పోల్ డ్యాన్స్ తో హీటెక్కిస్తున్న టీవీ నటి కం హాట్ యాంకరు

టెంప్టింగ్ అనేది ఒక అరుదైన కళ. నేటితరం సెలబ్రిటీలకు అవసరమైన నిరంతర కళ. ఇన్ స్టా వేదికల్లో చెలరేగుతున్న స్టార్ల వ్యవహారం చూస్తుంటే దీనిని అంగీకరించాలి ఎవరైనా. ఇక ఈ తరహా టెంప్టింగ్ కళలో ఆరితేరిపోయిన యాంకర్ కం టీవీ నటి షామా శికందర్. ఈ భామ నిరంతరం బికినీ బీచ్ సెలబ్రేషన్స్ తో యూత్ ని టెంప్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. బీచ్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన వీడియోలు ఫోటోలతో నిరంతరం ఇన్ స్టాలో ఫ్యాన్ బేస్ పెంచుకుంటూనే ఉంది.

తాజాగా బ్లాక్ బికినీలో పోల్ డ్యాన్సాడుతూ టెంప్ట్ చేస్తున్న వీడియోని షేర్ చేసింది. ఈ వీడియోతో పాటు షామా డ్యాన్సులకు సంబంధించిన రకరకాల వీడియోలు అంతర్జాలాన్ని సునామీలీ చుట్టేస్తున్నాయి. లేట్ ఏజ్ లో హాట్ అప్పియరెన్సుతో ట్రీటిస్తున్న నవతరం బ్యూటీగా సామా పాపులరవుతోంది. ఇలా పోల్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తే ఆత్మను శరీరాన్ని ఐక్యం చేయొచ్చు అంటూ సెలవిస్తోంది ఈ అమ్మడు.

 

View this post on Instagram

 

A post shared by Shama Sikander (@shamasikander)

Related Images:

సామ్ జామ్.. ఆ `బిగ్ బాస్ 4` హీరో జాక్ పాట్

అక్కినేని కోడలు సమంత వరుసగా సెలబ్రిటీ ఇంటర్వ్యూలతో సామ్ జామ్ కార్యక్రమాన్ని పెద్ద సక్సెస్ చేస్తున్నారు. ఆహా- తెలుగు ఓటీటీలో వరుస ఇంటర్వ్యూల హంగామా గురించి తెలిసినదే. ఇక ఇదే వేదికపై ప్రస్తుతం స్టార్ మాలో టెలీకాస్ట్ అవుతున్న బిగ్ బాస్ 4 ఇంటి సభ్యుడు అభిజీత్ కి జాక్ పాట్ తగిలిందని తెలిసింది. అతడు ఇంటి నుంచి బయటికి రాగానే సామ్ జామ్ వేదకపై సందడి చేస్తాడట. ఇక ఈ ఇంటర్వ్యూలో అభిజీత్ గుట్టు మట్లు మొత్తం లీకైపోవడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. బిగ్ బాస్ లోటుపాట్లు.. ఆ ఇంట్లో జరిగే చాలా విషయాల్ని ఇలాంటి వేదికలపై సూటిగా చెప్పేయొచ్చు. బిగ్ బాస్ తో పెరిగిన ఇమేజ్ కి అనుగుణంగా సినిమాలకు అతడు సంతకాలు చేసే వీలుంటుంది.

ఇక బిగ్ బాస్ స్టార్లంతా వరుసగా యూట్యూబ్ చానెళ్లు.. టీవీ చానెళ్ల ఇంటర్వ్యూలలో సందడి చేసేస్తుంటారు ప్రతిసారీ. ఈసారి ఫైనల్ కంటెస్టెంట్స్ లో విజేత ఎవరో తేలాల్సి ఉంది ఇంకా. అభిజీత్ రేస్ లో ఉన్నారు కాబట్టి ఇప్పటికే సామ్ జామ్ నుంచి ఇన్విటేషన్ అందిందట. నాతో ఎంజాయ్ మెంట్ మామూలుగా ఉండదంటూ హోస్ట్ సమంత అతడి గుట్టంతా రట్టు చేస్తుందన్నమాట. ఫన్ తో పాటు సీక్రెట్స్ ని బయటపెట్టడంతోనే ఈ కార్యక్రమం సక్సెసవుతోంది.

Related Images:

వెబ్ సిరీస్ తోనూ షేకాడిస్తున్న రౌడీ బేబీ

నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ ‘పావై కధైగల్ – స్టోరీస్ ఆఫ్ సిన్` పాజిటివ్ సమీక్షలను అందుకుంది. ట్యాలెంటెడ్ వేట్రిమారన్ దర్శకత్వం వహించిన నాలుగు చిన్న కథలలో ఒకటైన సాయి పల్లవి నటనపైనా ప్రశంసల జల్లు కురుస్తోంది. రౌడీ బేబీ డిజిటల్ వరల్డ్ ని షేక్ చేసే నటనతో అలరించిందనేది క్రిటిక్స్ కితాబు.

కులాంతర వివాహం చేసుకుని తల్లిదండ్రుల నుండి విడిపోయే అమ్మాయిగా.. గర్భవతిగా ఛాలెంజింగ్ పాత్రలో సాయిపల్లవి నటన ఆద్యంతం రక్తి కట్టించింది. ఆమె తన పాత్రలో చాలా సహజంగా ఒదిగిపోయి నటించింది. తన బాడీ లాంగ్వేజ్ ప్రతి బిట్ నిజమైన గర్భిణీ స్త్రీని తలపించిందన్న ప్రశంసలు కురుస్తున్నాయి.

పరువు హత్య చుట్టూ తిరిగే కథతో చాలా కష్టతరమైన పాత్రలతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కగా.. ఇందులో సహజ సిద్ధమైన నటనతో సాయిపల్లవి కట్టిపడేసింది. మరోసారి తనని తాను మంచి నటిగా ఆవిష్కరించుకునే అరుదైన అవకాశాన్ని సాయిపల్లవి సద్వినియోగం చేసుకుందని క్రిటిక్స్ కితాబిచ్చేస్తున్నారు. చిన్న పాత్ర అయినా నటిగా తన పరిధిని చూపించింది. ఫిదాలో భానుమతిగా .. ఆ తర్వాత ధనుష్ సరసన రౌడీ బేబీగా అలరించిన సాయి పల్లవికి మరో మంచి పేరు తెచ్చే ఆఫర్ దక్కిందని విశ్లేషిస్తున్నారు.

Related Images:

సందీప్ వంగా టైటిల్.. డెవిల్ కాదు యానిమల్…!

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో సందీప్ రెడ్డి వంగా మూవీ ఉన్నట్టా లేనట్టా? ఇంతకీ సౌండ్ వినిపించదేం? అంటూ ఇటీవల ఫిలింసర్కిల్స్ లో సర్వత్రా ఆసక్తిక చర్చ సాగింది. చాలా గ్యాప్ వచ్చినా ఈ మూవీకి సంబంధించిన ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో రకరకాల సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ మూవీకి సంబంధించిన మరో కీలక సమాచారం తాజాగా రివీలైంది. సందీప్ వంగా ఇప్పటికీ రణబీర్ అండ్ టీమ్ కి టచ్ లోనే ఉన్నారు. గత వారం క్రితమే చిత్ర నిర్మాతల్ని కలిసాడని సమాచారం. అంతేకాదు ఇంతకుముందు ప్రకటించిన `డెవిల్` టైటిల్ ని మార్చాలన్న ప్రతిపాదన తెచ్చారట. ఇప్పుడు `యానిమల్` అని పేరు మారిందట. అయితే టైటిల్ మార్చడానికి కారణమేమిటి? అంటే.. సల్మాన్ వల్లనేనని తెలిసింది.

ఒక నివేదిక ప్రకారం.. డెవిల్ టైటిల్ ని సాజిద్ నాడియాద్ వాలా రిజిస్టర్ చేయించారట. దీంతో టైటిల్ మార్చాలని సందీప్ వంగా అండ్ మేకర్స్ నిర్ణయించారు. సల్మాన్ నటిస్తున్న `కిక్` సీక్వెల్ కి డెవిల్ టైటిల్ ని ఉపయోగించాలనే ఆలోచనతో ఉన్నారు సాజిద్. సల్మాన్ ఖాన్ నటించిన మొదటి భాగంలో కథానాయకుడు తన అప్రమత్తమైన కార్యకలాపాలను చేపట్టేటప్పుడు `డెవిల్` అనే మారుపేరును ఉపయోగించాడు. దానివల్ల డెవిల్ అన్న పేరు బాగా రిజిస్టర్ అయిపోయింది. అందుకే ఇప్పుడు సీక్వెల్ తో.. సాజిద్ నాడియాద్వాలా డెవిల్ బిరుదును నిలబెట్టుకోవాలనుకుంటున్నాడట.

ఫలితంగా సందీప్ రెడ్డి వంగాతో రణబీర్ కపూర్ తదుపరిది మూవీ టైటిల్ ని `యానిమల్` అని మార్చారు. ఇది మోటైన గ్యాంగ్ స్టర్ డ్రామా .. రణబీర్ సందీప్ ను.. చిత్ర నిర్మాతలు భూషణ్ కుమార్ – మురాద్ ఖేతానీలను సందీప్ గత వారం కలుసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

యానిమల్ కు ముందు రణబీర్ కపూర్ శ్రద్ధా కపూర్ తో కలిసి నటించిన `లవ్ రంజన్` పెండింగ్ పనిని పూర్తి చేస్తాడు. ఇది దిల్లీ- ఘజియాబాద్- నోయిడాలో .. తరువాత విదేశాలలో చిత్రీకరిస్తారు. దీని మొదటి షెడ్యూల్ జనవరి 6 న ప్రారంభమై జనవరి 14 తో ముగుస్తుంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం షూట్ మే 2021 నాటికి పూర్తవుతుందని ఆ తర్వాత రణబీర్ `యానిమల్` చిత్రీకరణలో జాయినవుతారని చెబుతున్నారు.

2019 లో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో సందీప్ వంగా బాలీవుడ్ లో అడుగుపెట్టాడు. షాహిద్ కపూర్-నటించిన ఈ చిత్రం విమర్శల నడుమ సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద 278.24 కోట్లు వసూలు చేసింది. ఇది షాహిద్ కెరీర్ బెస్ట్ గా నిలిచింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఓవర్ నైట్ స్టార్డమ్ తెచ్చింది. ఒరిజినల్ వెర్షన్ అయిన అర్జున్ రెడ్డితోనూ టాలీవుడ్ లో సత్తా చాటాడు. తదుపరి `యానిమల్`తో మరోసారి బాలీవుడ్ లో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నాడు. అలాగే సందీప్ వంగా ఓటీటీ కోసం పని చేస్తున్నారన్న సమాచారం ఇటీవల అందింది.

Related Images:

ఇటు ప్రభాస్.. అటు సల్మాన్.. టాప్ స్టార్స్ తో బుట్టబొమ్మ రొమాన్స్

స్టార్ హీరోయిన్ గా అన్ని ఇండస్ట్రీల్లోనూ దూసుకుపోతోంది పూజా హెగ్డే. ఈ బుట్ట బొమ్మ గ్లామర్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. అందం.. అభినయంతో అభిమానులను అలరిస్తుండడంతో మూవీ మేకర్స్ సైతం పూజాకే ప్రయారిటీ ఇస్తున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే కిట్ లో ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ప్రభాస్ ‘రాధే శ్యామ్’లో నటిస్తున్న ఈ బ్యూటీ.. అఖిల్స్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లోనూ ఆడిపాడుతోంది. ఇవే కాకుండా.. బాలీవుడ్ స్క్రీన్ పైనా తళుక్కున మెరవనుంది. రణవీర్ సింగ్ రోహిత్ శెట్టితో కలిసి ‘క్రికస్’ మూవీలోనూ నటిస్తోంది ఈ చిన్నది.

మరోవైపు సల్మాన్ ఖాన్ కొత్త చిత్రం ‘కబీ ఈద్ కబీ దివాళి’లోనూ నటిస్తోంది పూజా. ఈ చిత్రంలో ప్రాధాన్యం ఉన్న మహిళా పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో పూర్తి కావాల్సినప్పటికీ.. కరోనా కారణంగా ఆలస్యమైంది. తాజా సమాచారం ప్రకారం.. వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి సల్మాన్ తో కలిసి సెట్స్లో పాల్గొనబోతోంది ఈ బ్యూటీ. కాగా.. ఈ చిత్రం తమిళ స్టార్ అజిత్ ‘వీరం’ రీమేక్ అని సమాచారం.

Related Images:

తన తల్లి సోదరుడికి కోవిడ్.. భయమేసిందన్న రాపో

కరోనా మహమ్మారీ సామాన్యులు సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరినీ భయపెట్టేసింది. ప్రజల జీవితాలను మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులను ఇది ప్రభావితం చేసింది. టాలీవుడ్ హీరో రామ్ తన తల్లి .. సోదరుడు కృష్ణ చైతన్య లకు వైరస్ సోకిందని దానికి చికిత్స తీసుకున్నారని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.

నిర్మాత అయిన తన సోదరుడు తల్లి ఇద్దరూ కోవిడ్ -19 బారిన పడినప్పుడు చాలా భయపడ్డానని రామ్ చెప్పాడు. “నా సోదరుడికి ముఖ్యంగా చాలా తీవ్ర లక్షణాలు కనిపించాయి. చికిత్సకు స్పందించి అతను పూర్తిస్థాయిలో కోలుకోగలిగాడు” అని రామ్ తెలిపారు.

మొత్తానికి టీకా వచ్చేవరకు బయటకు వెళ్లి పని చేయాలంటే రాపో అశ్రద్ధ చేయక ఇంకా జాగ్రత్తగా ఉంటాడు. రామ్ నటిస్తున్న థ్రిల్లర్ మూవీ రెడ్ కోవిడ్ లాక్ డౌన్ వల్లనే ఆలస్యమైంది. సంక్రాంతి బరిలో క్రాక్ తో పాటు పోటీపడే చిత్రాల్లో రెడ్ పేరు వినిపిస్తోంది. దీనిపై మరోసారి చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంటుంది.

Related Images:

‘పెళ్లి సందD’ మొదలైంది

శ్రీకాంత్ హీరోగా రాఘవేంద్ర రావు దర్శకత్వంలో దాదాపు పాతిక సంవత్సరాల క్రితం వచ్చిన పెళ్లిసందడి మూవీ సెన్షేషనల్ సక్సెస్ అయిన విషయం తెల్సిందే. ఇప్పుడు అదే టైటిల్ తో రాఘవేంద్రరావు సినిమాను ప్రకటించడంతో అంతా కూడా ఆ సినిమాకు సీక్వెల్ లేదంటే రీమేక్ అంటూ అప్పుడే అంచనాలు పెంచేసుకున్నారు. కొత్త ‘పెళ్లి సందD’ లో శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించడం వల్ల ఆసక్తి మరింత ఎక్కువ అవుతుంది. ఈ సినిమాకు రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించకుండా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. గౌరి రోనక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

నేడు ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు మొదలు అయ్యాయి. షూటింగ్ మొదటి షెడ్యూల్ లో రోషన్ తో పాటు ముఖ్య తారాగనం పాల్గొంటున్నారు. ఈ సినిమాలో శ్రీకాంత్ కూడా నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ లేదు. ‘పెళ్లి సందD’ షూటింగ్ ప్రారంభం అయిన నేపథ్యంలో వచ్చే ఏడాది ప్రథమార్థం చివరి వరకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్న ఈ సినిమాకు పాటలను కీరవాణి అందిస్తున్నారు. అప్పట్లో పెళ్లి సందడికి కూడా కీరవాణి సంగీతం అందించారు. పాతికేళ్ల తర్వాత వస్తున్న ఈ ‘పెళ్లి సందD’ కి కూడా కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

Related Images:

నందమూరి వారి ఇంట పెళ్లి సందడి

మొన్నటి వరకు మెగా వారి పెళ్లి సందడికి సంబంధించిన ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. మెగా బ్రదర్ నాగబాబు తన కూతురు నిహారిక వివాహంను వైభవంగా నిర్వహించాడు. పెళ్లి తంతు ఇటీవలే పూర్తి అయ్యింది. మెగా వారి పెళ్లి హడావుడి పూర్తి అయ్యిందో లేదో సోషల్ మీడియాలో నందమూరి వారి పెళ్లి సందడికి సంబంధించిన ఫొటోలు ట్రెండ్ అవుతున్నాయి. నందమూరి ఫ్యామిలీకి చెందిన చైతన్య కృష్ణ వివాహం తాజాగా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో నందమూరి హీరోలు ఇతర కుటుంబ సభ్యులు ప్రముఖులు పాల్గొన్నారు.

చైతన్య కృష్ణ హీరోగా తెలుగులో ఒక సినిమాను చేశాడు. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. వ్యాపారాలతో బిజీగా ఉన్న చైతన్య కృష్ణ నిన్న రేఖారాణి మెడలో మూడు ముళ్లు వేశారు. నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ మద్యలో జరిగిన ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ పెళ్లికి హాజరు అయ్యాడా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. కళ్యాణ్ రామ్ హాజరు అవ్వడంతో ఎన్టీఆర్ కూడా హాజరు అయ్యే ఉంటాడు. కాని ఫొటోలు బయటకు రాలేదు అంటున్నారు. నందమూరి బాలకృష్ణ దంపతులు మరియు ఆయన కూతురు మరియు అల్లుడు ఇంకా ఆ కుటుంబ పెద్దలు పిల్లుల అంతా హాజరు అయ్యారని మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

Related Images:

ఉపాసన షోలో నవదీప్ డ్రగ్స్ చర్చ

మెగా ఇంటి కోడలు ఉపాసన మల్టీ ట్యాలెంటెడ్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె ఎన్నో వ్యాపారాలు చేస్తూనే ఫిట్ నెస్ పై అత్యధిక దృష్టి పెడుతుంది. ఆమె యువర్ లైఫ్ అనే వెబ్ పోర్టల్ కు గెస్ట్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. యువర్ లైఫ్ కోసం ప్రతి వారం ఒక సెలబ్రెటీని తీసుకు వచ్చి ఆరోగ్యపరమైన అప్ డేట్ ను ఇస్తూ ఉంటుంది. హెల్త్ టిప్స్ ను ఇవ్వడంతో పాటు వారికి సంబంధించిన ఆహారపు అలవాటర్లను తెలుసుకుంటుంది. ఇక ఈవారం నవదీప్ ను ఉపాసన తీసుకు వచ్చారు. నవదీప్ అనగానే ఎక్కువ మంది పార్టీలు పబ్ లు డ్రగ్స్ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఉపాసన కూడా తన షో లో నవదీప్ తో డ్రగ్స్ గురించి చర్చించినట్లుగా తెలుస్తోంది.

ప్రతి ఒక్కరి జీవితంలో డ్రగ్స్ ను ఏదో ఒక విధంగా తీసుకుంటున్నారు. మెడిసిన్స్ రూపంలో తీసుకునే డ్రగ్స్ ను కంట్రోల్ చేయడం ఎలా.. ఒక్కసారి అలవాటు పడ్డ డ్రగ్స్ కు దూరం అవ్వడం ఎలా అనే విషయాలను ఉపాసన ఈ వారం తన షోలో చూపించబోతున్నారు. హై ఆన్ లైఫ్ పేరుతో సాగబోతున్న ఈ చర్చ కార్యక్రమంలో న్యూరాలజీ డాక్టర్ సి రాజేష్ తో కలిసి నవదీప్ డ్రగ్స్ విషయమై మాట్లాడబోతున్నారు. డ్రగ్స్ వ్యసనంగా మారిన సమయంలో దాన్ని ఎలా అధిగమించాలనేది డాక్టర్ తన సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు నవదీప్ తన అనుభవాలను వివరించబోతున్నాడు.

Related Images:

ప్లాస్టిక్ సర్జరీ వికటించి మోడల్ కం నటి దుర్మరణం

ప్లాస్టిక్ సర్జరీలతో అంతో ఇంతో ముప్పు పొంచి ఉంటుందన్నది మెడికల్ సైన్స్ చెప్పే మాట. సైడ్ ఎఫెక్ట్స్ గురించి ముందే వివరణ ఇచ్చాకే సర్జరీలకు అనుమతిస్తారు. అయితే దానికి సిద్ధపడే నటీమణులు మోడల్స్ కి కొదవేమీ లేదు. ఇంతకుముందు అందాల కథానాయిక ఆర్తి అగర్వాల్ లైఫో సక్సెమీ ఫెయిల్యూర్ తోనే మరణం సంభవించిందని కథనాలొచ్చాయి. అలా ఎందరో సెలబ్రిటీలకు జరిగిందనడానికి ఉదాహరణలున్నాయి. ఇప్పుడు `బ్రెజిలియన్ కిమ్ కర్థాషియన్`గా పాపులరైన ప్రముఖ మోడల్ కం నటి జోస్లిన్ కానో ఆపరేషన్ విఫలమైనందున మరణించినట్లు తెలిసింది. జోస్లిన్ ఈత దుస్తుల డిజైనర్.. టాప్ మోడల్.. నటిగానూ రంగ ప్రవేశం చేయనున్నారు.

జోసెలిన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో 12.9 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్నారు. అయితే ఆమె మరణాన్ని కుటుంబీకులు అధికారికంగా ప్రకటించకపోయినా.. తోటి మోడల్ లిరా మెర్సెర్ ఈ వార్తను వెల్లడించారు. “ఓంగ్ జోస్లిన్ కానో కొలంబియాలో శస్త్రచికిత్స చేయించుకుని మరణించారని.. అందమైన జీవితాన్ని కోల్పోయార“ని వెల్లడించారు.

జోస్లిన్ అంత్యక్రియల వీడియో యూట్యూబ్ లో లభించడంతో కొందరు అభిమానులు ఈ వార్తలను ధృవీకరించారు. కాలిఫోర్నియాలోని రివర్సైడ్ లోని ఏక్స్ ఫ్యామిలీ ఫ్యూనరల్ హోమ్ ఈ వీడియోను అప్ లోడ్ చేసినట్లు తెలిసింది. ఈ వీడియో ప్రకారం.. జోసెలిన్ 1990 మార్చి 14న జన్మించింది. 2020 డిసెంబర్ 07 నాటికి ఆమె ఎటర్నల్ లైఫ్ లోకి ప్రవేశించింది. జోస్లిన్ ఈత దుస్తుల డిజైనర్.‘మెక్సికన్ కిమ్ కర్దాషియన్’ అని పిలిచేవారు. ప్లాస్టిక్ సర్జరీ ‘బ్రెజిలియన్ బట్ లిఫ్ట్’ పొందడానికి జోసెలిన్ కొలంబియాకు వెళ్లినట్లు తెలిసింది. ఈ శస్త్రచికిత్సలో శరీరంలోని ఒకచోటి నుంచి కొవ్వును వేరొక చోటికి మార్చే ప్రక్రియ జరగనుంది. పిరుదులకు కొవ్వును అంటించుకునే ప్రయత్నం ఇది అని తెలిసింది.

మోడల్ కం డిజైనర్ వ్యక్తిగత ఇన్స్టాగ్రామ్ పేజీ చివరిసారిగా డిసెంబర్ 7 న అప్ డేట్ అయ్యి ఉంది. ఆమె ఈత దుస్తుల బ్రాండ్ పేజీ డిసెంబర్ 8 న ఒక చిత్రాన్ని పోస్ట్ చేసింది. ఆమె ఈత దుస్తుల బ్రాండ్ కి సంబంధించి కానీ.. ఆమె మరణానికి సంబంధించి కానీ కుటుంబ సభ్యులు ఎవరూ మరణాన్ని ధృవపరుస్తూ ఏదీ చెప్పలేదు.

Related Images:

‘సోలో బ్రతుకే సో బెటర్’ ట్రైలర్ విడుదల..!

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’. ఇందులో తేజ్ కి జోడీగా నభా నటేష్ నటించింది. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు మరియు సాంగ్స్ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. విరాట్ ఫిలాసఫీ పేరుతో రిలీజ్ చేసిన గ్లిమ్స్ కూడా ఆకట్టుకుంది. డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. లాక్ డౌన్ తరవాత థియేటర్లలో విడుదలవుతోన్న ఒక స్టార్ హీరో సినిమా ఇదేనని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో తాజాగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఈ ట్రైలర్ స్టార్టింగ్ లో ‘మాకు న్యాయం జరగాలి’ అంటూ కొంత మంది యువతీ యువకులు ధర్నా చేస్తూ సాయి ధరమ్ తేజ్ కటౌట్ ని తగలబెడుతున్నారు. ‘అసలు వీడెవడు? ఏమి చేసుంటాడు? ఖర్చు పెట్టి మరీ వీడి కటౌట్ ను ఎందుకు తగలబెడుతున్నారు? ఇదంతా తెలియాలంటే మీరు ఈ కథలోకి రావాలి’ అంటూ విరాట్ పాత్రధారి అయిన సాయి తేజ్ చెప్తున్నాడు. ‘మన రాజ్యాంగం మనకు స్వేచ్ఛగా బ్రతకమని కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఇచ్చింది. వాటిని మనం ఈ ప్రేమ పెళ్లి అనే కమిటెడ్ రిలేషన్ షిప్స్ తో నాశనం చేస్తున్నాం’ అని తేజ్ చెప్పడం ద్వారా ఈ సినిమా నేపథ్యం అర్థం అవుతోంది. ‘సినిమా హాళ్ళలో మందుకి సిగరెట్లకి దూరంగా ఉండమని వార్నింగ్ ఇచ్చినట్లే.. అలానే పెళ్లి కి పెళ్ళానికి దూరంగా ఉండాలని వార్నింగ్ ఇవ్వాలి’ అంటూ రావు రమేష్ చెప్పే డైలాగ్ హాస్యాస్పదంగా ఉంది.

సోలో బ్రతుకే సో బెటర్ అంటూ సింగిల్ గా ఉండాలని డిసైడైన విరాట్ లైఫ్ లోకి అమృత అనే అమ్మాయి వచ్చిన తర్వాత జరిగే పరిస్థితులను ఇందులో చూపించారు. బ్యాచిలర్ గా ఉండటానికి విరాట్ చేసే ప్రయత్నాలు నవ్వు తెప్పిస్తున్నాయి. ఆర్.నారాయణమూర్తి ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని సోలోగా ఉండాలని నిర్ణయించుకున్న విరాట్.. ‘మనిషి ప్రకృతి ధర్మాన్ని పాటించాలి. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. పెళ్లి చేసుకోవాలి’ అని ఓ ఇంటర్వ్యూలో ఆర్. నారాయణమూర్తి చెప్పడం చూసి షాక్ తినడంతో ట్రైలర్ పూర్తయింది. ఇందులో రాజేంద్రప్రసాద్ – సీనియర్ నరేష్ – రావు రమేష్ – వెన్నెల కిషోర్ – సత్య కీలక పాత్రలు పోషించారు. దీనికి వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేశారు. థమన్ సంగీతం సమకూర్చాడు. మొత్తం మీద సోలో లైఫ్ సో బెటర్ అంటూ వచ్చిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ వారు ఈ నెల 25న థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు.

Related Images:

సంక్రాంతికి ఫిక్స్.. మాస్ రాజా మోగించారు జేగంట

క్రిస్మస్ బరిలో సాయి తేజ్ నటించిన `సోలో బ్రతుకే సోబెటర్` రిలీజవుతుండగా సంక్రాంతికి డేర్ చేసే హీరోలు ఎవరు? అంటూ ఆసక్తికర చర్చ మొదలైంది. ఇంతలోనే మాస్ మహారాజా రవితేజ నేనున్నాను! అంటూ జేగంట మోగించారు. థియేటర్లు తెరిచాక టాలీవుడ్ నిర్మాతలు సంక్రాంతి సీజన్ పై ఆశపడ్డారు. కనీసం అప్పటికి మహమ్మారీ నుంచి బయటపడితే అయినా బతికి బట్టకట్టగలం అన్న ఆశాభావం వ్యక్తమైంది. ఎందుకంటే పెద్దా చిన్నా అన్న తేడా లేకుండా ఈ సీజన్ లో బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం దక్కుతుందన్న నమ్మకం .. ధీమా.

అప్పట్లోనే పలువురు సంక్రాంతి రిలీజ్ పై దృష్టి సారించామని ప్రకటించారు. తాజాగా మాస్ మహారాజ్ రవితేజ ‘క్రాక్’ ని సంక్రాంతికి అధికారికం చేసారు. జనవరి 14న క్రాక్ రిలీజవుతుందని తాజాగా సంగీత దర్శకుడు తమన్ రివీల్ చేశారు. నిర్మాణానంతర పనులు పూర్తి చేస్తున్నామని తెలిపారు. క్రాక్ బీజీఎం గురించి మూడో సింగిల్ గురించి థమన్ వెల్లడించారు. థియేట్రికల్ ట్రైలర్ త్వరలో వస్తుందని తెలిపారు. దీన్ని రీట్వీట్ చేస్తూ దర్శకుడు గోపిచంద్ మలినేని # క్రాక్ ఆన్ 14 అనే హ్యాష్ ట్యాగ్ ను ఉపయోగించారు. కాబట్టి సంక్రాంతి బరిలో క్రేజీ సినిమాగా `క్రాక్` బరిలో దిగుతోందని అర్థమవుతోంది. శ్రుతి హాసన్ నాయికగా నటిస్తున్న సంగతి తెలిసినదే. ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Related Images:

చెవిటి మూగ యువకుడిగా శౌర్య

నిశ్శబ్ధం చిత్రంలో స్వీటీ అనుష్క శెట్టి చెవిటి మూగ యువతిగా నటించిన సంగతి తెలిసిందే. కె.విశ్వనాథ్ లా ప్రయోగం చేయాలని ప్రయత్నించినా కోన వెంకట్ అండ్ కో ప్రయత్నం అంతగా మెప్పించలేదు. అయితే ఆ తర్వాత ఈ తరహా ప్రయోగాల గురించి వరుస కథనాలు హీట్ పెంచేస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ యువహీరో నాగశౌర్య చెవిటి మూగ (బదిర) యువకుడిగా ప్రయోగానికి సిద్ధమవుతున్నారన్న కథనాలు వినిపిస్తున్నాయి. నటసింహా నందమూరి బాలకృష్ణ సినిమాలో ఈ తరహా పాత్ర పోషించనున్నారన్నది ఆ వార్తల సారాంశం.

అయితే ఇది నిజమా? అంటే .. హీరో నాగ శౌర్య ప్రస్తుతం మూడు ప్రాజెక్టుల షూటింగ్ ల్లో బిజీగా ఉన్నారు. అతను తన హోమ్ బ్యానర్ లో ఒక రొమాంటిక్ కామెడీ … అలాగే సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో మరో రొమాంటిక్ డ్రామా చేస్తున్నాడు. ఇవేగాక శౌర్య మరో మూడు ప్రాజెక్టులపై సంతకం చేసారు. త్వరలోనే వీటికి సంబంధించిన అధికారిక ప్రకటనలు విడుదల కానున్నాయి.

నందమూరి బాలకృష్ణ మూవీలోనూ శౌర్య నటిస్తున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ చిత్రానికి డెబ్యూ శ్రీమాన్ వేముల దర్శకత్వం వహిస్తున్నారని.. ఇందులో శౌర్య చెవిటి మూగ వ్యక్తి పాత్రలో నటించనున్నారని ప్రచారమవుతోంది. శౌర్య పాత్ర చాలా ఆహ్లాదకరంగా వినోదాత్మకంగా ఉంటుందట. ఈ చిత్రంలో బాలయ్య- శౌర్య ఇద్దరికీ సముచిత ప్రాముఖ్యత ఉంటుందని.. వచ్చే ఏడాది ప్రారంభంలో రెగ్యులర్ చిత్రీకరణకు వెళతారని చెబుతున్నారు.

Related Images:

ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఓపెనింగ్ కూడా చేసిన మెగా హీరో

సినిమాల్లో హీరోలు అనాధల కోసం ఎన్నో మంచి పనులు చేయడం.. వారికి నేను ఉన్నాను అంటూ రౌడీలతో పోరాటం చూశాం. కాని రియల్ లైఫ్ లో హీరోలు ఎక్కువగా సామాజిక విషయాల గురించి పట్టించుకోవడం మనం చూడలేదు. ఏదైనా ప్రత్యేక సందర్బంగా వచ్చినప్పుడు మాత్రమే తమవంతు సాయం చేసేందుకు ముందుకు వస్తారు. ఆతర్వాత మళ్లీ ఎవరు కూడా పట్టించుకోరు. కాని సాయి ధరమ్ తేజ్ మాత్రం ఒక సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. దాన్ని మర్చి పోకుండా కంటిన్యూస్ గా దానికి సంబంధించిన అప్ డేట్ అడిగి తెలుసుకుంటూ వచ్చాడు. డబ్బులు ఇచ్చాం చేతులు దులుపుకున్నాం అని కాకుండా ఓపెనింగ్ కు కూడా వెళ్లాడు. ఇంతకు దేని గురించి అనుకుంటున్నారా.. ఏడాది క్రితం తేజూ ఒక అనాధ ఆశ్రమం గురించి తెలుసుకుని దాన్ని బాగు చేయించేందుకు ముందుకు వచ్చాడు. అన్నట్లుగానే ఆ భవనం మొత్తం బాగు చేయించాడు.

విజయవాడకు చెందిన అమ్మ ప్రేమ ఆశ్రమం శిధిలావస్తకు చేరిందని.. ఆర్థిక సమస్యతో నిర్వాహకులు సతమతం అవుతున్నారనే విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న సాయి ధరమ్ తేజ్ సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. ఆ భవనంను పూర్తిగా బాగు చేయిస్తాను అని అలాగే అందులో ఉన్న వారి కోసం తాను అండగా నిలుస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. అన్నట్లుగానే సాయి ధరమ్ తేజ్ భవనం నిర్మాణం పూర్తి చేయించాడు. నిన్న రాత్రి సమయంలో ఆ భవనంను ప్రారంభించడంతో పాటు అందులో ఉన్న వారిని కలిసి బాగోగులు తెలుసుకున్నాడు. ఈ సమయంలో అక్కడకు వెళ్లడం అంటే నిజంగా తేజూ మంచి మనసుకు హ్యాట్సాప్ అంటూ మెగా అభిమానులు ప్రశంసిస్తున్నారు. మామయ్యల మాదిరిగా తేజూకు కూడా మంచి మనసుందని అభిమానులు అంటున్నారు.

Related Images:

శ్రీముఖి కంటే ఎక్కువ తీసుకున్న మోనాల్?

తెలుగు బిగ్ బాస్ బడ్జెట్ కాస్త తక్కువ ఉంటుంది. ఆ బడ్జెట్ లోనే కంటెస్టెంట్స్ ను ఎంపిక చేయాల్సి ఉంటుంది. వచ్చే ఆదాయం కంటెస్టెంట్స్ పారితోషికం.. స్టాఫ్ ఇలా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని షో ను డిజైన్ చేస్తారు. అందుకే ఫేమస్ సెలబ్రెటీలను బిగ్ బాస్ లో మనం చూడం. ఒక వేళ వాళ్లకు ఆసక్తి ఉన్నా కూడా వారికి పారితోషికం ఇవ్వలేక నిర్వాహకులు వారిని తీసుకు వచ్చేందుకు ఇష్టపడరు. బిగ్ బాస్ నాలుగు సీజన్ ల కంటెస్టెంట్స్ ను చూస్తే వారంకు అయిదు లక్షలు అటు ఇటుగా ఇచ్చే తీసుకు వచ్చారు. కొందరికి వారంకు లక్ష రూపాలు మాత్రమే ఇచ్చి కూడా తీసుకు వచ్చారు. కాని మోనాల్ గజ్జర్ కు మాత్రం ఏకంగా ఆరున్నర నుండి ఏడు లక్షల వరకు పారితోసికంగా బిగ్ బాస్ నిర్వాహకులు ఇచ్చారంటూ వార్తలు వస్తున్నాయి.

ఇప్పటి వరకు గత సీజన్ కంటెస్టెంట్ అయిన శ్రీముఖి తీసుకున్న 5.5 లక్షల పారితోషికం అత్యధికం అంటున్నారు. కాని ఈసారి మాత్రం మోనాల్ ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఈ సీజన్ లో లాస్యకు దాదాపుగా రూ. 5 లక్షల వరకు ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. ఈ సీజన్ మొత్తం కలిపి మోనాల్ కు ఏకంగా కోటి వరకు పారితోషికంగా ముట్టి ఉంటుందని అంటున్నారు. ఆమె హౌస్ లో స్క్రిప్ట్ ప్రకారం నడుచుకున్న కారణంగానే ఆ భారీ పారితోషికం అంటున్నారు. మోనాల్ పారితోషికం విషయంలో రికార్డు సృష్టించింది. ఆమెకు అందిన పారితోషికంకు పూర్తి న్యాయం చేసింది అనడంలో సందేహం లేదు. విమర్శలు వచ్చినా కూడా తనకు అప్పగించిన సీక్రెట్ టాస్క్ ను సక్సెస్ ఫుల్ గా నిర్వర్తించింది.

Related Images:

ప్రొడ్యూసర్ తో గొడవ.. హీరో రామ్ తో ‘జగడం’

ఒక హీరోతో అనుకున్న సినిమాలో మరో హీరో నటించడం.. ఒక హీరోయిన్ ప్లేస్ లోకి మరో నటి రావడం సినీ ఇండస్ట్రీలో తరచూ జరిగేదే. అయితే.. ఆ పరిస్థితి రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. హీరో రామ్ నటించిన ‘జగడం’ సినిమా కూడా ఇలాంటిదే. వాస్తవానికి ఈ సినిమాని దర్శకుడు సుకుమార్.. అల్లు అర్జున్ తోగానీ.. మహేశ్బాబుతోగానీ తీయాాలనుకున్నాడట.

అయితే.. ఆ తర్వాత ఏం జరిగిందో గానీ.. ఈ సినిమా విషయమై ఓ ప్రముఖ నిర్మాతతో సుకుమార్ కు విబేధాలు వచ్చాయట. దీంతో అనూహ్యంగా రామ్ తెరపైకి వచ్చాడు. వెంటనే అతనికి కథ వినిపించి ఒప్పించి ‘జగడం’ అనే టైటిల్ ఫిక్స్ మరుసటి రోజే సినిమాను ప్రారంభించాడు సుకుమార్. అయితే.. సినిమాలో హింస పాళ్లు ఎక్కువ కావడంతో ఫ్లాప్ అయింది. అయితే.. ఈ సినిమా మహేష్ బన్నీ ఎవరో ఒకరు చేస్తే లెక్క మరోలా ఉండేదని అంటూ ఉంటారు.

ఆ తర్వాత సుకుమార్ మహేష్తో ‘1 నేనొక్కడినే’ తెరకెక్కించినా ఆ సినిమా కూడా కమర్షియల్గా సక్సెస్ కాలేకపోయింది. ఇక బన్నీకి ‘ఆర్య’తో బ్లాక్బస్టర్ హిట్ ఇచ్చిన సుకుమార్.. ఆ తర్వాత అతడితోనే ‘ఆర్య 2’ కూడా తీశాడు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో ‘పుష్ప’ తెరకెక్కుతోంది.

Related Images:

పెళ్లి తర్వాత నిహారిక ఫస్ట్ బర్త్ డేను చైతన్య ఎక్కడ చేస్తున్నాడో తెలుసా?

మెగా వారి ఇంటి అమ్మాయి నిహారిక కొనిదెల ఇటీవలే చైతన్య ను పెళ్లి చేసుకుని జొన్నలగడ్డ వారి అమ్మాయిగా మారిపోయింది. ఇక నేడు నిహారిక పుట్టిన రోజు జరుపుకుంటుంది. తన 28వ వసంతంలోకి అడుగు పెడుతున్న నిహారికకు ప్రముఖులు మరియు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా పెద్ద ఎత్తున వేడుకలను ఇటు కొనిదెల ఫ్యామిలీ అటు జొన్నలగడ్డ వారి ఫ్యామిలీ నిర్వహిస్తుంది. నిన్న రాత్రి సమయంలో జబర్దస్త్ మరియు అదిరింది కమెడియన్స్ తో పాటు తన సన్నిహితులకు నాగబాబు పిలిచి నిహారిక బర్త్ డే పార్టీని ఇచ్చాడు.

ఇక నేడు నిహారిక బర్త్ డే పార్టీని పలక్ నుమా ప్యాలెస్ లో వైభవంగా చైతన్య నిర్వహించబోతున్నాడు. ఈ బర్త్ డే వేడుకలో మెగా ఫ్యామిలీతో పాటు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నారు. పెళ్లి తర్వాత వచ్చిన నిహారిక మొదటి పుట్టిన రోజు అవ్వడంతో ఎప్పటికి గుర్తు ఉండేలా ఈ వేడుకను నిర్వహిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇటీవలే పెళ్లి తంతు పూర్తి చేసుకుని కార్యక్రమాలు ముగించుకుని వచ్చేసిన కొత్త జంట నేడు మళ్లీ బర్త్ డే వేడుకల సందర్బంగా సోషల్ మీడియాలో సందడి చేయబోతున్నారు.

Related Images:

అందాల నిధి ఫిట్ నెస్ కవర్

అక్కినేని బ్రదర్స్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మద్దుగుమ్మ నిధి అగర్వాల్ హీరోయిన్ గా ఇస్మార్ట్ శంకర్ తో సక్సెస్ దక్కించుకుంది. ఆ సక్సెస్ తో ఒక్కసారిగా టాలీవుడ్ లో బిజీ అయ్యింది. అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ ఏడాదిలో మూడు నాలుగు సినిమాలతో ఈ అమ్మడు ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కాని కరోనా కాటేయడంతో సినిమాలన్నీ ఆగిపోయాయి. వచ్చే ఏడాది ఈమె వరుసగా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతుంది. ఇదే సమయంలో ఈ అమ్మడు క్రమం తప్పకుండా ఫొటో షూట్ లతో నెటిజన్స్ ను ఆకట్టుకుంటూనే ఉంది.

ఇటీవల ఈ అమ్మడు ఉమెన్ ఫిట్ నెస్ అనే మ్యాగజైన్ కవర్ పై ఎక్కింది. రెండ్ డ్రస్ లో నడుము అందాలు చూపిస్తూ కనిపించి కనిపించనట్లుగా క్లీవేజ్ ఎక్స్ పోజ్ చేస్తూ ఎలా కనిపిస్తే అబ్బాయిలు అబ్బా అంటారో అలా కనిపిస్తూ అదరగొట్టేస్తోంది. ఈ అమ్మడు చేస్తున్న ఈ అందాల ఎక్స్ పోజింగ్ తో పాటు ఆమె ఫిట్ నెస్ తో ఉమెన్ ఫిట్ నెస్ మ్యాగైజన్ కవర్ అదిరి పోయింది. ఫుల్ పేజీ కవర్ లో ఫుల్ షాట్ లో నిధి అగర్వాల్ నిజంగా అందాల నిధి అన్నట్లుగా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Related Images:

కొణిదెల పవన్ తేజ్ ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ టీజర్ రిలీజ్ చేసిన నాగబాబు..!

కొణిదెల పవన్ తేజ్ హీరోగా పరిచయం చేస్తూ అభిరామ్ ఎమ్. దర్శకత్వం వహిస్తున్న సినిమా ”ఈ కథలో పాత్రలు కల్పితం”. మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజేష్ నాయుడు ఈ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ నిర్మిస్తున్నాడు. ఇందులో మేఘన హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్స్ లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ప్రచార చిత్రాలకు మరియు సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా డిసెంబర్ 18న చిత్ర టీజర్ ని మెగాబ్రదర్ కొణిదెల నాగబాబు రిలీజ్ చేశాడు.

‘ఈ కథలో పాత్రలు కల్పితం’ టీజర్ లో మిస్టరీగా మారిన ఓ కేసును ఛేదించే క్రమంలో హీరో మరియు పోలీసుల మధ్య జరిగే స్టోరీ అని తెలుస్తోంది. సీనియర్ నటుడు పృథ్వీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు. ముఖ్యంగా పవన్ తేజ్ యాక్షన్ సన్నివేశాలపై బాగా ఫోకస్ పెట్టినట్లు అర్థం అవుతోంది. దీనికి సినిమాటోగ్రాఫర్ సునీల్ కుమార్ అందించిన విజువల్స్.. కార్తీక్ కొడకండ్ల ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. కాకపోతే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని మేకర్స్ చెప్తూ వస్తున్న రేంజ్ లో ఈ టీజర్ లేదనే చెప్పాలి. ‘ఆర్ఎక్స్ 100’ చిత్రానికి డైలాగ్స్ రాసిన తాజుద్దీన్ సయ్యద్ ఈ చిత్రానికి మాటలు మరియు అడిషినల్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని థియేటర్స్ లోనే రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Related Images:

కూతురుకు నాగబాబు ఎమోషనల్ పుట్టిన రోజు శుభాకాంక్షలు

మెగా బ్రదర్ నాగబాబు తన కూతురు నిహారికను ఎంతగా ప్రేమిస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి తండ్రి కూడా తన కూతురును ప్రిన్సెస్ మాదిరిగా చూసుకుంటాడు. కాని నాగబాబు అంతకు మించి చూసుకున్నట్లుగా అనిపిస్తుంది. ఆమె ఏం కోరితే అది చేశారు.. చేయనిచ్చారు. ఇతరులు ఏం అనుకుంటారో అనే విషయంను ఆయన ఎప్పుడు పట్టించుకోలేదు. కూతురు కోసం ఎంతో చేసిన నాగబాబు ఇటీవలే ఆమె పెళ్లిని అంగరంగ వైభవంగా నిర్వహించాడు. ఇక నేడు ఆమె పుట్టిన రోజు అవ్వడంతో చాలా ఎమోషనల్ గా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

నిహారిక చిన్నప్పటి ఫొటోను షేర్ చేసి దేవుడిపై నమ్మకం లేని నాకు నీ రాకతో ఏంజిల్స్ ను నమ్మాలనిపించింది. నీ కళ్లలో ఆనందం చూసేందుకు నీ ముందు గర్వంగా ఉండేందుకు నేను చాలా చేశాను. ఈ పెళ్లి అనేది మనం ఇంకా క్లోజ్ అవ్వడానికి మరియు నాకు నీపై ఉన్న ప్రేమను చూపించింది అని భావిస్తున్నాను. హ్యాపీ బర్త్ డే నాన్న అంటూ పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలో నిహారిక మరియు ఆమె తల్లిని కనీసం గుర్తు పట్టడానికి కూడా కష్టంగా ఉన్నారు కదా. చిన్నప్పుడే నిహరిక ఎంత క్యూట్ గా ఉంది.. ఆ బుగ్గలు ఎంత ముద్దు వస్తున్నాయో అంటూ మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Related Images: