పవన్ ఫొటో వైరల్.. ఆ మూవీ టైంలో తీసిందేనా!

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆయన అభిమానులు తలుచుకుంటే సోషల్ మీడియాను షేక్ చేయగలరు. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన సినిమా న్యూస్ వచ్చినా.. ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చినా అవి ఏ రేంజ్ లో వైరల్ అవుతుంటాయో చూస్తూనే ఉంటాం. ఇటీవల తరచూ పవన్ కళ్యాణ్ జీవితానికి సంబంధించి అరుదైన ఫోటోలు బయటికి వస్తున్నాయి. ఇటీవల ఒక ఐదారేళ్ళ వయసులో పవన్ నిక్కరేసుకుని స్నేహితులతో కలసి నిలుచున్న ఫోటో ఒకటి బయటకు రాగా అది ట్రెండ్ అయింది. అలాగే పవన్ టీనేజీ లుక్ ఫోటో ఒకటి బైటకు రాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ ఒక అన్ సీన్ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే ఇది ఎప్పుడు తీసిన ఫోటోనో కచ్చితంగా అర్థం కావడం లేదు. ఈ ఫోటోలో పవన్ షార్ట్ హెయిర్ లుక్ లో ఉన్నారు. హాఫ్ హాండ్స్ షర్ట్ వేశారు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో నెరసిన గడ్డంతో కనిపిస్తున్నారు.

ఖుషీలో ఎల్లో టీ షర్టు వేసుకొని రెండు చేతులూ గడ్డానికి ఆంచి నవ్వుతున్న ఫోటో ఒకటి ఎంతో ఫేమస్. సేమ్ అలాంటి లుక్ లోనే పవన్ కనిపిస్తున్నారు. ఇప్పటితో పోలిస్తే కాస్త లావుగా.. బుగ్గలతో కనిపిస్తున్నారు. ఇటీవలి కాలంలో పవన్ ఎప్పుడూ ఇంత షార్ట్ హెయిర్ తో కనిపించలేదు. బహుశా ఇది కొమరం పులి టైంలో తీసినట్లుగా ఉంది. సరిగ్గా అదే టైంలో ప్రజారాజ్యం పార్టీ తరపున పవన్ ప్రచారం నిర్వహించే సమయంలోనూ పవన్ లుక్ ఇలాగే ఉంది. కానీ ఫోటోలో మాత్రం పూర్తి నెరిసిన గడ్డంతో పవన్ కనిపిస్తున్నారు. కొమరం పులి టైంకే పవన్ లుక్ ఇలా మారిందా అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు ఈ ఫోటో ట్విట్టర్ ఇన్ స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతోంది.