V ని ఎంత పైకి ఎత్తాలని చూసినా కానీ..!

రిలీజైన తొలి రోజే ప్రీమియర్ నుంచి టాక్ బయటకు వచ్చేస్తుంది. థియేట్రికల్ రిలీజ్ కాకపోయినా ఓటీటీ రిలీజ్ అయినా మొదటిరోజు సినిమా కోసం వేచి చూసే జనం అంతే ఇదిగా దీనిపై ముచ్చట పెడుతుంటారు. ఈ సీజన్ లో అతి పెద్ద మూవీగా రిలీజైంది వి. నాని- సుధీర్ బాబు లాంటి స్టార్లతో ఇంద్రగంటి తెరకెక్కించిన ఈ మూవీ ఫలితం కూడా తొలిరోజే డిసైడ్ చేశారు విశ్లేషకులు.

వి గురించి ప్రచారం సాగినంతగా సినిమాలో కంటెంట్ పరంగా లేదని విమర్శలొచ్చాయి. నాని.. సుధీర్ స్టైలిష్ గా నటించినా కానీ ఏదో తేడా కొట్టిందన్న విమర్శ ఎదురైంది. ఇలాంటి ప్రతికూల పరీక్షను ఎదుర్కొన్న తర్వాత కూడా దీనికి ప్రచారం చేయడం అంటే శహభాష్ అనే అనాలి.

గత కొంతకాలంగా చిత్రబృందం అధునాతన విధానాల్లో ప్రమోషన్ చేస్తోంది. ‘# షేర్ యువర్ ఫ్రేమ్’ సవాల్ ని స్వీకరించి.. V ప్లే అవుతున్న టీవీ ముందు నిలబడి దాని సెల్ఫీని షేర్ చేయమని కోరుతున్నారు. నాని- సుధీర్- నివేధ ఈ కాన్సెప్టుతో ప్రచారం చేయడం ఆసక్తికరం. ఎన్ని విమర్శలు ఎదురైనా వీలైనంత ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరేలా చూడడానికి అతను సోషల్ మీడియాలో ఈ చిత్రాన్ని చురుకుగా ప్రచారం చేస్తున్నాడు. మొదటి రోజు నెగటివ్ టాక్ వచ్చాకా.. ఇంకా తమ సినిమా చూడాల్సిందిగా కోరడం వింతైనదే అయినా కానీ వి టీమ్ తెగువను మెచ్చుకుని తీరాల్సిందే అంటూ పంచ్ లు వేస్తున్నారు కొందరైతే.

Related Images:

కుప్పకూల్చిన చోటే ఆఫీస్ డ్యూటీ చేస్తా!- కంగన

కంగన వర్సెస్ ముంబై మున్సిపాలిటీ ఎపిసోడ్ గురించి తెలిసిందే. తాను ఎంతో శ్రమించి భారీగా ఖర్చు చేసి నిర్మించుకున్న ఆఫీస్ ని బీఎంసీ కుప్పకూల్చింది. అయితే కూల్చివేసిన కార్యాలయాన్ని పునర్నిర్మించేంత డబ్బు లేదని శిథిలాల మధ్యనే కూచుని ఆఫీస్ డ్యూటీ చేస్తానని చెప్పుకొచ్చింది క్వీన్.

ఆఫీస్ ని తిరిగి కట్టుకోలేను. స్త్రీ సంకల్పానికి చిహ్నంగా ఈ పని చేస్తున్నట్టుగా ప్రకటించింది. నిర్మాణాత్మక ఉల్లంఘనల ఆధారంగా బీఎంసీ ఈ ఆఫీస్ ని కూల్చివేసినా ఇదంతా శివసేన రాజకీయ కక్ష అన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇక తన ఆఫీస్ ని కూల్చివేయడంపై కంగన తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

ఒక ట్వీట్ లో దీనిని ప్రస్థావిస్తూ.. “నేను జనవరి 15 న నా కార్యాలయం ప్రారంభించాను. కరోనా వల్ల పని ఆగిపోయింది. సినిమాలు చేయడం లేదు. అందుకే దాన్ని పునరుద్ధరించడానికి డబ్బు లేదు. నేను అక్కడి నుండి పని చేస్తాను. శిథిలమైన ఆ కార్యాలయంలో పని చేసేందుకు ఈ ప్రపంచంలో ధైర్యం చేసిన స్త్రీల ఇష్టానికి చిహ్నంగా మారతాను“ అంటూ ఆవేశ పూరితంగా ప్రతినబూనింది క్వీన్. దీనికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేని వ్యతిరేకిస్తూ.. “కంగనా వర్సెస్ ఉద్దవ్” అనే హ్యాష్ ట్యాగ్ ను ఆమె జోడించారు.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అందించిన సెక్యూరిటీ గార్డులతో కంగనా సెప్టెంబర్ 9 న బిఎంసి కూల్చివేసిన కొన్ని గంటల తరువాత ముంబై చేరుకుంది. గురువారం నాడు తన భవంతిని సందర్శించిన కంగన నష్టాన్ని అంచనా వేసింది. శివసేన నాయకుడు సంజయ్ రౌత్తో మాటల యుద్ధం తరువాత కంగనా తన భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేయడంతో వై-ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కవర్ ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అందించారు. ముంబైలో తాను అసురక్షితంగా భావిస్తున్నానని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లా పరిస్థితి ఉందని పోల్చడంతో ఈ వివాదం ప్రారంభమైంది. రౌత్ ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ మహారాష్ట్రలో అడుగు పెట్టవద్దని వార్నింగ్ ఇచ్చారు.

ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఒక వీడియో సందేశంలో కంగనా నేరుగా ఠాక్రేను టార్గెట్ చేసింది. “ఉద్ధవ్ ఠాక్రే ఫిల్మ్ మాఫియాతో కుమ్మక్కై నా ఇంటిని పడగొట్టడం ద్వారా మీరు నాపై ప్రతీకారం తీర్చుకున్నారని అనుకున్నారా? ఈ రోజు నా ఇల్లు కూల్చివేశారు. కాని రేపు మీ అహంకారం నలిగిపోతుంది. కాలం మారుతుంది. మీరు నాకు భారీ సహాయం చేసారని నేను అనుకుంటున్నాను. కాశ్మీరీ పండితుల విషయంలో తప్పక ఏమి జరిగిందో నాకు తెలుసు. కాని ఈ రోజు నేను దానిని అనుభవించాను. అయోధ్యపైనే కాదు.. కాశ్మీర్ పై కూడా సినిమా చేస్తానని శపథం చేస్తున్నాను. నేను నా తోటి దేశస్థులను రెచ్చగొడతాను. ఇది నాకు జరిగింది. దీనికి కొంత అర్ధం తో పాటు ప్రాముఖ్యత ఉంది. ఉద్ధవ్ ఠాక్రే క్రూరత్వానికి భీభత్సానికి నేను నష్టపోయాను“ అని కంగన ఆవేశంగా నయా పొలిటికల్ సీన్ క్రియేట్ చేయడం రక్తి కట్టించింది.

Related Images:

రేణు నటి కాకపోతే ఏమయ్యేదంటే..?

ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయి. డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని చాలా మంది నటీనటులు చెబుతుంటారు. కానీ నటి కం నిర్మాత రేణూ దేశాయ్ మాత్రం తాను సైంటిస్ట్ కావాలనుకుందట. ఏదో కావాలనుకుని ఏదో అయ్యానని చెప్పడం అభిమానుల్లో చర్చకొచ్చింది. పవర్స్టార్ పవన్కల్యాణ్ నటించిన `బద్రి` చిత్రంతో రేణూ దేశాయ్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. హీరోయిన్ గా రేణుకు ఇదే తొలి సినిమా. ఈ చిత్రం విడుదలై 25 ఏళ్లు కావస్తోంది.

ఈ సందర్భంగా నటి రేణూ దేశాయ్ తన పాత జ్ఞాపకాల్ని చెరిగిపోయిన డ్రీమ్ ని గుర్తు చేసుకుంది. తను నటిని కావాలనుకోలేదని చెబుతోంది. అంతరిక్ష శాస్త్ర వేత్తని కావాలని వుండేదని అలా కాకుండా కనీసం డాక్టర్ ని అయినా అయ్యుండేదాన్నని చెబుతోంది. విధి మాత్రం తన డ్రీమ్ ని చిదిమేసిందట. శాస్త్రవేత్త కావాలనుకున్న తనని కెమెరా ముందుకు లాగేసిందని వాపోతోంది. నాసాలో శాస్త్ర వేత్తగా చేరాలనుకున్న తన కల అలా కల్లలైపోయిందని చెప్పుకొచ్చింది.

16 ఏళ్ల వయసులో తను కెమెరా ముందుకు వచ్చానని ఆ తరువాత సినిమాలతో ప్రేమలో పడిపోయానని చెబుతోంది. సినీ రంగంలో అడుగు పెట్టిన తరువాత తన జీవితంలో జరిగిన విషయాలన్నీ అందరికి తెలుసని వెల్లడించింది. గత కొంత కాలంగా రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా వుంటూ విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. పవన్ నుంచి విడిపోయాక రెండో పెళ్లి అన్న టాపిక్ కూడా రేణూని తీవ్రంగానే ఇబ్బంది పెట్టడం ఇంతకుముందు చర్చనీయాంశమైంది.

Related Images:

అక్టోబర్ 2న ఓటీటీలో ‘ఒరేయ్ బుజ్జిగా’…!

కరోనా మహమ్మారి కారణంగా గత ఆరు నెలలుగా థియేటర్స్ మూతబడి ఉండటంతో రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలన్నీ వాయిదా పడుతూ వచ్చాయి. అయితే థియేటర్స్ ఎప్పుడు రీ ఓపెన్ చేస్తారనే దానిపై క్లారిటీ లేకపోవడంతో సినిమాలన్నీ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ఓటీటీలలో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లోని క్రేజీ ప్రాజెక్ట్స్ అన్నీ ఒక్కొక్కటిగా ఓటీటీ బాట పడుతున్నాయి. ఈ క్రమంలో లేటెస్టుగా యువ హీరో రాజ్ తరుణ్ నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాని కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

ప్రముఖ తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ‘ఆహా’ లో ”ఒరేయ్ బుజ్జిగా” విడుదల కానుంది. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని ఆహాలో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి ‘గుండజారి గల్లంతయ్యిందే’ ఫేమ్ విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో మాళవిక అయ్యర్ – హెబ్బా పటేల్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మించారు. ఈ సినిమా మార్చి 25న విడుదల కావాల్సి ఉండగా కరోనా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ చేసే అవకాశాలు లేకపోవడంతో ‘ఆహా’ యాప్ తో డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

Related Images:

ఎట్టకేలకు ఓటీటీ ప్రీమియర్ కు నిశ్శబ్ధం..?

థియేటర్ల స్థానాన్ని డిజిటల్ ఆక్రమిస్తోంది. ఓటీటీల ప్రాధాన్యత అంతకంతకు పెరుగుతోంది. ఇటీవల వరుసగా క్రేజీ స్టార్లు నటించిన సినిమాల్ని ఓటీటీల్లో రిలీజ్ చేసేస్తుండడంతో ఈ వేదికపై జనంలో ఆసక్తి పెరుగుతోంది. మొన్న నాని- సుధీర్ బాబు నటించిన `వి` అమెజాన్ ప్రైమ్ లో రిలీజైంది. ఈ సీజన్ లో ఓటీటీలోకి వచ్చిన పెద్ద సినిమా ఇదే.

ఆ తర్వాత రాబోతున్న సినిమా `నిశ్శబ్ధం`. అనుష్క – మాధవన్ జంటగా నటించిన ఈ సినిమా స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో నేరుగా విడుదల చేయబోయే తదుపరి పెద్ద టాలీవుడ్ చిత్రమని ప్రచారమవుతోంది. నిజానికి డిజిటల్ లోకి రావాల్సిన మొదటి చిత్రం ఇదే కావాల్సింది. కానీ కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ ఆలస్యమవ్వడంతో ఇంత లేటయ్యింది.

నిశ్శబ్ధం డిజిటల్ రిలీజ్ సరైనదా థియేట్రికల్ రిలీజ్ సరైనదా? అంటూ నిర్మాత కం రచయిత కోన వెంకట్ ఆడియెన్ నే ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఇక ఎట్టకేలకు అమెజాన్ ప్రైమ్ వీడియోతో డీల్ కుదిరిందని తెలుస్తోంది. ఈ విషయాన్ని త్వరలో అధికారికంగా ప్రకటిస్తారట. ఈ మూవీలో అనుష్క మ్యూట్ క్యారెక్టర్ లో నటించగా.. అమెరికా నేపథ్యంలో హారర్ థ్రిల్లర్ కాన్సెప్టుతో రక్తి కట్టించనుందని సమాచారం. అక్టోబర్ లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. విడుదల షెడ్యూల్ ప్రకారం ఇది అక్టోబర్ 10 లేదా అక్టోబర్ 17 న ప్రదర్శిస్తారు. ఈ ప్రకటన అధికారికమైన తర్వాత తాజా ట్రైలర్ ను విడుదల చేయనున్నారు.

Related Images:

డ్రగ్స్ కేసులో గుండెలదిరే నిజం తెలిసింది!

అటు బాలీవుడ్ ఇటు శాండల్ వుడ్ రెండు చోట్లా డ్రగ్స్ సిండికేట్ గుట్టు ఒకేసారి లీకవ్వడంతో సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. ముఖ్యంగా శాండల్ వుడ్ నాయికలు సంజన గల్రానీ- రాగిణి ద్వివేది నుంచి రకరకాలుగా సమాచారం రాబడుతున్నారు. ఈ భామలు డ్రగ్స్ కేసు వ్యవహారం బయటపడే క్రమంలో 100 మందికి సంబంధించిన సమాచారాన్ని ఫోన్ నుంచి తొలగించారని తెలుస్తోంది. ఇక ఆ వందమంది ఎవరు? అన్నదానిపైనా పోలీసులు ఆరాలు తీస్తున్నారు.

దీనిని బట్టి తీగ లాగితే చాలా ఇండస్ట్రీల లోగుట్టు బయటపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పరిశ్రమల మధ్య డ్రగ్స్ సరఫరా ఇంటర్ లింకులపైనా నార్కోటిక్స్ అధికారులు ఆరాలు తీస్తున్నారట. ఇక ఈ కేసులో మరో ఆసక్తికర ట్విస్టు బయటపడింది. అరెస్టు చేసే క్రమంలో సంజనను పోలీసులు అడిగిన ప్రశ్న `మీకు పెళ్లయిందా?` .. కానీ దానికి సంజన అవ్వలేదు అని చెప్పింది. అయితే గత ఏడాది అజీజ్ పాషా అనే తమిళ వైద్యుడిని సంజన రహస్య వివాహం చేసుకుందన్న నిజం బయటపడింది. ఆ ఇద్దరూ జంటగా ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాల్లో బయటపడడంతో ఖంగు తిన్న సంజన పోలీసుల ముందు నిజమేనని ఒప్పుకోవాల్సి వచ్చిందట.

ఇక డ్రగ్ డీలింగ్స్ పైనా పెడ్లర్ల గురించి ఆరాలు తీస్తున్నారట. తమతో సన్నిహితంగా ఉన్నవారు సహా నిందితుల గురించి సంజన.. రాగిణి కీలక సమాచారం తెలిపారట. ఈ డీలింగ్స్ లో డెబిట్.. క్రెడిట్ కార్డులు సహా బిట్ కాయిన్ల ద్వారా డ్రగ్స్ ని కొనుగోలు చేసినట్లు సీసీబీ పోలీసులు ఆధారాలను సేకరించారు. డార్క్ వెబ్లో డ్రగ్స్ సరఫరా చేసే ఆఫ్రికన్ ముఠాల వివరాల్ని ఆ ఇద్దరూ వెల్లడించారని తెలుస్తోంది. ఈ కేసలో రవిశంకర్- రాహుల్- వీరేన్ లతో ఆ ఇద్దరి సంబంధాలు బయటపడ్డాయి. ఇక ఒకే జైలులో ఉన్నా రాగిణి.. సంజనల మధ్య పొసగక పోవడంతో ఇద్దరికీ వేర్వేరు గదుల్ని ఎరేంజ్ చేయాల్సి వచ్చిందట. ఇక రాగిణి తల తిరుగుతోందని ఊపిరాడడం లేదని అనడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా తనకు బీపీతో పాటు గ్యాస్ట్రిక్ ఉందని తెలిసిందట. ప్రస్తుతం సంజన.. రాగిణిలకు రక్త పరీక్షల్ని నిర్వహించనున్నారు.

Related Images:

మహేష్ అభిమాన సంఘం అధ్యక్షుడు హఠాన్మరణం

సూపర్ స్టార్ మహేష్ కి దేశవ్యాప్తంగా అభిమాన సంఘాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇరు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫాలోవర్స్ ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం.. నెల్లూరు జిల్లా మహేష్ బాబు అభిమానుల సంఘం అధ్యక్షుడు దరిసి సురేష్ బాబు అకస్మాత్తుగా మరణించారని తెలుస్తోంది. సీనియర్ అభిమాని విషాదకరమైన మరణానికి కలత చెందిన మహేష్ ట్విట్టర్ లో తన సంతాపం తెలియజేశారు.

“దరిసి సురేష్ బాబు అకాల మరణం గురించి వినడం హృదయాన్ని కలిచి వేసింది. అతడు నిజంగా మానుంచి తప్పిపోతాడు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి అండగా నిలుస్తామ“ని మహేష్ ట్వీట్ చేశారు. ట్విట్టర్ పేజీలో ఒక అభిమాని మహేష్ తో కలిసి సురేష్ ఉన్నప్పటి ఫోటోని షేర్ చేశారు.

స్టార్లు ఉన్నంతకాలం వారిని నెత్తిన పెట్టుకుని పూజించేది అభిమానులే. అందుకే ఆ కుటుంబానికి మహేష్ తరపున ఆర్థిక సాయం అందనుందని తెలుస్తోంది. ఇకపోతే మహేష్ తన కెరీర్ 27వ సినిమాని పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్న వేళ అభిమాని మరణం విషాదకరం.

Related Images:

డబ్బింగ్ రైట్స్ కి లెక్కలేకుండా పోతోందా…?

నేచురల్ స్టార్ నాని – సుధీర్బాబు హీరోలుగా నటించిన ‘వి’ సినిమా ఇటీవలే ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో విడుదలైన సంగతి తెలిసిందే. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు – శిరీష్ – హర్షిత్ రెడ్డి నిర్మించారు. నివేదా థామస్ – అదితిరావ్ హైదరీ హీరోయిన్లుగా నటించారు. నాని కెరీర్లో 25వ చిత్రంగా తెరకెక్కిన ”వి” పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. సమ్మర్ కానుకగా విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. దీంతో ఆరు నెలలు థియేటర్స్ రీ ఓపెన్ చేస్తారేమో అని వెయిట్ చేసిన మేకర్స్ చివరకి ఓటీటీకే ఓటు వేశారు.

ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వారు ‘వి’ సినిమాని రూ.30 నుంచి 35 కోట్ల మధ్య డీల్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 5న తెలుగు తమిళ్ కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అయిన ‘వి’ మూవీకి ఓటీటీ ఆడియన్స్ నుంచి విశ్లేషకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. నాని కెరీర్లో మైలురాయి సినిమా ఇలా ఉంటుందని ఎక్సపెక్ట్ చేయలేదని ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ చేసి ఉంటే దిల్ రాజుకు నష్టాలు తెచ్చి పెట్టేదని కామెంట్స్ వినిపించాయి. ఓటీటీ పుణ్యమా అని లాభాల బాట పట్టిన ‘వి’ సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ సుమారు రూ.8 కోట్లకు అమ్ముడుపోయాయట.

ఇదిలా ఉండగా ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ కూడా భారీ ధర పలికినట్లు తెలుస్తోంది. దీనికోసం ఏకంగా రూ.8 కోట్ల డీల్ జరిగినట్లు ఫిలిం సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. అయితే ఓటీటీలో ఎక్కువ ఆదరణ దక్కించుకోని సినిమా రీమేక్ రైట్స్ ఈ రేంజ్ లో అమ్ముడుపోవడం ట్రేడ్ నిపుణులను ఆశ్చర్యానికి గురి చేస్తోందట. లాక్ డౌన్ లో కూడా రిపీట్ వ్యూస్ లేని సినిమాలకు ఇంత క్రేజ్ ఏంటని ఆలోచిస్తున్నారు. ఏదేమైనా కరోనా లాక్ డౌన్ లో డబ్బింగ్ రైట్స్ కి లెక్కలేకుండా పోతోందని కామెంట్స్ చేస్తున్నారు.

Related Images:

‘వి’ కాపీ ఇంద్రగంటికి తెలియకుండా జరిగిందా?

నాని 25వ సినిమా ‘వి’ తాజాగా ఓటీటీ ద్వారా నేరుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు నెగటివ్ టాక్ వచ్చింది. దానికి తోడు సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తమిళ హిట్ మూవీ ‘రాక్షసన్’ నుండి మక్కీకి మక్కీ ఎత్తిసినట్లుగా ఉంది. ‘వి’ సినిమా షూటింగ్ సమయంలోనే సంగీత దర్శకుడు థమన్ ఈ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడట. అయితే ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను రాక్షసుడు నుండి థమన్ ఎత్తి వేశాడు అంటూ ఇంద్రగంటి కనిపెట్టలేక పోయాడు అంటూ కొందరు అంటున్నారు. కాని అసలు విషయం ఏంటీ అంటే స్వయంగా ఇంద్రగంటి తనకు అలాంటి బీజీ కావాలని థమన్ ను కోరాడు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. దర్శకుడు కోరినట్లుగా సంగీత దర్శకుడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడంటున్నారు.

రాక్షసన్ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి మార్కులు పొందింది. తన సినిమా కథకు అది బాగా సూట్ అవుతుందని ఇంద్రగంటి భావించాడని అందుకే దాన్ని మార్చి ‘వి’ సినిమాలో పెట్టేద్దాం అంటూ థమన్ తో అన్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే థమన్ దాన్ని పెద్దగా మార్చకుండానే నేరుగా పెట్టేశాడు. ఇంద్రగంటి రాక్షసన్ బీజీ తరహాలో కవాలని అన్నాడు కనుక ఆయన దాన్ని గుర్తించ లేక పోయాడంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉండగా మరి కొందరు మాత్రం కనీసం దిల్ రాజు అయిన ఈ విషయంలో కాస్త శ్రద్ద చూపిస్తే బాగుండేది కదా అంటున్నారు.

మొత్తానికి ఎక్కడో ఏదో పొరపాటు జరగడమో లేదంటే కావాలని చేయడమో చేశారు కాని తమ అభిమాన హీరో నాని పరువు తీశారంటూ నాచురల్ స్టార్ నాని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాని ప్రతిష్టాత్మక 25వ సినిమాకు ఇలా జరగడం విచారకరం అంటూ అభిమానులు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.

Related Images:

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత

సినీ పరిశ్రమలో చోటు చేసుకుంటున్న వరుస విషాదాలు ప్రేక్షకులను కలవరపెడుతున్నాయి. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ నుంచి సినీ ప్రముఖుల వరుస మరణ వార్తలు విని షాక్ అవుతున్నారు జనం. గురువారం రోజు ప్రముఖ తమిళ సినీ హాస్యనటుడు వడివేలు బాలాజీ (45) గుండెపోటుతో కన్నుమూశారు. గత 15 రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో చెన్నైలోని గవర్నమెంట్ ఆసుపత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందారు.

వడివేలు బాలాజీ ఆరోగ్య పరిస్థితి బాగాలేక పోవడంతో ముందుగా ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. 10 రోజులకు పైగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి మరీ విషమించడంతో హార్ట్ అటాక్ వచ్చి నిన్న కన్నుమూశారు. దీంతో కోలీవుడ్ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ధనుష్, ప్రసన్న, ఐశ్వర్య రాజేష్, వివేక్ సహా పలువురు కోలీవుడ్ స్టార్స్ ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు.

విజయ్‌ టీవీలో ప్రసారమవుతున్న ‘కలక్క పోవదు యార్’‌ కార్యక్రమం ద్వారా వడివేలు బాలాజీ ఫేమస్ అయ్యారు. పలు టీవీ కార్యక్రమాల్లో వినోదం పండించిన ఆయన ఆ తర్వాత పలు తమిళ సినిమాల్లోనూ నడిచారు. న టుడు వడివేలును అనుకరిస్తూ కామెడీ చేయడంతో ఆయనకు వడివేలు బాలాజీ అనే పేరు వచ్చింది. ఆయనకు భార్య, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు.

Related Images:

అక్కినేని హీరో బాధ్యత మెగా ఫ్యామిలీ తీసుకుందా…?

అక్కినేని ఫ్యామిలీ మూడో తరం హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు అఖిల్. తన ఫస్ట్ మూవీ ‘అఖిల్’ పరాజయం పాలైనప్పటి నుంచి సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్.. ఆకట్టుకునే అందం.. ఆడియన్స్ ని మెప్పించగల అభినయం.. అన్నీ ఉన్నా అక్కినేని అఖిల్ కి సాలిడ్ హిట్ మాత్రం పడలేదు. హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో తనయుడి కెరీర్ మీద ఫోకస్ పెట్టిన నాగార్జున.. అఖిల్ ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చేతిలో పెట్టాడు. గీతా ఆర్ట్స్2 బ్యానర్ లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ”మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” అనే సినిమాని పట్టాలెక్కించారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. అయితే ఈ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ హిట్ అయినా అఖిల్ ని మాస్ హీరోగా నిలబెట్టాలనే నాగ్ కోరిక మాత్రం నెరవేరదనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో అఖిల్ బాధ్యత మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్ తీసుకున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో అనుకుంటున్నారు.

అక్కినేని ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య ఎప్పటి నుంచో మంచి అనుబంధం ఉందనే విషయం తెలిసిందే. టాలీవుడ్ లో సీనియర్ హీరోలుగా కొనసాగుతున్న నాగ్ – చిరు ఇద్దరూ సోదరభావంతో మెలుగుతూ ఉంటారు. ఇద్దరూ కలిసి పలు వ్యాపారాల్లోనూ భాగస్వాములుగా ఉన్నారు. ఈ క్రమంలో అఖిల్ – రామ్ చరణ్ కు మధ్య కూడా మంచి బాండింగ్ ఏర్పడింది. అందుకే చిరంజీవిని అఖిల్ ‘పెదనాన్న’ అని సంబోధిస్తూ చరణ్ ని ‘అన్నయ్య’ గా ట్రీట్ చేస్తూ ఉంటాడు. చిరంజీవి సైతం ఓ సందర్భంలో ‘అఖిల్ ఇంట్లో తిరుగుతూ ఉంటే మాకు ఇలాంటి మరో కొడుకు ఉంటే బాగుండు’ అని అనుకుంటూ ఉంటామని చెప్పుకొచ్చాడు. వీరి మధ్య ఇలాంటి రిలేషన్ షిప్ ఉన్న నేపథ్యంలో అఖిల్ ని హీరోగా నిలబెట్టాలని అతని బాధ్యత చిరు – చరణ్ తీసుకున్నారని సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఎలా అయినా అఖిల్ ని నిలబెట్టాలని నెక్స్ట్ ప్రాజెక్ట్ పై స్పెషల్ ఫోకస్ పెట్టిన రామ్ చరణ్.. తన కోసం రెడీ చేసిన స్క్రిప్ట్ ని అఖిల్ తో తీసేలా ప్లాన్ చేసాడని వార్తలు వస్తున్నాయి. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి చరణ్ తో ‘ధ్రువ’.. చిరంజీవితో ‘సైరా నరసింహారెడ్డి’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ‘సైరా’ వంటి పాన్ ఇండియా మూవీ తరువాత అదే రేంజ్ లో చరణ్ కోసం ఓ స్టోరీ రెడీ చేశారట. అయితే చరణ్ కి ఈ స్టోరీ నచ్చినప్పటికీ అఖిల్ తో చేయమని రిక్వెస్ట్ చేశాడట. దీంతో సురేందర్ రెడ్డి చరణ్ కోసం రెడీ చేసిన స్పై థ్రిల్లర్ స్టోరీని అఖిల్ తో తీస్తున్నట్లు టాక్ వస్తోంది. ఇటీవల సినిమాకి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. చరణ్ సెట్ చేసిన స్టోరీతో అఖిల్ కి సూపర్ సక్సెస్ వచ్చి మెగా బాధ్యత నెరవేర్చుకుంటారేమో చూడాలి.

Related Images:

కంగనా వై ప్లస్ కి నా డబ్బులు ఎంత వినియోగిస్తున్నారన్న నటి

ముంబయిలో అడుగు పెట్టనివ్వం అంటూ శివసేన కార్యకర్తలు కంగనాను హెచ్చరించిన నేపథ్యంలో ఆమె సెక్యూరిటీ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం ఆమెకు ఏకంగా వై ప్లస్ సెక్యూరిటీని కేటాయించిన విషయం తెల్సిందే. ఒక నటికి ఆ స్థాయిలో సెక్యూరిటీ ఇవ్వడం మొదటి సారిగా చెబుతున్నారు. కంగనాకు ముప్పు ఉన్న కారణంగా ఆమెకు సెక్యూరిటీ ఇవ్వడం మంచిదే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా మరి కొందరు మాత్రం ఈ విషయంలో కేంద్రంను మరియు కంగనాను విమర్శిస్తున్నారు. ప్రజల సొమ్ముతో ఒక నటికి వై ప్లస్ సెక్యూరిటీ ఇవ్వడం ఏంటీ అంటూ విమర్శలు కురిపిస్తున్నారు.

ఈ విషయమై నటి కుబ్రా సైథ్ స్పందిస్తూ.. ఈ సెక్యూరిటీ కోసం ఖర్చు చేస్తున్నదాంట్లో నేను కడుతున్న ట్యాక్స్ లు ఎంత ఉన్నాయి. కేంద్రం నా డబ్బులు ఎన్ని ఇందుకు ఉపయోగిస్తుంది అంటూ ఆమె ప్రశ్నించింది. కుబ్రా ట్వీట్ కు రంగోలీ కాస్త తీవ్రంగానే స్పందించింది. ఉత్సుకతతో అడుగుతున్న నువ్వు ప్రభుత్వంకు ఎంత ట్యాక్స్ చెల్లిస్తున్నావు కుబ్రా అంటూ రంగోలీ కౌంటర్ ఇచ్చింది. కంగనా సెక్యూరిటీ విషయంలో సోషల్ మీడియాలో రకరకాలుగా మీమ్స్ వస్తున్నాయి. పేదవాడి గురించి పట్లని ప్రభుత్వాలు ఇలా సెల్రబెటీల కోసం పదుల సంఖ్యలో సెక్యూరిటీకి ఖర్చు చేయడం ఏంటో అంటున్నారు. ఆమెకు ఉన్న డబ్బుతో అంతకు మించిన సెక్యూరిటీని ఏర్పర్చుకుంటుంది కదా ప్రభుత్వం ఎందుకు ఆమెకు ప్రత్యేకంగా సెక్యూరిటీ కల్పించాల్సి వస్తుందని కొందరు ప్రశ్నిస్తున్నారు.

Related Images:

‘గుండు బాస్’ గా బిగ్ బాస్.. మెగాస్టార్ లుక్ చూస్తే షాకవ్వాల్సిందే…!

మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య తన లుక్స్ తో వేరియేషన్స్ చూపిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా కోసం స్లిమ్ గా మారిన చిరంజీవి.. ఇటీవల క్లీన్ షేవ్ లో మీసాలు లేకుండా కనిపించి ఒక్కసారిగా అందరినీ ఆశ్యర్యపరిచాడు. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో ఓ ఫోటో పోస్ట్ చేసి మరోసారి షాక్ ఇచ్చాడు మెగాస్టార్. అయితే ఈ లుక్ మాత్రం ఎవరూ ఉహించిందని చెప్పవచ్చు. ఎందుకంటే చిరంజీవి ఈ ఫొటోలో గుండుతో కనిపిస్తున్నాడు. ”నేను సన్యాసిలా ఆలోచించగలనా?” అని ఆ ఫొటోకు #UrbanMonk అనే క్యాప్షన్ ను జత చేసాడు. ‘గుండు బాస్’ గా మారిన బిగ్ బాస్ ని చూసి అందరూ షాక్ అవుతున్నారు.

మెగాస్టార్ ఇచ్చిన సర్ప్రైజ్ లుక్ చూసిన మెగా అభిమానులు ‘అది మేకప్ ఏమో’ అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తుంటే.. ‘ఏదేమైనా మన బాస్ గుండు బాస్ లుక్ సూపర్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ లుక్ ప్రస్తుతం చిరు నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా కోసమా.. లేదా యాడ్ కోసమా అనేది తెలియాల్సి ఉంది. లేదంటే చిరు నటించే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో గెటప్ టెస్ట్ చేస్తున్నారా.. మరేదైనా కారణం ఉందా అనేది తెలియాలంటే వెయిట్ చేయక తప్పదు. ప్రస్తుతం మెగాస్టార్ గుండుతో ఉన్న ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Related Images:

‘జెంటిల్ మేన్ 2’ చిత్రాన్ని అనౌన్స్ చేసిన ప్రొడ్యూసర్…!

తమిళ మలయాళ భాషల్లో ఒకప్పుడు భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించిన ప్రొడ్యూసర్ కేటి కుంజుమోన్.. 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ సినిమాలు ప్రొడ్యూస్ చేయనున్నట్లు ప్రకటించారు. రజినీకాంత్ – కమల్ హాసన్ – మమ్ముట్టి – మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించిన కేటి కుంజుమోన్.. ‘కింగ్’ అక్కినేని నాగార్జున తో ‘రాక్షుసుడు’ సినిమా నిర్మించాడు. భారతదేశం గర్వించదగ్గ నిర్మాతల్లో ఒకరైన శంకర్ ఫస్ట్ సినిమా ‘జెంటిల్ మేన్’ సినిమాని కూడా కేటి కుంజుమోన్ నిర్మించాడు. 1993లో తమిళం తెలుగు భాషల్లో రూపొందిన ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించి హీరో అర్జున్ కెరీర్ లో మైలురాయిగా నిలిచింది. విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ.. అవినీతిపై పోరాడే ఓ యువకుడి కథతో తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయం నమోదు చేయడమే కాక అనేక అవార్డులను కూడా అందుకుంది. అయితే ఇప్పుడు ‘జెంటిల్ మేన్’ చిత్రానికి సీక్వెల్ చేయబోతున్నట్లు కుంజుమోన్ ప్రకటించారు.

కాగా 1999లో విజయ్ హీరోగా నటించిన ‘ఎండ్రెండ్రం కాదల్’ అనే సినిమా తర్వాత కుంజుమోన్ మరో సినిమా నిర్మించలేదు. ఇన్నేళ్ల తర్వాత తన నిర్మాణంలో భారీ విజయాన్ని సాధించిన ‘జెంటిల్ మేన్’ చిత్రానికి పార్ట్ 2 చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. జెంటిల్ మేన్ ఫిలిం ఇంటర్నేషనల్ అనే బ్యానర్ లో మొదటి భాగానికి రెండింతలు ఉండేలా ‘జెంటిల్ మేన్ 2’ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు నిర్మాత కేటి కుంజుమోన్. ఈ చిత్రాన్ని తెలుగుతమిళ హిందీ మలయాళ కన్నడ భాషలలో నిర్మించనున్నారు. నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా కుంజుమోన్ మాట్లాడుతూ.. ‘జెంటిల్ మేన్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో అనువదించబడి మంచి రెస్పాన్స్ రాబట్టుకుంది. అందుకే ‘జెంటిల్ మేన్ 2’ చిత్రాన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హాలీవుడ్ చిత్రాలకు ధీటుగా రూపొందిస్తున్నాం” అని పేర్కొన్నారు.

Related Images:

యువ హీరో మేకోవర్ చూసి వావ్ అనాల్సిందే..!

చాక్లెట్ బాయ్ ఇమేజ్ ఉన్న యువ హీరో నాగ శౌర్య ఇప్పుడు లుక్ మార్చేశాడు. తన కెరీర్లో 20వ చిత్రంగా రాబోతున్న మూవీ కోసం శౌర్య వర్కౌట్స్ చేసి తన కటౌట్ ని మార్చేశాడు. ఇంట్లోనే జిమ్ ని రెడీ చేసుకొని కఠోర వ్యాయామాలు చేస్తున్న నాగ శౌర్య కండలు తిరిగిన దేహాన్ని చూసి ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు. గత ఆరు నెలలుగా షూటింగ్స్ లేకపోవడంతో ఇంటికే పరిమితమైన శౌర్య.. మళ్ళీ సెట్స్ లో అడుగుపెట్టడానికి రెడీ అయ్యాడు. ఈ క్రమంలో తాజాగా నాగశౌర్య సోషల్ మీడియాలో ఓ పిక్ ని పోస్ట్ చేసి ‘బాడీ విషయానికి వస్తే.. అది ట్రైనర్ కి సంబంధించిన అంశం’ అంటూ పేర్కొన్నాడు. ఈ ఫొటోలో తన ట్రైనర్ తో కలిసి ఉన్న నాగశౌర్య మేకోవర్ చూస్తే అందరూ వావ్ అనాల్సిందే. ఇంకేముంది ఆరు పలకల దేహంతో నిలబడి ఉన్న నాగ శౌర్య ఫోటోకి లైకులు కొడుతూ సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తున్నారు.

కాగా #NS20 చిత్రానికి ‘సుబ్రహ్మణ్యపురం’ ఫేమ్ ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై నారాయణ్ దాస్ కె నారంగ్ – పుష్కర్ రామ్మోహన్ రావు – శరత్ మరార్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాలభైరవ సంగీతం సమకూరుస్తుండగా రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా ఆర్చరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఫస్ట్ ఇండియన్ మూవీ అని తెలుస్తోంది. ఇటీవలే చిత్ర యూనిట్ విడుదల చేసిన ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమా రెగ్యులర్ షూట్ త్వరలోనే ప్రారభించబోతున్నారని సమాచారం.

Related Images:

విమానం హైజాక్ లో 212 మంది భారతీయుల్ని కాపాడిన వీరుడి కథ!

విమానం హైజాక్ నేపథ్యంలో హాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. వీటి స్ఫూర్తితోనే ఇంతకుముందు కింగ్ నాగార్జున కథానాయకుడిగా గగనం సినిమా కూడా వచ్చింది. అయితే అది తమిళ వాసనలతో తెలుగు ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు. తమిళంలోనూ ఆశించిన విజయం దక్కించుకోలేదు.

ఇక ఇదే కాన్సెప్టుతో ప్రస్తుతం కిలాడీ అక్షయ్ కుమార్ ఓ భారీ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు. బెల్ బాటమ్ అనేది టైటిల్. ఇందులో లారా దత్తా- హ్యూమా ఖురేషి సహా పలువురు టాప్ స్టార్లు నటిస్తున్నారు. ఆగస్టు 21న విదేశాల్లో చిత్రీకరణ ప్రారంభించగా అక్టోబర్ ఎండ్ వరకూ చిత్రీకరణ సాగనుందని తెలిసింది. ఇక అన్ లాక్ 4.0 సందర్భంగా విదేశాల్లో ప్రారంభమైన తొలి బాలీవుడ్ చిత్రమిదేనన్న ముచ్చటా సాగుతోంది.

ఈ సినిమా 80లలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందిస్తున్నారని సమాచారం. 212 మంది భారతీయుల్ని హైజాక్ నుంచి కాపాడిన వీరుడి కథాంశమిది. నాటి వాతావరణాన్ని సెట్స్ లో రీక్రియేట్ చేశారు. రంజిత్ తివారీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అక్షయ్ ఓ స్పై పాత్రలో నటించనున్నారు. విమానం హైజాక్ నేపథ్యం అనగానే సినిమా ఆద్యంతం ఊపిరి సలపనివ్వని ట్విస్టులతో కుర్చీ అంచున కూచోబెట్టాలి. అంత థ్రిల్లింగ్ గా తెరకెక్కిస్తేనే ఆడియెన్ కనెక్టవుతారు. ఇప్పటికే పలు హాలీవుడ్ చిత్రాల్ని అమెజాన్ ప్రైమ్ నెట్ ఫ్లిక్స్ లో వీక్షించిన ఆడియెన్ కి పూర్తిగా కొత్త సరంజామా కావాలి. మరి అది అక్షయ్ బృందం ఇస్తుందా లేదా? అన్నది చూడాలి. హైజాక్ నేపథ్యం అనగానే భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లోకి అనువదించి రిలీజ్ చేసేందుకు ఆస్కారం ఉంది.

Related Images:

మరో క్లైమాక్స్ రాబోతుంది

రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే ‘క్లైమాక్స్’ అనే టైటిల్ తో ఒక సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. డిజిటల్ మీడియా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమాతో వర్మ బాగానే డబ్బులు మూట కట్టుకున్నట్లుగా ప్రచారం జరిగింది. శృంగార సినిమాగా ఆ సినిమాను వర్మ తీశాడు. ఇప్పుడు అదే టైటిల్ తో రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో శ్రీరెడ్డితో పాటు ఇంకా ప్రముఖ నటీనటులు నటించిన సినిమా ‘క్లైమాక్స్’ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ వచ్చింది.

ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యగా కనిపించబోతున్నాడు. విజయ్ మాల్య ఇండియా తిరిగి వచ్చి రాజకీయాల్లో చేరితే ఎలా ఉంటుంది పరిస్థతి అనే విషయాలను చూపించేందుకు క్లైమాక్స్ అనే సినిమాను తీశారట. శ్రీ రెడ్డి తన రియల్ లైఫ్ పాత్రను సినిమాలో పోషించిందట. అంటే ప్రముఖులను విమర్శిస్తూ మరో వైపు సోషల్ మీడియాలో సెన్షేషన్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది.

ఇక శివ శంకర్ మాస్టర్ సినిమా లో మరో కీలక పాత్రలో నటించబోతున్నాడు. మొత్తానికి క్లైమాక్స్ చాలా ఆసక్తికరంగా ఉంటుందని అనిపిస్తుంది. కాస్త వివాదాస్పద అంశాలు ఉన్నా కూడా తప్పకుండా సినిమా ఆకట్టుకునేలా ఉంటుందని అంతా నమ్ముతున్నారు.

Related Images:

కర్మ అంటూ కన్నీరు పెట్టుకున్న హీరోయిన్

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన హీరోయిన్ సంజన గర్లానీ కన్నీరు మున్నీరు అయినట్లుగా తెలుస్తోంది. బెంగళూరులోని మహిళ సాంత్వన కేంద్రంలో ఈ కేసులో అరెస్ట్ అయిన రాగిణి మరియు సంజనను ఉంచడం జరిగింది. అక్కడ వీరిద్దరు మాట్లాడుకోలేదట. మౌనంగా ఎవరికి వారు అన్నట్లుగా ఉన్నారట. రాత్రి సమయంలో పొద్దు పోయే వరకు సంజన కన్నీరు పెట్టుకుందని ఆమె లేడీ కానిస్టేబుల్ తో మాట్లాడుతూ ఇది అంతా నా కర్మ అందట. సంజన భోజనం కూడా వద్దని సంజన ఖాళీ కడుపుతోనే ఉందట.

సంజన ఈ కేసులో కర్మ కొద్ది ఇరుక్కున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేసిందట. ఈ విషయంలో ఇంకా చాలా మంది పెద్ద వారు ఉన్నా కూడా తననే అరెస్ట్ చేశారనే ఆవేదనలో ఆమె ఉందట. కన్నడ సినిమా పరిశ్రమ మరియు రాజకీయ నాయకులకు కూడా సంబంధం ఉందని వార్తలు వస్తున్నాయి. విచారణ అధికారులు నేడు మరియు రేపు కూడా సంజనను ప్రశి్నంచే అవకాశం ఉందంటున్నారు. ఈ ఎంక్వౌరీలో సంజన ఏం సమాధానం చెప్పబోతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related Images:

వివాహాలకు పోయే కాలం దగ్గర పడింది : పూరి

రామ్ గోపాల్ వర్మకు పెళ్లి అనే కాన్సెప్ట్ నచ్చదు. ఆ విషయం అందరికి తెల్సిందే. అందుకే ఆయన తన భార్య ను కుటుంబాన్ని వదిలేశాడు. పెళ్లి అనే దానిపై అస్సలు ఆసక్తిలేని రామ్ గోపాల్ వర్మ పెళ్లి అవసరమా అంటూ ఉంటాడు. తాజాగా ఆయన శిష్యుడు అయిన పూరి జగన్నాధ్ కూడా పెళ్లి అనేది పనికి రాని వ్యవస్థ అంటూ తీ్రవ వ్యాఖ్యలు చేశాడు. ఈమద్య కాలంలో పూరి జగన్నాద్ ‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో ఆడియో మెసేజ్ లు ఇస్తున్నాడు. గత వారం పూరి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విచిత్రమైన తెగల పద్దతులను వివరించాడు. తాజాగా పెళ్లి గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

పెళ్లి అనే పద్దతికి పోయే కాలం దగ్గర పడింది. గొప్ప వారు అవ్వాలనుకున్న వారు పెళ్లి చేసుకోకుండా ఉండాలి. పెళ్లి అనేది అంత మంచిది అవ్వక పోవడం వల్లే ఏసుక్రీస్తు పది వివాహాలు చేసుకున్నారు. ఇక భార్యను వదిలేయడం వల్లే రాజుల వంశంకు చెందిన కుర్రాడు బుద్దుడు అయ్యాడు. ఇప్పుడు ఎంతో మందికి ఆయన ఆదర్శంగా నిలుస్తున్నాడు.

పట్టుదల అనేది మీకు ఉంటే కాళ్లకు పారాణి పెట్టుకోకుండా ప్రపంచ దేశాలు తిరగాలి. పెళ్లి చేసుకున్న వారు అంతా కూడా పెళ్లికాని బాబాల కాళ్లపై పడి దండం పెడుతున్నారు. పెళ్లి కాకుండా ఉన్న వారు అంతా గొప్ప వారినిగా పేరు సంపాదించారు అంటూ విచిత్రమైన వ్యాఖ్యలు చేశాడు. ఇంకా కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటే నాకు మీ పెళ్లి శుభలేక పంపండి నేను వచ్చి ఆశీర్వదిస్తాను అన్నాడు. పూరి వ్యాఖ్యలను కొద్ది మంది సమర్థిస్తే మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు.

Related Images:

‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’ ఛైర్మన్ గా పరేష్ రావల్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన `శంకర్ దాదా ఎంబిబిఎస్`లో డాక్టర్ మామగా నటించిన పరేష్ రావల్ ని ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోలేరు. శంకర్ వర్సెస్ డాక్టర్ మామ ఎపిసోడ్స్ ఫుల్ జోష్ ని పంచాయి ఆ చిత్రంలో. బాలీవుడ్ సహా సౌత్ ఇండస్ట్రీస్ లోనూ ఆయన చెప్పుకోదగ్గ పాత్రల్లో నటించారు. ఆయన తనకంటూ యూనిక్ ప్రెజెంటేషన్ తో అభిమానుల గుండెల్లో నిలిచిన నటుడు.

ఆయన స్కూల్ ఆఫ్ డ్రామా స్పెషలిస్ట్ అన్న సంగతి తెలిసిందే. స్టేజీ నటుడిగా రాణించి వెండితెరపై ఎన్నో సంచలనాలు సృష్టించారు. అందుకే ఆయనకు సరైన గుర్తింపు దక్కింది ఈరోజు. పరేష్ రావల్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్డి- దిల్లీ) కు కొత్త ఛైర్మన్ పదవిని స్వీకరించనున్నారు. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గురువారం స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు.

ఈ ఎంపికను నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా స్వాగతించింది. ప్రస్తుతం దీనికి అధ్యక్షత వహించే ప్రముఖ థియేటర్ ఆర్టిస్ట్ అర్జున్ డియో చరణ్ నుండి చైర్మన్ పదవిని పరేష్ రావల్ తీసుకోనున్నారు. వినోద పరిశ్రమకు చేసిన కృషికి 2014 లో భారతదేశంలో నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన భారత ప్రభుత్వం రావల్ కి పద్మశ్రీని ప్రదానం చేసింది. 1994 లో వోహ్ చోక్రీ & సర్ లో నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని గెలుచుకున్నాడు.

డాక్టర్ మామకు దక్కిన గౌరవం.. తాజా ఎంపికపై అటు బాలీవుడ్ సహా ఇటు టాలీవుడ్ లోనూ ఆసక్తి నెలకొంది. పరేష్ రావల్ కామెడీ నటుడిగా పరిశ్రమలో అడుగుపెట్టారు. అందాజ్ అప్నా అప్నా- చాచి 420- హేరా ఫేరి- నాయక్- ఆంఖేన్- అవరా పాగల్ దీవానా- హంగమా- హల్చల్- దీవానే హుయ్ పాగల్- గరం మసాలా- ఫిర్ హేరా ఫేరి- గోల్మాల్: ఫన్ అన్లిమిటెడ్ భాగ్- మలమాల్ వీక్లీ- భూల్ భూలైయా- స్వాగతం- ఓఎంజి – ఓహ్ మై గాడ్!- వెల్కమ్ బ్యాక్- టైగర్ జిందా హై- సంజు లాంటి చిత్రాల్లో పరేష్ నటించారు.

Related Images: