బాలయ్య- బోయపాటి క్రేజీ కాంబో.. BB3కి టైటిల్ ఫిక్స్! సర్‌ప్రైజ్ ఎప్పుడంటే..

సింహ, లెజెండ్ సినిమాలతో భారీ హిట్స్ రాబట్టి హాట్రిక్ హిట్ ప్లాన్ చేసింది బోయపాటి- బాలకృష్ణ కాంబో. ఈ మేరకు మరో మాస్ ఓరియెంటెడ్ కథతో సెట్స్ మీదకొచ్చారు. BB3 పేరుతో రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఇటీవలే లాక్ చేసింది చిత్రయూనిట్. మే నెల 28వ తేదీన ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లు తెలపడంతో అందరి కళ్లు సినిమా టైటిల్‌పై పడ్డాయి. ఇంతకీ ఈ మూవీకి ఏ టైటిల్ ఫిక్స్ చేసినట్లు అనే చర్చలు ముదిరాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఇందుకు సంబంధించిన ఓ అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఈ క్రేజీ సినిమాకు ‘మోనార్క్’ అనే టైటిల్‌నే ఫైనల్ చేశారని, ఈ టైటిల్‌ను మహా శివరాత్రి సందర్భంగా మార్చి 11న ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఈ టాక్ బయటకొచ్చిన క్షణం నుంచి అందరి చూపు ఆ డేట్‌పై పడింది. ఇటీవలే ఈ మూవీ నుంచి విడుదల చేసిన ‘బీబీ3 ఫస్ట్ రోర్’ నందమూరి అభిమానులను హుషారెత్తించింది. బోయపాటి మార్క్ చూపిస్తూ బాలయ్య చేత చెప్పించిన ఊరమాస్ డైలాగ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి.

నిజానికి ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ కావాల్సిఉండగా కరోనా లాక్ డౌన్ కారణంగా కొన్ని నెలలపాటు వాయిదా పడింది. దీంతో ప్రస్తుతం షూటింగ్ వేగం పెంచేసిన బోయపాటి అతిత్వరలో షూటింగ్ ఫినిష్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో ఈ మూవీ రూపొందుతోంది. ఈ భారీ సినిమా కోసం బాలయ్య అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Related Images:

పవన్ – క్రిష్ మూవీ ఫస్ట్ లుక్.. టైటిల్ ప్రకటన తేదీ ఫిక్స్?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓవైపు రాజకీయాలు .. మరోవైపు వరుస సినిమాలతో క్షణం తీరిక లేనంత బిజీగా ఉన్నారు. ఏపీలోని పంచాయితీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు గెలిచి సర్పంచులు అవుతుండడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

ఇదిలా ఉండగానే మరోవైపు పవన్ కల్యాణ్ తన సినిమాల షెడ్యూళ్లను విడిచిపెట్టకుండా పూర్తి చేయనున్నారని తెలిసింది. వకీల్ సాబ్ చిత్రీకరణ పూర్తయింది. తదుపరి క్రిష్ తో షూటింగ్ సైలెంట్ గా పూర్తి చేస్తున్నారు. పనిలోపనిగా అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ షూటింగ్ కి ప్రిపరేషన్స్ సాగించడం ఆసక్తిని పెంచింది. వీటితో పాటు మరో రెండు మూడు చిత్రాలకు పవన్ సంతకాలు చేశారు.

సమయం తీసుకున్నా ప్రతిదీ ప్లాన్ ప్రకారం క్రమశిక్షణతో పూర్తి చేస్తున్నారని సమాచారం. వకీల్ సాబ్ సమ్మర్ కానుకగా రిలీజ్ కి రెడీ అవుతోంది. అలాగే పవన్ -క్రిష్ జోడీ ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజ్ పైనా చర్చించారని తాజాగా లీకులు అందుతున్నాయి.

2021 మోస్ట్ అవైటెడ్ చిత్రాల జాబితాలో టైటిల్ నిర్ణయించని ఈ భారీ పాన్ ఇండియా మూవీ కూడా ఉంది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా మార్చి 11న శివరాత్రి సందర్భంగా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్టర్ ని లాంచ్ చేస్తారని .. అలాగే రిలీజ్ తేదీపైనా క్లారిటీ ఇస్తారని తాజాగా ప్రచారమవుతోంది.

అయితే దీనిపై ఇంకా క్రిష్ పెదవి మెదపలేదు. ఆయన నుంచి క్లారిటీ వస్తుందని పవన్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. పలు భాషల్లో పాన్ ఇండియా కేటగిరీలో రిలీజ్ కానున్న ఈ భారీ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా పవన్ స్నేహితుడు ఏఎం రత్నం నిర్మిస్తున్నారు.

Related Images:

రాధేశ్యామ్ టీజర్ గ్లింప్స్: వ్వాట్! ప్రేమ కోసం పడి చచ్చే టైప్ కాదన్నాడు!!

ప్రేమకోసం చచ్చేందుకైనా సిద్ధంగా ఉండేవాడే అసలైన ప్రేమికుడు! కానీ రాధేశ్యామ్ ఏమిటీ ఇలా అనేసాడు? నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా? అంటూ తన వెంటపడేవాడిని అడిగేస్తోంది ప్రేరణ (పూజాహెగ్డే).

దానికి అతడి సమాధానం అంతే ఇంట్రెస్టింగ్. “ఛ.. వాడు ప్రేమకోసం చచ్చాడు.. నేనా టైప్ కాదు!!“ అంటూ డార్లింగ్ ప్రేరణ కళ్లలోకి చూస్తూ ప్రేమగా ఎంత ఇదిగా చెప్పాడు? చూస్తుంటే ప్రేరణ లేకుండా జీవించేట్టు లేడు పాపం పసోడు! .. ఇదీ రాధేశ్యామ్ వేలెంటైన్స్ డే టీజర్ గ్లింప్స్.

వ్వావ్ అనిపించే బ్యూటీతో టీజర్ ఆద్యంతం ఎంతో ప్లెజెంట్ గా ఆకట్టుకుంది. రాధేశ్యామ్ ప్రభాస్ అభిమానులకు మరపు రాని ట్రీట్ కానుందని అర్థమవుతోంది. బాహుబలి లో వీరుడిగా కనిపించిన ప్రభాస్.. సాహోలో యాక్షన్ కే బాప్ అనిపించాడు. ఇప్పుడు ప్రేమికుడిగా కూడా ఎక్స్ ట్రీమ్ అంటే ఏమిటో చూపించేయబోతున్నాడని దీనిని బట్టి అర్థమవుతోంది. యూరప్ అందచందాల్ని తెరపై అంతే మంత్రముగ్ధంగా చూపించబోతున్నారని కూడా రాధేశ్యామ్ టీజర్ చెబుతోంది. ఇక పూజా హెగ్డే అందం నటన మరో అస్సెట్ కానుంది.

మునుముందు ట్రైలర్ కూడా వచ్చేస్తే మరింత ఖుషీ అయిపోతారు డైహార్డ్ ఫ్యాన్స్. జూలై 30న రిలీజ్ చేస్తున్నామని టీజర్ లో కూడా ఖాయం చేసేయడంతో ఇక ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవ్.

Related Images:

లవర్స్ డే స్పెషల్: ఆయన పెదరాయుడు అయితే మరి అవిడా..!

వేలెంటైన్స్ డే సందర్భంగా పర్ఫెక్ట్ కపుల్ ని ఎంపిక చేయమని అడిగితే ఎలాంటి సందేహం లేకుండా నయనతార- విఘ్నేష్ జంటను ఎంపిక చేసే అభిమానులున్నారు. అంతగా ఆ జంట ఇటీవల పాపులరైంది. ఏజ్ పరంగా తనకంటే ఒక ఏడాది సీనియర్ అయిన నయనతారతో విఘ్నేష్ ప్రేమాయణం నిరంతరం హాట్ టాపిక్ గా మారుతోంది.

ప్రేమికుల రోజును పురస్కరించుకుని నయనతారతో అద్భుతమైన ఫోటోను విఘ్నేష్ తాజాగా పంచుకున్నారు. తన ప్రియాతి ప్రియమైన ప్రేయసిని ఎల్లవేళలా ప్రేమించడం తనకు చాలా ఇష్టమని వ్యాఖ్యను జోడించాడు. ప్రతిసారీ సందర్భాన్ని బట్టి విఘ్నేష్ శివన్ తన లేడీ లవ్ నయనతారను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. అతను ఆమెతో ప్రేమలో ఉండడాన్ని ప్రేమిస్తున్నానని చెప్పడమే గాక.. తనను తంగమే అని ఎంతో ప్రేమగా పిలిచాడు. నానుమ్ రౌడీ ధాన్ లోని విజయవంతమైన పాటలలో ఒకటి తంగమే… ఈ మూవీ కోసం కలిసి పనిచేసినప్పుడు 2015 లో డేటింగ్ ప్రారంభించారు. ఆరు సంవత్సరాలుగా ఈ జంట ప్రేమాయణం సాగిస్తోంది. త్వరలోనే పెళ్లికి సిద్ధమవుతున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. తాజాగా వేలెంటైన్స్ డే సందర్భంగా షేర్ చేసిన ఫోటోలో విఘ్నేష్ లుక్ చూస్తుంటే ఎంతో పరిణతితో ఉన్న యువకుడిలా కనిపిస్తోంది. ఇక నయనతార మెచ్యూర్డ్ వ్యక్తిత్వానికి అది మ్యాచ్ అవుతోంది.

ఇక కెరీర్ మ్యాటర్ కి వస్తే విఘ్నేష్ శివన్ ఇప్పుడు కాతువాకుల రేండు కాదల్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. రోమ్-కామ్ లో నయనతార- విజయ్ సేతుపతి- సమంత అక్కినేని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ స్వరాలు అందిస్తున్నారు. ఈ చిత్రం మొదటి సింగిల్ రేండు కాదల్ ఈ రోజు రాత్రి 7 గంటలకు విడుదల కానుంది.

Related Images:

అనూ.. గులాబీ బాల ఆ ఫోజులేల!

అందానికి అందం వేడెక్కించే సొగసు అనూ ఇమ్మాన్యుయేల్ ప్రత్యేకత. అందుకే కొంత గ్యాప్ వచ్చినా కానీ ఈ అమ్మడు కంబ్యాక్ అవుతున్న తీరు ఆసక్తిని కలిగిస్తోంది. పవన్ కల్యాణ్ సరసన నటించిన అజ్ఞాతవాసి.. బన్ని సరసన నటించిన `నా పేరు సూర్య` చిత్రాలు డిజాస్టర్ అవ్వడంతో బ్యాక్ టు పెవిలియన్ అంటూ కనిపించకుండా వెళ్లిపోయింది ఈ బ్యూటీ.

ఇటీవలే బెల్లంకొండ సరసన అల్లుడు అదుర్స్ చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో అనూ అందచందాలు కన్నుల పండుగనే తలపించాయన్న టాక్ వినిపించింది. దీంతో పాటు అజయ్ భూపతి మహా సముద్రం చిత్రంలోనూ నటిస్తోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లోనూ అనూ ఓ సినిమా కి కమిటైందన్న ప్రచారం కూడా ఉంది.

ఇక ఇదే హుషారులో సోషల్ మీడియాల్లోనూ అనూ స్పీడ్ పెంచేసింది. ఇటీవల వరుస ఫోటోషూట్లతో ఈ అమ్మడు వేడెక్కిస్తోంది. తాజాగా లవర్స్ డే కానుకగా ఓ స్పెషల్ థీమ్ ఫోటోషూట్ తో అభిమానుల ముందుకు వచ్చింది. గులాబీలు పట్టుకుని బాస్ లా లిఫ్ట్ లో అనూ ఇచ్చిన ఫోజులు గుబులు పెంచుతున్నాయి. అనూలోని రెబలిజంతో పాటు స్పైసీ లుక్ ఎలివేట్ అవ్వడంతో యూత్ వాట్సాపుల్లో ఈ ఫోటోల్ని జోరుగా వైరల్ చేస్తున్నారు.

Related Images:

రాజ్ తరుణ్ ‘పవర్ ప్లే’.. పవర్ మొత్తం లిప్ లాక్

షార్ట్ ఫిలింస్ తో వెండితెరకు పరిచయమై.. తొలి సినిమాతోనే సక్సెస్ సాధించింది కెరీర్ ను కంటిన్యూ చేశాడు రాజ్ తరుణ్. ‘ఉయ్యాల.. జంపాల’తో సాఫ్ట్ హిట్ కొట్టిన రాజ్ తరుణ్.. ఆ తర్వాత ‘సినిమా చూపిస్తమావ’ కుమారి 21ఎఫ్ వంటి చిత్రాలతో క్రేజీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే.. ఆ తర్వాత చేసిన సినిమాలు మాత్రం పెద్దగా వర్కవుట్ కాలేదు.

ఈ క్రమంలో పలు వైఫల్యాలు ఎదురైనప్పటికీ.. ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడు రాజ్ తరుణ్. విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. దాంతో.. ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది.

ఇప్పుడు మరోసారి వీరి కాంబో రిపీట్ అవుతోంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి ‘పవర్ ప్లే’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. నేడు ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ పోస్టర్లో రాజ్ తరుణ్ లిప్ లాక్ తో రెచ్చి పోతున్నాడు. పోస్టర్ తోనే ఇలాంటి కిక్ ఇస్తే.. ఇక సినిమా ఎలా ఉంటుందో అంటున్నారు నెటిజన్లు. వనమాలి క్రియేషన్స్ ప్రై.లి పతాకంపై రూపొందుతోన్నఈ చిత్రాన్ని మహిదర్ దేవేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సమ్మర్ స్పెషల్గా ఈ చిత్రాన్ని మార్చి 5న రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మేకర్స్.

Related Images:

ఇలియానా దేహంలో ఆరని మంటలు

ఇలియానా లవ్ బ్రేకప్ తర్వాత సన్నివేశమేంటో తెలిసిందే. ఈ భామ నిరంతరం జిమ్ముల్లో కసరత్తులు చేస్తూ దేహాన్ని పూర్తిగా ట్రిమ్ చేస్తోంది. అంతకుముందు డిప్రెషన్ తో బాగా బరువు పెరగడంతో ఒక్కసారిగా బాలీవుడ్ లో అవకాశాలే లేకుండా పోయాయి. అందుకే ఇటీవల ఇల్లీ నిరంతరం జిమ్ కి అంకితమై.. ఆపై రెగ్యులర్ గా యోగ మెడిటేషన్ సాధనతో ఇప్పటికి సన్నజాజి రూపానికి చేరుకుంది.

ఇటీవల ఇలియానా జిమ్ లో శ్రమిస్తున్న ఫోటోలు ఇన్ స్టాలో షేర్ చేయగా అవన్నీ యూత్ లో వైరల్ అయ్యాయి. ఇలియానా సన్నజాజి నడుముతో పాటు నాభి సొగసులపైనా యువతరంలో వాడి వేడిగా చర్చ సాగింది. తాజాగా ఇలియానా మరో హాట్ఫీని షేర్ చేసింది. ఈసారి కూడా సేమ్ టు సేమ్ ట్రీట్.

ఓవైపు యోగా చేస్తూనే వీలున్నప్పుడల్లా జిమ్ చేయడం ఇల్లీ ప్రత్యేకత. ఇదిగో అక్కడ యోగా మ్యాట్ పక్కనే కనిపిస్తోంది. రెగ్యులర్ గా హార్డ్ కోర్ కార్డియోవాస్కులర్ జిమ్మింగ్ .. యోగాతోనే ఈ రూపం సాధ్యం. దీనికోసం ఇల్లీ చాలా కమిట్ మెంట్ తో శ్రమించింది. తాజా సెల్ఫీ చూశాక.. ఇలియానా దేహంలో ఆరని మంటలు భగభగ! అంటూ అభిమానులు కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.

కెరీర్ సంగతికి వస్తే.. తాజా చిత్రం ది బిగ్ బుల్ త్వరలో రిలీజ్ కి రానుంది. అభిషేక్ బచ్చన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి అజయ్ దేవగన్ నిర్మాత. దీంతో పాటు పలువురు దర్శకనిర్మాతలు వినిపించిన కథలకు సంతకాలు చేసిందని తెలిసింది.

Related Images:

డిటెక్టివ్ నందమూరి.. సరికొత్త సినిమాలో కల్యాణ్ రామ్!

సినిమా నిర్మాణంలో వెనకడుగు వేయడమనేదే ఉండదు.. బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే ఉండదు.. అయినా కానీ కల్యాణ్ రామ్ కెరీర్ ఇంకా స్ట్రగుల్స్ అధిగమించలేకపోతోంది. ఒక హిట్ వస్తే.. వరుస ఫ్లాపులు పలకరిస్తున్నాయి. పలు అపజయాల తర్వాత 118 సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కిన నందమూరి హీరో.. గతేడాది వచ్చిన ‘ఎంత మంచి వాడవురా’ సినిమాతో మళ్లీ పట్టాలు తప్పాడు. దీంతో ఏడాది కాలంగా సినిమా అనౌన్స్ మెంటే లేదు.

మలయాళ థ్రిల్లర్ ‘అంజామ్ పత్తిర’ రీమేక్లో నటించబోతున్నాడని ప్రచారం సాగినప్పటికీ.. ఏమైందో తెలీదు. ఇది కాకుండా.. మరికొన్ని కథలు విన్నప్పటికీ ఏదీ వర్కవుట్ కాలేదు. అయితే.. లేటెస్ట్ గా ఓ అప్డేట్ వినిపిస్తోంది. దీని ప్రకారం.. డిటెక్టివ్ పాత్రను పోషించబోతున్నాడట కల్యాణ్ రామ్.

‘ఏజెంట్ వినోద్’ పేరుతో ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. అవసరాల శ్రీనివాస్ హీరోగా ‘బాబు బాగా బిజీ’ అనే నాన్ వెజ్ కామెడీ మూవీని డైరెక్ట్ చేసిన నవీన్ మేడారం.. ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ‘బాబు బాగా బిజీ’ సినిమా ఫ్లాప్ అయ్యింది. అయితే.. అది రీమేక్ కావడంతో.. దర్శకుడిని పూర్తిగా నిందించడానికి లేదు.

ఈ క్రమంలోనే సూపర్బ్ థ్రిల్లర్ స్టోరీతో కల్యాణ్ రామ్ను ఇంప్రెస్ చేశాడట నవీన్. దీంతో.. ఈ చిత్రానికి కల్యాణ్ రామ్ ఓకే చెప్పాడని సొంత బేనర్లోనే నిర్మించబోతున్నారని సమాచారం. 1940 బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుందట. బడ్జెట్లోనే ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో.. కళ్యాణ్ రామ్ సరికొత్త గెటప్లో కనిపిస్తాడని తెలుస్తోంది. అన్నీ కుదిరితే త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

Related Images:

‘వీరమల్లు’ పవన్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్..! ఎంతో తెలుసా?

పవర్స్టార్ పవన్కళ్యాణ్ – దర్శకుడు క్రిష్ కాంబోలో రాబోతున్న మూవీ గురించి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి ‘వీరమల్లు’ అనే టైటిల్ పరిశీలిస్తున్న విషయం కూడా తెలిసిందే. ఈ పీరియాడికల్ డ్రామాలో.. పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రను పోషిస్తున్నారు.

అయితే.. పవన్ రీ-ఎంట్రీలో అనౌన్స్ చేసిన నాలుగు సినిమాల్లో అత్యంత క్యూరియాసిటీని రేకెత్తిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమా 15వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యపు కాలం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతోంది. దీంతో.. అప్పటి మనిషిగా పవన్ ఎలా కనిపిస్తారు? ఆయన గెటప్ ఎలా డిజైన్ చేస్తున్నారు? ఏ టైటిల్ ఖరారు చేయబోతున్నారు? వంటి అంశాలు ఫ్యాన్స్ లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.

అయితే.. పవన్ గెటప్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న క్రిష్.. అద్భుతమైన రూపాన్ని ఫైనల్ చేశాడట. అంతేకాదు.. ఈ గెటప్ పవన్ కు పర్ఫెక్ట్ గా సరిపోయిందని తెలుస్తోంది. ఎవ్వరూ ఊహించలేని విధంగా.. అటు పీరియాడిక్ ఫిల్మ్కి తగ్గట్టుగా ఉండడమే కాకుండా.. చూడగానే ఒక వీరుడిని తలపించే రూపాన్ని సిద్ధం చేశాడట క్రిష్.

కాగా.. ఇప్పుడు మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా నిలవబోతోందట. దాదాపు 170 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారట. మొఘల్ కాలం నాటి పరిస్థితులను కళ్లకు కట్టాలంటే పక్కాగా సెట్స్ రూపొందించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు.. మనుషుల వేషధారణ మొత్తం భిన్నంగా ఉండబోతోంది.

ఇక ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో రూపొందించబోతున్నారు. దీంతో.. ఇతర భాషలకు చెందిన యాక్టర్స్ ను కూడా తీసుకోబోతున్నాడు క్రిష్. ఈ చిత్రంలో పవన్ సరసన.. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటిస్తున్నారు. అదేవిధంగా.. పవన్ ను ప్రేమించే ఓ గిరిజన యువతి క్యారెక్టర్ కోసం ప్రగ్యా జైస్వాల్ ను తీసుకోనున్నారని సమాచారం.

ప్రముఖ నిర్మాత ఏ.ఎమ్ రత్నం ఈ భారీ బడ్జెట్ చిత్రం నిర్మిస్తున్నారు. పవన్ తో గతంలో బ్లాక్ బస్టర్ మూవీ ‘ఖుషీ’ నిర్మించింది కూడా ఈ నిర్మాతే. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి బరిలో నిలపాలని యోచిస్తోంది యూనిట్.

Related Images:

నిజంగానే సర్ ప్రైజ్ ఇచ్చిన మోనాల్.. అఖిల్ తో లవ్.. ప్రేమికుల రోజున ప్రకటన!

టాలీవుడ్లో అల్లరి నరేష్ సరసన ‘సుడిగాడు’ ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాలి’ వంటి చిత్రాల్లో నటించి కనువిందు చేసింది హీరోయిన్ మోనాల్ గజ్జర్. అందాల ప్రదర్శనకు మొహమాటం లేకుండా అందాల ప్రదర్శన చేసినప్పటికీ.. అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదు. దీంతో.. తెలుగు తెరపై కనుమరుగైందీ బ్యూటీ. అయితే.. అకస్మాత్తుగా బిగ్ బాస్-4లో ప్రత్యక్షమైంది. అందులో ఈ అమ్మడు చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. అయితే.. తాజాగా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఇన్ స్టాలో ఓ సస్పెన్స్ పోస్ట్ పెట్టిందీ బ్యూటీ. కానీ.. అందులో సస్పెన్స్ మెయింటెయిన్ చేసింది. దీంతో.. అదేంటో తెలుసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు ఫ్యాన్స్.

బిగ్ బాస్ లో మొదట అందరితో ఒకేవిధంగా.. సన్నిహితంగా ఉన్న మోనాల్.. ఆ తర్వాత అభిజీత్కు బాగా దగ్గరైంది. కొన్నాళ్లపాటు ట్రావెల్ చేశాక.. అతన్ని వదిలేసి అఖిల్ సార్థక్తో క్లోజ్ అయింది. అప్పటి నుంచి అతడితోనే ఉంటూ వచ్చింది. ఈ క్రమంలో మరింత దగ్గరయ్యారు. ముద్దులు హగ్గులతో ఓ రేంజ్ లో రెచ్చిపోయారు ఇద్దరూ.

