మూగ జీవుల ప్రేమకు ఫిదా అయిన సమంత

తమిళనాడులోని పలమేడుకు చెందిన ఒక రైతు వద్ద ఆవు ఎద్దు చాలా కాలంగా ఉంటున్నాయి. ఆవు కొన్నాళ్లుగా సరిగా పని చేయలేక పోతున్న కారణంగా దాన్ని అమ్మేసి కొత్త ఆవు లేదా ఎద్దు కొనుగోలు చేయాలనుకున్నాడట. ఆ ఆవును అమ్మేసేందుకు వాహనంలో ఎక్కించాడు. ఆవును ఎక్కడికో తీసుకు వెళ్తున్నట్లుగా గుర్తించిన ఎద్దు వాహనంను వెంబడించింది. వాహనంకు అడ్డుగా నిలిచింది. డ్రైవర్ వద్దకు వెళ్లి జాలిగా చూసింది. ఈ మొత్తం వ్యవహారం వీడియో తీసి కొందరు సోషల్ మీడియాలో పెట్టారు.

జూన్ నెలలో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అప్పుడు చూడలేదో లేక మరేంటో కాని సమంత ఇప్పుడు ఆ వీడియోకు స్పందించింది. వీడియోను రీ ట్వీట్ చేసి హార్ట్ సింబల్ ను పోస్ట్ చేసింది. ఒక్క లవ్ సింబల్ తో సమంత తాను చెప్పాలనుకున్నది చెప్పేసింది. ఆ మూగ జీవుల మద్య ఉన్న అన్యోన్యం మరియు ఆప్యాయత ఎలాంటిదో వీడియో చూస్తుంటే అర్థం అవుతుంది. మనసున్న ఏ ఒక్కరు అయినా ఖచ్చితంగా వీడియోకు కదిలి పోవాల్సిందే. సమంత కూడా కదిలి పోయి ప్రేమకు చిహ్నం అంటూ హార్ట్ సింబల్ ను పోస్ట్ చేసింది. సమంత రీ ట్వీట్ వల్ల మళ్లీ ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

True love still exists❤️❤️❤️
Touching story from India

Related Images:

ట్రెండ్ అవుతున్న ‘#CancelNetflix’ హ్యాష్ ట్యాగ్

అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ మైన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ పై మరోసారి ఇండియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో రెండు మూడు సార్లు ఇండియన్స్ మనో భావాలను దెబ్బ తీసేలా నెట్ ఫ్లిక్స్ వ్యవహరించడంతో విమర్శల పాలయిన నెట్ ఫ్లిక్స్ తాజాగా మరోసారి సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుంది. ఈసారి కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా విమర్శలు ఎదుర్కొంటుంది. ‘క్యూటీస్’ అనే ఫ్రెంచ్ మూవీని తాజాగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయడం జరిగింది. అందులో ఉన్న కంటెంట్ పై విమర్శలను చవి చూసింది.

క్యూటీస్ మూవీలో 11 ఏళ్ల బాలికలతో అసభ్యంగా డాన్స్ లు చేయించడంతో పాటు వారిని అసభ్యంగా చూపించారు. చిన్న పిల్లలను అలా చూపించడం ప్రపంచ వ్యాప్తంగా కూడా సరైనది కాదుగా భావిస్తున్నారు. అందుకే సోషల్ మీడియాలో #CancelNetflix హ్యాష్ ట్యాగ్ తో తమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు. ఇలాంటి సినిమాలు సమాజానికి ఎంత మాత్రం మంచిది కాదంటూ అంతర్జాతీయ స్థాయిలో అభిప్రాయం వ్యక్తం అవుతున్న ఈ నేపథ్యంలో నెట్ ఫ్లిక్స్ షేర్ల విలువ అంతర్జాతీయ మార్కెట్ లో ఏకంగా 4 శాతం వరకు పడి పోయినట్లుగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Related Images:

‘నా 7500 ఎవరు మింగారు.. నా పైసల్ నాకు కావాలే’

‘నచ్చావులే’ హీరోయిన్ మాధవీలత సినిమాలతో కంటే తన వివాదాస్పద వ్యాఖ్యలతో ఎక్కువగా ఫేమస్ అవుతూ వచ్చారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాధవీ లత.. సినీ రాజకీయ సమకాలీన అంశాలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తూ వస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తనకు నచ్చని విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్తూ వస్తోంది. ఇటీవల సినీ ఇండస్ట్రీని కుదిపేస్తున్న డ్రగ్స్ మాఫియా టాలీవుడ్ లో కూడా ఉందని.. డ్రగ్స్ లేకుండా అసలు పార్టీలే జరగవని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో తాజాగా తన ఫేస్ బుక్ పేజీలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ని ట్యాగ్ చేసి ”నా డబ్బు కోసం నేను డిమాండ్ చేస్తున్నాను.. నా 7500 రూపాయలు ఎవరు మింగారు” అంటూ పోస్ట్ పెట్టింది.

కాగా మాధవీలత విద్యుత్ బిల్లు చెల్లింపులో తనకు జరిగిన అన్యాయం పై నిలదీస్తూ.. ”ఆంధ్ర తెలంగాణ ఎక్కడ తగ్గడం లేదు కరెంటు బిల్లులు. మే నెలలో 7500 బిల్లు కట్టాను ఎయిర్టెల్ యాప్ లో.. కానీ కరెంటు బిల్లు కట్టలేదని మళ్ళీ 7500 కట్టించుకున్నారు. సరే అని క్రెడిట్ కార్డు వాళ్ళకి బ్యాంకు వాళ్ళు మెయిల్ పెడితే ‘మేము ఎయిర్టెల్ కి పే చేసాము ‘ అన్నారు. ఎయిర్టెల్ వాళ్ళకి మెయిల్ పెడితే సాక్షాలతో సహా మెయిల్ పంపుతూ బిల్లు కట్టాము అన్నారు. మరి నా 7500 ఎవరు మింగారు.. ఎంతమంది బిల్లులు మింగుతారు.. నేను హైదరాబాద్ లో ఉన్నాను కనుక నేను ఉన్న ప్రభుత్వాన్నే అడుగుతున్నా. పవర్ బిల్లు కట్టలేదు అని మళ్ళీ కట్టించుకున్న వాడితో కుమ్మక్కై ప్రజల మీద బిల్లులు రుద్దే ప్రభుత్వాలదా.. ఇపుడు నా 7500 ఎవడు ఇస్తారు” అని ప్రశ్నించింది.

‘డబ్బులెవరికి ఊరికే రావు సర్.. ప్రతి రూపాయి విలువైనదే’ అంటే నీలి రంగు గులాబీ రంగు వాడికి మండుద్ది. ఒకవేళ అంత మండితే నా 7500 నాకు ఇచ్చి అపుడు పెట్రోల్ పోసుకుని మరి మంట తెచ్చుకుని అరవండి. కానీ నా పైసల్ నాకు కావాలె. వాడు తినలే వీడు తినలే అంటే మరి నా పైసల్ ఏడికి పోయినయి ??? ఇలా ఇప్పటికే చాలామంది మీద బిల్లులు మోపారు. డబల్ ధమాకాలు మోపుతున్నారు. ఐనా కడుతున్నాం. ఏమో నాకు తెల్వదు. నా పైసల్ నాకు కావాలి ఎవరిస్తారు. మూడు నెలలైంది.. అన్ని సోర్స్ నుంచి ట్రైల్ చేస్తున్నా అంటూ కేటీఆర్ – సీఎం కేసీఆర్ – తెలంగాణ విద్యుత్ శాఖలను ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టింది మాధవీలత. బిల్లు చెల్లించినట్టు అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని.. అయితే సెక్యురిటీ ఇష్యూస్ వల్ల ఫేస్ బుక్ లో షేర్ చేయలేదని మాధవీలత చెప్పుకొచ్చింది.

Related Images:

అవమానించారు.. కంగనకు నష్టపరిహారం చెల్లించండి!

ఎవరికైనా అవమానం అవమానమే. క్వీన్ కంగన రనౌత్ కార్యాలయాన్ని ముంబై మున్సిపల్ (బీఎంసీ) అధికారులు కుప్పకూల్చడం అన్యాయమని వాదించేవారి సంఖ్య అంతకంతకు అధికమవుతోంది. ఒకరకంగా కంగనకు బలం పెరుగుతోందనే చెప్పాలి. బాంద్రాలో అధికారుల అనుమతి లేకుండా మూడు అంగుళాల పాటు ఇంటికి అదనపు హంగులు చేయించుకోవడంతో దానిని బీఎంసీ కూల్చి వేసింది.

అయితే కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే కంగనను ఓదార్చడమే గాక మీడియా ముందుకు వచ్చి తనకు అండగా నిలిచారు. ఆమెకు అవమానం జరిగిందని నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ముంబైలో నివశించేందుకు భయపడాల్సిన అవసరం లేదని .. ఇది అందరి ఆర్థిక రాజధాని అని అన్నారు. తనకు ఆర్పీఐ పార్టీ మద్ధతు ఉంటుందని ప్రకటించారు.

కంగన జనవరిలోనే ఇంటి నిర్మాణం పూర్తి చేయగా.. మూడు అంగులాళ అధిక స్థలాన్ని బిల్డర్ ఉపయోగించిన విషయం కంగనకు తెలియదని ఆయన అన్నారు. బీఎంసీ అధికారులు అధికంగా ఉన్న భాగాన్ని కూల్చివేసినా ఫర్నీచర్ గోడలు పడిపోయాయని న్యాయస్థానంలో తనకు న్యాయం జరుగుతుందని అన్నారు. కంగనకు ఇప్పటికే కేంద్రంలోని భాజపా వత్తాసు పలుకుతుంటే ఇప్పుడు ఒకటొకటిగా శివసేన వ్యతిరేక పార్టీలన్నీ కంగనకు మద్ధతు పలుకుతుండడం విశేషం.

Related Images:

అక్షయ్ కుమార్ కు ‘డి’ గ్యాంగ్ కు సంబంధాలా?

బాలీవుడ్ అగ్రహీరోలంతా ఖాన్ లు.. వారంతా బీజేపీకి వ్యతిరేకమే.. హిందుత్వ బీజేపీ కూడా ఈ ‘ఖాన్’ త్రయాన్ని వ్యతిరేకిస్తారు. అమీర్ ఖాన్ అయితే బీజేపీపై అప్పట్లో నోరుపారేసుకున్నారు. దీంతో ఖాన్ లను దించేస్తూ బీజేపీ ఇప్పుడు హిందూ హీరో ‘అక్షయ్ కుమార్’ను బాలీవుడ్ లో నెత్తిన పెట్టుకుంటోంది. ప్రధాని మోడీ స్వయంగా అక్షయ్ తో అప్పట్లో ఓ ఇంటర్వ్యూ కూడా చేశాడు. బీజేపీతో సాన్నిహిత్యం నెరుపుతున్న అక్షయ్ పై ఇప్పుడు బిగ్ ‘డి’ బాంబు పడింది? మరి అది నిజమా? కాదా? అసలేంటి ఆ బాంబు? అనేది ఇప్పుడు బాలీవుడ్ లో చర్చనీయాంశమైంది.

సెలెబ్రెటీలలో టాప్ పొజిషన్ లో ఉన్న హీరో అక్షయ్ కుమార్. ప్రస్తుతం బాలీవుడ్ లో ఆయన దూసుకుపోతున్నారు. అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోగా ఉన్నారు. అయితే తాజాగా అక్షయ్ కుమార్ తో ముంబై అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ తో సంబంధాలు ఉన్నాయా? అన్న ఆరోపణలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. అక్షయ్ కుమార్ వ్యక్తిగత లాయర్ అయిన అడ్వకేట్ విబోర్ ఆనంద్ తాజాగా అక్షయ్ కుమార్ కు ‘డి’ గ్యాంగ్ తో సంబంధాలు ఉన్నాయని ట్విట్టర్ లో పోస్టు పెట్టడం బాలీవుడ్ లో సంచలనమైంది. ‘అక్షయ్ కుమార్ ఎందుకు వాళ్లను కలిశాడు? పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్స్ వాళ్లతో అక్షయ్ కుమార్ కు ఏం పని’ అని ట్వీట్ పెట్టారు.

ఆ ఫొటో అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడు వైరల్ అయ్యింది. అక్షయ్ కుమార్ ను అభిమానించే హిందువులు అంతా పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. అక్షయ్ కుమార్ ఇలాంటి వాడు అని మేము ఊహించలేదు అని.. మేము సపోర్టు చేస్తేనే అతడు పెద్ద స్టార్ అయ్యాడని.. పాకిస్తాన్ ఐఎస్ఐ వాళ్లతో కలిసి ఫొటో దిగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ఈ విషయంలో పెద్ద ఎత్తున అక్షయ్ కుమార్ ను ట్రోల్ చేస్తున్నారంట.. మరి అక్షయ్ లాయర్ చేసిన పోస్ట్ లో ఫొటోలు నిజమా? లేక ఫేక్ ఫొటోలా అనేది పూర్తి స్థాయిలో తెలియదు.. కానీ అంతర్జాతీయంగా మాత్రం పెద్ద ఎత్తున ఆ ఫొటో వైరల్ అవుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. చూద్దాం ఏది నిజమో? ఏది అబద్ధమో చూడాలి మరీ..

Related Images:

పవిట నిలవనంటోంది ఏమిటో ఈ అమ్మడు

తెలుగులో సంచలన విజయం సాధించి ఇతర భాషల్లో రీమేక్ అయిన చిత్రం `అర్జున్రెడ్డి`. తెలుగు సినిమాల్లో ఓ గేమ్ ఛేంజర్ గా నిలిచింది. ఈ చిత్రంలోని ఓ సన్నివేశంలో విజయ్ తో కలిసి నటించి హీటెక్కించింది క్యారెక్టర్ ఆర్టిస్ట్ సాయి సుధ. ఇటీవల కెమెరామెన్ చోటా కె. నాయుడు సోదరుడు శ్యామ్ కె. నాయుడు తనని శరీరకంగా వాడుకుని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని సాయి సుధ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది.

తాజాగా మరోసారి హాట్ టాపిక్ గా మారింది సాయి సుధ. అల్లరి రవిబాబు నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం `క్రష్`. యూత్ ని టార్గెట్ చేస్తూ రవిబాబు హద్దులు దాటిన అడల్ట్ కంటెంట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గురువారం ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ పెప్ పేరుతో టీజర్ ని రిలీజ్ చేశారు. ఆద్యంతం డబుల్ మీనింగ్ డైలాగ్ లు.. అడల్ట్ కంటెంట్ తో సాగిన ఈ ఫస్ట్ పెప్ లో సాయి సుధ రెచ్చిపోయి నటించింది.

హాట్ గర్ల్ గా రచ్చ చేసినట్టు తెలుస్తోంది. సాయి సుధ ఫస్ట్ పెప్ లో శారీని జారవిడుస్తూ ఎద అందాలను ప్రదర్శించిన తీరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. చాలా కాలంగా నటిగా గుర్తింపు కోసం ఎదురుచూస్తున్న సాయి సుధకు `క్రష్` మూవీ ప్లస్ పాయింట్గా మారనుందా? ఈ దెబ్బతో సాయి సుధ కెరీర్ టాలీవుడ్ లో ఊపందుకున్నట్టేనా?

Related Images:

లైంగిక వేధింపుల్లో స్టార్ డైరెక్టర్ బుక్కయ్యాడు

#మీటూ ఉద్యమం బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. చాలా మంది ఈ ఉద్యమం కారణంగా అరోపణలు ఎదుర్కొన్నారు. భారీ చిత్రాల్లో నటించే అవకాశాన్ని కొంత మంది కోల్పోతే మరి కొంత మంది దర్శకులు క్రేజీ అవకాశాల్ని కోల్పోవాల్సి వచ్చింది. ఈ జాబితాలో హౌస్ ఫుల్ దర్శకుడు సాజిద్ ఖాన్ కూడా వున్నారు. తాజాగా మరో సారి ఈ దర్శకుడు లైంగిక వేధింపుల ఆరోపణల్లో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది.

హౌస్ ఫుల్ 1- హౌస్ ఫుల్ 2 చిత్రాలతో భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న సాజిద్ ఖాన్ మీటూ ఆరోపణల కారణంగా పలు క్రేజీ చిత్రాలను వదులుకోవాల్సి వచ్చింది. తాజాగా అతనిపై సౌలా అనే ఓ మోడల్ సంచలన ఆరోపణలు చేయడం ఆసక్తికరంగా మారింది. హౌజ్ ఫుల్ సినిమా ఆఫర్ అంటూ తనని దర్శకుడు లైంగికంగా వేధించాడని ఆరోపించింది. ఈ సినిమా సమయంలో సాజిద్ ఖాన్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందో తాజాగా వెల్లడించింది.

మీటూ ఉద్యమం మొదలైనప్పుడు సాజిద్ పై చాలా విమర్శలు వినిపించాయి అయితే తాను ధైర్యం చేయలేకపోయానని చెబుతోంది. కుటుంబం కోసమే మౌనంగా వున్నానని సొంతం గా సంపాదించడం మొదలుపెట్టాక తనలో ధైర్యం ఏర్పడిందని అందుకే ఇప్పుడు నోరు విప్పుతున్నానని చెప్పుకొచ్చింది. హౌస్ ఫుల్ సీక్వెల్ లో అవకాశం రావాలంటే తన ముందు నగ్నంగా నిలబడాలని సాజిద్ ఖాన్ అన్నడని అవకాశం వంకతో తనని ఎక్కడ పడితే అక్కడ తాకేవాడని చెప్పుకొచ్చింది.

Related Images:

కేజీఎఫ్ స్టార్ ను తిడుతున్న కూతురు

కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా ఆల్ ఇండియా స్టార్ అయిన యశ్ ప్రస్తుతం కేజీఎఫ్ 2 సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ లో యశ్ పాల్గొంటున్నాడు. ఇదే సమయంలో తన ఇద్దరు పిల్లలతో కూడా ఎక్కువ సమయం గడిపేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. సోషల్ మీడియాలో యశ్ మరియు ఆయన భార్య రాధికలు రెగ్యులర్ గా పిల్లల ఫొటోలను షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా వీరు షేర్ చేసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు నవ్వు తెప్పిస్తోంది.

యశ్ తన కూతురు ఐరాకు ఇటీవల జుట్టు తీయించాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం పుట్టు వెంట్రుకలు తీయిస్తూ ఉంటారు. ఐరాకు కూడా అందులో భాగంగా జుట్టు తీయించినట్లుగా ఉన్నారు. ఐరాను ఎత్తుకుని యశ్ ఉన్న ఈ ఫొటోకు ఫన్నీ కామెంట్స్ చాలా వస్తున్నాయి. నీకేమో అంత జట్టు ఉంది.. నాకున్న కొద్ది జట్టును కూడా తీయించేశావ్ ఎందుకు అన్నట్లుగా యశ్ పై ఐరా కోపంతో చూస్తున్నట్లుగా ఆమె రియాక్షన్ ఉందని కొందరు నెటిజన్స్ అంటుంటే మరికొందరు మాత్రం ఇంకా ఎన్నాళ్లు అలా ఉంటావ్ నాలా గుండు చేయించుకో హాయిగా ఉంటుంది నాన్న అంటూ ఐరా రియాక్షన్ ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

Related Images:

‘2 సెకన్ల ఫేమ్ కోసమే ఇదంతా చేశానా?’

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో కీలక విషయాలు బయటపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో మొదటి నుంచి సుశాంత్ మాజీ గర్ల్ ఫ్రెండ్ అంకిత లోఖండే.. సుశాంత్ కుటుంబానికి మద్దతుగా నిలుస్తూ రియా తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చారు. రియా అరెస్ట్ తర్వాత ఇదంతా ఆమె కర్మ అని చెప్తూ ‘సుశాంత్ ది హత్య అని నేను ఎప్పుడూ చెప్పలేదని.. నా స్నేహితుడు సుశాంత్ కు న్యాయం జరగాలని కోరుకున్నానని.. డిప్రెషన్ లో ఉన్న వ్యక్తి డ్రగ్స్ తీసుకోవడానికి ఆమె ఎలా ప్రోత్సహించిందని?’ అని అంకిత పోస్ట్ పెట్టింది. అయితే నటి శిబానీ దండేకర్ రియాను విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తూ.. అంకితపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అంకిత పితృస్వామ్య భావజాలానికి రాకుమారి వంటిదని.. 2 సెకన్ల ఫేమ్ కోసం ఇలా చేస్తోందంటూ వ్యాఖ్యానించింది. దీనిపై రియాక్ట్ అయిన అంకిత.. చనిపోయిన తన స్నేహితుడికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తేనే తనకు ప్రచారం లభిస్తుందని అనుకోవడం లేదని చెప్పుకొచ్చింది.

”రెండు సెకన్ల ఫేమ్ – ఈ పదం నన్ను ఆలోచింపజేసింది. టైర్ 2 సిటీలోని మర్యాదగల కుటుంబం నుంచి వచ్చాను. నన్ను నేను ప్రమోట్ చేసుకునే ఫ్యాన్సీ ఎడ్యుకేషన్ నాకు లేదు. 2004లో ‘జీ సినీ స్టార్ కే ఖోజ్’ అనే షో ద్వారా టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. అయితే 2009లో ‘పవిత్ర రిష్తా’ సీరియల్ తో నా నిజమైన ప్రయాణం మొదలైంది. ఆ సీరియల్ 2014 వరకు కొనసాగింది. వరుసగా ఆరేళ్లపాటు అత్యధిక టీఆర్పీతో కొనసాగిన విషయాన్ని నేను ఇక్కడ ప్రస్తావించక తప్పడం లేదు. ఫేమ్ అనేది ప్రేక్షకుల నుంచి లభించే ప్రేమ అభిమానానికి అదనపు హంగు మాత్రమే అనుకుంటున్నాను. ప్రేక్షకుల్లో నాకున్న గుర్తింపు కారణంగానే ‘మణికర్ణిక’ ‘భాగీ3’ వంటి చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. 17 ఏళ్లుగా టీవీ ఇండస్ట్రీలో ఉన్న నేను నా స్నేహితుడికి న్యాయం జరగాలని డిమాండ్ చేయడం కేవలం 2 సెకన్ల చీప్ పబ్లిసిటీ కోసమే అనడం ఎందుకో నాకైతే అర్థం కావడంలేదు. నేను ఎక్కువగా బాలీవుడ్ లో కాకుండా టెలివిజన్ లో పనిచేశాననా? బాలీవుడ్ అయినా టీవీ ఇండస్ట్రీలోనైనా నటీనటులకు సమానమైన కృషి మరియు అంకితభావం అవసరం. టీవీ నటిని అయినందుకు గర్విస్తున్నా. నేను ఇష్టపడే మరియు కేర్ చూపించే వ్యక్తుల కోసం నేను ఎల్లప్పుడూ నా గొంతును వినిపిస్తాను” అంటూ నటి శిబానీ కి కౌంటర్ ఇచ్చారు అంకిత.

Related Images:

ఎనర్జీ చూపించడానికి రెడీ అవుతున్న మంచు హీరో…!

ఎనర్జటిక్ హీరో మంచు మనోజ్ చాలా వరకు తన సినిమాల్లో రియలిస్టిక్ ఫైట్స్ ఉండేలా చూసుకుంటాడని విషయం తెలిసిందే. అందుకే రిస్కీ ఫైట్స్ ని తనే స్వయంగా కంపోజ్ చేసుకుంటూ డూప్ లేకుండా స్టంట్స్ చేసి అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఉంటాడు. కరోనా కారణంగా షూటింగ్స్ లేకపోవడంతో గత కొన్ని రోజులుగా ఇంటికే పరిమితమైన మంచు హీరో మళ్ళీ సెట్స్ లో అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నట్లున్నాడు. లేటెస్టుగా మనోజ్ తన ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఫొటోతో తిరిగి వర్కౌట్స్ స్టార్ట్ చేసినట్లుగా అర్థం అవుతోంది. ఈ ఫొటోలో ఎర్లీ మార్నింగ్ మనోజ్ తన ట్రైనర్ తో కలిసి ఓ హై కిక్ ప్రాక్టీస్ చేస్తూ కనిపిస్తున్నాడు. అందరికీ శుభోదయం తెలిపిన మనోజ్ ‘రైజ్ అండ్ షైన్’ అని క్యాప్షన్ పెట్టాడు.

కాగా కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిద్యభరితమైన చిత్రాలు చేస్తూ వస్తున్న మంచు మనోజ్ నుంచి ‘ఒక్కడు మిగిలాడు’ తర్వాత మరో మూవీ రాలేదు. అయితే దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఆయన మళ్ళీ ”అహం బ్రహ్మాస్మి” సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై తన ఎనర్జీని చూపించడానికి సిద్ధమయ్యారు. పాన్ ఇండియా మూవీగా తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని మంచు మనోజ్ – నిర్మలా దేవి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘అహం బ్రహ్మాస్మి’ ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్.. త్వరలోనే స్టార్ట్ కాబోతోందని సమాచారం.

Related Images:

ఏం చేసినా ఆమెలో ఫైర్ మాత్రం తగ్గడం లేదు!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఏమాత్రం తగ్గడం లేదు. ఆమె తీరు చూస్తుంటే హేమా హేమీలకు కూడా ఆశ్చర్యం కలుగుతోంది. మొన్నటి వరకు బాలీవుడ్ స్టార్స్ ను మాత్రమే టార్గెట్ చేసింది. తనను ఒక్క మాట అంటే అవతలి వారిని పది మాటలు అనకుండా ఊరుకోని తత్వం కంగనాది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే కంగనాను ఎందుకు కెలకడం అంటూ చాలా మంది ఆమె విమర్శలను కూడా పట్టించుకోకుండా ఉంటారు. కంగనాను కేవలం బాలీవుడ్ వారిపైనే కాకుండా ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయ నాయకులతో పాటు ఏకంగా సోనియా గాంధీపై కూడా విమర్శలు చేస్తున్నారు.

ఈమెను ముంబయిలో అడుగు పెట్టనివ్వం అంటూ కంగనాను శివ సేన కార్యకర్తలు హెచ్చరించారు. శివసేన ప్రభుత్వం ఆమెను ఇప్పటికే టార్గెట్ చేసి ఆమెపై చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఆమె ఆఫీస్ ను కూల్చి వేసేందుకు ప్రయత్నించారు. ఇక ఆమె సినిమాల్లో ఏ ఒక్క దాన్ని కూడా ముంబయిలో చిత్రీకరణ చేయనిచ్చేది లేదని అలాగే మహారాష్ట్రలో సినిమాలను విడుదల కానిచ్చేది లేదంటూ అనధికారికంగా చెబుతున్నారు. ముంబయిలో కంగనా బయట తిరగలేని పరిస్థతి ఉంది.

ఇంత జరుగుతున్నా కూడా ప్రతి రోజు మహా సీఎం ఉద్దవ్ ఠాక్రేను రెచ్చ గొట్టేలా మాట్లాడటంతో పాటు తనను ఏం చేయలేరు అంటూ విమర్శలకు మరింతగా పదును పెడుతోంది. ప్రభుత్వం అంతగా టార్గెట్ చేసినా కూడా కంగనాలో ఫైర్ తగ్గక పోవడంపై పలువురు పలు రకాలుగా అభివర్ణిస్తున్నారు. ఇటీవలే విశాల్ ఆమెను భగత్ సింగ్ తో పోల్చడం చర్చనీయాంశం అయ్యింది. ఇంకా కొందరు కూడా ఆమెలోని ఫైర్ ను అభినందిస్తున్నారు.

Related Images:

సుశాంత్ దర్యాప్తు: రియా తొ సహా మరో ఐదుగురి బెయిల్ తిరస్కారం

సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు లైవ్ అప్ డేట్స్ అంతకంతకు హీట్ పెంచుతున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. రియా చక్రవర్తి సహా మరో ఐదుగురి బెయిల్ అభ్యర్థన తిరస్కారానికి గురైంది. రియా- షోయిక్ చక్రవర్తి- అబ్దుల్ బాసిత్- జైద్ విలాత్రా- దీపేశ్ సావంత్- శామ్యూల్ మిరాండా అనే ఆరుగురు నిందితుల బెయిల్ దరఖాస్తులను ముంబై సెషన్స్ కోర్టు శుక్రవారం తిరస్కరించింది. బెయిల్ పిటిషన్లన్నీ తిరస్కరించినట్లు తమకు సమాచారం అందిందని వారు హైకోర్టును ఆశ్రయిస్తారని న్యాయవాదులు తెలిపారు.

సుశాంత్ సింగ్ రాజ్పుత్ బలవన్మరణం సహా డ్రగ్స్ సంబంధిత ఆరోపణలపై అరెస్టయిన రియాను జైలుకు తరలించిన వెంటనే బెయిల్ దరఖాస్తుపై కోర్టు శుక్రవారం వరకు రిజర్వు చేసింది. సహ నిందితులు అలాగే ఆరోపణలు ఎదుర్కొన్న డ్రగ్ పెడ్లర్లు బసిత్ పరిహార్- జైద్ విలాత్రా బెయిల్ ను కూడా తిరస్కరించింది కోర్టు.

రియా ఆమె సోదరుడు బెయిల్ కోసం నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (ఎన్డిపిఎస్) చట్టం కింద ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. ఎందుకంటే వారి అభ్యర్ధనలను మేజిస్ట్రేట్ కోర్టు బుధవారం తిరస్కరించింది. తన న్యాయవాది సతీష్ మనేషిందే దాఖలు చేసిన తాజా పిటిషన్లో 28 ఏళ్ల రియా నిర్దోషి అని పేర్కొన్నారు. “ఆమె ఎటువంటి నేరానికి పాల్పడలేదు. ఈ కేసులో తప్పుగా చిక్కుకుంది“ అని పిటిషన్లో పేర్కొన్నారు. మనేషిందే- స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ సర్పాండే- ఎన్సిబి దర్యాప్తు అధికారి కిరణ్ బాబుల సమక్షంలో బెయిల్ పిటిషన్ ను ప్రత్యేక న్యాయమూర్తి విచారించడంతో తాజా నిర్ణయం కోర్టు ప్రకటించింది.

ఆరుగురు నిందితులందరూ త్వరలోనే బెయిల్ కోసం బొంబాయి హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. వీళ్లంతా మంగళవారం అరెస్టు కాగా సెప్టెంబర్ 22 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపిన రియా – బైకుల్లా జైలులోనే ఉంటారు.

Related Images:

నాని ‘జెర్సీ’ స్టార్ ద్విభాషా చిత్రం!!

నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన జెర్సీ సినిమాలో కీలక గెస్ట్ రోల్ లో కనిపించిన తమిళ స్టార్ నటుడు హరీష్ కళ్యాణ్ ఆకట్టుకున్నాడు. ఉన్నంత సమయం మంచి స్ర్కీన్ ప్రజెన్స్ తో మెప్పించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ తో హరీష్ మంచి నటన కనబర్చాడు. నాని కొడుకు పాత్రలో కనిపించిన హరీష్ కళ్యాణ్ మళ్లీ తెలుగులో నటించలేదు. అతడికి తెలుగులో ఆఫర్లు వస్తున్నా కూడా మంచి పాత్రల కోసం వెయిట్ చేస్తున్నాడట. తాజాగా ఈయన బిచ్చగాడు దర్శకుడు శశి దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు ఓకే చెప్పాడు. అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

జెర్సీ సినిమాతో తెలుగులో గుర్తింపు రావడం వల్ల ఈసారి చేయబోతున్న సినిమాను తమిళంతో పాటు తెలుగులో కూడా చేయాలని ఆయన భావిస్తున్నాడు. దానికి తోడు బిచ్చగాడు సినిమాతో దర్శకుడికి తెలుగు లో మంచి క్రేజ్ దక్కింది. ఇద్దరు కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన వాళ్లే అవ్వడం వల్ల తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమాను రూపొందించి విడుదల చేస్తే మంచి లాభాలు వస్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ద్విభాష చిత్రం అంటూ చెప్పినా కూడా ఒకే భాషలో తెరకెక్కించి డబ్ చేసి విడుదల చేస్తారు అంటున్నారు. ఏది ఏమైనా ఈ కాంబో ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకుల దృష్టిని కూడా ఆకర్షించడం ఖాయం అంటున్నారు.

Related Images:

నాన్న గురించిన వదంతులు నమ్మవద్దన్న ఎస్పీ చరణ్

రెండు రోజుల క్రితం ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థతిపి ఆయన తనయుడు ఎస్పీ చరణ్ మాట్లాడుతూ నాన్న ఆరోగ్యం నిలకడగా ఉందని కాని ఊపిరి తిత్తుల్లో ఉన్న ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన ఇంకా ఐసీయూలోనే ఉన్నారు. ఆయనకు వెంటిలేటర్ ద్వారా శ్వాసను అందిస్తూ ట్రీట్ మెంట్ అందిస్తున్నట్లుగా పేర్కొన్నాడు. కరోనా నుండి బయట పడ్డ నాన్న గారు మాట్లాడుతున్నారు.. తన ఐపాడ్ ను చూస్తున్నారు. క్రికెట్ టెన్నీస్ చూస్తున్నారు అంటూ ఎస్పీ చరణ్ తెలియజేశారు. త్వరలోనే నాన్న ఆరోగ్యం పూర్తిగా కుదుట పడి డిశ్చార్జ్ అవుతారని ఆశిస్తున్నట్లుగా పేర్కొన్నారు.

ఈ సమయంలోనే బాలు ఆరోగ్యం గురించి రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆయన ఆరోగ్యం పూర్తిగా కుదుట పడింది. ఆయన్ను డిశ్చార్జ్ చేసేందుకు ఆసుపత్రి వర్గాలు రెడీ అయ్యాయి. ఆయన పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అవ్వబోతున్నాడు అంటూ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఎస్పీ చరణ్ స్పందించాడు. నాన్న గారు ఇంకా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. కనుక ఆయన డిశ్చార్జ్ ఇంకాస్త సమయం పడుతుంది. ఆయన ఊపిరి తిత్తుల ఇన్ఫెక్షన్ నుండి కోలుకోలేదు. కనుక ఆయన కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని వైధ్యలు అంటున్నారు. కనుక మీడియాలో జరుగుతున్న ప్రచారంను నమ్మవద్దు.

ఈ సమయంలో తాను ఏది అయితే చెబుతున్నానో అదే నమ్మండి. ఇతరులు ఊపిరితిత్తులు చెడిపోయాయి అంటూ చేస్తున్న పుకార్లను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దంటూ పేర్కొన్నాడు. ఈ నెలాఖరు వరకు బాలు గారి ఆరోగ్యం పూర్తిగా కుదుట పడుతుందనే నమ్మకంతో కుటుంబ సభ్యులు ఉన్నట్లుగా తెలుస్తోంది. నాన్న గారి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తానే స్వయంగా వివరాలు అందిస్తాను. ఇతరులు చెప్పేది నమ్మవద్దంటూ జనాలను చరణ్ కోరాడు.

Related Images:

బిగ్ బాస్ 4: ఈ కట్టప్ప ఎవడ్రా బాబు

బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఎపిసోడ్ ఆరంభంలోనే ఎప్పుడెప్పుడు మాట్లాడుతుందా అంటూ ఎదురు చూసిన దివి మాట్లాడేసింది. ఆమెకు ఇచ్చిన టాస్క్ ప్రకారం ఆమె ఇంటి సభ్యుల అందరి గురించి ఆమె ఏం గమనించింది వారిలో ఏం మార్చుకోవాల్సి ఉంది అనే విషయాన్ని చెప్పింది. అందులో భాగంగా ఆమె అందరి గురించి వివరించిన తీరు అందరికి బాగా నచ్చింది. బిగ్ బాస్ లో గత మూడు రోజులుగా దివి మాట్లాడక పోవడంతో ఆమెపై నానా రకాల మీమ్స్ వచ్చాయి. ఇప్పుడు ఆమె మాట్లాడటంతో మా దివి పాప మాట్లాడిందోచ్ అంటూ సోషల్ మీడియాలో కొందరు రచ్చ రచ్చ మీమ్స్ చేస్తున్నారు.

ఇక మొదటి ఎపిసోడ్ నుండి మీలో ఒకరు కట్టప్ప ఉన్నారు. వారు ఎవరో గుర్తించండి అంటూ బిగ్ బాస్ హెచ్చరిస్తున్నాడు. మొదటి రోజు నుండి నిన్నటి ఎపిసోడ్ వరకు కట్టప్ప ఎవరు అయ్యి ఉంటారా అంటూ షో లో ఉన్న వారు అంతా కూడా జుట్టు పీక్కుంటున్నారు. ఇప్పటికే ఓటింగ్ ద్వారా కట్టప్ప ఎవరు అనే విషయాన్ని గెస్ చేశారు. కనుక కట్టప్ప ఎవరో అర్థం కాని పరిస్థతి. నిన్నటి ఎపిసోడ్ లో మళ్లీ కట్టప్ప ఎవరు అనే విషయంపై చర్చ జరిగింది. అరియానా మరియు సోహెల్ లను కన్ఫెషన్ రూంకు పిలిచి ఒకొక్కరిని చొప్పున మీ ఉద్దేశ్యం ప్రకారం కట్టప్ప ఎవరు అనుకుంటున్నారు అంటూ ప్రశ్నించాల్సి ఉంది. అందుకు కొందరు ముందుకు వచ్చి తమ అభిప్రాయంను చెప్పగా మరి కొందరు మాత్రం ఇప్పటికే బాక్స్ లో కట్టప్ప ఎవరు అనే విషయంలో మేము క్లారిటీ ఇచ్చాము. మళ్లీ వాళ్లకు చెప్పల్సింది ఏమీ లేదు అన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రేక్షకులు కూడా ఎవడ్రా ఈ కట్టప్ప అంటూ జుట్టు పీక్కుంటున్నారు.

ఇక గంగవ్వ నిన్నటి ఎపిసోడ్ లో మళ్లీ సందడి చేసింది. తన వ్యూలో ఒక్కో ఇంటి సభ్యుల గురించి మాట్లాడింది. అమ్మ రాజశేఖర్ మాస్టర్ వంటలు బాగా చేస్తున్నాడని సూర్య కిరణ్ పంచాయితీలు తీరుస్తున్నాడని అఖిల్ రాత్రి అంతా పడుకున్న తర్వాత కూడా అందరు మంచిగ ఉన్నారా లేరా అనే విషయాలను పరిశీలిస్తున్నాడు అంది. ఇక దివి తనను బాగా చూసుకుంటుంది. అమమ్మ అంటూ కాళ్లు కూడా ఒత్తుతుందని పేర్కొంది. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ అంతా సందడి సందడిగా సాగిపోయింది.

Related Images:

పెళ్లి పీఠలు ఎక్కిన సెక్సీబాంబ్

సోషల్ మీడియాను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్లకు పూనం పాండే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె చాలా కాలం పాటు సోషల్ మీడియాలో సంచలన వీడియోలు ఫొటోలు షేర్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ వచ్చింది. కొన్ని సినిమాల్లో కూడా నటించి మెప్పించిన ఈ అమ్మడు ఇప్పుడు పెళ్లి పీఠలు ఎక్కింది. పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వబోతున్నట్లుగా కొన్ని రోజుల క్రితం ప్రకటించిన పూనం తాజాగా ప్రియుడు సామ్ బాంబేను వివాహం చేసుకుని ఆ ఫొటోలను షేర్ చేసింది.

ఇన్నాళ్లు చాలా హాట్ కాస్ట్యూమ్స్ లో ఆమెను చూసిన జనాలు పెళ్లిలో ఆమెను ఫుల్ డ్రస్ లో చూసి వావ్ అంటున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు ఉన్న ఫాలోవర్స్ ఆమె పెళ్లి ఫొటోలపై బాగా రియాక్ట్ అవుతున్నారు. ఇలా చూడటం కాస్త ఇబ్బందిగా ఉన్నా చాలా బాగున్నారు. మీరు కొత్త జీవితంలో అడుగు పెట్టారు. అంతా బాగుండాలని కోరుకుంటున్నాను అంటూ ఆమెకు కామెంట్స్ పెట్టారు. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈమె మళ్లీ సినిమాల్లో నటించే ఆసక్తితో ఉంది. కాని ఆఫర్లు వచ్చేది రానిది తెలియాల్సి ఉంది.

Related Images:

మెగా హీరో మూవీకి గుమ్మడికాయ కొట్టేసారు..!!

‘చిత్రలహరి’ ‘ప్రతిరోజూ పండగే’ విజయాలతో జోష్ లో ఉన్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. నభా నటేష్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ మరియు రెండు వీడియో సాంగ్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. మెజారిటీ భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని ఐదు నెలల తర్వాత తిరిగి స్టార్ట్ చేశారు. కోవిడ్-19 నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని సింగిల్ షెడ్యూల్ లో మిగతా చిత్రీకరణ పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టారని తెలుస్తోంది.

కాగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీని సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ భావించినప్పటికీ.. కరోనా కారణంగా కుదరలేదు. ఇక థియేటర్స్ ఎప్పుడు రీ ఓపెన్ చేస్తారనే విషయంపై క్లారిటీ లేకపోవడంతో ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా త్వరగా పూర్తి చేసి ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాన్ని ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ‘జీ 5 ఒరిజినల్’ లో విడుదల చేస్తారని ఓటీటీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఈ సినిమా రిలీజ్ పై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Related Images:

మహేష్ ఆ డైరెక్టర్ తో హ్యాట్రిక్ ప్లాన్ చేస్తున్నాడా…?

సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లో 27వ చిత్రం ‘సర్కారు వారి పాట’ ను పరశురామ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ ప్రాజెక్ట్ చేయనున్నాడని సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది. మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ‘అతడు’ ‘ఖలేజా’ అనే రెండు సినిమాలు వచ్చాయి. ‘అతడు’ సినిమా సక్సెస్ అందుకున్నప్పటికీ ‘ఖలేజా’ నిరాశపరిచింది. అయితే ‘ఖలేజా’ సినిమాతో మహేష్ లోని కామెడీ యాంగిల్ బయటకి వచ్చిందని చెప్పవచ్చు. అందుకే ఈ సినిమా ఎప్పుడు టీవీలో ప్రసారం అయినా మంచి ఆదరణ తెచ్చుకుంటుంది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో మూవీ వస్తే బాగుండు అని మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఈ క్రమంలో వీరి కాంబోలో హ్యాట్రిక్ మూవీ రాబోతోందని వార్తలు వస్తున్నాయి.

కాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ జూనియర్ ఎన్టీఆర్ తో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఇప్పటికే స్టార్ట్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా లేట్ అవుతూ వచ్చింది. అయితే ఈ దొరికిన సమయంలో త్రివిక్రమ్ మహేష్ కోసం ఓ స్క్రిప్ట్ రెడీ చేశారట. ఇటీవల మహేష్ ని కలిసి త్రివిక్రమ్ స్టోరీ చెప్పాడని.. మహేష్ కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చాడని సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతోంది. అంతేకాకుండా ఈ సినిమా ‘సీతారామపురం’ అనే టైటిల్ తో రాబోతుందని.. 1967లో వచ్చిన ‘ప్రాణమిత్రులు’ సినిమా స్టోరీ లైన్ తో ఉండబోతోందని అంటున్నారు. దర్శకధీరుడు రాజమౌళి మహేష్ బాబుతో తన నెక్స్ట్ సినిమా ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ పూర్తవడానికి చాలా సమయం పట్టే అవకాశాలు ఉండటంతో ఈ గ్యాప్ లో మహేష్ మరో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మహేష్ – త్రివిక్రమ్ వార్తలు నిజమైతే ఎప్పుడు సాధ్యపడుతుంది అనే ప్రశ్న తలెత్తుతుంది. త్రివిక్రమ్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి మహేష్ సినిమా స్టార్ట్ చేస్తాడా లేదా అంతకంటే ముందే ‘సర్కారు వారి పాట’తో ప్యారలల్ గా ఈ సినిమా చేసారా అనేది చూడాలి. ఈ నేపథ్యంలో మహేష్ బాబు – త్రివిక్రమ్ హ్యాట్రిక్ మూవీపై క్లారిటీ రావాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.

Related Images:

ప్రతి రోజు గోమూత్రం తాగే సూపర్ స్టార్

హిందువులు పవిత్రంగా భావించే ఆవు మూత్రం ఆయుర్వేదిక్ గా ఎంతో మంచిది అంటూ ప్రయోగాల్లో కూడా వెళ్లడి అయ్యింది. వందల కొద్ది ఆయుర్వేదిక్ ఔషదాల్లో గో మూత్రంను ఉపయోగిస్తారు. విదేశాల్లో కూడా గో మూత్రంకు మంచి డిమాండ్ ఉంది. ప్రముఖులు కూడా చాలా మంది గోమూత్రం తాగుతారు. అయితే ఆ విషయాన్ని వారు బయటకు చెప్పక పోవచ్చు. కాని తాజాగా అక్షయ్ కుమార్ మాత్రం తాను గో మూత్రంను ప్రతి రోజు తాగుతాను అంటూ చెప్పాడు. ఔషద గుణాలు ఉన్న గో మూత్రంను తాగడం వల్ల పలు ఆనారోగ్య సమస్యలు దూరం అవుతాయి అంటూ ఆయన పేర్కొన్నాడు.

ఇటీవల ఆయన ఇన్ టు ద వైల్డ్ విత్ గ్రీల్లీస్ తో సాహస యాత్ర చేశాడు. ఆ సందర్బంగానే తన ఆరోగ్య విషయమై స్పందిస్తూ గో మూత్రంను తాగుతాను అంటూ చెప్పుకొచ్చాడు. ప్రతి రోజు కూడా తాను గో మూత్రం తాగుతాను అంటూ అక్షయ్ చెప్పడంతో ఇప్పుడు ఆ విషయం వైరల్ గా మారింది. గోమూత్రం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పటి వరకు ఎంతో మంది చెప్పారు. కాని అక్షయ్ కుమార్ నోటి నుండి ఈ విషయం రావడంతో చాలా మందిలో ఆసక్తి కలుగుతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన అక్షయ్ కుమార్ గో మూత్రం తాగడం వల్ల ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటామని చెప్పడం వల్ల ఖచ్చితంగా దాన్ని తాగాలని చాలా మంది ఇప్పుడు నిర్ణయం తీసుకుని ఉంటారు.

Related Images:

చెప్పుతో కొట్టినట్టు.. ఏంటయా ఆ పురస్కారం?

జాతీయ మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన పేరు అర్నబ్ గోస్వామి. రిపబ్లిక్ టీవీ నిర్వహణలో కీలక భూమిక పోషిస్తున్న అర్నబ్ వాగ్ధాటికి ఎవరైనా డంగైపోవాలి. ఈయన ప్రస్తుతం జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్నారు. అధికారంలో వున్న భారతీయ జనతా పార్టీకి అత్యంత అనుకూల మీడియాగా పేరున్న రిపబ్లిక్ టీవీని రన్ చేస్తున్న అర్నబ్ పై గత కొంత కాలంగా కాంట్రవర్సీలు వెలుగులోకి వస్తూనే వున్నాయి.

తను మాత్రమే దేశ భక్తుడిగా అభివర్ణించుకునే అర్నబ్ గోస్వామి తనకు నచ్చని వారిపై విరుచుకుపడుతుంటాడు. తన ఛానల్ లో జరిగే చర్చల్లో తనకు నచ్చిన వారికి మాత్రమే మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తూ నచ్చని వారిని లైవ్ లోనే ఏకిపారేస్తుంటాడు. అర్నబ్ నోటికి భయపడి చాలా మంది ముదుర్లే నోరెళ్లబెడుతుంటారంటే అతని దాడి ఏ స్థాయిలో వుంటుందో లైవ్ చూసిన వాళ్లకి విదితమే. ఇతనితో పెట్టుకోవడానికి రాజకీయ నాయకులు.. సినీ సెలబ్రిటీలు వెనకడుగు వేస్తుంటారు. రియా- సుశాంత్ ల వివాదాన్ని అర్నబ్ మరింత రచ్చగా మార్చిన విషయం తెలిసిందే.

అలాంటి అర్నబ్ నే ఓ బాలీవుడ్ దర్శకుడు టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ లో వర్మ తరువాత అత్యంత వివాదాస్పద దర్శకుడిగా పేరున్న అనురాగ్ కశ్యప్ గురువారం రిపబ్లిక్ టీవి చానల్ ముందు బ్లాక్ చెప్పుని ఓ ఫ్రేమ్ లో జతచేసి ఓ ఫొటో ఫ్రేమ్ ని లామినేట్ చేసి అర్నబ్ గోస్వామికి జర్నలిజంలో లభించిన పురస్కారంగా ప్రదర్శించడం సంచలనంగా మారింది. అతనితో కలిసి కమెడియన్ కునాల్ కమ్రా వైట్ చెప్పుని ఓ ఫ్రేమ్లో చేర్చి గిప్ట్ గాచేర్చి జతకలవడం ఆసక్తికరంగా మారింది. ముంబైలోని రిపబ్లిక్ చానల్ ముందు ఈ లామినేషన్ ఫ్రేమ్ లతో హంగామా చేశారు. సెక్యూరిటీ అడ్డుకోవడంతో అక్కడ ఫొటోలకు పోజులిచ్చారు. వాటినే సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్ గా మారాయి.

Related Images: