పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత నటిస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’. హిందీలో ఘన విజయం సాధించిన ‘పింక్’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు – శిరీష్ నిర్మిస్తున్నారు. పవన్ రీ ఎంట్రీగా వస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ కోవిడ్ నేపథ్యంలో తిరిగి ప్రారంభమైంది. అయితే ‘వకీల్ సాబ్’ విడుదలపై ఇంతవరకు క్లారిటీ రాలేదు.
ముందుగా ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని సమ్మర్ కానుకగా విడుదల చేసేలా ప్లాన్ చేసుకున్నారు. అదే సమయంలో కరోనా మహమ్మారి వచ్చి బ్రేక్స్ వేసింది. ఇప్పుడిప్పుడే థియేటర్స్ రీ ఓపెన్ అవుతున్న నేపథ్యంలో సంక్రాంతి ఫెస్టివల్ సీజన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని వార్తలు వచ్చాయి. దిల్ రాజు కూడా ఈ చిత్రాన్ని పండక్కి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడని తెలుస్తోంది. కాకపోతే దిల్ రాజు చెప్పే రేట్లకి సినిమా తీసుకోడానికి బయ్యర్లు ముందుకు రావడం లేదని టాక్ నడుస్తోంది. ఒకవేళ సొంతగా విడుదల చేసినా పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందా అనేది అనుమానమే. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ ఫ్యాన్స్ ‘వకీల్ సాబ్’ కోసం ఇంకొన్నాళ్లు వెయిట్ చేయాల్సి వస్తుందేమో అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
నిజానికి కరోనా మహమ్మారి కారణంగా స్టార్ హీరోల సినిమాల బిజినెస్ మీద కూడా గట్టిగా ప్రభావం చూపించింది. థియేటర్స్ రీ ఓపెన్ చేస్తున్నా ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తారో రారో అనే అనుమానంతో డిస్ట్రిబ్యూటర్స్ మనీ పెట్టి పెద్ద సినిమాలను కొనాలంటే భయపడుతున్నారట. ఈ నేపథ్యంలో డిసెంబర్ 25న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా రిలీజ్ కానుంది. దీని తర్వాత ఇండస్ట్రీలో ఏమైనా చేంజ్ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా సక్సెస్ ని బట్టి రాబోయే సినిమాల బిజినెస్ ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.
అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా బయోపిక్ తెరకెక్కితే టైటిల్ పాత్రధారి ఎవరు? అన్నదానికి ఒబామానే ఆన్సర్ ఇవ్వడం ఆసక్తిని కలిగిస్తోంది. ఫలానా నటుడు నా బయోపిక్ చేస్తే బావుంటుంది అని ఆయన మనసారా ధీవించారంటే ఆ నటుడి గొప్పతనం గురించి తెలుసుకుని తీరాలి.
గ్రామీ విజేతగా నిలిచి ఆ నటుడి పేరు డ్రేక్.. అతడు ఒబామా పాత్రలో నటిస్తే `గో-అహెడ్` అంటూ ఒబామా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. భవిష్యత్ లో మాజీ అధ్యక్షుడు ఒబామా పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నానని డ్రేక్ ప్రకటించగా.. అందుకు అతడు అధికారిక ఆమోద ముద్రను కలిగి ఉన్నారని బరాక్ ఒబామా స్వయంగా చెప్పారు.
2001 టీన్ డ్రామా `డెగ్రస్సి: ది నెక్స్ట్ జనరేషన్` లో నటుడిగా కెరీర్ నటనను ప్రారంభించిన గ్రామీ విజేత డ్రేక్ 2007 లో వచ్చిన కామెడీ-డ్రామా చార్లీ బార్ట్లెట్ లో మైమరిపించే పాత్రతో ఆకట్టుకున్నారు. 2010 లో ఒబామా పాత్ర పోషించడానికి ఆసక్తిగా ఉన్నానని అతడు ప్రకటించారు.
ఓ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో ఒబామా మాట్లాడుత.. “నటుడు డ్రేక్ తనకు కావలసినది చేయగలడని అనిపిస్తుంది. అతడు ప్రతిభావంతుడు. ట్యాలెంట్ ఉన్న సోదరుడు. కాబట్టి బయోపిక్ కి సమయం వచ్చి అతను సిద్ధంగా ఉంటే నాకు ఓకే“ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. డ్రేక్ ఒబామాగా నటిస్తానంటే.. తామే సినిమా తీస్తామని అతని కుమార్తెల నుంచి కూడా ఆశీర్వాదం పొందడం ఆసక్తికరం.
ప్రఖ్యాత `పేపర్ మ్యాగజైన్`కు 2010 లో ఇచ్చిన ఇంటర్వ్యూలో డ్రేక్ కామెంట్ అప్పట్లో వైరల్ అయ్యింది. “ఒబామా జీవితం గురించి త్వరలో ఎవరైనా సినిమా చేస్తారని ఆశిస్తున్నానని..నేను ఆ పాత్రను పోషించగలను“ అని డ్రేక్ చెప్పాడు. టీవీ చూస్తే ఒబామా ఆహార్యాన్ని బాడీ లాంగ్వేజ్ ని పరిశీలిస్తానని అతడు చెప్పాడు. అసలు ఆ సమయంలో టీవీ చానెల్ నే మార్చనని తెలిపాడు.
2020 మినీ సిరీస్ డ్రామా `ది కామెడీ రూల్` ..`సౌత్ సైడ్ విత్ యు` సిరీస్ లలో ఒబామా పాత్రను చూపించారు. 2016 లో విడుదలైన రెండు టెలివిజన్ చిత్రాలలో ఒబామాను అమరత్వం పొందారు. అయితే పూర్తి స్థాయిలో ఒబామా రాజకీయ జీవితం పై బయోపిక్ ఇంకా రూపొందించలేదు. హాలీవుడ్ లో అలాంటి ప్రయత్నాలు ఇంకా సాగనే లేదు.
సౌత్ స్టార్ డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్ ప్రతిభ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఆయన హాలీవుడ్ రేంజ్ సినిమాలు తీయగల సత్తా ఉన్న దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో ఇటు సౌత్.. అటు హిందీ చిత్రపరిశ్రమలో బ్లాక్ బస్టర్లతో సంచలనం సృష్టించిన దర్శకుడిగా అతడికి ప్రత్యేకమైన క్రేజు ఉంది.
తాజా సంచలనం ఏమంటే.. అతడు హాలీవుడ్ సినిమాకి దర్శకత్వం వహించనున్నారని కోలీవుడ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ మూవీ కన్ఫామ్ అయితే సౌత్ నుంచి హాలీవుడ్ చిత్రానికి దర్శకత్వం వహించిన తొలి గ్రేట్ డైరెక్టర్ గా రికార్డులకెక్కే వీలుంది. మురుగదాస్ ప్రస్తుతం తన తొలి హాలీవుడ్ చిత్రం కోసం హాలీవుడ్ ఫేమస్ స్టూడియో డిస్నీ పిక్చర్స్ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారని సమాచారం.
మురుగదాస్ తో డిస్నీ పిక్చర్స్ ప్రతినిధులు `ది జంగిల్ బుక్`.. ది బ్యూటీ అండ్ ది బీస్ట్ తరహాలో లైవ్ యాక్షన్ కమ్ యానిమేషన్ చిత్రం గురించి చర్చిస్తున్నారు. ఈ ఊహాగానాలకు సంబంధించి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
కెరీర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాల్ని తెరకెక్కించిన మురుగదాస్ గజిని-సర్కార్- తుపాకి లాంటి స్పెషల్ మూవీస్ ని తెరకెక్కించారు. ప్రస్తుతం దళపతి విజయ్ 65 వ చిత్రం కోసం చర్చలు జరుపుతున్నాడు. సృజనాత్మక వ్యత్యాసాల కారణంగా మురుగదాస్ ఈ ప్రాజెక్ట్ నుండి వైదొలిగారు. అనంతరం డిస్నీవాళ్లతో యానిమేషన్ మూవీకి సన్నాహాలు చేస్తుండడం సర్వత్రా ఉత్కంఠగా మారింది.
‘ఈ నగరానికి ఏమైంది’ ఫేం సుశాంత్ హీరోగా ఛాందిని చౌదరి మరియు సిమ్రాన్ చౌదరి హీరోయిన్స్ గా రూపొందిన ‘బొంభాట్’ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. రాఘవేంద్ర వర్మ దర్శకత్వంలో విశ్వాస్ హన్నూర్ కార్ నిర్మించిన ఈ సినిమాను దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సమర్పిస్తున్నాడు. ఆయన సమర్పణతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా కథ మరియు స్క్రీన్ ప్లే లో సలహాలు సూచనలు దర్శకేంద్రుడు ఇచ్చాడు అంటూ ప్రచారం జరుగుతుంది. అందువల్ల సినిమా కోసం ఒక వర్గం వారు వెయిట్ చేస్తున్నారు.
థియేటర్లు ఇంకా పూర్తి స్థాయిలో ఓపెన్ అవ్వలేదు. ఎప్పటి వరకు చిన్న సినిమాలకు మంచి రోజులు వస్తాయో తెలియదు. అందుకే థియేటర్ల కోసం వెయిట్ చేయడం మానేసి ఈ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేయాలనే నిర్ణయానికి మేకర్స్ వచ్చారంటూ మీడియా సర్కిల్స్ ద్వారా ప్రచారం జరుగుతోంది. నిర్మాత విశ్వాస్ మాట్లాడుతూ మా కథ నచ్చి సమర్పించేందుకు ఒప్పుకున్నందుకు దర్శకుడు రాఘవేంద్ర రావు గారికి కృతజ్ఞతలు. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ ద్వారా డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా పేర్కొన్నాడు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుందనే నమ్మకంను యూనిట్ సభ్యులు అంతా వ్యక్తం చేశారు.
అయిదు సంవత్సరాల క్రితం రానా హీరోగా హిరణ్య కశ్యప సినిమాను చేయబోతున్నట్లుగా గుణశేఖర్ ప్రకటించిన విషయం తెల్సిందే. ఏవో కారణాల వల్ల సినిమా పట్టాలెక్కలేదు. అనారోగ్య కారణాల వల్ల రానా దాదాపు రెండు సంవత్సరాల పాటు షూటింగ్ లకు పూర్తి స్థాయిలో హాజరు కాలేక పోయాడు. ఈ ఏడాదిలో హిరణ్య కశ్యపను పట్టాలెక్కించాలని భావిస్తున్న సమయంలో కరోనా వల్ల సినిమా ఆగిపోయింది. భారీ బడ్జెట్ తో రూపొందించాల్సిన హిరణ్య కశ్యప సినిమాను ఇప్పుడు తీయడం సాధ్యం కాదంటూ గుణశేఖర్ మరో సినిమాను మొదలు పెట్టిన విషయం తెల్సిందే.
రానా కు హిరణ్య కశ్యప ప్రాజెక్ట్ పై చాలా ఆసక్తి ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే మరీ ఆలస్యం చేయకుండా 2022లో మొదలు పెట్టాలని ఆయన భావిస్తున్నాడు. సురేష్ బాబు ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. అయితే ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ ఫాక్ స్టార్ వారు ఈ సినిమా నిర్మాణంలో మెజార్టీ భాగస్వామ్యం కలిగి ఉంటుందట.
ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ఇప్పటికే కమిట్ అయిన ఒకటి రెండు సినిమాలు కూడా 2022 వరకు పూర్తి చేసి మరే ప్రాజెక్ట్ ఒప్పుకోకుండా హిరణ్య కశ్యపను పాన్ ఇండియా మూవీగా చేయాలని రానా ఆశ పడుతున్నాడట. 200 కోట్లకు మించిన బడ్జెట్ తో ఈ సినిమా రూపొందే అవకాశం ఉందంటున్నారు. ఈ లోపు గుణశేఖర్ శాకుంతలం సినిమాను తీయబోతున్నాడు. వచ్చే ఏడాది ఆ సినిమా పట్టాలెక్కి 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
రకరకాల వివాదాల్లో నటి పూనమ్ కౌర్ పేరు ప్రముఖంగా చర్చల్లోకొచ్చింది. “నా అమాయకత్వం అజ్ఞానం నన్ను గందరగోళంలో పడేసింది. నేను దాని నుండి ఎలా బయటపడాలో తెలియలేదు..“ అంటూ అప్పట్లో వ్యాఖ్యానించారు నటి పూనమ్ కౌర్. రాజకీయాల్లో అపసవ్య దిశ గురించి మీడియా ఇంటర్వ్యూల్లో తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.
గత ఎన్నికల సందర్భంలో పూనమ్ పలు వివాదాంశాలతో హాట్ టాపిక్ అయ్యారు. ఆ సందర్భంలో ఆమె వ్యాఖ్యలు ఇప్పటికీ అభిమానుల్లో చర్చకొస్తూ ఉన్నాయి. అలాగే తనపై సోషల్ మీడియాల్లో తప్పుడు వ్యాఖ్యలు చేసిన వారిపైనా సైబర్ క్రైమ్ కి పూనమ్ ఫిర్యాదు చేశారు.
నన్ను చాలా మంది మానసికంగా వేధించారు. వారంతా నా జీవితంతో ఆడటానికి ప్రయత్నిస్తున్నారు. ఇది గత రెండేళ్లుగా కొనసాగుతోంది. నేను ఇప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్నాను ఎందుకంటే నేను మాట్లాడితే అది చాలా మందిని ప్రభావితం చేస్తుంది. చాలా జీవితాలు నాశనమవుతాయి. ఈ కారణంగా నా కుటుంబం ఇప్పటికే చాలా మానసికంగా వేదనకు గురైంది. నా వ్యక్తిగత జీవితం ముక్కలైంది. నేను తీవ్ర ఒత్తిడికి గురయ్యాను.. అంటూ అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశారు పూనమ్.
అదంతా గతం అనుకుంటే .. ఇటీవల పూనమ్ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటున్నారు. లేటెస్టుగా పూనమ్ షేర్ చేసిన కొన్ని ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. తన నెక్ దిగువగా ఛాతీ భాగంపై త్రిశూలాన్ని నాగుపామును పచ్చబొట్టు పొడిపించుకున్న ఫోటోలు యూత్ లో హాట్ టాపిక్ గా మారాయి.
ఈమద్య కాలంలో సెల్రబెటీలు వరుసగా మాల్దీవుల్లో చక్కర్లు కొట్టేందుకు వెళ్తారు. నెలల తరబడి కరోనా కారణంగా ఇంటికే పరిమితం అయిన స్టార్స్ ఎట్టకేలకు అవకాశం దక్కడంతో దుబాయ్ మరియు మాల్దీవులకు వెళ్లారు. సాదారణంగా అయితే అమెరికా.. లండన్.. యూరప్ కు వెళ్లే సెల్రబెటీలు ఈసారి పూర్తిగా దుబాయ్ మరియు మాల్దీవులకు వెళ్లారు. అక్కడే కరోనా తక్కువ ఉండటం ప్రధాన కారణం అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో మంది హీరోయిన్స్ మాల్దీవులకు వెళ్లి అక్కడ హాట్ ఫొటో షూట్ లను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. కాని రకుల్ మాత్రం అంతకు మించి అన్నట్లుగా సముద్రంపై సాహసం చేసి ఫొటోలు షేర్ చేసింది.
మాల్దీవుల్లో ఈ అమ్మడు ప్లై బోర్డింగ్ అనుభూతిని చవి చూసింది. చాలా శిక్షణ ఉంటే తప్ప దీనిని చేయడం సాధ్యం కాదు. చాలా మంది దానిపై నిల్చోలేక కిందపడి పోతారు. అయితే రకుల్ మాత్రం సాధించింది. ఏడు సార్లు కింద పడి 8వ సారి నిలబడ్డాను అంటూ పేర్కొంది. పట్టుదలతో రకుల్ చేసిన ఈ సాహసంను అభిమానులు అభినందిస్తున్నారు. హీరోయిన్స్ అంతా కూడా అక్కడకు వెళ్లి ఫాట్ ఫొటో షూట్ లు ఇచ్చారు. కాని ఈమె మాత్రం అంతకు మించి అన్నట్లుగా ప్లై బోర్డింగ్ ను ఎక్స్ పీరియన్స్ చేసింది.
మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనమ్ కోషియమ్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. బిజూ మీనన్ – పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. తెలుగు రీమేక్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – దగ్గుబాటి రానా హీరోలుగా నటించనున్నారు. బిజూ మీనన్ పోషించిన నిజాయితీగల పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కనిపించనుండగా.. అతనికి ధీటుగా నిలిచే పాత్రలో రానా కనిపించనున్నాడు. ఇందులో పవన్ – రానా లకు భార్య పాత్రల్లో ఎవరు నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది. నిడివి తక్కువైనా ఈ పాత్రలకు కథలో ప్రాధాన్యత ఉంటుంది. ఈ నేపథ్యంలో రానా కి జోడీగా నివేథా పేతురాజ్ ని తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
‘మెంటల్ మదిలో’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన డస్కీ బ్యూటీ నివేథా.. ‘చిత్ర లహరి’ ‘బ్రోచేవారేవరురా’ వంటి సినిమాలలో అలరించింది. ఇక అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలో కూడా నటించింది. ఇప్పుడు అదే ప్రొడక్షన్ లో వస్తున్న ‘అయ్యప్పనుమ్ కొశియుమ్’ లో కూడా నివేథా ఛాన్స్ దక్కించుకుందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ ని తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే ఈ ప్రాజెక్ట్ లోకి మరో డస్కీ బ్యూటీ వచ్చినట్లు అవుతుంది. ఈ చిత్రానికి సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు.
రాజమౌళి RRR పాన్ ఇండియా కేటగిరీలో తెరకెక్కుతుండడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. `బాహుబలి` వంటి సంచలన చిత్రం తరువాత జక్కన్న నుంచి వస్తున్న మూవీ కావడంతో సహజంగానే అంచనాలు స్కైహైకి చేరుకున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే ఈ మూవీని ఓ రేంజ్ లో సిద్ధం చేస్తున్నారు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన కీలక పోరాట ఘట్టాల చిత్రీకరణని పూర్తి చేశారు.
ఇందు కోసం ఏకంగా 50 రోజులు కేటాయించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. డే అండ్ నైట్ అనే తేడా లేకుండా 50 రోజుల పాటు ఈ మూవీ కోసం యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరించారు. తాజా షెడ్యూల్ ని కూడా వెంటనే ప్రారంభించబోతున్నారని తెలిసింది. పూనేలో కీలక సన్నివేశాల్ని వారం రోజుల పాటు పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించబోతున్నట్టు తెలిసింది. ఈ షెడ్యూల్ లో బాలీవుడ్ హీరో అజయ్దేవగన్ తో పాటు ఎన్టీఆర్కు జోడీగా నటిస్తున్న ఒలివియా మోరీస్ కూడా పాల్గొనబోతోందని చెబుతున్నారు. లండన్ లో స్కూల్ ఆఫ్ డ్రామా స్టడీస్ చేసిన ఒలీవియా స్టేజీ ఆర్టిస్టుగా పాపులర్. ఇప్పుడు టాలీవుడ్ అగ్రకథానాయకుడి సరసన అవకాశం అందుకుంది. ఎన్టీఆర్ కూడా పాల్గొనబోతున్న ఈ ఎపిసోడ్ ని జక్కన్న ఎలా డిజైన్ చేశాడో చూడాలి.
టాలీవుడ్ స్టార్ హీరోలకు పాన్ ఇండియా రేంజులో భారీ క్రేజ్ వున్న విషయం తెలిసిందే. అదే స్థాయిలో వారి వైఫ్ లకు అభిమానుల్లో పాపులారిటీ దక్కుతోంది. సోషల్ మీడియాల్లో స్టార్ వైఫ్స్ క్రేజు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మహేష్- రామ్ చరణ్- బన్ని లాంటి స్టార్ల సతీమణులకు సామాజిక మాధ్యమాల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. వారి ఇన్ స్టా ఖాతాలకు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. బన్నీ వైఫ్ స్నేహరెడ్డి సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా వుంటున్నారు. గారాల పట్టీలు అర్హ- అయాన్ లకు సంబంధించిన ఫోటోలు వీడియోలను అభిమానులకు షేర్ చేస్తున్నారు.
స్టార్ హీరోయిన్ కు ఏమాత్రం తగ్గని గ్లామర్ స్నేహ సొంతం. హీరోయిన్ లకు ధీటుగా అందంగా కనిపించే స్నేహరెడ్డి స్టైలిష్ స్టార్ కు సరిజోడుగా హబ్బీకి తగ్గట్టే తన అప్పియరెన్స్ వుండేలా జాగ్రత్తపడుతూ వుంటారు. ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్ తో ఆకట్టుకునే స్నేహరెడ్డి తాజాగా షేర్ చేసిన ఫొటో ఇటర్నెట్ వైరల్ గా మారింది. ఎంతో స్లిమ్ లుక్ తో స్టైలిష్ గా కనిపించే స్నేహారెడ్డి చీరలో అంతే ట్రెండీగా కనిపిస్తున్నారు. ఆ రౌండ్ గాగుల్స్ ఎంతో ఆకర్షణను పెంచాయి.
సాఫ్రాన్ కలర్ చీరలో స్నేహరెడ్డి లుక్ వైబ్రేంట్ గా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. ఈ లుక్ చూసిన వారంతా మీరూ హీరోయిన్ అయిపోండి మేడమ్ అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. దాదాపుగా స్నేహారెడ్డి లుక్ ని 2.6 లక్షల మంది లైక్ చేయగా 862 మంది వ్యాఖ్యల్ని జోడించడం ఆసక్తికరంగా మారింది.
గోవా బ్యూటీ ఇలియానా ఈమద్య కాలంలో వరుసగా బీచ్ ఫొటోలను షేర్ చేస్తుంది. ఇటీవల తన కుటుంబ సభ్యులను ఎంతగా మిస్ అయ్యానో చెప్పిన ఇలియానా ప్రస్తుతం వారితో పూర్తి సమయంను గడుపుతున్నట్లుగా చెబుతోంది. గోవాలో సేద తీరుతున్నట్లుగా ఉన్న ఈ ఫొటోను షేర్ చేసిన ఈ అమ్మడు మెంటల్లీ బీచ్ లో ఉన్నట్లుగా అనిపించినా కూడా నిజానికి అయితే నేను అద్బుతమైన ఫ్యామిలీ మద్యలో ఉన్నట్లుగా ఫీల్ అవుతున్నాను. ఈ పరిణామాలు మరియు పరిస్థితులు నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయి అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టింది.
ఈ అమ్మడు తన క్లీవేజ్ ను మరీ క్లోజప్ నుండి చూపించేందుకు సెల్ఫీ తో ప్రయత్నించింది. ఆమద్య కాస్త బరువు పెరిగినట్లుగా అనిపించిన ఈ అమ్మడు మళ్లీ బరువు తగ్గింది. తన గత జీరో సైజ్కు వచ్చిన ఈ అమ్మడు పదేళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది అనిపించుకుంటుంది. ఈ అమ్మడు మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యేందుకు పూర్తిగా అర్హురాలు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నడుము మరియు క్లీవేజ్ షో తో ఇలియానా నెటిజన్స్ కు పిచ్చెక్కిస్తోంది. ఈమె బ్యూటీకి అభిమానులు ఫిదా అవుతున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి మొన్న మొన్ననే అయినట్లుగా అనిపించింది. వారు మాల్దీవుల్లో సందడి చేసింది నిన్న మొన్నే అన్నట్లుగా అనిపించింది. కాని అప్పుడే కాజల్ కిచ్లుల వివాహం అయ్యి నెల రోజులు పూర్తి అయ్యింది. మొదటి నెల పూర్తి అయిన సందర్బంగా కిచ్లు రొమాంటిక్ ఫొటోను సగం వరకే షేర్ చేసి ఒక నెల పూర్తి అయ్యింది.. ఇంకా జీవితాంతం జర్నీ ముందు ఉంది అంటూ పోస్ట్ పెట్టాడు. వెనుక నుండి తీసిన ఫొటోలో ఒకరి నడుము మీద మరొకరు చేయి వేసుకుని ఉన్నారు. వారు ఈ ఫొటోలో కనిపించకున్నా కూడా చాలా క్యూట్ గా ఉన్నారు అంటూ కామెంట్స్ భారీగా వస్తున్నాయి.
కాజల్ అగర్వాల్ మరి కొన్ని రోజుల్లో ఆచార్య షూటింగ్ లో జాయిన్ అవ్వబోతుంది. అతి త్వరలోనే సినిమా కోసం హైదరాబాద్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. కాజల్ అగర్వాల్ తమిళంలో ఇండియన్ 2 సినిమాలో కూడా నటిస్తున్న విషయం తెల్సిందే. పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాల్లో నటిస్తానంటూ ఇప్పటికే ప్రకటించింది. కనుక ఈమె సినీ కెరీర్ ఎలా సాగుతుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ ఇటీవల ఓ బ్రాండ్ ఎండార్స్మెంట్ కోసం యాడ్ షూట్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. నితిన్ ఈ యాడ్ షూట్ కి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేశాడు. ఇందులో నితిన్ కూల్ అండ్ స్టైలిష్ గెటప్ చూసిన ప్రేక్షకులు అందరూ ఇదొక మేజర్ ఇంటర్నేషనల్ బ్రాండ్ ఎండార్స్మెంట్ అని అనుకున్నారు. అయితే నితిన్ చేసిన యాడ్ షూట్ హైదరాబాద్ కి చెందిన స్నేహ చికెన్ బ్రాండ్ కోసం అని తెలుస్తోంది. తాజాగా స్నేహ చికెన్ కి సంబంధించిన కమర్షియల్ యాడ్ ని నిర్వాహకులు రిలీజ్ చేశారు.
‘స్నేహ చికెన్ – ది చికెన్ ఆంథమ్’ అనే పేరుతో విడుదలైన ఈ యాడ్ లో హీరో నితిన్ కి తల్లిగా సీనియర్ నటి ప్రగతి కనిపిస్తోంది. ”ఈ అమ్మలెప్పుడు ఇంతేనండి. మనం ఎక్కడున్నా ఏంచేస్తున్నా ఒకటే ప్రశ్న.. ‘తిన్నావా?’ అని. ఆ ప్రశ్నకు స్నేహ ఫ్రెష్ చికెన్ బదులైతే ప్రతి అమ్మకి ఇక పండగే” అని నితిన్ ప్రమోట్ చేస్తున్నాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సాహో’ చిత్రానికి కో రైటర్ గా అసోసియేట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన అనిల్ కుమార్ ఉపాధ్యాయుల ఈ కమర్షియల్ యాడ్ రూపొందించారు. ప్రస్తుత జనరేషన్ టేస్ట్ కి తగ్గట్టు మెస్మరైజింగ్ విజువల్స్ తో క్యాచీ సాంగ్ తో ఈ యాడ్ షూట్ చేయబడింది.
ఇందులో నితిన్ అడుగుతున్న ‘తిన్నావా?’ అనే ప్రశ్న అందరినీ అలరించడంతో పాటు సోషల్ మీడియాలో చక్కర్ కొడుతోంది. ఇన్నాళ్లు ప్రాంతీయంగా బెస్ట్ చికెన్ బ్రాండ్ అనిపించుకున్న స్నేహ చికెన్.. నితిన్ చేసిన ఈ యాడ్ తో నెక్స్ట్ లెవల్ కి వెళ్ళనుందని చెప్పవచ్చు. ఇది నితిన్ కి మొట్టమొదటి కార్పొరేట్ బ్రాండ్ ఎండార్స్మెంట్. నితిన్ లవ్ లీ పెరఫార్మన్స్ కి అనిల్ కుమార్ డైరెక్షన్ తోడై ఇలాంటి అద్భుతమైన యాడ్ బయటకొచ్చిందని ఈ సందర్భంగా స్నేహ చికెన్ సీఈఓ వరుణ్ సంతోషం వ్యక్తం చేశారు.
గర్భిణీ స్త్రీలు కదలకూడదని.. మెట్లు ఎక్కడం నిషేధమని.. నీళ్ల బిందె ఎత్తకూడదని పెద్దలు చాలా చెబుతుంటారు. కానీ అలాంటి వాళ్లను పాతకాలం అమ్మమ్మలు అంటూ తీసిపారేస్తూ నేటితరం గాళ్స్ జిమ్ముల్లో కసరత్తులు చేయడం చూస్తున్నదే. లేడీ రోబోట్ ఎమీజాక్సన్ అయితే బేబి బంప్ తో కేజీల కొద్దీ బరువైన డంబెల్స్ ఎత్తుతూ జాగింగ్ చేస్తూ కనిపించింది. గర్భంతో పలువురు కథానాయికల అండర్ వాటర్ ఫీట్స్ షాక్ కి గురి చేశాయి. లైవ్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ కొందరు భామలు తమ హార్డ్ హిట్టింగ్ యాటిట్యూడ్ ని బయటపెట్టారు గతంలో.
ఇప్పుడు విరుష్క జంట ప్రయోగాలు చూస్తుంటే అలాంటి సందేహమే కలుగుతోంది. గర్భిణీలు యోగా చేయడం మంచిదే. కానీ ఇలా తలకిందులుగా శీర్షాసనం ప్రాక్టీస్ చేయడం చూస్తుంటే ఇది ఎంతటి దుస్సాహసమో అనిపిస్తోంది. అనుష్క శర్మ ఇటీవలే తన గర్భానికి సంబంధించిన సమాచారాన్ని మీడియా ముఖంగా వెల్లడించారు. అనంతరం టీమిండియా కెప్టెన్ కోహ్లీపై వెటరన్ క్రికెటర్ గవాస్కర్ కొంటె కామెంట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
ఇక గర్భిణి అయిన తన సతీమణిని విడిచి కోహ్లీ ఒక్క క్షణమైనా ఉండలేని పరిస్థితి. ఆట తో ఓవైపు బిజీ అయినా.. వీలున్నంతవరకూ ఇంటికే అంకితమవుతూ అనుష్క ఆలనా పాలనా చూడాలనుకుంటున్నారట. ఇటీవల ఆసీస్ టూర్ కి ముందు తనతో కలిసి జిమ్ యోగా చేస్తూ సమయం స్పెండ్ చేశారు.
తాజాగా భర్త విరాట్ కోహ్లీతో కలిసి యోగా చేస్తున్నప్పటి త్రోబాక్ ఫోటోను అనుష్క శర్మ సోషల్ మీడియాలో విడుదల చేయగా అంతర్జాలంలో వైరల్ అయ్యింది. గర్భిణి అయిన భార్యకు విరాట్ శీర్షాసనం వేయడానికి సాయపడుతుండడం అందరినీ ఆకర్షించింది. అతడి సాయం ఎంతో గొప్పది అంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు.
తల్లి కాబోతున్న అనుష్క శర్మ తన బిడ్డ ఆరంగేట్రానికి ముందే ఇటీవల కొన్ని పనులను(ప్రకటనలు) ముగించుకుంటూ గత కొన్ని రోజులుగా ట్రెండీ టాపిక్ గా మారింది. గత కొన్ని రోజులుగా అనుష్క నగరంలో పెండింగ్ షూట్లు పూర్తి చేస్తున్నప్పుడు.. విరాట్ కోహ్లీ తన టోర్నమెంట్ కోసం ఆస్ట్రేలియాలో ఉన్నాడు.
యోగాలో కోహ్లీ రక్షణ కల్పిస్తూ సహాయాన్ని అందించడం అందరినీ ఆకట్టుకుంది. అనుష్క తన యోగా గురువు అయిన భర్త సహాయం పర్యవేక్షణలో కష్టమైన యోగాసనం ప్రయత్నించానని వెల్లడించారు. ఈ అందమైన ఫోటో ని తన తల్లిదండ్రులకు అనుష్క షేర్ చేసింది. యోగా నా జీవితంలో ఒక పెద్ద భాగం కాబట్టి నేను అలాంటివన్నీ చేయగలనని నా డాక్టర్ సిఫారసు చేసారు.. నేను గర్భవతిగా ఉండటానికి ముందు నేను చేస్తున్న ఆసనాలు అన్నీ అటూ ఇటూ తిరిగేవి పూర్తిగా ముందుకు వంగి ఉండేవి చేసేదానిని.
కానీ ఇప్పుడు సులువైన అసనాలే వేస్తున్నాను. అయితే తగిన సపోర్ట్ తీసుకునే చేస్తున్నాను. నేను చాలా సంవత్సరాలుగా చేస్తున్న శిర్శాసన కోసం గోడ సాయం తీసుకున్నాను. సమర్థుడైన నా భర్త అదనపు సమతుల్యతతో ఉండటానికి నాకు సహకరించారు. నా యోగా గురువు పర్యవేక్షణలో ఇదంతా. ఈ సెషన్ లో ఆయన నాతో వాస్తవంగా ఉన్నారు. గర్భం తో ఇలా అభ్యాసాన్ని కొనసాగించగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది“ అని అనుష్క వెల్లడించారు.
ప్రస్తుతం అనుష్క ఇంట్లో సమయం గడుపుతుండగా విరాట్ ఆస్ట్రేలియాలో ఇండియా తరఫున ఆడుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ తర్వాత త్వరలోనే ఆయన భారతదేశానికి తిరిగి వస్తారని భావిస్తున్నారు. అతను బిసిసిఐ నుండి కాబోయే డాడ్ గా సెలవు తీసుకున్నారు. అనుష్క బిడ్డకు జన్మనిచ్చేప్పుడు ఆ `అందమైన క్షణం` కోసం అక్కడ ఉండాలని తాను కోరుకుంటున్నానని విరాట్ ఈ సందర్భంగా చెప్పారు.
ఓటీటీతో పోల్చితే ఏటీటీ రిస్క్ కాస్త ఎక్కువ అయినా కూడా సినిమా సక్సెస్ అయితే పే పర్ వ్యూ పద్దతి కనుక నిర్మాతలకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదే ఓటీటీకి సినిమాను అమ్మేస్తే ఫలితం తో సంబంధం లేకుండా ఒక ఫిక్స్ అమౌంట్ వస్తుంది. అందుకే టాలీవుడ్ లో ఏటీటీ వైపు కొందరు అడుగులు వేస్తున్నారు. టాలీవుడ్ కు చెందిన ఒక నిర్మాత ఏటీటీ ఏర్పాటులో నిమగ్నమై ఉన్నారు అంటూ ఇటీవలే వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. మీడియా సర్కిల్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఆ నిర్మాత మరెవ్వరో కాదు బన్నీ వాసు.
ఈనెల 18వ తారీకున బన్నీ వాసు తన ఏటీటీని ప్రకటిస్తాడని అంటున్నారు. బన్నీ వాసు అంటే అల్లు ఫ్యామిలీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. బన్నీకి అత్యంత ఆప్తుడు.. అల్లు అరవింద్ కు అత్యంత నమ్మకస్తుడిగా బన్నీ వాసుకు పేరు ఉంది. జీఏ2 బ్యానర్ పూర్తి బాధ్యతలను బన్నీ వాసుకు అప్పగించారు అంటే అల్లు అరవింద్ కు ఆయనపై ఉన్న నమ్మకం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆయన ఏటీటీ ని ప్రారంభిస్తున్నాడు అంటే ఖచ్చితంగా దాని వెనుక అల్లు వారు ఉండి ఉంటారు అనే ప్రచారం ఇండస్ట్రీ వర్గాలతో పాటు మీడియా సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తుంది. అల్లు వారు ఇప్పటికే ఆహా ఓటీటీని రన్ చేస్తున్నారు. ఇదే సమయంలో బన్నీ వాసు ను ముందు ఉంచి ఏటీటీని కూడా వారే నడిపించేందుకు సిద్దం అయ్యారు అనిపిస్తుంది.
ఓటీటీతో పాటు ఏటీటీలకు ముందు ముందు మంచి భవిష్యత్తు ఉంటుంది. థియేటర్లకు జనాలు వెళ్లకుండా డిజిటల్ గానే సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే అల్లు అరవింద్ ముందు చూపుతో ఆహా ఓటీటీని ప్రారంభించారు. ఇదే సమయంలో ఏటీటీని కూడా సిద్దం చేస్తున్నారు అనిపిస్తుంది. ఇప్పటికే శ్రేయాస్ ఈటీ అనే ఏటీటీ ఉంది. వర్మ కు చెందిన పలు సినిమాలు అందులో విడుదల అయ్యాయి. అయితే ప్రముఖులు పెట్టే ఏటీటీకి ఖచ్చితంగా మంచి పబ్లిసిటీ దక్కడంతో నిర్మాతలు తమ సినిమాల స్ట్రీమింగ్ కు ముందుకు వచ్చే అవకాశం ఉంది. బన్నీ వాసు తీసుకు రాబోతున్న ఏటీటీలోమొదటగా డర్టీ హరీని స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇండస్ట్రీలోకి రాబోతున్న కొత్త ఏటీటీకి ప్రేక్షకులు ఎలా వెల్ కమ్ చెప్తారు అనేది చూడాలి.
పార్టీలు సెలబ్రేషన్స్ అంటే దూకుడుమీద ఉండే నటి తనీషా ముఖర్జీ ఇటీవల 42వ బర్త్ డే ని సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. తన సన్నిహితులు ఆమె తల్లి ప్రముఖ నటి తనూజాతో కలిసి ఒక రిసార్ట్ లో తనీషా చేసిన సందడి ప్రముఖంగా హైలైట్ అయ్యింది.
అప్పట్లో తనీషా ముఖర్జీ బీచ్ వేర్ పార్టీ సంచలనంగా మారింది. ఈ వేడుకలో గాళ్స్ అంతా సంతోషంగా ఉత్సాహంగా బికినీలతో చెలరేగడం హాట్ టాపిక్ అయ్యింది. స్నేహితులతో పార్టీకి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. తనీషా.. తనూజా ఈత దుస్తులలో హీటెక్కించారు. తనీషా ఇప్పటికీ 40 ప్లస్ లోనూ ఏజ్ లెస్ బ్యూటీగా అలరిస్తోంది.
తాజాగా ఇన్ స్టా వేదికగా తనీషా రివీల్ చేసిన ఫోటో వైరల్ గా దూసుకెళుతోంది. చీరలో గ్లామర్ ఎలివేషన్ కట్ట తెగిందిగా! అంటూ ఆ రొమాంటిక్ శారీ లుక్ ని బోయ్స్ అదే పనిగా సోషల్ మీడియాల్లో షేర్ చేస్తున్నారు. తనీషా ఇన్ స్టా ఆద్యంతం ఇంతకుమించి వేడెక్కించే ఫోటోలతో ట్రీట్ అదిరిందన్నది యూత్ గుసగుస.
ఈ అమ్మడి కెరీర్ సంగతి చూస్తే.. 2003 లో థ్రిల్లర్ మూవీ `ష్..`తో తన నటవృత్తిని ప్రారంభించింది. వన్ టూ త్రీ- సర్కార్ – నీల్ నిక్కి వంటి చిత్రాలను చేసింది. హిందీ బిగ్ బాస్ ఏడవ సీజన్లో ఇంటి సభ్యురాలిగా అలరించింది. కానీ ఇటీవల ఎందుకనో బాలీవుడ్ లో చెప్పుకోదగ్గ ఆఫర్లు లేవు.
బిగ్ బాస్ లో ఈ వారం నామినేషన్ ప్రేక్షకులు ఊహించని విధంగా జరిగాయి. ఈసారి ఇద్దరికి మించి నామినేట్ చేసే అవకాశంను బిగ్ బాస్ ఇచ్చాడు. కాని మోనాల్ మరియు అరియానాలు మాత్రమే ముగ్గురుని చేశారు. మిగిలిన వారు అంతా ఇద్దరు చొప్పున చేశారు. అభిజిత్ ను హారిక నామినేట్ చేస్తున్నట్లుగా చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. అదే సమయంలో అభిజిత్ కూడా కన్నీరు పెట్టుకున్నాడు. టాస్క్ చేసేందుకు ఒప్పుకోక పోవడమే దీనికి కారణం అంటూ హారిక చెప్పింది. ఆ టాస్క్ ఎందుకు చేయలేదు అనే విషయం నీకు తెలుసు. నీవే నన్ను నామినేట్ చేయడం ఏంటీ అన్నట్లుగా అభిజిత్ ఎమోషనల్ అయ్యాడు. ఆ సమయంలో హారిక కూడా ఏడుపు దిగమింగుకుంది.
అభిజిత్ మరియు అవినాష్ ను హారిక నామినేట్ చేసింది. అవినాష్ ను ఆమె నామినేషన్ చేయడం పెద్దగా షాకింగ్ గా అనిపించలేదు. ఆ తర్వాత అభిజిత్ మళ్లీ హారికను నామినేట్ చేశాడు. మోనాల్ వల్ల తనకు ఎందుకో మొదటి నుండి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. కాని వల్ల చాలా ఇబ్బంది పడ్డట్లుగా అనిపించింది. అందుకే మోనాల్ ను నేను నామినేట్ చేస్తున్నాను అంటూ అభిజిత్ తన వద్ద ఉన్న కలర్ వాటర్ దాదాపు పూర్తిగా పోశాడు. కేవలం 50 ఎంఎల్ మాత్రమే ఉంచి దాన్ని హారిక కంటైనర్ లో పోశాడు. అఖిల్ తో గొడవ ఇక్కడితో వదిలేద్దాం అనుకుని ఈ పని చేస్తున్నట్లుగా అన్నాడు.
తాజా నామినేషన్ ఎపిసోడ్ లో అభిజిత్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఇక మరో ఆసక్తికర విషయం ఏంటీ అంటే మోనాల్ టైం వచ్చినప్పుడు ఆమె చాలా సీరియస్ అయ్యింది. మొదట అవినాష్ ను నామినేట్ చేసిన ఆమె నీ కంటే నేను స్ట్రాంగ్ మళ్లీ నన్ను వీక్ అనొద్దు. ఆ విషయాన్ని ప్రేక్షకులు కూడా నిరూపించారు అంటూ మోనాల్ చెప్పింది. ఇక అభిజిత్ మరియు అఖిల్ లను కూడా నామినేట్ చేసింది. అభిజిత్ పెద్దగా స్పందించలేదు కాని అఖిల్ మాత్రం చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు. ఇద్దరి మద్య మాటల యుద్దం సాగింది.
ఆ కోపంలో ఉండగా అరియానా వచ్చి నామినేట్ చేయడం ఆ సమయంలో అవినాష్ తెలుగులో మాట్లాడాలంటూ చెప్పడం తో మోనాల్ కు తిక్క రేగినంత పనైంది. ఆమె సహనం కోల్పోయి అరిచేసింది. మొత్తానికి సోహెల్ మరియు అరియానా మినహా మిగిలిన అయిదుగుర అఖిల్.. అభిజిత్.. అవినాష్.. హారిక మరియు మోనాల్ లు ఈ వారం నామినేషన్ లో ఉన్నారు. మరి వీరిలో ఈ వారం పోయేది ఎవరో చూడాలి.
మాల్దీవులు సెలబ్రిటీల వెకేషన్ కి కేరాఫ్ అడ్రస్ లుగా మారాయి. అందాల మలైకా.. తాప్సీ మొదలు.. ఇప్పటికీ తారల తాకిడి కొనసాగుతూనే వుంది. మాల్దీవుల అందాల్ని అతివల బికినీ అందాలతో మరింతగా మైమరపింజేస్తున్నాయి. సినీ తారలే కాకుండా బుల్లితెర భామలు కూడా ఇక్కడ హంగామా చేస్తున్నారు. టూపీస్ లు బికినీలు ధరించి సందడి చేస్తున్నారు. తాజాగా అల్లరి నరేష్ హీరోయిన్ షర్మిలా మాండ్రే మరో ఇద్దరు భామలతో కలిసి మాల్దీవుల్లో హంగామా చేస్తోంది.
నికోల్ ఫరియా.. షిఫా జోవర్ లతో షర్మిలా మాండ్రే బీచ్ లలో హల్ చల్ చేస్తోంది. ఈ ముగ్గురు బీచ్ లలో బికినీలు ధరించి మత్సకన్యల్లా మారి తమ లేలేత అందాలతో హీటెక్కిస్తున్నారు. బీచ్ దృశ్యాలకు సంబంధించిన ఫొటోలని ఇన్ స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అవి ఇప్పుడు ఇన్ స్టాని హీటెక్కిస్తున్నాయి. లాక్ డౌన్ సమయంలో తారలంతా మాల్దీవులకే వెళ్లడం వెనక ఏదో ఓ ప్రయోజనం.. బలమైన కారణం వుందనే వాదన వినిపిస్తోంది.
అల్లరి నరేష్ తో కలిసి `కెవ్వు కేక` చిత్రంతో షర్మిలా మాండ్రే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విషయం తెలిసిందే. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన షర్మిలా మాండ్రే చాలా కాలంగా సోషల్ మీడియాకు దూరంగా వుంటూ వస్తోంది. ప్రస్తుతం ఆమె దసరా.. మైసూర్ మసాలా.. గాలిపట 2 అనే మూడు చిత్రాల్లో నటిస్తోంది.
పెళ్లి తర్వాతా నటించాలా వద్దా? అన్న డైలమా కొందరికి ఉంటుంది. అలాటిది ఏదీ లేకుండా పూర్తి క్లారిటీతో తిరిగి షూటింగులకు సిద్ధమవుతున్నారు చందమామ కాజల్. సతీమణికి వృత్తి పరమైన స్వేచ్ఛను ఇచ్చారు గౌతమ్ కిచ్లు. కాజల్ ఇప్పటికిప్పుడు క్రేజీగా నాలుగైదు సినిమాల్లో నటించాల్సి ఉంది.
ఇటవలే మాల్దీవుల్లో హనీమూన్ ముగించి తిరిగి పెండింగ్ షూటింగులను పూర్తి చేసేందుకు ప్రణాళికల్లో ఉన్నారట. అలాగే కొత్తగా ప్రారంభం కానున్న ఆచార్య షెడ్యూల్ విషయమై నిర్మాతల్ని ఆరా తీసారట. ఆచార్య షెడ్యూల్ రకరకాల కారణాలతో ఆలస్యమవుతోంది. చిరంజీవి- కొరటాల బృందం నుంచి క్లారిటీ వచ్చేస్తే కాజల్ కూడా సెట్స్ లో జాయిన్ అవుతారట. అలాగే ఇతర సినిమాల షూటింగుల వ్యవహారం కాజల్ తన నిర్మాతలతో చర్చిస్తున్నారని సమాచారం.
ఆ క్రమంలోనే హైదరాబాద్ టు చెన్నయ్ ప్రయాణాలతో కాజల్ బిజీగా ఉన్నారట. కాజల్ ప్రస్తుతం ఓ తమిళ హారర్ చిత్రంలో నటిస్తున్నారు. ఆ మూవీ కోసం లుక్ టెస్ట్ పూర్తయింది. షెడ్యూల్స్ కూడా ఖరారు చేసారని తెలుస్తోంది. ఇక ఇదే మూవీలో మరో ముగ్గురు అగ్ర కథానాయికలు నటించనున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన త్వరలో వస్తుంది. వచ్చే ఏడాది షూట్ ప్రారంభమవుతుంది.
మరోవైపు విశ్వనటుడు కమల్ హాసన్ -శంకర్ కాంబినేషన్ మూవీ భారతీయుడు 2 (ఇండియన్ 2) ఎప్పటినుంచి సెట్స్ కెళుతుంది? అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. దీనిపైనా కాజల్ ఆరా తీశారట. అలాగే కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ దర్శకత్వంలో `హే సినామికా`లో దుల్కర్ సల్మాన్ సరసన కాజల్ నటించనున్నారు. వీటితో పాటు తెలుగులో పలువురు దర్శకులు వినిపించిన కథల్ని కాజల్ వింటున్నారట. డెడికేషన్ అంటే చందమామ. అందుకే సౌత్ అగ్ర నాయికగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు.
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి – యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి కాంబోలో ఇప్పటి వరకు వచ్చిన మూడు సినిమాలు ‘ఛత్రపతి’ ‘బాహుబలి’ ‘బాహుబలి 2’ చిత్రాలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో తెలిసిందే. ముఖ్యంగా ‘బాహుబలి’ తర్వాత వీరి క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా పాకింది. టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కాస్తా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ సినిమాలు మాత్రమే చేసే స్థాయికి ప్రభాస్ స్టార్ డమ్ చేరింది. ఈ నేపథ్యంలో ఎప్పటికైనా ప్రభాస్ – జక్కన్న కాంబోలో మరో సినిమా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజమౌళిని అడగగా ఫన్నీగా సమాధానం చెప్పాడు.
ప్రభాస్ ని మరోసారి డైరెక్ట్ చేస్తారా? అని అడిగిన ప్రశ్నకు రాజమౌళి సమాధానమిస్తూ.. ”వామ్మో.. మళ్లీ ప్రభాస్ తోనా? బాహుబలి కోసం దాదాపు 5 సంవత్సరాలు కలిసి చేశాం. మళ్లీ మా కాంబినేషన్ లో సినిమా అంటే జనాలు తలలు పట్టుకుంటారేమో” అని చెప్పుకొచ్చారు. రాజమౌళి ఈ మాటలు మాటలు అన్న తర్వాత నవ్వుతూ ”సరదాగా అలా అన్నాను. నిజంగా ప్రభాస్ తో సినిమా చేయడం నాకు ఇష్టమే. మంచి కథ కుదిరితే తప్పకుండా మేం మళ్లీ సినిమా చేస్తాం” అని జక్కన్న చెప్పారు. కాగా రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా ‘ఆర్.ఆర్.ఆర్’ అనే పాన్ ఇండియా మూవీ తీస్తున్నాడు. దీని తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో కలిసి ఓ సినిమా చేయనున్నాడు.