కాగా.. ఇన్స్టాగ్రామ్ లో శనివారం మోనాల్ పెట్టిన ఓ పోస్ట్.. ఆసక్తిని రేకెత్తించింది. ఫిబ్రవరి 14న మీ అందరికీ బిగ్ సర్ ప్రైజ్ ఇస్తానని ప్రకటించింది. ‘‘గాయ్స్.. ఓ ఇంట్రస్టింగ్ అప్డేట్.. రేపు మధ్యాహ్నం బిగ్ సర్ప్రైజ్. వెయిట్ చేయండి’’ అంటూ రాసుకొచ్చింది మోనాల్. దీంతో.. అది ఏమై ఉంటుందా? అని తీవ్రంగా ఆలోచించారు ఫ్యాన్స్. తన లవ్ విషయం ఏమైనా చెప్తుందా.. లేదంటే.. సినిమా ఆఫర్ గురించి అప్డేట్ ఇస్తుందా? అని డిస్కస్ చేశారు.

చివరకు.. ప్రేమికులరోజు సాక్షిగా ఆ క్రేజీ అప్డేట్ ఇచ్చింది మోనాల్ గజ్జర్. అఖిల్ సార్థక్ తో జంట కట్టబోతున్నట్టు ప్రకటించింది! అయితే.. అది నిజ జీవితంలో కాదని ఓ వెబ్ సిరీస్ కోసమని చెప్పి ఫ్యాన్స్ ను నీరుగార్చేసింది. ‘తెలుగు అబ్బాయి.. గుజరాత్ అమ్మాయి’ అనే వెబ్ సిరీస్ రూపొందుతోంది. ఇందులో వీళ్లిద్దరూ ప్రేమికులుగా కనిపించబోతున్నారు. ఇదే విషయాన్ని ఇలా వెల్లడించింది మోనాల్!

Related Images:

నారప్పగా అదరగొడుతున్న వెంకీ.. ఆ యాక్షన్ చూస్తే రోమాంచితమేనట!

తమిళ్లో ధనుష్ హీరోగా తెరకెక్కిన అసురన్ ఒక సంచలనం. సమాజంలో వేళ్లూనుకున్న క్యాస్టిజాన్ని నిలదీస్తూ సాగిన ఈ మూవీ.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాను తెలుగులో విక్టరీ వెంకటేష్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆ మధ్య రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ మంచి ఇంప్రెషన్ కొట్టేసింది. గత చిత్రాల మాదిరిగానే ఫ్యామిలీ వెకేషన్ ను పరిచయం చేశాడు దర్శకుడు. ఇక రీసెంట్ గా వెంకీ బర్త్ డే రోజున రిలీజ్ చేసిన స్మాల్ వీడియో క్లిప్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చిది.

లేటెస్ట్ అప్డేట్ ఏమంటే.. ‘నారప్ప’ సినిమా ఫస్ట్ కాపీ పూర్తి అయిందని సమాచారం. అంతేకాదు.. ఈ సినిమాకు ఆ మేరకు డబ్బింగ్ కూడా పూర్తి చేశాడట వెంకీ. అయితే.. ఈ సినిమా ప్లాష్ బ్యాక్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ చూస్తే.. గూస్ బంస్ అవుతాయట. వెంకీ చేసిన ఈ రోమాంచితమైన రిస్కీ స్టంట్స్ అద్భుతంగా వచ్చాయని సమాచారం. ఈ సీక్వెన్స్ సీన్స్ సినిమా మొత్తంలోనే వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయనున్నాయట.

ఈ సినిమాలో వెంకటేష్ సతీమణిగా ప్రియమణి నటిస్తుండగా.. రెండవ హీరోయిన్ పాత్రలో మలయాళ నటి రెబ్బ మోనిక జాన్ కనిపించనుంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి వి క్రియేషన్స్ పతాకాలపై డి.సురేష్బాబు కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Related Images:

‘గుర్తుందా శీతాకాలం’.. : ఫస్ట్ లుక్

టాలీవుడ్లో విలక్షణమైన నటుల్లో సత్యదేవ్ ఒకరు. ఇండస్ట్రీలో ఎవరి అండా లేకుండా ఎదుగుతున్న ఈ హీరో.. తన కంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. కాగా.. సత్యదేవ్ లేటెస్ట్ మూవీ ‘గుర్తుందా శీతాకాలం’. మిల్కీ బ్యూటీ తమన్నా ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ చిత్రం ‘లవ్ మాక్టైల్’కు రీమేక్ గా వస్తున్న ఈ చిత్రాన్ని.. నాగశేఖర్ తెరకెక్కిస్తున్నారు.

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది యూనిట్. ఈ పోస్టర్ లో హీరో హీరోయిన్లు ఒకరి చేతులు మరొకరు పట్టుకోగా.. కళ్లు మాత్రం ప్రేమ కావ్యాలు రచిస్తున్నాయి. కళ్లతోనే అనంతమైన ప్రేమను ఇచ్చిపుచ్చుకుంటున్నాయి దేహాలు! చేతివేళ్ల మధ్యలోని కాఫీ కప్పు పొగలు వెదజల్లుతుంటే.. వీరి మనసులు ప్రేమదేశంలో రివ్వున విహరిస్తున్నాయి.

క్లీన్ లవ్ ను ప్రొజెక్ట్ చేసిన ఈ ఫస్ట్ లుక్.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. టాప్ హీరోయిన్ తమన్నా ఈ సినిమాతోపాటు పోస్టర్ కు కూడా మరింత అందాన్ని అద్దింది. సత్యదేవ్ యాజ్ యూజవల్ గా తన ఆర్ద్రతను ముఖంలో పలికించాడు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేసిన ఈ లుక్ లవ్ బర్డ్స్ కు తప్పకుండా రీచ్ అయ్యేలా ఉంది.

ఈ చిత్రాన్ని నాగశేఖర్ మూవీస్ బ్యానర్పై నాగశేఖర్ భావన రవి రామారావు చింతపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాల భైరవ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రేమికులకు వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలిపిన యూనిట్.. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేస్తామని ప్రకటించింది.

Related Images:

ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న సింగర్ సునీత.. ఆ ప్లేస్ ఎక్కడై ఉంటుందబ్బా?

ప్రముఖ సింగర్ సునీత రెండో వివాహం వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. మ్యాంగోమూవీస్ అధినేత బిజినెస్ మెన్ రామ్ వీరపనేని సునీత మెడలో మూడుముళ్లు వేశారు. జనవరి 9న ఒక్కటైందీ జంట. హైదరాబాద్ శివారు శంషాబాద్లోని అమ్మపల్లి సీతారామచంద్రస్వామి దేవాలయంలో సునీత-రామ్ వివాహం ఘనంగా జరిగింది.

ఈ వేడుక అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. మెహందీ ఫంక్షన్ కు సునీత స్నేహితురాలు పవన్ కళ్యాణ్ మాజీ భార్య నటి రేణూ దేశాయ్ తోపాటు యాంకర్ సుమ తదితరులు హాజరయ్యారు. ఇక సునీత రెండో పెళ్లిపై ఓ వర్గం విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అవన్నీ లైట్ తీసుకున్న సునీత.. పిల్లల సమక్షంలో ఆనందంగా వివాహం చేసుకున్నారు.

పెళ్లి తర్వాత కూడా సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లో ఉన్న సునీత.. తన అప్డేట్స్ ను పోస్ట్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో పలు ఫొటోలను షేర్ చేసి తన జీవితం ఇప్పుడు ఎంతో అందంగా ఆనందంగా ఉందని ప్రకటించారు. అయితే.. తాజాగా మరో ఫొటో షేర్ చేసింది సునీత. తన ఇన్ స్టా గ్రామ్లో పోస్ట్ చేసిన ఆ పిక్ లో చాలా హ్యాపీగా ఉన్నారు సునీత.

అంతేకాదు.. ఆ ఫోటో చూస్తుంటే వెకేషన్ కు వెళ్లినట్లు క్లియర్ గా తెలుస్తోంది. అది కూడా ప్రేమికుల దినోత్సవం రోజున పోస్ట్ చేయడంతో.. ఖచ్చితం హాలీడే టూర్ కు వెళ్లినట్టుగానే తెలుస్తోంది. అయితే.. ఆ వెకేషన్ కు సంబంధించిన లొకేషన్ ఏంటి? అన్నదే అర్థం కావట్లేదు.

ఈ ఫొటో బ్యాక్గ్రౌండ్ చూస్తే.. మాల్దీవులకు వెళ్లారేమో అనిపిస్తోంది. నెటిజన్లు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఎక్కడికి వెళ్లారు? అనే విషయంపై సునీత మాత్రమే క్లారిటీ ఇవ్వగలరు. ఆ లోకేషన్ ఎక్కడో అయినప్పటికీ.. ఈ ఫొటో మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. సునీత హ్యాట్ గాగుల్స్ సూపర్బ్ గా ఉన్నాయి.

Related Images:

కోలీవుడ్ టాక్.. పెళ్లికి త్రిష గ్రీన్ సిగ్నల్..!

సీనియర్ హీరోయిన్ త్రిష పెళ్లికి సిద్ధమవుతున్నారా? అంటే అవుననే కోలీవుడ్ లో ప్రచారమవుతోంది. త్రిషపై గత కొద్దిరోజులుగా రకరకాల ఊహాగానాలు షికార్ చేస్తున్నాయి. ఇటీవల ఓ ప్రముఖ కోలీవుడ్ హీరోని త్రిష పెళ్లాడేందుకు రెడీ అవుతోందని ప్రచారమైంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక కన్ఫర్మేషన్ లేదు.

ఇప్పటికే ఏజ్ 38. అందుకే కెరీర్ కంటే వ్యక్తిగత జీవితానేకే త్రిష ప్రాధాన్యతనిస్తున్నారన్న ప్రచారం ఉంది. తెలుగు- తమిళ పరిశ్రమల్లో అగ్ర హీరోలందరి సరసనా నటించిన త్రిష ఇటీవల చిరంజీవి సరసన నటించేందుకు అంగీకరించిందని ప్రచారమైంది. ఆచార్య నెక్ట్స్ మూవీకి త్రిష పేరు పరిశీలిస్తున్నారన్న టాక్ వినిపించింది.

ఇకపోతే త్రిష కెరీర్ కి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేసి పెళ్లాడేందుకు సిద్ధంగా ఉన్నారా? అంటే అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. నిర్మాత కం బిజినెస్ మేన్ వరుణ్ మణియన్ తో పెళ్లి క్యాన్సిల్ అయ్యాక త్రిష తిరిగి కెరీర్ కోసమే ప్రయత్నించారు. కానీ ఇటీవల తన మనసు మారి పెళ్లికి సిద్ధమయ్యారన్న వార్తలు ఏమేరకు నిజమో తానే చెప్పాల్సి ఉంటుంది.

Related Images:

‘బాహుబలి’ విషయంలో జరిగిందే ‘ఉప్పెన’కు జరుగుతోందా..?

మెగాస్టార్ చిరంజీవి చిన్న మేనల్లుడు సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన ‘ఉప్పెన’ చిత్రం శుక్రవారం విడుదల అయింది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ – సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మించాయి. తొలి రోజే ‘ఉప్పెన’ బాక్సాఫీస్ వద్ద 10 కోట్లకు పైగా రాబట్టిందని చిత్ర యూనిట్ వెల్లడించింది. అయితే ‘ఉప్పెన’ సినిమా అంతా బాగానే ఉంది కానీ ఒక్క సీన్ కారణంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.

సినిమాలోని సెన్సిటివ్ పాయింట్ మీద ఒక సెక్షన్ ఆడియెన్స్ నుంచి నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి. దీంతో ఈ సినిమాలో ఉన్న అసలు విషయం అంతా డైవర్ట్ అయిపోయి.. సినిమా మీద నెగిటివిటీ వచ్చేసింది. అయితే ఇదే పాయింట్ ని కొన్ని సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ బాగా యాక్సప్ట్ చేస్తున్నారు. సినిమాలో మెయిన్ ట్విస్ట్ రివీల్ అయినా కూడా ‘ఉప్పెన’ చిత్రాన్ని చూడటానికి థియేటర్స్ కి వస్తున్నారు. ‘బాహుబలి’ ని కట్టప్ప చంపుతాడు అని తెలిసినా.. ఎందుకు చంపాడనే పాయింట్ మీద జనాలు ఆసక్తి కనబరిచారు. ఇప్పుడు ‘ఉప్పెన’ విషయంలో కూడా అలానే జరుగుతోంది. హీరోకి అలా ఎందుకు జరిగిందనే విషయంపై ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని తెలుస్తోంది.

ఏదేమైనా ప్రస్తుతానికి ఈ సినిమాకి ఓపెనింగ్ కలెక్షన్స్ మాత్రం బాగా వచ్చాయి. 100 శాతం సీటింగ్ ఆకుపెన్సీ కూడా రావడంతో ఈ సినిమాకు భారీగానే వీకెండ్ కలెక్షన్స్ ఉంటాయని ట్రేడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కాకపోతే ‘ఉప్పెన’ టైటిల్ కార్డ్ పడకముందే త్వరలో నెట్ ఫ్లిక్స్ లో రాబోతోందని చెప్పడం ఓ వర్గం ప్రేక్షకులను దూరం చేసే అవకాశం ఉందని అంటున్నారు.

Related Images:

అఖిల్ రికార్డును కొట్టేసిన వైష్ణవ్

‘ఉప్పెన’ సినిమా మొదలైనపుడు ఏమో అనుకున్నారు. ఆ సినిమా సెట్స్ మీద ఉండగా కూడా మరీ అంచనాలేమీ లేవు. సినిమా పట్ల జనాల్లో ఆసక్తి కనిపించింది కానీ.. కరోనా కారణంగా పది నెలలకు విడుదల కోసం ఎదురు చూసిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఈ ప్రేమకథ ఏమాత్రం ప్రభావం చూపుతుందో అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ఇప్పుడీ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. విడుదలకు ముందు అనూహ్యమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజిలో జరిగాయి. సంక్రాంతి సినిమాలు సహా అన్నీ బాక్సాఫీస్ దగ్గర జోరు తగ్గించేయడం కనీస పోటీ కూడా లేకపోవడం రిలీజ్ రోజు పాజిటివ్ టాక్ రావడంతో ‘ఉప్పెన’కు ఎదురే లేకుండా పోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం ప్యాక్డ్ హౌసెస్తో నడుస్తోంది. తొలి రోజు ‘ఉప్పెన’ సాధించిన వసూళ్లు ఇప్పుడు ట్రేడ్ పండిట్లను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

ఏకంగా రూ.10.43 కోట్ల షేర్ రాబట్టి ఔరా అనిపించింది ‘ఉప్పెన’. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.9.3 కోట్ల షేర్ రావడం విశేషం. నైజాంలో షేర్ రూ.3 కోట్లు దాటిపోగా.. సీడెడ్లో రూ.1.3 కోట్లు వచ్చాయి. ఆంధ్రాలోని మిగతా ఏరియాలన్నీ కలిపి రూ.5 కోట్ల దాకా షేర్ కొల్లగొట్టిందీ చిత్రం.

మిగతా రాష్ట్రాలు ఓవర్సీస్ కలిపి రూ.కోటికి పైగానే షేర్ వచ్చింది. కొత్త హీరో హీరోయిన్లతో ఓ కొత్త దర్శకుడు రూపొందించిన చిత్రానికి ఈ స్థాయి వసూళ్లు అనూహ్యం. తెలుగులో ఓ డెబ్యూ హీరో నటించిన సినిమాకు వచ్చిన అత్యధిక షేర్ ఇదే కావడం విశేషం. ఇప్పటిదాకా టాలీవుడ్లో ఓ కొత్త హీరో సినిమా తొలి రోజు సాధించిన హైయెస్ట్ షేర్ అంటే.. రూ.7.4 కోట్లు. అది అక్కినేని వారసుడు అఖిల్ తొలి చిత్రం ‘అఖిల్’కు వచ్చిన షేర్. ఆ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ ప్రి రిలీజ్ హైప్తో భారీగా తొలి రోజు వసూళ్లు రాబట్టి రికార్డు నెలకొల్పింది. కానీ రెండో రోజు నుంచి సినిమా అడ్రస్ లేకుండా పోయింది. కానీ ‘ఉప్పెన’ అలా కాదు. తొలి రోజే ‘అఖిల్’ సినిమాను మించి రూ.3 కోట్ల పైగానే షేర్ రాబట్టిన ఈ చిత్రం తర్వాతి రెండు రోజుల్లోనూ భారీగా షేర్ రాబట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మూడు రోజుల్లోనే షేర్ రూ.25 కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదేమో.

Related Images:

స్వెట్ షర్ట్ బటన్స్ మిస్ .. పిన్నీసులతో కవర్ చేసిన కత్రిన!

బాలీవుడ్ లో రెండు దశాబ్ధాల పాటు ఎదురే లేని కథానాయికగా రాజ్యమేలింది కత్రిన. ఇప్పటికీ నవతరం నాయికలతో పోటీపడుతూ అవకాశాలు అందుకుంటోంది. అంతకుమించి గ్లామర్ ని మెయింటెయిన్ చేస్తూ టీనేజీ భామనే తలపిస్తోంది.

ఇన్ స్టాలో ఎప్పటికప్పుడు వేడెక్కించే ఫోటోషూట్లను షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటోంది. తాజాగా కత్రిన కిల్లింగ్ లుక్ ఒకటి అంతర్జాలాన్ని సునామీలా చుట్టేస్తోంది . అంతగా ఇందులో ఏం ఉంది? అంటే.. ఈ ఫోటో చూస్తే మీకే అర్థమవుతుంది.

కత్రిన చాలా సింపుల్ గా స్వెట్ షర్ట్ .. జీన్స్ ధరించింది. ఆ స్వెట్ షర్ట్ బటన్స్ మిస్సవ్వడంతో ఏం చేసిందో చూశారుగా.. అలా పిన్నీసులతో కవరప్ చేసింది. పిన్సీసుల నడుమ వేడెక్కించే అందాలు కుర్రకారు కంటికి కునుకుపట్టనివ్వని ట్రీటిస్తున్నాయి. నిజానికి ఇది కూడా డిజైనర్ థాటేనా.. లేక అనుకోకుండానే అలా జరిగిందా? అన్నది కత్రిననే చెప్పాల్సి ఉంది. ఈ భామ తదుపరి టైగర్ 3లో సల్మాన్ సరసన నటించనుంది. మరోవైపు సూపర్ గాళ్ తరహా పాత్రలోనూ కత్రిన నటించనుంది. ఇతర భారీ ప్రాజెక్టులతోనూ బిజీఆ ఉంది.

Related Images:

హీరోయిన్ మెహ్రీన్ పెళ్లి ఫిక్స్.. పెళ్లికొడుకు ఇతడే?

పంజాబీ ముద్దుగుమ్మ.. టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ పెళ్లి పీటలు ఎక్కబోతోందా? పెళ్లికి రెడీ అయ్యిందా? ఆమె ఎంగేజ్ మెంట్ మార్చి 13న నిర్వహిస్తున్నారా? అంటే ఔననే అంటున్నాయి ఆమె సన్నిహిత వర్గాలు. టాలీవుడ్ లో హీరో నాని మూవీ ‘కృష్ణగాడి వీర ప్రేమకథ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పంజాబీ అందం మెహ్రీన్ కౌర్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రచారం సాగుతోంది.ఓ పెద్దింటికి కోడలుగా వెళ్లబోతోందట..

రాజకీయ పలుకుబడి ఉన్న ఓ కుటుంబంలోకి మెహ్రీన్ వెళ్లనున్నట్టు సమాచారం. మాజీ ముఖ్యమంత్రి మనువడిని ఆమె పెళ్లి చేసుకోబోతోందని టాక్ నడుస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయట.. త్వరలోనే మెహ్రీన్ వైవాహిక జీవితం ప్రారంభించనుందట..

హర్యానాకు మూడు సార్లు సీఎంగా వ్యవహరించిన భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్ తో మెహ్రీన్ పెళ్లి నిశ్చయమైనట్టు సమాచారం. కాంగ్రెస్ నేత ఆడంపూర్ ఎమ్మెల్యే కుల్ దీప్ బిష్ణోయ్ కుమారుడే భవ్య బిష్ణోయ్. హర్యానాలో బాగా పలుకుబడి ఉన్న కుటుంబం వీరిది.

వీరిద్దరి పెళ్లికి పెద్దలు అంగీకరించడంతో మెహ్రీన్ భవ్య కలిసి తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. వీరి నిశ్చితార్థం మార్చి 13న ఫిక్స్ చేశారట.. దీంతో వీరు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related Images:

ప్యాంట్ సూట్ ని పరిచయం చేసిన శ్రుతి

గబ్బర్ సింగ్ నాయికగా శ్రుతిహాసన్ కి అభిమానుల్లో ఉండే క్రేజు వేరు. టాలీవుడ్ లో తనకు పెద్ద కెరీర్ ని ఇచ్చింది ఈ సినిమా సక్సెస్సే. ఆ తర్వాత మళ్లీ రీఎంట్రీలోనూ పవర్ స్టార్ సరసన బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించేందుకు సంతకాలు చేసింది. వకీల్ సాబ్ చిత్రంలో శ్రుతి పవన్ తో రొమాన్స్ చేస్తోంది.

ఇక సంక్రాంతి బరిలో రిలీజైన క్రాక్ ఘనవిజయంతో శ్రుతి మబ్బుల్లో తేల్తోంది. ఇదే హుషారులో వరసగా సినిమాలకు సంతకాలు చేస్తూ బిజీగా ఉంది. పనిలో పనిగా తన ఇన్ స్టా అభిమానుల్ని శ్రుతి అలరిస్తోంది.

తాజాగా ప్యాంట్ సూట్ అనే కొత్త డ్రెస్ ని పరిచయం చేసింది శ్రుతి. ఈ డిజైనర్ డ్రెస్ లుక్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. ప్యాంట్ సూట్ కి కాంబినేషన్ గా ఉపయోగించిన జువెలరీ హైలైట్ గా ఉంది. ముఖ్యంగా ఆ చేతి పది వేళ్లకు ఉంగరాలు మరింత స్పెషల్ గా ఆకర్షిస్తున్నాయి. నీరజ కోన శ్రుతికి స్టైలింగ్ చేశారు. శ్రుతి కెవ్వు కేక లుక్ ప్రస్తుతం అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది.

Related Images:

నన్ను చంపుతానని మా నాన్న బెదిరిస్తున్నాడుః నటుడిపై కూతురి ఫిర్యాదు!

ప్రముఖ కన్నడ నటుడు సత్యజిత్ పై ఆయన కుమార్తె అక్తర్ సాలేహా పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బు కోసం సత్యజిత్ తనను తీవ్రంగా వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు.. కొందరు రౌడీలతో తనను బెదిరిస్తున్నారని ఆయన వల్ల తనకు ప్రాణహాని ఉందని కూడా పేర్కొనడం గమనార్హం.

తాను నెలకు రూ.లక్ష చెల్లిస్తున్నప్పటికీ.. ఇంకా ఎక్కువ డబ్బు డిమాండ్ చేస్తున్నారని ఆమె తెలిపింది. అక్తర్ సాలేహా తన భర్త ఖాన్ తో కలిసి రెండు వారాల క్రితం నగర సివిల్ కోర్టులో కేసు పెట్టారు. ఈ కేసు విషయమై శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు. తాను ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భవతి అని అయినప్పటికీ డబ్బుకోసం తన తండ్రి వేధిస్తున్నాడని చెప్పారు. వివాహం అయినప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు రూ .42 లక్షలు చెల్లించామని అయినప్పటికీ ఇంకా కావాలని వేధిస్తున్నాడని పేర్కొంది.

అయితే.. ఈ ఆరోపణలను సత్యజిత్ ఖండించారు. తన కుమార్తె చదువు కోసం తన ఇంటిపై రుణం తీసుకున్నాని దానిని మాత్రమే చెల్లించమని కోరినట్లు చెప్పాడు. తన కుమార్తె నుంచి ఇకపై తాను డబ్బు కోరుకోవడం లేదని చెప్పారు. కాగా.. గ్యాంగ్రేన్ వ్యాధి కారణంగా నటుడు సత్యజిత్ కాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Related Images: