నార్కో టెర్రరిజం అంటూ బాంబ్ పేల్చిన కంగన

0

ఐదారు నెలలుగా కరోనా విలయం ప్రపంచాన్ని దుంపనాశనం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే ప్రపంచ దేశాలపై చైనా బయోవార్ ఇది! అన్న చర్చా వేడెక్కించింది. బాంబులు వేయకుండా వైరస్ తోనే ఆర్థిక వ్యవస్థల్లో కల్లోలం సృష్టించడం అనే ప్రమాదాన్ని చైనా సృష్టించిందని మాట్లాడుకుంటున్నారు. ఓవైపు ఈ మహమ్మారీ విలయం ఇలా ఉండగానే మరోవైపు డ్రగ్స్ మహమ్మారీ గురించి జాతీయ స్థాయిలో డిబేట్ మొదలైంది.

సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో డ్రగ్స్ గుట్టు బయటికి రావడంతో అది సెలబ్రిటీల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. పలువురు అగ్ర తారల పేర్లు తెరపైకి రావడం సంచలనంగా మారుతోంది. తాజాగా క్వీన్ కంగనా డ్రగ్స్ మహమ్మారీపై ఒక రహస్యానికి సంబంధించిన నిగూఢమైన ట్వీట్ ని పోస్ట్ చేసింది.

“దేశంలోని యువ జనాభాను నాశనం చేయడానికి .. భవిష్యత్తును క్రమపద్ధతిలో నాశనం చేయడానికి పొరుగు దేశాల స్వార్థ ప్రయోజనాలు కాపాడేందుకు మనపై విరుచుకుపడుతున్న నార్కోటెర్రరిజం ఈ రోజు మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి. దానిని తలదాచుకోవడానికి సిద్ధంగా ఉన్నారా?“ అంటూ కంగన పెద్ద బాంబ్ పేల్చింది. ఓవైపు కరోనాని బయోవార్ అని భావించి నిలువునా ఒణికిపోతుంటే అంతకుమించి ఇప్పుడు డ్రగ్స్ కల్లోలం కూడా కలవర పెట్టే రేంజులో ఉందని క్లారిటీగా చెప్పింది కంగన. తాజాగా హైదరాబాద్ సహా మెట్రో నగరాల్లో నార్కోటిక్స్ డ్రగ్స్ దాడుల్లో ఎన్నో కఠోర నిజాలు బయటపడుతున్నాయి. స్టెరాయిడ్లు సహా గంజాయి.. వంటి ప్రమాదకర ఉత్ప్రేరకాల్ని యూత్ విరివిగా వినియోగిస్తోందని బయటపడుతోంది. ఇది వేల కోట్ల లావాదేవీల్లోకి రూపాంతరం చెందిందన్న చేదు నిజం కలవరపెట్టేస్తోంది.