీ అధికారులు సోదరులు నిర్వహించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఐటీ జిఎస్టికి సంబంధించిన లావాదేవీల విషయంలో అధికారులు హఠాత్తుగా చిత్ర నిర్మాణ సంస్థ అభిషేక్ అగర్వాల్ కార్యాలయంలో సోదరులు నిర్వహిస్తోన్నట్లు సమాచారం.
అయితే ఈ తరహా ఐటి రైట్స్ ఇండస్ట్రీలో కొత్తేమి కాదు. గతంలో మైత్రి మూవీ మేకర్స్ అలాగే మరికొంతమంది ప్రముఖ నిర్మాతల ఆఫీసులలో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. ఇక ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు సినిమా నిర్మాత అభిషేక్ అగర్వాల్ సంస్థ వైపు యూ టర్న్ తీసుకోవడం కొంత హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్య కాలంలో అభిషేక్ అగర్వాల్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు.
ది కాశ్మీర్ ఫైల్స్ వీరి ప్రొడక్షన్ లోనే తెరపైకి వచ్చింది. ఆ సినిమా ప్రపంచం వ్యాప్తంగా ఉహించని స్థాయిలో. కలెక్షన్స్ అందుకోవడమే కాకుండా బీజీపీ ప్రముఖ నాయకుల మన్ననలు కూడా పొందింది. అలాగే కార్తికేయ 2 సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో మంచి వసూళ్లను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు సినిమాను కూడా అదే తరహాలో గ్రాండ్ గా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.
గత రెండు మూడు వారాలుగా టైగర్ నాగేశ్వరరావు చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్స్ తో చాలా బిజీగా గడుపుతున్నారు. హీరో రవితేజ తో పాటు హీరోయిన్ కూడా అటు నార్త్ లొనే కాకుండా ఇటు సౌత్ లో కూడా గ్యాప్ లేకుండా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సినిమాతో తప్పకుండా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ ఆదుకోవాలి అని రవితేజ ప్రమోషన్ అయితే చేస్తున్నాడు. ఈ సినిమా రవితేజ కెరీర్ లోనే అత్యధిక భారీ బడ్జెట్ తో రూపొందింది. ఈనెల 23వ తేదీన టైగర్ నాగేశ్వరరావు తెలుగు లొనే కాకుండా హిందీ తమిళ్ మలయాళం కన్నడ భాషలో విడుదలవుతోంది. ఇక సినిమా విడుదలకు సిద్దమవుతున్న సమయంలో ఐటీ సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. మరి ఈ విషయంలో ఆ సంస్థ ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.
రాఘవ లారెన్స్ కొంత కాలంగా హారర్ సినిమాలతోనే బిజీ అయిన సంగతి తెలిసిందే. ‘ముని-2’ నుంచి ఎక్కువగా ఆ తరహా సినిమాలే చేస్తున్నాడు. హారర్ థ్రిల్లర్ సక్సెస్ కి సీక్వెల్స్ చేసే పనిలోనే నిమగ్నమ య్యాడు. గత రెండు..మూడేళ్లగా ఆ జానర్ కి పూర్తిగా అంకితమైపోయాడు. ‘కాంచన-3′. ..’రుద్రన్’.. ‘చంద్ర ముఖి-2’ అంటూ దెయ్యాలు..ఆత్మలతోనే ప్రయాణం చేసాడు. ఇతర ఏ జానర్ చిత్రాలు టచ్ చేయలేదు.
స్వీయా దర్శకత్వంలో చేసిన సినిమాలు..ఇతర దర్శకులతో చేసిన సినిమాలు కూడా అదే కొవకు చెందినవి. ఇటీవలే ‘చంద్రముఖి-2’ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు గానీ..అది ఆశించిన ఫలితాన్ని సాధించలేదు. ఈ నేపథ్యంలో ‘కాంచన -4’ ఎప్పుడు చేస్తున్నారు? అంటే లారెన్స్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ‘దెయ్యాల మీద సినిమాలు చేసి మనశ్శాంతి కోల్పోయాను. రాత్రుళు కూడా కలలోకి ఆ సినిమాలే వస్తున్నాయి.
ఆత్మలు..దెయ్యాలతో కలిసి నిద్రపోతున్నాను. దీంతో నా మైండ్ పిచ్చి పిచ్చిగానూ మారిపోయింది. కానీ ఏదో ఒక రోజు కాంచన-4 తప్పకుండా చేస్తాను’ అని అన్నారు. మొత్తానికి వరుసగా దెయ్యాల సినిమాలు చేయడంతో లారెన్స్ బాగా డిస్టబెన్స్ కి గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి వాటినుంచి రిలాక్స్ అయ్యేందు కు ఆజానర్ కి భిన్నమైన సినిమాలు చేస్తన్నాడు.
‘ఇటీవలే ‘జిగర్తాండ్ డబుల్ ఎక్స్’ షూటింగ్ పూర్తిచేసాడు. ప్రస్తుతం ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సినిమా విజయం సాధిస్తుందన్న ధీమాని వ్యక్తం చేసాడు లారెన్స్ . కార్తీక్ సుబ్బరాజ్ మేకింగ్ కి ఫిదా అయినట్లు తెలిపారు. అలాగే మరో తమిళ్ సినిమా కూడా సెట్స్ లో ఉంది. అయితే వరుసగా కోలీవుడ్ లో నే సినిమాలు చేస్తున్నారు తప్ప తెలుగులో మాత్రం సినిమాలు చేయలేదు. ఇక్కడ లారెన్స్ కి మంచి పేరుంది. మంచి పరిచయాలున్నాయి. నటుడిగా…దర్శకుడిగా అతనితో సినిమాలు చేయడానికి అంతా సిద్దంగానే ఉన్నారు. ఇతర భాషల హీరోలంతా టాలీవుడ్ కి జంప్ అవుతుంటే లారెన్స్ మాత్రం అనువాద చిత్రాలతోనే మెప్పిస్తున్నారు.
టైగర్ నాగేశ్వరావు రిలీజ్ కి ఇంకా పది రోజులే సమయం ఉండటంతో యూనిట్ ప్రచారంలో పనుల్లో బిజీ అయినట్లు తెలుస్తోంది. రవితేజ కెరీర్ లో తొలి పాన్ ఇండియా చిత్రం కావడంతో రాజాకి నార్త్ మార్కెట్ ఎంతో కీలకం. తెలుగు రాష్ట్రాల్లో అతని సినిమాకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. పోటీగా ‘లియో’ లాంటి సినిమా ఉన్నా! తెలుగు మార్కెట్ లో హిట్ టాక్ వస్తే రాజాని ఢీ కొట్టడం అసాధ్యం.
అయితే ఇతర భాషల్లోనూ టైగర్ నాగేశ్వరరావు ఎలా రాణిస్తాడు? అన్నది ఆసక్తికరం. ముఖ్యంగా హిందీలో ఇదే తొలి రిలీజ్ కావడంతో రవితేజ అక్కడ ప్రచారంపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. హీరోయి న్లు..కిందస్థాయి నటులంతా హైదరాబాద్ లో ఉండి ప్రచారం నిర్వహిస్తుంటే రాజా ఒక్కడే సోలోగా ముంబైలో తిష్ట వేసినట్లు కనిపిస్తుంది. తాజాగా బాలీవుడ్ టాలెంట్ షో ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ కి రవితేజ హాజరయ్యాడు. ఆ షో హెస్ట్ లో ఒకరైన శిల్పాశెట్టి తో కలిసి రాజా డాన్సులు చేసారు.
తన సినిమాలోని “ఏక్ దమ్ ఏక్ దమ్” పాటకు డాన్సులు చేసారు. ఇద్దరు హుక్ స్టెప్ వేసి ఆకట్టుకు న్నారు. ఆ వీడియోఎని శిల్పా శెట్టి కుంద్రా సోషల్ మీడియాలో షేర్ చేసింది. రవితేజ బ్లాక్ అండ్ బ్లాక్ స్పోర్స్ట్ దుస్తుల్లో కనిపిస్తుండగా..శిల్పాశెట్టి పసుపు వర్ణం చీరల ధగధగలాడిపోతుంది. శిల్పాశెట్టి చేతికి ధరించిన గాజులు మాత్రం సమ్ థింగ్ స్పెషల్ గా ఫోకస్ అవుతున్నాయి. రవిక మ్యాచింగ్ గాజులు ధరించినట్లు కనిపిస్తుంది.
ప్రస్తుతం ఈ వీడియో అంతర్జాలంలో వైరల్ గా మారింది. రవితేజ అభిమానులు సాగరకన్యతో డాన్సు చూసి మురిసిపోతున్నారు. మరి ముంబైలో తిష్ట వేసిన రవితేజకి కరణ్ జోహార్ నుంచి పిలుపు రాలేదా? అన్నది చూడాలి. టాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరు ముంబైలో కనిపించినా కచ్చితంగా కరణ్ షోలోనూ పాల్గొంటారు. ఆయనే ప్రత్యకంగా ఆహ్వానిస్తారు. మరి రవితేజకి ఆహ్వానం అందిందా? లేదా? అన్నది తెలియాలి. ఒకవేళ అలాంటిదే ఉంటే ఇప్పటికే ప్రోమోలు లీకయ్యాయి. మరి ఆసంగతేంటో తేలాలి.
హీరో ఫ్రెండ్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన యంగ్ అండ్, టాలెంటెడ్ సుహాస్ ఆ తరువాత చిన్న, లో బడ్జెట్ సినిమాలకు, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సిరీస్‌లకు కెరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. తను సైకో సీరియల్ కిల్లర్‌గా నటించిన మూవీ ‘హిట్ 2’. వరుసగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ లని సొంతం చేసుకున్న అడివి శేష్ కథానాయకుడిగా నటించారు. ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘హిట్’కు దీన్ని సీక్వెల్‌గా తెరకెక్కించారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ మూవీ గత ఏడాది డిసెంబర్ 2న విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇందులో సుహాస్ సీరియల్ కిల్లర్ సైకో కుమార్‌గా నటించి ఆశ్చర్యపరిచాడు. తన కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యేదని రీసెంట్‌గా దర్శకుడు శైలేష్ కొలను వెల్లడించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో సుహాస్ డేట్స్ సమస్య తలెత్తే అవకాశం ఉందని, తను లేకపోతే షూటింగ్ ఆగిపోయే ప్రమాదం ఉందని దర్శకుడు శైలేష్ కొలను భయపడ్డారట. దానిక కారణం సుహాస్ మరో సినిమా కోసం గుండు చేయించుకోవడమేనట.
సుహాస్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. దుశ్యంత్ కటికనేని దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాని బన్నీవాసుతో కలిసి దర్శకుడు వెంకటేష్ మహ సమర్పించారు. ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ మూవీ త్వరలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. అంతే కాకుండా టీజర్‌లోని ఓ సన్ని వేశం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
సినిమాలో మల్లిగాడు పాత్రలో సుహాస్ నటించాడు. ఈ క్యారెక్టర్ అత్యంత సహజంగా రావడం కోసం కీలక సన్నివేశంలో సుహాస్ ఎలాంటి మేకప్ ట్రిక్స్ వాడకుండా స్వయంగా గుండు చేయించుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. చాలా వరకు కీలక నటులు రియల్‌గా సినిమా కోసం గుండు చేసుకున్న సందర్భాలు చాలా తక్కువ ‘జెంటిల్‌మెన్’ కోసం అప్పట్లో చరణ్ రాజ్ ఓ సీన్లో రియల్‌గా గుండు చేయించుకుని నటించారు. మళ్లీ ఇన్నేళ్లకు సుహాస్ ‘అంబాజీపేట మ్యారేజీబ్యాండు’ కోసం గుండు చేయించుకుని నటించడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
తెలుగు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు వరుస హిట్ సినిమాలలో నటించిన ఈ అమ్మడుకు.. ప్రస్తుతం తెలుగులో అంతగా అవకాశాలు రావట్లేదు. దీంతో ఈ భామ ప్రస్తుతం బాలివుడ్లో వరుస సినిమాలు చేస్తూ బిజీ అయింది. అయితే ఈ అమ్మడు పుట్టినరోజు సందర్బంగా తన స్నేహితులు, సన్నిహితుల నడుమ గ్రాండ్‌గా ఆమె బర్త్‌డే సెలెబ్రషన్స్ జరిగాయి.
ఆ సెలెబ్రేషన్స్ ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్ పోస్ట్ చేసింది. బెస్ట్ ఫ్రెండ్స్‌తో బెస్ట్ బర్త్డ్. ఈ పుట్టినరోజు ప్రత్యేకం చేసినందుకు ప్రతిఒక్కరికి ధన్యవాదాలు. నాకు లవ్లీ విషెస్ తెలిపిన ప్రతిఒక్కరికీ కూడా బిగ్ థ్యాంక్యూ అంటూ రాసుకొచ్చింది.
ఈ పిక్స్‌లో రకుల్ ప్రీత్ సింగ్.. చాక్లెట్ కేక్ కట్ చేసినట్లు కనిపిస్తోంది. తన భాయ్ ఫ్రెండ్ కూడా వేడుకకు హాజరై సందడి చేశాడు. నటీమణులు మంచు లక్ష్మీ, ప్రగ్యా జైశ్వాల్ కూడా ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొని సందడి చేశారు. రకుల్ సిల్వర్ కలర్ టాప్, జీన్స్ మిడ్డీ టైప్ ప్యాంట్లో మెరిసింది. ఎంతో అందంగా కనిపించింది. బొకేలు పట్టుకుని నవ్వుతూ ఎంతో ఆనందంగా ఉంది. సెల్ఫీలకు పోజులు కూడా ఇచ్చింది. ఆ ఫొటోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. నెటిజన్లు ఆమెకు బర్త్డె విషెస్ తెలుపుతున్నారు.
కాగా, రుకుల్ ప్రీత్ సింగ్.. 1990 అక్టోబర్ 10న పంజాబీ ఫ్యామిలీలో జన్మించింది. కుల్విందర్ సింగ్,రాజేందర్ కౌర్ దంపతులకు జన్మించింది. తండ్రి ఆర్మీ ఆఫీసర్. దీంతో రకుల్ చదువు కూడా ఆర్మీ స్కూల్లోనే సాగింది. ఆమెకు సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ కూడా ఉన్నారు. ఇకపోతే రకుల్ ప్రీత్ సింగ్ నటించిన సినిమాలు ఈ మధ్య సరిగ్గా ఆడట్లేదు. సరైన హట్ కోసం ఆమె ఎదురుచూస్తోంది. త్వరలోనే తమిళంలో శివకార్తికేయన్‌తో కలిసి నటించిన అయలాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరిన్ని చిత్రాలను కూడా లైన్‌లో పెట్టింది.